వాడుకరి:Purushotham9966

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వున్నం చెంచయ్య

వున్నం చెంచయ్య జననం 19-7-1950, గ్రామం సాయిపేట, కొండాపురం అమండలం, నెల్లూరు జిల్లా. తల్లిదండ్రులు ఉన్నాం సాయమ్మ, వున్నం రోశయ్య. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు ఏం .ఏ పాసయి, 1874 లోకావలి జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా చే,రి ఆ కాలేజీలోనే 2008 లో పదవీ విరమణ చేశాడు.

కవితల రచనలతో సాహిత్యలో ప్రవేశించిన చెంచయ్య సాహిత్య విమర్సకుడుగా గుర్తింపు పొందాడు.

1975 లో అనంతపూర్ లో జరిగిన విరసం సభలలో విరసం సభ్యత్వం తీసుకొన్నాడు. 1988 లో ఒంగోలులో జరిగిన విరసం సంభలలో విరసం కార్యదర్శి అయి, విరసం సాంస్కృతిక మాసపత్రిక అరుణతార సంపాదక బాధ్యత కూడా తీసుకొన్నాడు.

1994 లో విరసం కార్యదర్శి బాధ్యతలనుంచి వైదొలగినా, 1998 జనవరి వరకు అరుణతార పత్రిక సంపాదకుడుగా కొనసాగాడు.

2005 జూన్ 30న చెంచయ్య, మరిముగ్గురు విరసం సభ్యలు అరెస్టు అయ్యారు. తర్వాత నిజామాబాదు తీసికొనివచ్చి నిజామాబాదు పరివరాలలో అరెస్టు చేసినట్లు పోలీసులు కుట్రకేసు పెట్టారు. 20రోజుల నిర్బంధం తర్వాత బెయిలు పైన విడుదల అయ్యాడు. సుదీర్ఘ విచారణ తరవాత, అయిదేళ్ళతర్వాత న్యాయస్థానం కేసు కొట్టివేసింది.

2006 నుంచి 2008 వరకు రెండవ పర్యాయం విరసం కార్యదర్శిగా పనిచేశాడు. ప్రస్తుతం విరసం సభ్యడుగా కొనసాగుతున్నాడు.

వి.చెంచయ్య పుస్తకాలు ;

1 సాహిత్య దృక్పథం, 2.వ్యాసరచనాశిల్పం, 3.మహాప్రస్థానం నుండి మరోప్రస్థానం దాకా, 4.తెలుగు సాహిత్యంలో భక్తి ఉద్యమం, 5.వివేచన, 6.సామాజికం. 7.కలంయోధుడు చెరబండరాజు, 8.తెలుగుభాష కొన్ని సంగతులు, 10.ఒక వెంటాడే జ్ఙాపకం, 11.సాహిత్యంలో వస్తు రూప శిల్పాలు,11. గతితార్కిక భౌతికవాదం, 12.చరిత్రలో కుసుమ ధర్మన్న, 13.సాహిత్య లేఖలు.

ఇవికాకాక పుస్తకరూపంలోకి రాని సమీక్షలు, వ్యాసాలు, ముందుమాటలు నూరుదాకా ఉన్నాయి.

ఆకారాలు 1. అరుణతార సంపుటాలు, 2. తెలుగు దిన అత్రికలలో వచ్చిన రిపోర్టులు 3.విరసం కరపత్రాలు, ప్రచురణలు