Jump to content

వాడుకరి:Purushotham9966/ది లంచ్ బాక్స్ హిందీ సినిమా

వికీపీడియా నుండి

"ది లంచ్ బాక్స్" హిందీ సినిమాలు 2013లో విడుదలైంది. రితీశ్ బత్రా దర్శకుడు, నిర్మాత గునీత్ మోంగా, అనురాగ్ కాశ్యప్, అరుణ్ రంగాచారి నిర్మాతలు. అంతర్జాతీయంగా దేశ దేశాల స్టూడియోలు నిర్మాణంలో భాగస్వాములు. ఈ సినిమా కాన్సు ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శింపబడింది. Critics week writers' choice పురస్కారం దీనికి లభించింది. 2013 టొరెంతో అంతర్ జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని పాదర్శించారు. ఇర్ఫాన్ ఖాన్, నిర్మత్ కౌర్ పాత్రల్లో పరకాయప్రవేశం చేశారు.

బొంబాయిలో డబ్బావాలాలు ఆఫీసులకు భోజనం కేరియర్లు అందించే విధానం చాలా నిర్దుష్టంగా ఉంటుంది, చిన్న పొరపాటు వల్ల కథానాయిక ఇలా తనభర్తకు పంపిన కేరియర్ సాజన్ ఫెర్నాండేజ్ కు చేరుతుంది. ఆమె భర్త రాజీవ్ మరొక మహిళ మోజులో పడి ఇలాను పట్టించుకోడు. ఇలా పొరపాటును గుర్తిచి, జాబురాసి టిఫన్ బాక్స్.లో పెడుతుంది. ఇద్దరిమద్య రోజు టిఫిన్ డబ్బాల ద్వారా ఉత్తరాలు సాగుతాయి. ఇలాను పొరిగింటి పెద్దావిడ ఈ విషయంలో ప్రోత్సహిస్తుంది. ఇద్దరు ఒకహోటల్లో కలుసుకోవాలనుకొంటారు. సాజన్ దూరంనుంచి ఆమెను చూచి ఆమెకు తాను తగనని భావించి కనపడకుండా వచ్చేస్తాడు. ఇంతలో సాజన్ ఉద్యోగ విరమంచేసి నాసిక్ లో స్థిరపడాలని నిశ్చయించుకొంటాడు. ఆమె తన భర్తను విడచిపెట్టి కుమార్తెతో బాటు జీవనవ్యయ్యం తక్కువని భూటాన్ లో స్థిరపడాలని నిశ్చయించుకోంటుంది. ఇలా దాంపత్య జీవితం గురించి ముక్కలు ముక్కలుగా ప్రేక్షకులకు తెలుస్తాయి. సాజన్ విధురుడని, యాంత్రికంగా జీవితం కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. చివరకు అతను మనసు మార్చుకుని డబ్బావాలాల ద్వారా ఇలా చిరునామా కనుగొని, కలుసుకోడానికి వెళ్ళడంతో సినిమా ముగుస్తుంది. చాలా భాగం ఉత్తరాలు పాత్రల గొంతుకలోనే వినిపిస్తాయి. వారి మనసులో భావాలన్నీ వాతావరణంలో చిత్రీకరించారు. ఇర్ఫాన్ సినిమాలలో గొప్పగా నటించాడు. మూలాలు: ఇంగ్షీషు వికీపీడియా, Lunch Box చిత్రం