వాడుకరి:వయస్వి/రెయిన్ డ్రాప్ కేక్ (Raindrop cake)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కురోమిట్సు, కినాకోతో అందించిన రెయిన్‌డ్రాప్ కేక్

రెయిన్‌డ్రాప్ కేక్ నీటిని, అగర్‌ను వాడి తయారు చేసే ఒక డెజర్ట్, ఇది వర్షపు బిందువును పోలి ఉంటుంది. జపాన్ లో మొదటి సారి 2014లో జనాదరణ పొంది, తర్వాత అంతర్జాతీయ దృష్టినీ ఆకర్షించింది.

చరిత్ర[మార్చు]

వాస్తవానికి సాంప్రదాయ జపనీస్ డెజర్ట్ షింగెన్ మోచి (信玄餅)

పరిణామమే ఈ మిజు షింగెన్ మోచి (水信玄餅) అని పిలుచుకునే  జపనీస్ డెజర్ట్.

షింగెన్ మోచి[మార్చు]

మొదటి సారి సెంగోకు యుగంలో డైమ్యో, టకేడా షింగెన్ అనే ఇద్దరు ఈ షింగెన్ మోచి ని అత్యవసర ఆహారంగా సృష్టించారు. ఇది బియ్యపు పిండిని, చక్కెరను వాడి తయారు చేసిన వంటకం. [1] [2]

మిజు షింగెన్ మోచి[మార్చు]

ఇక ఆధునిక జపాన్‌లో, హోకుటో-చోలోని స్థానికులు తాజా మినరల్ వాటర్‌ను ఈ డెజర్ట్‌లో చేర్చడం ప్రారంభించారు. యమనాషి ప్రిఫెక్చర్‌లోని కిన్‌సీకెన్ సీకా కంపెనీ మొదటి సారి వారాంతాల్లో తమ స్టోర్‌లలో దీన్ని విక్రయించటం మొదలు పెట్టింది. [3]

మిజు అంటే నీరు,షింగెన్ మోచి అనేది కిన్‌సీకెన్ కంపెనీ తయారుచేసిన ఒక రకమైన స్వీట్ రైస్ కేక్ ( మోచి). [4] 2013కి ముందు సంవత్సరమే ఈ వంటకపు సృష్టికర్త తినడానికి వీలైన నీటిని తయారు చేయాలనే ఆలోచనతో అన్వేషణ ప్రారంభించాడు. [4] ఈ డెజర్ట్ ఒక సంచలనం(వైరల్) గా మారింది. ఇక జనాలు ఈ వంటకాన్ని ఆస్వాదించటానికి ప్రత్యేక పర్యటనలు చేసేవారు. [5]

ఇక ఏప్రిల్ 2016 లో న్యూయార్క్ నగరంలో జరిగిన స్మోర్గాస్‌బర్గ్ ఫుడ్ ఫెయిర్‌లో డారెన్ వాంగ్ ఈ వంటకాన్ని యునైటెడ్ స్టేట్స్‌కు పరిచయం చేశాడు. [5] [6] [7] దీనికి కొంతకాలం తర్వాత, లండన్ రెస్టారెంట్ యమగోయా నాలుగు నెలలు శ్రమించి మరో వెర్షన్‌ను అభివృద్ధి చేసింది. [5]

వివరణ[మార్చు]

డిష్ మినరల్ వాటర్ ను, అగర్ ను వాడి తయారు చేస్తారు. అందుకే ,దీంట్లో వాస్తవంగా ఎలాంటి కేలరీలు ఉండవు. [5] [6] [7] ఒరిజినల్ డిష్ లో వాడిన నీరు దక్షిణ జపనీస్ ఆల్ప్స్ యొక్క కైకోమా పర్వతం నుండి సేకరించారు. ఈ నీరు తేలికపాటి తియ్యదనం కలిగి ఉన్నట్లు వర్ణించేవారు. [4] అగర్ అనే శాఖాహారం (వేగన్) జెలాటిన్ కి ప్రత్యామ్నాయంగా తయారు చేసిన సీవీడ్(సముద్రపు మొక్క) . [6] [8] దీన్ని వేడిచేసిన తరువాత, అచ్చుపోసి చల్ల బరుస్తారు. [6] కురోమిట్సు(kuromitsu) అనే ఒక మొలాసిస్ లాంటి సిరప్ ను, కినాకో(kinako) అనిపిలుచకునే సోయాబీన్ పిండిని టాపింగ్స్ గా ఉపయోగిస్తారు. [5] [6] [7] ఈ వంటకం పారదర్శకమైన వర్షపు బిందువులా కనిపించినప్పటికీ దీన్ని రొమ్ము ఇంప్లాంట్ల తోను, జెల్లీ ఫిష్‌లతో పోలుస్తారు. పెద్ద రుచిలేని ఈ డెజర్ట్ నోటిలోకి ప్రవేశించగానే కరిగిపోతుంది. అందుకే దీన్ని తక్షణమే తినాలి లేకపోతే ఇది ఇరవై నిమిషాలు అయ్యే సరికి కరిగి ఆవిరైపోతుంది. [5] [7]

డెజర్ట్‌ను ఇంట్లో తయారు చేసుకోవడానికి కిట్‌ల రూపంలో కూడా విక్రయిస్తారు. [8] ఈ వంటకాన్ని అమెరికన్ ప్రధాన మీడియా లైన ది టుడే షో, బజ్‌ఫీడ్, ABC న్యూస్‌ లు కూడా ప్రదర్శించాయి. [8]

ఇది కూడ చూడు[మార్చు]

ప్రస్తావనలు[మార్చు]

 

బాహ్య లింకులు[మార్చు]

  1. "信玄餅 | 金精軒". 金精軒 |  山梨県北杜市で和菓子屋を営んでおります。 (in జపనీస్). 2011-01-31. Retrieved 2021-07-18.
  2. "Raindrop Cake, A Low Calorie Japanese Dessert You Need To Try!". Honest Food Talks (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2021-06-01. Retrieved 2021-07-18.
  3. "2019年 水信玄餅をお求めの方へ | 金精軒". 金精軒 |  山梨県北杜市で和菓子屋を営んでおります。 (in జపనీస్). 2019-05-01. Retrieved 2021-07-18.
  4. 4.0 4.1 4.2 "Mizu Shingen Mochi: Water You Can Eat?". Japan Info. Retrieved 2018-08-16. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Japan Info" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 Maitland, Hayley (2018-08-14). "Everything You Need To Know About Raindrop Cakes". British Vogue. Retrieved 2018-08-16. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Maitland 2018" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  6. 6.0 6.1 6.2 6.3 6.4 "What is a Raindrop Cake – How to Make a Raindrop Cake". Delish. 2018-03-13. Retrieved 2018-08-16. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Delish 2018" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  7. 7.0 7.1 7.2 7.3 Strutner, Suzy; Aiken, Kristen (2016-03-31). "Get Ready, This Magical Raindrop Cake Is Coming To America". HuffPost. Retrieved 2018-08-16. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Strutner Aiken 2016" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  8. 8.0 8.1 8.2 "Raindrop Cake Making Kit". Raindrop Cake. 2017-08-08. Retrieved 2018-08-16. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Raindrop Cake 2017" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు