Jump to content

వాడుకరి:తన్నీరు రమేష్/పుస్తకాలు/తన్నీరు రమేష్ రచనలు

వికీపీడియా నుండి
Title
ఈ పుస్తకానికి సరిపోయిన ముఖపత్ర బొమ్మను ఎంచుకోండి. సూచనలకొరకు "మూస:భద్రపరచిన_పుస్తకం"చూడండి."
ఇది వాడుకరి పుస్తకం వాడుకరి కూర్చిన వికీవ్యాసాల సంగ్రహం. దీనిని సులభంగా భద్రపరచవచ్చు, ఈ-పుస్తకం గా రూపుదిద్దవచ్చు, ముద్రణ పుస్తకంగా కొనుక్కొనవచ్చు కూడా. మీరు ఈ పుస్తకాన్ని కూర్చినవారై మరింత సహాయం కావాలంటే సహాయం:పుస్తకాలు (సాధారణ చిట్కాలు), వికీప్రాజెక్టు వికీపీడియా-పుస్తకాలు(ఆంగ్లంలో) ( ప్రశ్నలు, సహాయం) చూడండి.
PDF దించుకో ]

పుస్తక కూర్పరిలో తెరువు ]  [ ముద్రణ పుస్తకాన్ని కొనుగోలు చేయండి ]

[ About ] [ FAQ ] [ Feedback ] [ Help ] వికీప్రాజెక్టు(ఆంగ్లంలో) ] [ Recent Changes ]


వాడుకరి:తన్నీరు రమేష్
తన్నీరు రమేష్ రచనలు

అతని పేరు అరవింద్ రామస్వామి, వయస్సు 72 సంవత్సరాలు. ఇంటి వద్ద నుంచి నడుచుకుంటూ ఒక గ్రౌండ్ వద్దకు చేరుకొని మెట్లపై కూర్చుని ఇన్నేళ్ల తన జీవితాన్ని ఒకసారి నెమరువేసుకుంటూ సుఖాలు-దుఃఖాలు, కష్టాలు-నష్టాలు, జయాలు- అపజయాలు, ఆటలు-పాటలు, పద్ధతులు-పండగలు, పిల్లలు-అనుబంధాలు అన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకొని అందరూ ఉన్న అనాధగా ఎందుకు చనిపోవాల్సివచ్చింది అనేదే ఈ కథ....


ఆ రోజు సూర్యోదయం ఇంట్లో అరవింద్ రామస్వామి ఒక్కడే ఉన్నాడు రోజువారీ పనుల్లో భాగంగా ఏవో పనులు చేసుకొని రెడీ అవుతున్నాడు.

తన భార్య ఫోటో వద్దకు వచ్చి దీపం వెలిగించి కాస్త కన్నీళ్ళు పెట్టుకొని మన పిల్లలు విడిచి వెళ్ళినా, నువ్వు నాకు తోడుగా ఉంటావు అనుకున్నా కానీ నువ్వు కూడా నన్ను ఒంటరి వాన్ని చేసి వెళ్ళిపోతావు అనుకోలేదు.

అనుకొని కన్నీళ్లు తుడుచుకొని నీరసంగా నడుచుకుంటూ టేబుల్ వద్దకు వచ్చి కూర్చొని పిల్లల ఫోటోల వైపు చూసి కన్నీళ్లు పెట్టుకొని ఒక లెటర్ రాస్తాడు.

తర్వాత పిల్లల ఫోటోల దగ్గరకు వచ్చి చేతితో తడిమి లెటర్ ని సంచిలో పెట్టుకొని దాన్ని భుజానికి వేసుకుని బయటకు వచ్చి చెప్పులు వేసుకొని తలుపులకు తాళం వేసి ముందుకు నడిచి ఒక్కసారి వెనక్కి తిరిగి ఇంటిని చూసుకొని బాధగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తాడు.

అలా నడుచుకుంటూ ఒక గ్రౌండ్ వద్దకు చేరుకున్నాక ఐస్ క్రీమ్ బండి వద్ద ఉన్న పిల్లలందరికీ ఐస్ క్రీమ్ లు కొనిచ్చి

గ్రౌండ్ వైపు నడుస్తూ తనని తాను పరిచయం చేసుకుంటూ అందరికీ నమస్కారం నా పేరు అరవింద్ రామస్వామి నా వయసు 72 సంవత్సరాలు నా భార్య పేరు జానకి ఈ మధ్యే కాలం చేసింది. నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. వాళ్లు విదేశాల్లో స్థిరపడ్డారు.

మేము ఉన్నామా పోయామా అని పట్టించుకునే తీరిక కూడా వాళ్లకి లేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చనిపోయింది అని కబురు చేసినా ఎవ్వరూ రాలేదు. మా ఆస్తులు పంచుకున్నారు కానీ మా మంచి, చెడులు మాత్రం పంచుకోలేదు. రేపు నేను చనిపోయినా నా పరిస్థితీ అంతే కదా. అని ఆగి గ్రౌండ్ వైపు చూపిస్తూ,


ఇదిగో ఇదే నా ప్రపంచం. చిన్నప్పుడు గోలీలు ఆడుకుంది, బడికి వెళ్లేటప్పుడు దొంగా పోలీస్ ఆటాడుకుంది, కాలేజ్ అప్పుడు క్రికెట్ ఆడింది, పెళ్లి అయ్యాక ఆదివారాల్లో సేద తీరింది, ఇదిగో... ఈ ముసలితనంలో అవన్నీ నెమరు వేసుకోవడానికి గడిపింది ఈ గ్రౌండ్ లోనే.


అని చెబుతుండగా గ్రౌండ్ అంతా చూస్తే పచ్చని చెట్లతో, పక్షుల కిలకిలలతో ఎంతో అందంగా ఉంది. గ్రౌండ్ కు చుట్టూ మెట్లు ఉంటాయి వాటి మీదనుంచి దిగుతూ గ్రౌండ్ కు వెళ్లాలి.


అలా అరవింద్ రామస్వామి చెప్పాక , పై మెట్టు పై కూర్చుంటాడు. సంచీలోంచి డైరీ పెన్నుని తీసి చేతిలో పట్టుకొని ఒక్క క్షణం గట్టిగా శ్వాస పీల్చుకుని వదిలి

అరవింద్ రామస్వామి : ఏ పని చేతకాని ఈ ముసలితనం కంటే భార్యా పిల్లలతో గడిపిన ఆ రోజులే ఎంతో బాగుండేవి అనుకోగానే


పక్కనే కూర్చుని ఉన్న ఒక 45 సంవత్సరాల వ్యక్తి లేచి నిలబడి కాస్త పక్కకు జరిగి ఒక మెట్టు దిగి కూర్చొని తల పట్టుకొని

వ్యక్తి : ఏం సంసార జీవితమో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు, సాగరానైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేం అని పెద్దలు ఊరికే అన్నారా , అయినా యుక్త వయసులో నా కాలేజీ రోజులే బెటర్ ఎంతో సంతోషంగా గడిచిపోయేవి, అనుకోగానే పక్కనే కూర్చున్న పాతికేళ్ళ(25) కాలేజీ కుర్రోడు లేచి నిలబడి కాస్త పక్కకు జరిగి ఒక మెట్టు దిగి కూర్చొని


కాలేజీ కుర్రోడు : ఈ కాలేజీ గోలేంటీ, ఈ సెమిస్టర్ లేంటీ ఈ ల్యాబ్ లేంటీ, హ... అని నిట్టూర్చి,, నా చిన్నతనంలో బడికి వెళ్లే రోజులు ఎంత సంతోషంగా గడిచిపోయేవో అనుకోగానే పక్కనే స్కూలు బ్యాగు వేసుకొని కూర్చున్న 15 సంవత్సరాల బాలుడు(విద్యార్థి) లేచి నిల్చొని కాస్త పక్కకు జరిగి ఒక మెట్టు దిగి కూర్చొని


విద్యార్థి : ఇదెక్కడి స్కూలు రా బాబు, చిన్న పిల్లవాడిని అని కూడా చూడకుండా ఈ టీచర్లందరూ వాయ గొడుతున్నారు. అబ్బో.. ఇదంతా మన వల్ల కాదు ........ అయినా బడికి వెళ్లకముందు పసితనంలో ఎంత చక్కగా ఆడుకునే వాడినో ,, అని అనుకోగానే ఐస్ క్రీమ్ తింటూ పక్కన కూర్చున్న బాలుడు పైకి లేచి నిలబడి కాస్త పక్కకు జరిగి ఒక మెట్టు దిగి కూర్చొని


బాలుడు : హు..... ఒక్క ఐస్ క్రీమ్ కోసం ఎన్ని దెబ్బలు తినాల్సి వచ్చింది అదే పక్కింటి అన్న(విధ్యార్ది) స్కూలు కి వెళ్తుంటే రోజూ 5 రూపాయలు ఇస్తున్నారు.. హ... తను ఎంత లక్కీయో. అనుకోగానే పక్కనే స్కూలు బ్యాగు వేసుకొని కూర్చున్న విధ్యార్ది లేచి నిలబడి కాస్త పక్కకు జరిగి ఒక మెట్టు పైకి ఎక్కి కూర్చొని

విధ్యార్ది : త్వరగా 10 టెన్త్ అయిపోతే బాగుండు హ్యాపీ గా కాలేజీ లైఫ్ అనుభవించవచ్చు. అనుకోగానే పక్కనే కూర్చున్న కాలేజీ కుర్రోడు లేచి నిలబడి కాస్త పక్కకు జరిగి ఒక మెట్టు పైకి ఎక్కి కూర్చొని

కాలేజీ కుర్రోడు : ఈ వెధవ కాలేజీ అయిపోగానే, ఏదో ఒక ఉద్యోగం సంపాదించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు . అనుకోగానే పక్కనే కూర్చున్న వ్యక్తి లేచి నిలబడి కాస్త పక్కకు జరిగి ఒక మెట్టు పైకి ఎక్కి కూర్చొని

వ్యక్తి : ఈ సంసారాన్ని ఈదడం మన వల్ల అయితే కాదు... హ్యాపీ గా రిటైర్ అయిపోయి దర్జాగా కాలు మీద కాలు వేసుకొని బ్రతికేస్తే ఎంత బాగుంటుందో. అనుకోగానే యధాతధంగా పక్కనే ముసలివాడు అరవింద్ రామస్వామి కూర్చొని ఉండాలి కానీ లేడు రెండు, మూడు మెట్లు పైకెక్కి చూడగా అరవింద్ రామస్వామి పడుకొని ఉన్నాడు పక్కనే డైరీ తెరిచి ఉంది అందులో

👉పిల్లలకు ఉన్నత చదువులు చదివించడమే కాదు, ఉన్నత విలువలూ నేర్పించాలి, అప్పుడు వాళ్లు మనతో ఉన్నా విదేశాలలో ఉన్నా మన గౌరవాన్ని, విలువలను కాపాడుతూనే ఉంటారు, మన వెన్నంటే ఉంటారు... ఇక సెలవు . అని రాసి ఉంది.


అలా అరవింద్ రామస్వామి విగతజీవిగా పడి ఉన్నాడు.

అక్కడే ఉన్న చెట్లు తమ ఆకులను, పూలను విధిలించి, పక్షులు రెక్కల ఈకలను విదిలించి తమ సంఘీభావాన్ని తెలియజేశాయి.

ఒక్కసారిగా అక్కడ గాలి దుమారం చెలరేగి సుడిగుండం లాగా ఆకాశంలోకి ప్రవహిస్తూ వెళ్లిపోవడంతో

                  🏵️సమాప్తం🏵️
         
      ✍️ రచయిత :తన్నీరు రమేష్

తన్నీరు రమేష్ (చర్చ) 12:57, 9 నవంబరు 2023 (UTC)

తన్నీరు రమేష్ రచనలు


దసరాకి పుట్టింటికి వెళ్ళిన భార్య  సౌమ్య ,  ఇంటికి తిరిగి వస్తుంది.

బెడ్ పై కాళ్లు చాపుకొని కూర్చుని ల్యాప్ టాప్ లో, ఫోన్ లో ఎవరితోనో చాటింగ్ చేస్తుంటాడు భర్త    వినయ్.

భార్యను చూసి షాక్ అయిన

వినయ్:- అదేంటి సౌమ్య రేపు వస్తున్నాను అన్నావు కదా ఈ రోజే వచ్చావ్ ఏంటి

అనగానే కాస్త చిరాకుగా చూసిన

సౌమ్య:- ఆ ... నా భర్తగారైన వినయ్ గారు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు కదా , ఆ బెంగతో త్వరగా వచ్చేసా..

ఏం ... త్వరగా వచ్చినందుకు డిసప్పాయింట్ అయ్యావా. అనగానే కంగారు పడిన

వినయ్:- అబ్బే అదేం లేదు ఏదో క్యాజువల్ గా అడిగా అని కవర్ చేస్తాడు.

జర్నీ చేసి వచ్చినందుకు చిరాకుగా ఉంది ఫ్రెష్ అప్ అయి వస్తాను తర్వాత మాట్లాడుకుందాం . అని వాష్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది సౌమ్య.

హడావుడిగా ల్యాప్ టాప్ , ఫోను ఓపెన్ చేసి సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ లాగ్ అవుట్ చేసి కంగారు పడుతుంటాడు భర్త వినయ్. ఈలోగా సౌమ్య ఫ్రెష్ అప్ అయి వచ్చి అద్దంలో చూసుకుంటూ రెడీ అయి డ్రా లో ఉన్న  ప్రెస్సింగ్  బాల్ ని చేతిలోకి తీసుకొని ప్రెస్ చేస్తూ బెడ్ వద్దకు వస్తుంది.అది చూసిన

వినయ్:- ఆ బాల్ ఎందుకు బేబీ స్ట్రైస్సింగ్  గా ఉందా.   అనగానే

బాల్ ని ఎడమ చేతిలోకి తీసుకొని కుడి చేతి వేళ్ళని చూసుకుంటూ ఆడిస్తూ

సౌమ్య:- అవును   బేబీ ఈరోజు ఈ చేతులతో చాలా పని ఉంది అందుకే వీటికి ఎక్సర్సైజ్ చేస్తున్నా. అనగానే వినయ్ తన మనసులో ఏంటి ఏదో తేడాగా అనిపిస్తుంది  అనుకుంటాడు.

సౌమ్య బెడ్ పై కూర్చుంటుంది. వినయ్ కూడా కాస్త కంగారు పడుతూ బెడ్ పై కూర్చుంటాడు.

అదంతా సరే ఇంతకీ  రమ్య ఎవరు అని అడుగుతుంది సౌమ్య.

దాంతో వినయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

కాస్త తడబడుతూ రమ్య నా ,  రమ్య ఎవరు  బేబీ అంటాడు.

తెలుసు ఈ మాట అంటావని ఎక్స్ పెక్ట్ చేశాను. ఆ ల్యాప్ టాప్  ఇటు ఇవ్వు చెబుతా అంటుంది సౌమ్య.

కంగారుపడుతూ లాప్ టాప్ ఇస్తాడు వినయ్. కాసేపు చెక్ చేసిన తర్వాత రమ్య ఎవరు అన్నావు కదా వైజాగ్ రమ్య అనగానే ఒక్కసారిగా వినయ్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి , ముచ్చెమటలు పడతాయి. ఇన్ని రోజులుగా చాటింగ్ చేస్తున్నావు కదా ఆ అమ్మాయే,

‌‌ఏది ,, నీ ఫేస్ బుక్ పాస్వర్డ్ చెప్పు  అనగానే 

తెగ కంగారు పడిపోయిన వినయ్ కి పరిస్థితి అర్థం అయ్యి తన ఫ్రెండ్ కి మెసేజ్ లో డేంజర్ డిలీట్ రమ్య చాటింగ్ అని పెడతాడు.

(ఆ మెసేజ్ చూసిన ఫ్రెండ్ వెంటనే పని మొదలు పెడతాడు)

వినయ్ తడబడుతూ సోషల్ మీడియా మరీ ఎక్కువగా ఏం వాడను. ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేస్తుంటా పా..స్.. వర్డూ.. అని సాగదీస్తుండగా ఒక్కసారిగా చెంప చల్లుమనిపిస్తుంది సౌమ్య.

దెబ్బకి దిమ్మ తిరిగిన వినయ్ :- ఆ బేబీ గుర్తుకు వచ్చింది   vinay1298#   అని చెబుతాడు.

ఫ్రెండ్ నుండి రమ్య చాటింగ్ డిలీటెడ్ అనే మెసేజ్ వస్తుంది. అది చూసి కాస్త ఊపిరి పీల్చుకుంటాడు వినయ్.

చాటింగు ఓపెన్ చేసిన సౌమ్య అదేంటీ రమ్యతో చాటింగ్స్  ఏమీ లేవు, అనగానే కాస్త ఊపిరి పీల్చుకుంటూ అప్పుడే చెప్పాగా బేబీ నువ్వేదో పొరపాటు పడినట్టున్నావ్,  ఆ రమ్య ఎవరో నాకు అస్సలు  తెలియదు అని చెబుతాడు వినయ్.

అప్పుడు సౌమ్య అయ్యో పాపం అవునా బేబీ అంటూ తన ఫోనులో ఫేస్బుక్ ఓపెన్ చేస్తూ నీ మొహం చూస్తుంటే నిజమే అనిపిస్తుందే, అని చాటింగ్  స్క్రోల్ చేస్తూ,,

హాయ్ రమ్య గుడ్ మార్నింగ్ 💙 ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు 🤩 నీ నవ్వు ఇంకా అందంగా ఉంది 😊 నీ కళ్ళు ఇంకా ఇంకా అందంగా ఉన్నాయి 👁️

అని చాటింగ్ చదివి చూపెడుతూ,, చూడు ఇప్పటికైనా గుర్తుకు వచ్చిందా

అనగానే అది చూసిన వినయ్ కి చెమటలు కారిపోతుంటాయి.

బేబీ ఆ ఎకౌంటు నీ దగ్గరకు ఎలా వచ్చింది అని తడబడుతూ అడుగుతాడు వినయ్.

కాస్త  ప్రేమగా ఆ  అకౌంట్ నా దగ్గరకు రాలేదు బేబీ ,  ఆ అకౌంట్ ను క్రియేట్ చేసిందే నేను అని ఆ చెంప ఈ చెంప చెడా మడా వాయిస్తుంది సౌమ్య.

తల పక్కకు తిప్పుకొని తనలో తాను అనవసరంగా రమ్య అనే అమ్మాయే చాటింగ్ చేస్తుంది అనుకుని 10 రోజులు టైం వేస్ట్ చేసుకున్నానా అనుకుంటాడు.

అప్పుడే సౌమ్య తన ఎడమ చేతిలోని బాల్ ని కుడి చేతిలోకి తీసుకొని ఎడమ చేతి వేళ్ళని ఆడిస్తూ

    మరీ...  గౌతమి సంగతేంటి అంటుంది సౌమ్య.

మళ్లీ వినయ్ షాక్ అవుతాడు. వెంటనే ఫ్రెండ్ కి మెసేజ్ చేస్తాడు. గౌతమి చాటింగ్ డిలీట్ చేయమని,,,,

గౌతమి అకౌంట్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో కూడా చాటింగ్స్ ఏమీ లేవు...

అబ్బా ఇందులో కూడా చాటింగ్ ఏమీ లేదే అంటూ సౌమ్య తన ఫోనులో ఓపెన్ చేసి చూపెడుతూ

                       ఇదిగో,,  నీ గౌతమి...

హాయ్... అనే చాటింగ్ తో మొదలుపెట్టి మీటింగ్ అయ్యేదాకా వెళ్ళింది అన్నమాట వ్యవహారం.

అనగానే కంగారు పడుతున్న వినయ్ బేబీ గౌతమీ...  అంటుండగా ,,,

ఆ , ఆ ,, అది కూడా క్రియేట్ చేసింది నేనే అంటుంది సౌమ్య.

అని మళ్లీ చెంపలు వాయిస్తుంది. తల పక్కకు తిప్పుకొని చెంపలపై రుద్దుకుంటూ,,

నిజంగానే గౌతమి అనుకొని నెల రోజులుగా చాటింగ్ చేస్తున్నానా,, తూ.. దీనమ్మా  జీవితం అని మనసులో అనుకుంటాడు వినయ్.

ఈసారి సౌమ్య రెండు చేతుల్లోకి రెండు బాల్ లను తీసుకొని ప్రెస్ చేస్తూ

instagram లో ఐశ్వర్య సంగతేంటి అని అనగానే

ఒక్కసారిగా వినయ్ షాక్,, ఈసారి ఉరుములు మెరుపులు మెరుస్తుంటాయి. కరెంటు కూడా వచ్చి పోతుంటుంది.

వినయ్ మళ్లీ తన ఫ్రెండ్ కు మెసేజ్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఐశ్వర్య చాటింగ్ డిలీట్ అని టైప్ చేసి,, ఎందుకో అనుమానం వచ్చి దాన్ని క్యాన్సిల్ చేస్తూ,,

లేదు,, ఆ అకౌంట్ కూడా ఇదే(సౌమ్య) క్రియేట్ చేసి ఉంటుంది అనుకొని తల తిప్పి చూడగా ,,,

నీకు వచ్చిన డౌట్ కరెక్టే బేబీ చాలా షార్ప్ గా ఉన్నావ్ అని చాటింగ్ ని చెక్ చేస్తూ

అబ్బా ఇదైతే  ఏకంగా చాటింగ్ నుండి డేటింగ్ దాకా పోయింది వ్యవహారం

నువ్వు బాగా ముదిరిపోయావు బేబీ,,, నిన్నూ... అని పటా పటా చెంపలు వాయిస్తుంది.

2 నెలలుగా ఐశ్వర్య అనుకొని  పిచ్చోడిలా దీనితో (సౌమ్య) చాటింగ్ చేస్తున్నానా హే.. భగవాన్ ఏంటయ్యా ఇది అని అనుకుంటుండగా

సౌమ్య బాల్స్ ని ప్రెస్ చేస్తూ

ఫైనల్ గా ట్విట్టర్ లో అంజలి సంగతి ఏంటి..

అనగానే పిడుగులు పడిన ఎఫెక్ట్ లో ,, బాల్స్ ని ప్రెస్ చేస్తున్న సౌమ్య 2 చేతుల్ని పట్టుకొని

వినయ్:- బేబీ.. నాకంతా అర్థమయింది. నేను ఇన్నాళ్లుగా చాటింగ్ చేస్తున్నది నీతోనే అని తేలిపోయింది... అని ధీనంగా తలనివంచుకుంటూ తప్పయింది బేబీ నన్ను క్షమించు... అనగానే ఒక్కసారిగా ఉక్రోషంగా లేచిన

సౌమ్య:- క్షమించడమా.....  నిన్నా..... కట్టుకున్న భార్య ఉండగా ఇంత మందితో అఫైర్స్ నడిపిస్తున్న నిన్ను నమ్మడం కంటే ఒంటరిగా మిగిలిపోవడం బెటర్. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా నీకు నచ్చినట్లుగా చేసుకో. అని బ్యాగు తీసుకుని వెళ్లబోతుండగా వెంటనే వచ్చి కాళ్లమీద పడిన

వినయ్:-లేదు బేబీ నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోకు,, నువ్వు లేకుండా ఉండలేను. నువ్వు వెళ్లడానికి వీలు లేదు. ఏదో టైం పాస్ గా తెలియకుండా అలా జరిగిపోయింది.అనగానే చిరాకుగా

సౌమ్య:- నాకు తెలిసే ఇంత వ్యవహారం నడిపించావు అంటే, నాకు తెలియకుండా ఇంకెంత చేసి ఉంటావ్.

వినయ్:- లేదు బేబీ అంతకుమించి ఇంకేమీ చేయలేదు నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది.

నేను మారతాను ఒక్క ఛాన్స్ ఇవ్వు.  అనగానే

సౌమ్య:- నువ్వు మారావని తెలిసిన రోజున నేనే తప్పకుండా వస్తా. కానీ అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం  నీదే..                                                 Good Bye

అని వెళ్ళిపోతుండగా వినయ్ బాధతో కుమిలి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండిపోతాడు.


                                                🏵️  సమాప్తం  🏵️

                      రచయిత మాట:- 💮సోషల్ మీడియా అనేది మన హద్దుల్లో ఉన్నంతవరకే బాగుంటుంది. అది గాడి తప్పిన రోజున అదే మన జీవితాలని గాడి తప్పేలా చేస్తుంది. పిల్లలు , పెద్దలు అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ లకు బానిసలుగా మారిన ప్రతి ఒక్కరికీ ఈ కథ అంకితం.💮

                ✍️ రచయిత :- తన్నీరు రమేష్... తన్నీరు రమేష్ (చర్చ) 04:35, 13 నవంబరు 2023 (UTC)

తన్నీరు రమేష్ రచనలు


ఆ అమ్మాయి పేరు అమృత

తాను ప్రేమించిన అబ్బాయి రాజ్ చేతిలో మోసపోయి ఒక బ్రోతల్ హౌస్ లో చిక్కుకుంటుంది. తర్వాత అమృత ఆ వలయంలోనే ఇరుక్కుపోయిందా లేదా బయటపడగలిగిందా అసలు ఆమె జీవితం ఏమైంది అనేదే ఈ కథ...

అది ఒక బ్రోతల్ హౌస్ కొందరు అబ్బాయిలు, అమ్మాయిల ను తీసుకుని లోపలికి వెళ్తున్నారు. అలా ఒక గదిలో చూస్తే అద్దం ముందు కూర్చుని అమృత అందంగా రెడీ అవుతోంది..

అప్పుడే అక్కడకు వచ్చిన మరో అమ్మాయి

గీత :- ఏంటి అమృత అక్క ఇవ్వాళ ఇంత అందంగా రెడీ అవుతున్నావు, ఏంటి విషయం. అనగానే

అమృత :- ఈరోజు రాత్రికి ఎవడో ఎన్.ఆర్.ఐ బుక్ చేసుకున్నాడు నన్ను , వాడి కోసమే ఇదంతా అనగానే

గీత :- సరే సరే అయితే కానీయ్ అంటూ వెళ్ళిపోతుంది...

అమృత అందంగా ముస్తాబయి బెడ్ మీద కూర్చుంటుంది. ఇంతలో వచ్చిన ఎన్నారై పేరేంటి అని అడుగుతాడు,,

అమృత తన పేరు చెబుతుంది.

ఎన్నారై :-   పేరుకు తగ్గట్టే అమృతాన్ని పంచుతావా అనగానే

అమృత :- నువ్వే చూస్తావుగా అని  మురిపెంగా చెబుతుంది.

అప్పుడు ఎన్నారై బ్యాగ్ లోంచి మందు బాటిల్ సిగరెట్ ప్యాకెట్ తీయగానే అమృత రెండు గ్లాసుల్లో మందు పోసి రెండు సిగరెట్లు తీసి ఒకటి ఎన్నారైకి ఇచ్చి మరొకటి తన నోట్లో పెట్టుకోగానే అప్పుడు చేతులపై గమనించిన

ఎన్నారై ఈ గాయాలు ఏంటి అని అడుగుతాడు అప్పుడు

అమృత :- అవి సిగరెట్ తో కాల్చిన గాయాలు అని చెబుతుంది.

ఎన్నారై :- మరి నొప్పి వేయడం లేదా అని అడుగుతాడు. అలవాటైపోయింది అని చెబుతుంది అమృత.

ఎన్ఆర్ఐ , అమృతని బెడ్ పై వెనక్కి తోసి పైట కొంగు తీసి నడుముపై ముద్దు పెట్టడంతో 


                   🏵️  10 రోజుల క్రితం 🏵️

బెడ్ పై కూర్చొని ఒక వ్యక్తి గోపాల్ మందు సిగరెట్ తాగుతున్నాడు. పక్కనే కూర్చున్న అమృతకి తాగమని మందు సిగరెట్ ఇస్తాడు. నాకు ఇవి అలవాటు లేవు అని చెబుతుంది అమృత. అప్పుడు మత్తులో ఉన్న

గోపాల్ :- మరేం పర్లేదు ముందు ముందు అన్నీ అలవాటు అవుతాయి లే అని సిగరెట్ తో ఎక్కడపడితే అక్కడ కాల్చి బలవంతంగా మందు , సిగరెట్ తాగిస్తాడు. తర్వాత అమృతని బలవంతంగా వెనక్కి తోసి మీద పడిపోతాడు...

                 🏵️  20 రోజుల క్రితం  🏵️

బెడ్ పై ఒక వ్యక్తి దేవా కూర్చొని ఉంటాడు. అమృత భయం భయంగా లోనికి వస్తుంది. అమృతని చేయి పట్టుకొని లాగి పక్కన కూర్చోబెట్టుకుని

ఏంటీ ఫీల్డుకి కొత్తా అని అడుగుతాడు దేవా.. అవును అన్నట్లుగా తల ఆడిస్తుంది అమృత..

దేవా :- మరేం పర్లేదు నా బోనీ చాలా మంచిది ఏం భయపడకు ఇక్కడ ఇదంతా కామన్ అంటూ బెడ్ పైకి తోసి లైట్లు ఆర్పి వేస్తాడు.

              🏵️   1 నెల రోజుల క్రితం  🏵️

రాజ్ ,అమృతని  చైర్లో కూర్చో పెడుతూ అమృత నువ్వు ఇక్కడే కూర్చో నేను తినడానికి ఏమైనా తీసుకు వస్తాను ఆ తర్వాత వెళ్లి గుడిలో పెళ్లి చేసుకుందాం అని చెప్పి వెళ్ళిపోతుండగా భయపడిన పడిన

అమృత :- నాకెందుకో కంగారుగా ఉంది రాజ్ త్వరగా వస్తావుగా అనగానే

రాజ్ :- ఏం భయపడకు అమృత,  నేను ఉన్నాను కదా త్వరగా వచ్చేస్తా అంటూ గది తలుపులు మూసి వెళ్ళిపోతాడు..

బయటకు వచ్చిన రాజ్ మరో వ్యక్తి అయిన భైరవ్ తో

రాజ్ :- చూడు భైరవ్ చాలా అందమైన, అమాయకమైన అమ్మాయి,,,, 50 వేలకి పైసా తగ్గేది లేదు. ఓకే అనుకుంటే చెప్పు లేదంటే వేరే చోట చూసుకుంటా,, అని  వెను తిరిగి బోతుండగా ఆపిన 

భైరవ్ :- ఆ సరే పటు  అని డబ్బులు చేతిలో పెట్టి ఇక నువ్వు వెళ్లొచ్చు అనగానే రాజ్ డబ్బులు తీసుకుని వెళ్లి పోతాడు..

అప్పుడు భైరవ్ గడ్డం నిమురుకుంటూ అమృత గదివైపు వెళ్తుంటాడు.....                    

                  🏵️  1 నెలన్నర క్రితం  🏵️

రాజ్ , అమృతలు  ప్రేమ సాగరంలో మునిగి తేలుతున్నారు..

వాగులు , వంకలు .  చెట్లు ,  చేమలు.   పల్లెలు ,  పంటపొలాలు అనే తేడా లేకుండా హాయిగా ప్రేమ పావురాల్లా విహరిస్తున్నారు..

వీళ్ళ ప్రేమకి అండగా రాజ్ ఫ్రెండ్ అయిన విక్రమ్ కూడా ఉంటాడు.    

                     🏵️   ప్రస్తుతం  🏵️

ఒక బ్రోతల్ హౌస్ బయట రాజ్ , విక్రమ్ లు ఉంటారు.. అక్కడి అమ్మాయిలను చూసి టెమ్ట్ అయిన రాజ్, విక్రమ్ తో  రేయ్ పదరా కాస్త రిఫ్రెష్ అయి వద్దాం అనగానే ఇద్దరూ లోపలికి వెళ్లి చెరొక గది లోకి వెళ్తారు..

రాజ్ :- గదిలోకి వెళ్ళగా ఒక అమ్మాయి బెడ్ మీద అటువైపు తిరిగి కూర్చుని ఉంటుంది..

రాజ్ వెళ్లి ఆ అమ్మాయి భుజంపై చేయి వేయగానే ఆమె తల తిప్పి చూస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కు పడిన

రాజ్ :- చెల్లెమ్మా  నువ్వేంటి ఇక్కడ  అనగానే,, రాజ్ చెల్లెలు

సుమ :- చెల్లి అయితే ఏంటి,  తల్లి అయితే ఏంటి , నీకు కావాల్సింది సుఖమే కదా , రా రా వచ్చిన పని కానీయ్ అని పైట తీస్తుంది,, ఒక్కసారిగా ముచ్చెమటలు పట్టి అల్లాడిపోయిన

రాజ్ :- అలా మాట్లాడకు చెల్లెమ్మా ఈ ఘోరాన్ని నేను చూడలేక పోతున్నాను. అనగానే 

సుమ :- ‌ఇక్కడ అంత ఘోరం ఏమీ లేదు అన్నా,  నిన్ను ప్రాణంగా ప్రేమించిన దాన్ని నువ్వు అమ్మేశావ్,, నేను ప్రాణంగా ప్రేమించిన వాడు నన్ను అమ్మేశాడు అంతే తేడా,,    అనగానే ఏడుస్తూ చెల్లెలు సుమ కాళ్ళపై పడి

రాజ్ :- తప్పు చేశాను , దిద్దుకోలేని పొరపాటే చేసాను.  నన్ను క్షమించు  అని చెంపలు వాయించుకుంటూ ఉండగా

సుమ :- క్షమించాల్సింది నేను కాదు అన్నయ్య అదిగో అమృత అని అటు వైపు చూపించగా ,, అప్పుడే లోనికి విక్రమ్,  అమృతలు వస్తారు.. తను చేసిన తప్పును తెలుసుకున్న రాజ్ వెళ్లి అమృత కాళ్ళపై పడి ,,

రాజ్ :- నన్ను క్షమించు అమృత నీ విలువ తెలుసుకో లేకపోయాను. ఇకమీదట ఎప్పుడూ ఇలాంటి పొరపాట్లు చేయను, తప్పయింది క్షమించు అని బాధపడుతుండగా, ఏడుస్తూ అమృతరాజ్ ని పైకి లేపి హత్తుకుంటుంది.. అప్పుడు

రాజ్ :- నేను చేసిన తప్పును వెంటనే సరి చేసుకుంటాను మనం వెంటనే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం,, అనగానే డోర్ వైపు చూపిస్తూ

విక్రమ్ :- ఇక్కడి సంగతి నేను సెటిల్ చేస్తాను మీరు త్వరగా బయటికి వచ్చేయండి అని విక్రమ్ వెళ్తాడు.. బ్రోతల్ హౌస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయగా వాళ్లు బయటకు వస్తారు..

అప్పుడు రాజ్ అంతా ఓకే నా విక్రమ్ అనగానే అంతా ఓకే వెళ్దాం పద అంటాడు విక్రమ్..

అప్పుడు రాజ్ , అమృత భుజాల పై చేతులు వేసి నడిపిస్తుండగా వెనకాలే నడుచుకుంటూ వస్తున్న విక్రమ్ , సుమ లు ఒకరి మొహం ఒకరు చూసుకుని చాటుగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మొహాల్లో చిరునవ్వుతో వెళ్ళిపోతారు....


  🌸 సమాప్తం 🌸

             ✍️ రచయిత :- తన్నీరు రమేష్

తన్నీరు రమేష్ (చర్చ) 05:45, 13 నవంబరు 2023 (UTC)