వర్షా అడల్జా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్షా అడల్జా
1995లో జామ్‌నగర్‌లో వర్షా
పుట్టిన తేదీ, స్థలం (1940-04-10) 1940 ఏప్రిల్ 10 (వయసు 84)
Bombay (present Mumbai), Bombay Presidency, British India
వృత్తినవలా రచయిత
నాటక రచయిత
Negotiator
భాషగుజరాతీ
జాతీయతభారతీయురాలు
గుర్తింపునిచ్చిన రచనలుఅన్సార్
పురస్కారాలు

వర్షా మహేంద్ర అడల్జా గుజరాత్కు చెందిన స్త్రీవాద నవలా రచయిత, నాటకకర్త. 1995లో ఆమె రాసిన అన్సార్ అనే గుజరాతీ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం  అందుకున్నారు. నాటకాలకు రచన,  స్క్రీన్ ప్లేలు రాస్తుంటారు ఆమె. వర్షా రేడియో నాటకాలు కూడా  రచిస్తారు.

జీవిత విశేషాలు

[మార్చు]

వర్షా 1940 ఏప్రిల్ 10 న ముంబైలో గుణ్వంత్‌రాయ్ ఆచార్య, నీలాబెన్‌ లకు జన్మించింది. ఆమె తండ్రి గుజరాతీ నవలా రచయిత. ఆమె కుటుంబం జామ్‌నగర్‌కు చెందినది. 1960 లో ఆమె ముంబై విశ్వవిద్యాలయం నుండి గుజరాతీ, ఇంగ్లీషుల్లో బియ్యే పట్టా పుచ్చుకుంది.[1] 1962 లో సోషియాలజీలో ఎమ్‌ఏ చేసింది.[1][2] ఢిల్లీ లోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆమె నాటకకళ గురించి నేర్చుకుంది. 1961 నుండి 1964 వరకు ఆమె ముంబై ఆకాశవాణి కేంద్రనికి అధికార ప్రతినిధిగా పనిచేసింది. 1965 లో ఆమె మహేంద్ర అడల్జాను పెళ్ళి చేసుకుంది. ఆమె సోదరి, ఇళా అరబ్ మెహతా కూడా నవలా రచయిత్రే.

సాహితీ వ్యాసంగం

[మార్చు]

1966 లో తన రచనా వ్యాసంగం మొదలుపెట్టింది. 1973-1976 మధ్య మహిళా వారపత్రిక సుధాకు సంపాదకురాలిగా పనిచేసింది. తరువాత 1989-90 కాలంలో గుజరాతీ పత్రిక ఫెమీనాకు సంపాదకురాలిగా పనిచేసింది. 1978 నుండి గుజరాతీ సాహిత్య పరిషత్తులో కార్య నిర్వాహక పదవిని నిర్వహించింది.[3][4][5] ఆమె కుష్టు రోగుల కాలనీలపైన, జైలు జీవితం పైనా, ఆదివాసీల జీవితం పైనా పరిశోధనలు చేసింది.[6]

పురస్కారాలు

[మార్చు]

1995 లో ఆమె నవల అన్సార్ కు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.[7] 1976 లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారం, 1977, 1979, 1980 లలో గుజరాతీ సాహిత్య అకాడమీ పురస్కారం, 1972, 1975 లలో గుజరాతీ సాహిత్య పరిషత్తు పురస్కారం, 1997 లో కె. ఎం. మున్షీ పురస్కార్ం అందుకుంది. 2005 లో రంజిత్‌రాం సువర్ణ చంద్రక్ పురస్కారం పొందింది. నందకిషోర్ మెహతా చంద్రక్, సరోజ్ పాఠక్ బహుమతి, కథానికల కోసం రామ్‌నారాయణ్ పాఠక్ పురస్కారం అందుకుంది.[5][8]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Vyas, Daksha; Topiwala, Chandrakant. "સાહિત્યસર્જક: વર્ષા અડાલજા" [Writer: Varsha Adalja] (in Gujarati). Gujarati Sahitya Parishad.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. "Varsha Adalja, 1940-". New Delhi: The Library of Congress Office.
  3. "Varsha Adalja, 1940-". New Delhi: The Library of Congress Office.
  4. Kartik Chandra Dutt (1 January 1999). Who's who of Indian Writers, 1999: A-M. Sahitya Akademi. p. 13. ISBN 978-81-260-0873-5.
  5. 5.0 5.1 Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ (History of Modern Gujarati Literature – Modern and Postmodern Era) (in గుజరాతి). Ahmedabad: Parshwa Publication. pp. 258–260. ISBN 978-93-5108-247-7.
  6. "Varsha Adalja visits Tameside". Tameside: Tameside Metropolitan Borough Council. 15 April 2009. Archived from the original on 4 నవంబరు 2011. Retrieved 2 November 2011.
  7. "Sanskrit Sahitya Akademi Awards 1955-2007". Sahitya Akademi Official website. Archived from the original on 31 మార్చి 2009. Retrieved 29 June 2009.
  8. "Varsha Adalja, 1940-". New Delhi: The Library of Congress Office.