వాడుకరి:గురుమూర్తి వాల్మీకి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • 📗పుస్తక పరిచయం📔*
  • ఒక తెలుగు కథ*
  • (తెలుగు తక్కువ ప్రపంచంలో)*
  • -నందివెలుగు ముక్తేశ్వర రావు, విశ్రాంత ఐ. ఏ. యస్. అధికారి.*


👉 *భాషను నేర్చుకోవడం అనేది ఒక ప్రక్రియ- నేర్చుకునే ప్రక్రియ. దీనిని నేర్పేందుకు శాస్త్రీయంగా రూపొందించిన విధి విధానాలు ఉన్నాయి.వాటిని వదిలి పెట్టి ఇంగ్లీష్ మీడియం ద్వారా ఇంగ్లీష్ యోగం పడుతుంది అనుకోవడం ఒక అశాస్త్రీయమైన భ్రమ కదా!*

  • 👉ఇంగ్లీష్ మీడియం ని వ్యతిరేకించడం ఇంగ్లీషులో వ్యతిరేకించడం కాదు.ఇంగ్లీష్ నేర్చుకోవడానికి శాస్త్రీయమైన ఆధునికమైన పద్ధతులు ఉన్నాయి.అవి తరగతి గది దాకా రావాలి కదా!*
  • 👉 రాజ్యాంగం కానీ, వివిధ విద్యా కమిషన్లు, విద్యావేత్తలు ,మనస్తత్వ శాస్త్రవేత్తలు, మాతృ భాషల విషయంలో చాలా స్పష్టంగా ఆవిష్కరించిన సత్యాన్ని చూడటానికి మనం ఎందుకు నిరాకరిస్తున్నాము?*
  • 👉 మాతృభాషలో బోధన, పాలన,భాషను ఎలా జీవ వంతంగా కళకళలాడేటట్లు చేస్తాయి.?*
  • 👉 పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు ఉవ్వెత్తున లేచే ఈ కాలంలో,భాషా వరణం కూడా పర్యావరణం భాగమే కదా!.*
  • 👉 పరభాష మనని మన ఆలోచనల్లోంచి సహజత్వాన్ని ఎలా దూరం చేస్తుంది.?మన సంప్రదాయం పట్ల విముఖత ఎలా పెంచుతుంది.*
  • 👉 మనం చూస్తుండగానే ఇలాంటి నిర్లక్ష్యానికి గురై కొన్ని మాతృభాషలు తెరమరుగవుతున్నాయి అనేది నిజమే కదా!.*
  • 👉 ఇంగ్లీష్ మీద ఒక్కసారిగా తల్లిదండ్రులు ఎగబడటానికి మనం రూపొందించే విధానాలు, వాటిని నడిపిస్తున్న, ఇతరేతర శక్తుల ప్రభావం లేదా ?*
  • 👉ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి దేశీయ భాషా అనుకూల వైఖరితో ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధి రంగాల్ని మార్చుకోవడం నిజంగానే కష్టసాధ్యమా?*
  • 👉 మన వైఖరి "ఆకలి వేయ్యకుండా మందిస్తాను.అన్నం పెట్టు తల్లీ!" అన్న పాత సామెత నిరూపిస్తున్నట్టుగా లేదా!*
*ఇలాంటి అంశాలతో ఈ పుస్తకం మీతో మాట్లాడుతూ, మీతో కలిసి నడుస్తుంది.మీ చేతులారా స్వీకరించండి .ఆర్ద్రమైన మన అమ్మ బాషని ఆదరించండి.*


  • కావలసింది ధీరులు ధీరులు!*
  • తక్కినదంతా సిద్ధంగా ఉంటుంది.*
  • స్వామి వివేకానంద ధైర్యానికి ప్రతిరూపం మహోన్నత కార్యదక్షులు. ఆయన్ని గురించి ప్రస్తావిస్తూ శ్రీ రామకృష్ణులు ఇలా అనేవారు: " నరేంద్రుడు ఏ ప్రభావానికి లొంగడు.అతను మగ పావురం లాంటివాడు. మగ పావురం ముక్కు పట్టుకుంటే విదిలించి అవతలకు త్రోసిపార వేస్తుంది.అదే ఆడ పావురం అయితే ఎదురు తిరగకుండా కూర్చుంటుంది. జన సమూహంలో ఉన్నప్పుడు నా పక్కన నరేంద్రుడు ఉంటే నాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది".*
  • స్వామి వివేకానంద కాలక్రమేణ వచ్చే మార్పులను ప్రతిపాదించారు. 'అన్నమో రామచంద్ర' అని అలమటించే పేదవాళ్లకు తమ కాళ్లపై నిలబడగలిగే సామర్థ్యాన్ని ఇవ్వకుండా వారికి మతాన్ని గురించి బోధించడం నిరుపయోగ మని ఆయనకు బాగా తెలుసు. అదేవిధంగా సోమరులను కష్టపడి పనిచేసి జీవిత సమస్యలను ఎదుర్కొనటం నేర్పకుండా సమదర్శిత భావాన్ని బోధించడం వ్యర్థం అని స్వామి వివేకానంద చక్కగా గుర్తించారు. ఆయన దృష్టిలో బలహీనంగా ఉన్నవారు ప్రారంభ దశలో శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా ధీరులు కావాలి.పని పాటలు లేని సోమరులు కార్యశీలురై నిరంతరం పని చేయడం ద్వారా ధీరులు కావాలి. నిరక్షరాస్యులు విద్యాభ్యాసం ద్వారా ధీరులు కావాలి. విద్యావంతులైన వారు నైతిక విలువలు పాటించడం ద్వారా ధీరులు కావాలి. నైతిక విలువలను తు.చ తప్పకుండా అనుసరించగలిగేవారు ఆధ్యాత్మిక సాధనల ద్వారా ధీరులు కావాలి. స్వామి వివేకానంద ఎదుటి వారి స్థితిని బట్టి వాళ్ళ అభివృద్ధికి తగిన సందేశాన్ని ఇచ్చేవారు.ధీరులు గా తయారయ్యేందుకు ఆయన వివిధ వ్యక్తులకు ఇచ్చే సందేశం వారి అర్హతలను బట్టి మారుతూ ఉండేది.అందుకే ధీరత్వం విషయంలో ఆయన ఒక వర్గం వారికి ఇచ్చిన సందేశం వీరికి భిన్నంగా ఉండే మరొక వర్గం వారికి వర్తించదు. ప్రజలలో ధీరత్వాన్ని మేలు గొలపాలనే ఆవేదన తో ఇలా అనేవారు: "కావలసింది ధీరులు, ధీరులు! తక్కినదంతా సిద్ధంగా ఉంటుంది."*
 *అందరికీ ప్రారంభంలోనే భగవంతుడి గురించి ఉపదేశం చేయనవసరం లేదని ఆయన గుర్తించారు. క్రమ క్రమంగా ప్రజలలో ఉన్నతభావాలను పెంపొందింపజేస్తూ వారిని ధీరులుగా తీర్చిదిద్దుతూ మహోన్నత స్థితులకు ఎదిగేందుకు సహాయపడడమే ఆయన బోధనా విధానం.*
  • 👌మంచి మాట👌*

(నిన్నటి కొనసాగింపుగా...)

  • 1.శారీరకంగా బలహీనంగా ఉండే వారు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకొనడం ద్వారా ధీరులుగా మారాలి.*
 *దేశం నలుమూలలా పర్యటించినప్పుడు యువతరం వారు అనేకమంది శారీరక దౌర్బల్యం తో ఉండటం గమనించిన స్వామి వివేకానంద చాలా కలత చెందారు. ఆయన తన వ్యక్తిగత జీవితంలో దృఢ శారీరక నిర్మాణానికి బాల్యం నుండి శ్రద్ధ తీసుకునేవారు.చిన్నతనంలో ఆయన కర్రసాము,గుర్రపుస్వారీ, వ్యాయామశాలలో కసరత్తులు చేసేవారు. కాలాంతరంలో దేశవిదేశాలలో ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నప్పుడు కూడా నిరంతరం పని చేసేందుకు కావలసిన శరీర దారుఢ్యం కోసం డంబెల్స్ తో కసరత్తులు చేస్తుండేవారు.దేశ యువకులకు శారీరక దారుఢ్యం పెంపొందించుకొమ్మని సందేశం ఇస్తూ స్వామి వివేకానంద ఇలా అన్నారు.* 
  • మొదట మన యువకులు బలిష్టులు కావాలి. మతనిష్ఠ ఆ తర్వాత తనంతట తానే వస్తుంది. ముఖ్యంగా నా యువ సోదరులకు నేను చేసే విజ్ఞప్తి ఇది! భగవద్గీతా పారాయణం కన్నా ఫుట్బాల్ ఆటే మిమ్మల్ని త్వరగా మోక్ష మార్గానికి తీసుకువెళుతుంది.ఇవి మహాసాహసవచనాలు! అయినా వాటిని నేను చెప్పవలసి ఉంది. ఎందుకంటే నాకు మీ పట్ల గాఢాభిమానం ఉంది.నా చెప్పు ఎక్కడ కరుస్తుంది నాకు తెలుసు. నేను కొంచెం అనుభవం సంపాదించాను. మీ జబ్బలు ,కండరాలు ఇంకా కొంచెం బలపడినప్పుడు మీరు భగవద్గీతను ఇంకా బాగా అర్థం చేసుకొనగలరు.మీలో ఇంకా కొంచెం బలం ఉంటే రక్తం ప్రవహిస్తే శ్రీకృష్ణుని మహాబలాన్ని , ప్రతిభా విశేషాలను చక్కగా అర్థం చేసుకోగలరు. మీ పాదాల మీద మీ శరీరం దృఢంగా, సుస్థిరంగా నిలపగలిగినప్పుడు,మీరు నిజమైన ధీరులని భావించగలిగినప్పుడు,ఉపనిషత్తులను, ఆత్మ మహిమను సమగ్రంగా అవగాహన చేసుకోగలరు. ఈ విధంగా మన అవసరాలకై వీటిని ఉపయోగించుకోవాలి.*
  • 👌మంచి మాట👌*

(నిన్నటిది కొనసాగింపుగా)

  • 2.విద్యావంతులై సోమరులుగా ఉన్నవారు నిరంతర కార్యాచరణతో ధీరులుగా మారాలి*
  • స్వామి వివేకానంద దృష్టిలో ధీరత్వం అంటే కార్యశీలత. ఆయన ఈ పరమ సత్యాన్ని కఠోర అవస్థలలో చూడ సాహసించి పిరికితనానికి ఏ మాత్రం లొంగే వారు కాదు.స్వామి వివేకానంద దృష్టిలో ఏ పని చేయకుండా సోమరులుగా కూర్చోవడం మహా పాపం. ఈ విషయంలో ఆయన ఇలా అన్నారు."నాకు అనుభవం పెరుగుతున్న కొద్దీ అంతా వీరత్వం లోనే ఇమిడి ఉందని గమనిస్తున్నాను. ఇది నా నూతన సందేశం అవసరమైతే చెడుపనులను కూడా ధీరత్వం తో చేయండి.దుష్టులు కావాలంటే అందులో పరాకాష్టకు వెళ్ళండి.ఒకసారి సోదరి నివేదిత భారతదేశంలో నేరాలు చాలా తక్కువగా జరుగుతున్నాయని స్వామి వివేకానంద తో ప్రశంసా పూర్వకంగా అన్నది.స్వామి వివేకానంద ఆ ప్రశంసను ఖండిస్తూ ఇలా అన్నారు. దీనికి విరుద్ధంగా ఉంటే ఎంతో మంచిది. ఇది ధీరత్వం మరణించడం సూచిస్తోంది."*
*ఒకరోజు యువకుడొకడు స్వామి వివేకానంద వద్దకు వచ్చి ఇలా అన్నాడు:"స్వామీజీ పరమసత్యాన్ని ఆకళింపు చేసుకోగోరి నేను దర్శించని పుణ్యస్థలం లేదు.అంతేకాక అనేక మత సంస్థలతో సన్నిహిత సంబంధాన్ని కూడా నెరపాను. కానీ ఇంతవరకూ అసలు సత్యాన్ని తెలుసుకోలేకపోయాను. ప్రతిరోజూ తలుపులు మూసుకొని గదిలో కూర్చుని ధ్యానంలో నిమగ్నుడను అవుతున్నాను. కానీ మనశ్శాంతి మాత్రం దక్కడంలేదు."*
  • అతను చెప్పిందంతా సావకాశంగా విన్న తరువాత స్వామి వివేకానంద ఇలా అన్నారు:"నాయనా నీకు మానసిక ప్రశాంతత చేకూరాలంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకూ పూర్తిగా వ్యతిరేకమైన పనులను ఆచరించాలి. నువ్వు తలుపులు తెరచి ఉంచుకుని చుట్టుపక్కల పరికించాలి. అలా చేస్తే నీ సహాయార్థం ఎంతమంది అర్రులు చాచి నిరీక్షిస్తున్నారో చూసి ఆశ్చర్య పోతావు. వారికి ఆహార పానీయాలు సమకూరుస్తూ, నీ శక్తి వంచన లేకుండా సేవించు. అప్పుడు నీకు మనశ్శాంతి లభిస్తుందని ఘంటాపథంగా చెప్పగలను."*

(మిగిలిన భాగం రేపు...)