Jump to content

వాడుకరి:అఖిల.ఎస్/ప్రయోగశాల

వికీపీడియా నుండి

గీతాసారము

[మార్చు]

అర్జునుడు శిష్యునిగా శ్రీకృష్ణభగవానునికి శరణాగతుడౌతాడు. తాత్కాలికమైన భౌతికదేహానికి,నిత్యమైన ఆత్మకు ఉన్నట్టి మూలభేదాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశమును ప్రారంభిస్తాడు. పునర్జన్మ విధానమును,నిస్వార్థమైన భగవత్సేవా స్వభావుమును,ఆత్మదర్శియైన వ్యక్తి యొక్క లక్షణాలను భగవంతుడు వివరిస్తాడు.[1]

ఇది భగవద్గీత లో రెండవ అధ్యాయము లో ఉన్నది.ఇందులో మొత్తం 72 శ్లోకాలు ఉన్నాయి.

మొదటి శ్లోకం :

[మార్చు]

సంజయ ఉవాచా

తం తథా కృపయావిష్టమాశ్రుపూర్ణాకులేక్షణం |

విషీదన్తమిదం వాక్యమువాచ మధుసూధన :॥

సంజయ:ఉవాచ-- సంజయుడు పలికాడు ;తం -అర్జునునితో ;తథా -ఆ విధంగా ;కృపయా -జాలితో ;ఆవిష్టం -ఆవరింపబడినవాడు ;ఆశ్రుపూర్ణాకుల -ఆశ్రువులతో నిండిన ;ఈక్షణం -కన్నులు ; విషిదన్తం -శోకిస్తున్న వాడు ;ఇదం -ఈ ;వాక్యం -మాటలు ;ఉవాచ -- పలికాడు ;మధుసూదన - మధువును సహరించినవాడు .

సంజయుడు పలికాడు : మనస్సు క్రుంగినవాడై కళ్ళలో అశ్రువులు నిండి కృపాపూర్ణుడైనట్టి అర్జునుని చూసి మధుసూదనుడు (శ్రీకృష్ణుడు) ఈ మాటలు పలికాడు.

భాష్యము:
[మార్చు]

లౌకికమైన జాలి, శోకము, కన్నీరు అనేవన్నీ ఆత్మను గురించి తెలియకపోవడానికి చిహ్నాలు. నిత్యమైన ఆత్మ పట్ల చూపే జాలియే ఆత్మానుభవము.ఈ శ్లోకంలో "మధుసూదన” అనే పదము ముఖ్యమైనది. శ్రీకృష్ణభగవానుడు మధువనే దానవుని సంహరించాడు. కర్తవ్యనిర్వహణలో తనను ఆవరించినట్టి అపార్థమనే దానవుని ఇప్పుడు శ్రీకృష్ణుడు వధించాలని అర్జునుడు అనుకున్నాడు. జాలి ఎక్కడ చూపాలో ఎవ్వరికి తెలియదు. మునిగిపోతున్న వ్యక్తి వస్త్రాలపై జాలి చూపడం మూర్ఖత్వం.బాహ్యవస్త్రాన్ని, అంటే స్థూల శరీరాన్ని రక్షించడం ద్వారా అజ్ఞానసాగరంలో పడినవాడు.రక్షింపబడడు. ఈ సంగతి తెలియక బాహ్యవస్త్రాల కొరకే శోకించేవాడు శూద్రుడు లేదా అనవసరంగా శోకించేవాడని పిలువబడతాడు. అర్జునుడు క్షత్రియుడు; ఈ నడత అతనికి తగినదిగా లేదు. అయినా శ్రీకృష్ణభగవానుడు అజ్ఞానియైనవాని దుఃఖాన్ని శమింపజేయగలడు. ఆ ఉద్దేశము కొరకే భగవద్గీత అతనిచే గానము చేయబడింది.పరమప్రామాణికుడైన శ్రీకృష్ణభగవానుడు వివరించినట్లుగా భౌతికదేహానికి, ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మక అధ్యయనము ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని ఈ అధ్యాయము మనకు బోధిస్తుంది .మనిషి కర్మఫలాసక్తి లేకుండా పనిచేస్తూ నిజ ఆత్మభావనలో సుస్థిరునిగా నిలిచినప్పుడే ఈ అనుభూతి సాధ్యపడుతుంది.

మూలాలు
[మార్చు]

కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. భగవద్గిత యథాతథము.

  1. భగవద్గిత యథాతథము. ముంబాయి: భక్తి వేదాంత బుక్ ట్రస్ట్. ISBN 978-93-83095-10-0.