వాడుకరి:డేవిడ్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
డేవిడ్ | |
---|---|
జననం | డేవిడ్ 1980 అమరచింత |
ఇతర పేర్లు | డేవిడ్ |
వృత్తి | జర్నలిస్ట్ |
ప్రసిద్ధి | రచయిత, విశ్లేషకుడు |
ఎత్తు | 5.6 |
బరువు | 64 |
తండ్రి | అజ్జపాగు అబ్రహం |
తల్లి | శారా |
వెబ్‌సైటు | |
http://www.okavennela.blogspot.in/ |
జననం
[మార్చు]- బాల్యం[మార్చు]
డేవిడ్ 1980, అక్తోబర్ నెలలో 16న మహబూబ్ నగర్ జిలా అమరచింత అనే గ్రామంలో జన్మించాడు. తల్లి శార, తండ్రి అబ్రహం. చిన్నతనంలో చర్చి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. హైస్కూలు చదువులు పూర్తి కాకముందే బైబిల్ ను ఇతర క్రైస్తవ బోధకుల జీవిత చరిత్రలను క్షుణ్ణంగా చదివాడు. హైస్కూలు చదువుతున్న కాలంలోనే వివిద జిల్లాలో జరుగుతున్న అనే క్రైస్తవ మీటింగ్స్ లో పాల్గొని బైబిల్ కి సంబందించిన క్విజ్ పోటిల్లో అనేక బహుమతులు పొందాడు. అప్పట్లోనే ప్రముఖ క్రైస్తవ రేడియో ప్రసంగికులైన రెవరెండ్ అర్.అర్.కె. మూర్తి, జ్యోషి, ఇమ్మానూయేల్ వంటి వారితో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపాడు. అయితే ఇంటర్ చదువుతున్న రోజుల్లో రంగనాయకమ్మ రచనలతో ప్రభావితమై అనంతరం సమాజంలో అణగారిన వర్గాల పట్ల జరుగుతున్న అన్యాయాలపైకి అతని దృష్టిని గాఢంగా మళ్ళించింది.
విద్యాభ్యాసం
[మార్చు]- విద్యాభ్యాసం - [మార్చు]
హైస్ స్కూల్ వరకు స్వగ్రామమైన అమరచింతలోనే చదివాడు. ఇంటర్ మీడియట్ వనపర్తిలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో చదివాడు. ఆ సమయంలోనే రంగనాయకమ్మ రచనలతో ప్రభావితమై వామపక్ష ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. తరువాత బి.ఎ.చదువు కోసం జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ వెళ్ళాడు. ఇంటర్ చదువుతున్నప్పుడే భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ)లో కాలేజి అద్యక్షునిగా పనిచేశాడు. అనంతరం తాను డిగ్రీ చదువుతున్న కాలంలో విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొని మహబూబ్ నగర్ డివిజన్ అద్యక్షునిగా కూడా కొంత కాలం పనిచేశాడు. ఎం.ఏ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తిచేశాడు. ఉస్మానియా యూనివర్శిటిలో ఏం.ఏ చదువుతున్న రోజులతో యూనివర్శిటి విద్యార్థి సమస్యలపై, నాటి వైస్ చాన్స్ లర్ డి.సి. రెడ్డి ప్రవేశపెట్టిన సెమిస్టర్ సిస్టానికి వ్యతిరేకంగా పనిచేశాడు.
బయటి లింకులు
[మార్చు]డేవిడ్ గారి ఇతర సమాచారాన్ని ఇక్కడ ఛూడవచ్చు.
- ఒక వెన్నెల ఇక్కడ తన రచనలను వ్యాసాలు, కవితలు,స్పందనల రూపంలో పొందుపరచాడు.
- డేవిడ్ ఓయూ , ఇక్కడ వర్తమాన అంశాలపై తన అభిప్రాయాలను పొందుపరచిన విశేషాలు, ఫొటోలు ఉన్నాయి.