వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీ.ఎస్.టి.లో విలీనం అయ్యే పన్నులు

వస్తు, సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ - జీఎస్టీ) అన్నది భారతదేశంలో అనేక విడివిడి పన్నులను ఒకే పన్నులో విలీనం చేసేలా రాబోతున్న పన్నుల వ్యవస్థ. దాన్ని 122వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద రాజ్యాంగ (నూట ఒకటవ సవరణ) చట్టం 2016గా ప్రవేశపెట్టారు. జీఎస్టీ కౌన్సిల్, దాని ఛైర్మన్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వస్తు సేవల పన్నును పరిపాలిస్తారు.

జీఎస్టీ అన్నది భారతదేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల బదులు వస్తువులు, సేవల తయారీ, అమ్మకం, వినియోగాలపై విధించనున్న సమగ్రమైన పరోక్ష పన్ను.

ఈ పద్ధతిలో జీఎస్టీ-నమోదిత వ్యాపారాలు తమ వాణిజ్య వ్యవహారాల్లో భాగంగా కొనుగోలు చేసే సాధారణ వస్తువులు, సేవలపై జీఎస్టీ విలువ మీద పన్ను మినహాయింపు పొందవచ్చు. వస్తువులు, సేవలపై పన్ను విధించే నిర్వహణ బాధ్యత సాధారణంగా ఏకైక అధికారి వద్ద ఉంటుంది.[1] ఎగుమతులు జీరో-రేటెడ్ సప్లైలుగా పరిగణిస్తారు, దిగుమతులపై జీఎస్టీ కిందకు రాని కస్టమ్ డ్యూటీనీ, దానితో పాటు దేశీయ వస్తువులు, సేవలకు పడేలాంటి జీఎస్టీని విధిస్తారు.

భారతదేశంలో పరోక్ష పన్నుల విధానాన్ని సంస్కరించడంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టడం ప్రాముఖ్యత కలిగిన పరిణామం.  పలు కేంద్ర, రాష్ట్ర పన్నులను ఏకైక పన్నుగా [2] రూపొందించడం వల్ల  రెండు మార్లు ఒకే పన్ను పడడం వంటి సమస్యలను పరిష్కరిస్తుంది, ఒకే జాతీయ సాధారణ మార్కెట్ సాధ్యమవుతుంది. పన్నులోని సరళత వల్ల పరిపాలన, అమలు సులభం అవుతున్నాయి. వినియోగదారుల కోణం నుంచి చూస్తే వస్తువుల మీద మొత్తం పన్ను భారం అంచనాల మేరకు 25 నుంచి 30 శాతం వరకూ తగ్గనుండడం, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి రాష్ట్ర సరిహద్దుల్లో పన్ను చెల్లింపుల గురించి గంటల పాటు నిలుపుదల లేకుండా రవాణా సాగడం, పెద్ద ఎత్తున రాతకోతలు తగ్గుదల వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

పన్ను శాతాలు[మార్చు]

జిఎస్టి కౌన్సిల్ నాలుగు రకాల పన్నులను నెలకొల్పింది, ఇవి 5, 12, 18, 28 శాతం ఉన్నాయి.చాలా విషయాలు జీఎస్టీ(GST) నుండి మినహాయించబడినప్పటికీ,

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం (PDF) నుండి 2015-06-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2017-05-20. Cite web requires |website= (help)
  2. Which of the existing taxes are proposed to be subsumed under GST? - GST India Forum. URL accessed on 2 April 2017.