Jump to content

వాడుకరి:ధర్మవరపు సన్మిత్ర/లెక్కలంటే చుక్కలు కనిపిస్తున్నాయా?

వికీపీడియా నుండి

లెక్కలంటే చుక్కలు కనిపిస్తున్నాయా?

[మార్చు]

ప్రతీ మనిషి తనకు తెలియకుండా ప్రతీ రోజూ ఎన్నో లెక్కిస్తూ ఉంటాడు. మనిషి దైనందిన జీవితం లో ప్రతీ క్షణం లెక్కలతో ముడిపడే ఉంటుంది. అంతెందుకు మనం ప్రతీ రోజూ తినే భొజనం వండే సమయంలో ఆ బియ్యంలో ఎంత నీరు వెయ్యాలి, ఆ కూరలో ఉప్పూ కారాలు ఎంత నిష్పత్తి ఉండాలి ఇలా మనం చేసే ప్రతీ పనిలోనూ లెక్కలు కనిపిస్తాయి. ఇలాగే ఆనాటి అష్టాచెమ్మ నుండి ఈ నాటి క్రికెట్టు ఆట వరకూ పిల్లలు ఆడుకొనె ఆటల్లో లెక్కలు ప్రముఖపాత్ర వహిస్తాయి. ఇలా మనం ప్రతీ క్షణం ఉపయోగించే లెక్కలంటే కొంతమంది పిల్లలు ఎందుకు భయపడితున్నారు? "అల్జీబ్రా అంటే గుండె గాబరా" కింద ఎందుకు భావిస్తునారు?

"లెక్కలంటే చుక్కలు కనిపిస్తున్నాయని" లెక్కల భయంతోతప్పించుకోవడమే తప్ప అ చుక్కల్లో కూడా లెక్కలున్నాయని ఎందుకు తెలుసుకొవడం లేదు? ఈ చుక్కలనే మనం రేఖాగణితం లో "బిందువు" అని పిలుస్తామని ఎందుకు తెలుసు కోవడం లేదు? దీనికి సమాదానం చెప్పాల్సిన బాధ్యత మనందరిమీదాఉంది. ఈ పొటీ ప్రపంచంలో తల్లిదండ్రులు, విద్యా సంస్తలు మార్కులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ పిల్లలకు అర్థమయ్యిందో లెదో పట్టించుకోవడం లేదు.

లెక్కలు అన్ని పాఠ్యాంశాలలో కన్నా అతి సులువైనది. ఒక చిన్న సూత్రంతో ఒక పెద్ద పనిని చేయ గలిగే సాధనం ఇది. దీని సూత్రాలతో ఒక పెద్ద కొండ ఎత్తుని కనుగొనవచ్చు(త్రికోణమితి సహాయంతో). దీని సహాయంతో ఒక చిన్న వాహనం గంటకు ఎంత దూరం వెల్తుందో చెప్పవచ్చు. అంతెగాక ప్రతీ భాషలోనూ , ప్రతీ శాస్ర్తం లోనూ (బౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మొదలగునవి), మనకు లెక్కలు కనిపిస్తాయి. ఉదా: -

సీస పద్యం ప్రతీ పాదం లోనూ 6 ఇంద్రగణాలు, 2సూర్యగణాలు ఉంటాయి. ఇది తెలుగు  ఛందస్సులో ఒక లెక్క.

ఇలా ప్రతీదీ లెక్కల మీద ఆధారపడే జీవనం సాగిస్తున్నాయి. లెక్కలు లేక పొతే లేక పోతే మన పుట్టుక తెలీదు. ఒక్క మాటలో చెప్పాలంటే లెక్కలు లేక పోతే మనిషే లేడు. నిజానికీ లెక్కలంటే ఎవరికీ భయం ఉండదు. అది కొందరు ఉపాద్యాయులు, తల్లిదండ్రులు వల్లే కలుగుతుంది. అంటే లెక్కలు చాలా కష్టమయినవి, వాటిని జాగ్రత్తగా నేర్చుకోవాలి అని తల్లిదండ్రులూ, ఉపాద్యాయులూ చెప్పే మాటల వల్ల గానీ లేక లెక్కల పై పిల్లలకున్న అఇష్టం వల్ల గానీ లెక్కలపై భయం కలుగుతుంది. అదే ఆ కష్టాన్ని ఇష్టం గా చేసుకొని లెక్కలు అనే దాన్ని ఒక పాఠ్యాంశంలా గాక ఒక ఆటలా తీసు కుంటే లెక్కలంటే చుక్కలు కనిపించకుండా ఆ చుక్కల్లోనే ఎన్నో లెక్కలు కనిపిస్తాయి.

                                           "యథా శిఖామయూరాణాం 
                                       నాగానాం మనయో యథా !
                                       తద్వద్వేదాంగశాస్త్రాణాం 
                                       గణితం  మూర్ధనిస్ధితం"

"అంటే నెమళ్ళకు శిఖలవలె, పాములకు మణులవలె, వేదాంగ శాస్త్రాలన్నింటికీ శిరస్సు వంటిది గణితం" అని భావం.