వాడుకరి:కందర్పకృష్ణ
స్వరూపం
కందర్ప కృష్ణమోహన్ అను నేను భాగ్యనగరవాసిగా, మన భారతదేశ విభిన్న సంస్కృతుల పట్ల, భాషా సౌందర్యాల పట్ల, బహుముఖ ప్రజ్ఞలపట్ల అత్యంత ఇష్టం కలిగినవాడిగా అన్నింటినీ మించి తెలుగు భాషపట్ల అమితానురాగం కలిగినవాడిగా ఈ వికీపీడియాలో అడుగు పెట్టాను. ఆంగ్లభాషనుంచీ తెలుగులోకి అనువదించవలసిన విషయాలపట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నది. ఇప్పటికే వికీపీడియాలో అత్యంత ఉత్సాహంతో యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నవారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నన్ను కూడా మీలో కలుపుకోమని మనవి చేసుకుంటున్నాను.
నమోన్నమః