Jump to content

వాకిటి శ్రీహరి

వికీపీడియా నుండి
వాకిటి శ్రీహరి

ఎమ్మెల్యే
పదవీ కాలం
03 డిసెంబర్ 2023 - ప్రస్తుతం
ముందు చిట్టెం రామ్మోహన్ రెడ్డి
నియోజకవర్గం మక్తల్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1970
మక్తల్, నారాయణపేట జిల్లా , తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నివాసం ఇంటి నెం 1-184/12/1/A, సుగురేశ్వర కాలనీ, మక్తల్ (గ్రామం & మండలం), నారాయణపేట జిల్లా

వాకిటి శ్రీహరి ముదిరాజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2001 నుండి 2006 వరకు మక్తల్ గ్రామా సర్పంచ్‌గా,[4] 2014 నుండి 2018 వరకు మక్తల్ జెడ్పిటిసి సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2014 నుండి 2018 వరకు నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2022 సెప్టెంబర్ 03 నుండి నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా ఉన్న[5] ఆయనకు 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ దక్కింది.[6]

వాకిటి శ్రీహరి 2023లో తన సమీప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై 17525 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. వాకిటి శ్రీహరికి 74917 ఓట్లు రాగా, చిట్టెం రామ్మోహన్ రెడ్డికి 57392 ఓట్లు వచ్చాయి.[7][8]

మూలాలు

[మార్చు]
  1. 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  3. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
  4. Sakshi (4 December 2023). "మక్తల్‌". Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.
  5. Eenadu (4 September 2022). "పేట డీసీసీ తాత్కాలిక అధ్యక్షుడిగా వాకిటి శ్రీహరి". Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.
  6. Eenadu (27 October 2023). "తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా విడుదల". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  7. Namaste Telangana (4 December 2023). "కాంగ్రెస్‌ విజయం". Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.
  8. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.