వస్త్ర నమూనాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వస్త్రాల పై వివిధ రంగుల నమూనాలు ఉంటాయి. ఇవి స్త్రీ పురుషులకి వేర్వేరు విధంగా, లేక ఒకే విధంగా ఉండవచ్చును. వీటిలో కొన్ని సాంప్రదాయికాలు కాగా కొన్ని అసాంప్రదాయికాలు.

వివిధ నమూనాలు[మార్చు]

  • పోల్కా డాట్: సమదూరంలో చుక్కలు
  • స్ట్రైప్: చారలు
  • పిన్ స్ట్రైప్: అతి సన్నని చారలు
  • టాట్టర్సాల్: చారల వలన ఏర్పడే గడులు
  • చెక్: గడులు
  • హెరింగ్ బోన్: వంకరటింకర (వి ఆకారంలో గల) చారలు
  • అర్జైల్: గడులు చారల కలయిక
  • పెయిస్లీ: మామిది పిందెలు

పోల్కా డాట్స్[మార్చు]

పోల్కా డాట్ పాటర్న్ లో వస్త్రము పూర్తిగా వృత్తాలతో నిండి ఉంటుంది. వా వృత్తాలు ఒకే పరిమాణంతో సమాన దూరాలలో ఉంటాయి. ఈ వస్త్రాలు పిల్లలకు,బొమ్మలకు,ఫర్నిచర్ కు ఉపయోగిస్తారు. ఈ పాటర్న్ సాంప్రదాయకంగా ఉన్నప్పటికి దీనిని ఎక్కువగా స్విమ్‌ సూట్ గానూ, లింగరీ గాను వాడుతున్నారు. తెలుపు,నలువు వృత్తాలతో కూడి ఉన్న వస్త్రం సాంప్రదాయకంగా ఉంటుంది. 19 వ శతాబ్దంలో ఈ వస్త్ర పాటర్న్ యునైటెడ్ కింగ్ డం లో సాదారణ వస్త్ర విశేషము.

పిన్ స్ట్రైప్స్[మార్చు]

పిన్ స్ట్రిప్స్ అనే పాటర్న్ లో దళసరిగా ఉన్న చారలు అనేక రంగులలో ఉండవచ్చును. యివి సమాంతరంగా వస్త్రం అంతా వ్యాపించి యుంటాయి. ఈ వస్త్రం తో కూడిన సూట్స్ పురుషుల ఎక్కువగా యిష్టపడతారు. చికాగోలో గల కబ్స్ నందు బేస్ బాల్ క్రీడాకారులు ధరించే యూనిపాం కూడా పిన్ స్త్రిప్స్ తో కూడి ఉంటుంది.

టేటర్సాల్[మార్చు]

ఈ పాటర్న్ గడులతో కూడి ఉంటుంది. ఈ పాటర్న్ లో అడ్డంగా , నిలువుగా చారలు ఉంటాయి. యిది గడులు గా కనిపిస్తుంది. చతురస్రాకార గడులుగా ఉంటుంది.ఈ చారలు సాధారణంగా వివిధ రంగులతో, ముదురు,లేత బేక్ గ్రౌండ్ ను కలిగి ఉంటుంది.[1] ఈ పాటర్న్ 1766 లో లండన్ నందు గల టార్టర్‌సల్ గుర్రాల మార్కెట్ పేరుమీదుగా దీనికి ఆ పేరు వచ్చింది.[2] 1700 లలో ఈ పాటర్న్ ని గుర్రపు బజారులలో అమ్మేవారు. ఈ పాటర్న్ ని గుర్రములకు వాడేవారు.[1] ప్రస్తుతం ఈ పాటర్న్ కాటన్, ప్లానల్ తోనూ నేయబడుతుంది. దీనిని షర్ట్స్,వైస్ట్ కోట్ లకు సాంప్రదాయక షర్ట్స్ కు ఉపయోగిస్తున్నారు.

హెర్రింగ్‌బోన్[మార్చు]

ఈ పాటర్న్ లో వి-ఆకారపు పాటర్న్ లు ఉంటాయి. ఈ ఆకారాలు మామూలుగా, వ్యతిరేకంగా కలసి ఉంతాయి. ఈ పాటర్న్ హెరింగ్ చేప యొక్క అస్థిపంజరం లా అమర్చ వచ్చు కనుక దీనికి "హెర్రింగ్ బోన్" అనే పేరు వచ్చింది.[3] ఈ పాటర్న్ లో సాధారణంగా ఊల్, విశిష్టమైన వస్త్రములతో కూడి ఉంటుంది. దీనిని సూట్స్, బాహ్య దుస్తులకు ఉపయోగిస్తారు.[1]

వివిధ వస్త్ర నమూనాల చిత్రములు[మార్చు]

వస్త్ర నమూనాలతో కూడిన దుస్తులను ధరించే మోడల్స్ చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 fitnyc.edu/aspx/Content.aspx?menu=FutureGlobal:Museum The Museum at FIT], Fashion Institute of Technology (2006). "The Tailor's Art, Menswear Fabrics – a Glossary, "Tattersall"". Archived from the original on 2007-06-02. Retrieved 2008-11-24. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "FIT" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. Flusser, Alan (1985). Clothes and the Man: the Principles of Fine Men's Dress. New York City: Villard Books. p. 204. ISBN 0-394-54623-7.
  3. Ralph Lauren Style Guide; [www.style.polo.com/glossary/default.asp polo.com Glossary], Herringbone, archived from the original on 2011-10-05, retrieved 2008-11-24

యితర లింకులుల్[మార్చు]