Jump to content

వాడుకరి:డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డి

వికీపీడియా నుండి

డాక్టర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి - M.A (Gold Medal), B.Ed, M.Phil, Ph.D, JRF, NET Assistant Professor in Telugu, SRR Govt. Arts & Science College, Karimnagar, 9154690580

ప్రస్తుత పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన డాక్టర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకొన్నారు. 1996 లో ఉపాధ్యాయునిగా ఎంపికై 2002 లో జూనియర్ అధ్యాపకులుగా, 2010 డిగ్రీ అధ్యాపకులుగా ప్రమోషన్ పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఎం.ఏ తెలుగులో గోల్డ్ మెడల్ సాధించి అదే విశ్వవిద్యాలయం నుండి ఎం.ఫిల్, & పి. హెచ్ డి(డాక్టరేట్) పట్టా అందుకున్నారు. రే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజి, మద్రాస్ నుండి ఫిల్మ్ యాక్టింగ్‌లో సర్టిఫికేట్ కోర్సు & హైదరాబాద్ మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుండి ఆక్టింగ్ డిప్లమా చేసి అనేక లఘుచిత్రాలు నిర్మించారు. కళాశాలలో ఫిల్మ్ మేకింగ్ సెర్టిఫికేట్ కోర్స్ కోర్స్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్టూ విద్యార్థులకు ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణనిస్తూ లఘుచిత్రాలు నిర్మిస్తున్నారు. కళాశాల బోధనలోనే కాకుండా కళాశాల వివిధ అభివ్రుద్ధి కమిటీలలో కన్వీనర్ గా, సభ్యులుగా ఉన్నారు. ఇన్ ఛార్జి లైబ్రేరియన్‌గా, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గా భాధ్యతలు నిర్వహించారు. ఇన్ ఛార్జ్ ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తూ విద్యార్థులను రాష్ట్ర, జాతీయ క్రీడల పోటీలకు పంపించి పథకాలు, కరీం నగర్ లో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు ఉచిత పోలీసు నియామక శిక్షణ శిబిరం, యోగా శిక్షణ శిబిరం నిర్వహించారు. చైనీస్ వుషు కుంగ్ ఫూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కుంగ్ ఫూ మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ సాధించి, మార్షల్ ఆర్ట్స్ ద్వారా మహిళా విద్యార్థులకు స్వీయరక్షణ మెలకువలు (టెక్నిక్స్) నేర్పించారు. విద్యార్థులను మార్షల్ ఆర్ట్స్ పోటీలకు పంపించారు. వివిధ మార్షల్ ఆర్ట్స్ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివ్రుద్ధి కేకెంద్రం RTI యాక్ట్ పై నిర్వహించిన ట్రైనర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో శిక్షణ పొంది కేంద్ర ప్రభుత్వ పథకం కింద RTI కరీమ్ నగర్ జిల్లా రిసోర్స్ పర్సన్ గా నియమితులై పలువురికి శిక్షణనిస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కమిటీలో సభ్యుడిగా నామినేట్ చేయబడ్డారు. శాతవాహన విశ్వవిద్యాలయం తెలుగు బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులుగా భాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఉన్నతవిద్యామండలి ఆధ్వర్యంలో రెండు జాతీయ సదస్సులు నిర్వహించారు. 2017 లో హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో డిప్యుటేషన్ పై వెళ్ళి నెలరోజుల పాటు సభానిర్వహణలో సేవలు అందించారు. యువతరంగం జిల్లా, క్లస్టర్ & రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ గా సాంస్కృతిక మరియు సాహిత్య కార్యక్రమాల నిర్వహణ ద్వారా కళాశాల విద్యాశాఖ ప్రశంసా పత్రంతో పాటు కళాశాల విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్‌ సర్టిఫికెట్ కోర్సు కోఆర్డినేటర్ గా 2017 నుండి జర్నలిజం విద్యార్థుల కోసం అనేక సెమినార్‌లు & వర్కుషాప్‌లు నిర్వహించారు. యుజిసి ఆర్థిక సహాయయంతో విద్యాబోధనపై ప్రాజెక్ట్ నిర్వహించడమే కాకుండా మలేషియా కౌలాలంపూర్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొని ఆ అంశంపై పత్రసమర్పణ చేశారు. 2018 లో శాతవాహణ యూనివర్సిటీ ద్వారా కాలేజీ అకాడమిక్ కోఆర్డినేటర్‌గా నియమితులై కోవిడ్ లాక్ డౌన్ సమయంలో పరీక్షల విభాగాన్ని డిజిటలైజ్ చేశారు. 2021 ఉత్తమ సాంస్కృతిక సమన్వయ కర్తగా జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రం అందుకొన్నారు. ఇటీవల మద్రాస్ యూనివర్సిటీ తెలుగుశాఖ సమన్వయంతో ఇంటర్నేషనల్ వెబినార్ నిర్వహించారు. తెలంగాణరత్న, ఓ మరణమా క్షణమాగుమా, ఫిఫ్త్ ఎస్టేట్, వ్యాసరత్నావళి లాంటి 8 పుస్తకాలు రచించారు. జాతీయ & అంతర్జాతీయ సదస్సులలో 31 పత్రాలను సమర్పించారు. ప్రముఖ దినపత్రికలలో వ్యాసాలు ప్రచురించారు.