వాడుకరి:గుగ్గిళ్ల పరమేశ్వరాచార్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ సనారి విశ్వనాధ అవధూత స్వామివారు సభలో ఉన్నవారు సంబ్రమాశ్చర్యములు చెంది సనారి వారి మహిమ తెలిసి కొని ,క్షమాపణ కోరితిరి .ఒక బ్రాహ్మణుడు లేచి ...విశ్వనాధ ఆచార్యులు అని సంబోధించి ఆచార్య ! తమరు విశ్వబ్రాహ్మణ వంశస్థులని ,తెలుపుచున్నారు కదా! అయితే ,మహారాజు గారు ధరించిన కిరీటం ,నవరత్న ఖచితమైనది.కావున అందుగల నవరత్నములు యొక్క స్వచ్ఛత వాటి ప్రభావం తెలుపమనగా ...అప్పుడు స్వామివారు ఒకొక్క జాతి రత్నం ,యొక్క నవగ్రహ అధిపతులు ఎవరు,ఏ యే జాతి రత్నం యే ఏ సుగుణములు కల్గి ఉండును .నవరత్నం లో దోషం ఉన్న ఎటువంటి పరిణామములు జరుగును .నవరత్నములు ధరించునప్పుడు ఏయే సమయ ,నియములు పాటించాలి అన్ని తెలియజేసిరి.మహోన్నత విషయములు వినిన సభికులు హర్షద్వానాలు చేయగా మహారాజు గారు ఎంతో అనంద భరితులైరి .ఇక బ్రాహ్మణులు ఏమి చేయలేక మిన్నకుండిరి.రాజుగారికి రాజయోగం యొక్క విశిష్టత తెలిపి అచట నుండి విశాఖపట్నం చేరుకొనిరి .జెండా పంజా కూడలి వద్ద ఆశ్రమం ఏర్పాటు చేసికొనిరి .విశాఖలో వేదంత బోధనలు చేస్తూ కుల వృత్తికి సంబంధించిన పనులు చేస్తూ ఉండగా విశ్వబ్రాహ్మణులు వచ్చి భక్తి ప్రపత్తులతో మెలుగగ ఒక విశ్వబ్రాహ్మణుడికి స్వర్ణయోగం తెలిపెను .మరల దేశ సంచార నిమిత్తం అన్నవరం ,రామవరం వచ్చి అక్కడ వెంకటరెడ్డి గారి ఇంటి వద్ద ఆధ్యాత్మిక బోధనలు చేయగా పెంపుడు రామచిలుక ఆలకించి తరించి జీవోన్ముక్తి పొందినది .అచటనుండి ద్రాక్షారామం చేరుకొని ,శ్రీ భీమలింగేశ్వర స్వామిని దర్శించి, అచట భద్రకాళి రాత్రి యందు సంచారం చేయుచు జంతువులను ,మనుషులను చంపుచుండుట వలన విషయం గ్రహించి ఆమెను అరికట్టి పునః యంత్ర ప్రతిష్ట చేసి ద్రాక్షారామ ప్రజలకు ఎంతో మేలు చేసిరి . ద్రాక్షరామం వదలి రాజమండ్రి కోటిలింగాల రేవు వద్ద ఆశ్రమం ఏర్పాటు చేసుకొనిరి.విశ్వబ్రాహణ కులస్థులు వచ్చి దర్శనం చేసుకొని ఆధ్యాత్మిక విషయములు అడిగి తెలుసుకొనిరి.స్వామివారి సంకల్ప సిద్ధి అయిన "విశ్వేశ్వర సంవాదం " అను గ్రంధం ను వ్రాయుట ప్రారంభించిరి .ఒక నాడు రాజమండ్రి వచ్చిన కొత్త తహశీల్ధారు గారు (MRO) గుర్రం పై ఎక్కి ఎదురుగా వచ్చుచు స్వామివారిని చూసి ఈ భైరాగి నన్ను చూసి గౌరవించక ,నమస్కారం చేయలేదని కోపముతో కొరడా ఝుళిపించుటకు చేతిని పైకేతేను .ఎత్తిన చేయి ఎత్తినట్లే అచేతనం గ ఉండిపోయిరి .అది చూసిన వారు తహసీల్ధార్ భార్యకు చెప్పగా ఆమె పరుగున వచ్చి స్వామి పదాలు పట్టుకొని బ్రతిమలాడెను .భార్య సుణవంతురాలు అగుటవలన స్వామివారు పూర్వస్థితి వచ్చునట్లు అనుగ్రహించిరి .ఇట్లు దివ్యమహిమలు ,జ్ఞ్యాన బోధనలు చేయుచు ఉండగా రాజమహేంద్రవరం (రాజమండ్రి )లో గల విశ్వబ్రాహ్మణులు ఆలోచన చేసి స్వామివారు మన కులజులేకదా వారిని స్వర్ణయోగం తెలుపమని కోరుదుము అని స్వామివారి ఆశ్రమం వద్దకు స్వర్ణయోగం పొందు విధానం తెలుపమనగా స్వామివారు నవపాషాణములు నమిలి మింగి మీకు నచ్చిన రాగి లేక ఇనుప కడ్డీ ని తీసుకొని రమ్మని స్వర్ణ యోగ విధానం తెలిపెదను అని చెప్పగా ఒకరు వెళ్లి రాగి ముక్కలను,ఇనుప ముక్కలను స్వామి వారి కి ఇచ్చిరి .వాటిని స్వామివారు బంగారు ముక్కలు గ చేసి ఇచ్చారు.స్వామివారు నాయన లారాైన ,తాత్కాలిక ఆశల కంటే శాశ్వత మైన పరమాత్మ కోసం తపించండి అని చెప్పెను .రాజలింగం అను విశ్వబ్రాహ్మణుడికి విశ్వబ్రాహ్మణ గోత్రా అధ్యనం తాళ పత్రాలులను రాజలింగాచారి కి ఇచ్చిరి .విశ్వేశ్వర సంవాదం పూర్తిచేసి ఆ గ్రంథ ముద్రణ కొరకు చెన్నపట్నం మద్రాసు ప్రయాణించెను .గ్రంధములు ముద్రించు మొదలియార్ వద్దకు వెళ్లెను .తను కుష్ఠి వ్యాధితో బాధపడుతున్నాడు .స్వామివారు వద్దనున్న "విశ్వేశ్వర సంవాదం " ప్రతిని,మొదలియార్ కు ఇచ్చి ఈ గ్రంధం పరమ పవిత్రమైనది .లోక కల్యాణార్థం దీనిని ముద్రించి ఇచ్చినా, నేను మీ భాదను నివృత్తి చేసి ఆరోగ్య వంతుణ్ణి చేసెదను .అని తెలిపెను .మొదలియార్ కూలిలతో పనిచేపించి గ్రంధం ముద్రణ చేసి స్వామివారికి ఇచ్చెను. స్వామి వారు మొదలియార్ ను సంపూర్ణారోగ్యవంతునిగచేసెను .వారు స్వామివారిని చెన్నపట్నం లో ఉరేగిస్తుండగా శృo గేరి పీఠాధిపతులు తారసపడిరి . తాను ఈశ్వర అవతారమని చెప్పెను .వారి శిష్యుల్లో ఒకరు అయ్యా తమరు ఆ గౌరి పరమేశ్వరులు అని చెప్పుచున్నారు గదా!అయితే గౌరీదేవి ఏది?అని ప్రశ్నించగా ...సనారి వారు వెంటనే జన సమూహం వైపు చూసి ఓ 16 యేండ్ల వైశ్య బాలిక ను పిలిచెను .వచ్చి శ్రీ సనారి వారి ఎడమ తొడపై కూర్చుండెను .వీరు నిజముగా పరమేశ్వర సంభూతులు అని తెలుసుకొనిరి.స్వామివారు పిదప ఆత్మనివేదనకై శ్రీశైలం వెళ్లి, కొండ గుహల్లో తపస్సు లో నిమగ్నులుఅయిరి . (సమాప్తం)