Jump to content

వాడుకరి:వాడుకరి:Purushotham9966/బంకోలా తెలుగు చారిత్రాత్మక నవల

వికీపీడియా నుండి

బంకోలా నవలారచయిత సాధు సుబ్రహ్మణ్య శర్మ సొంత ఊరు కాకినాడ. కాకినాడ సమీపంలోనె సాగర తీరంలో 'కోరంగి' అనే ఓడరేవు ఉంది. ఇప్పుడు దాన్ని అందరూ మరచిపోయారు. బందరు రేవునుంచి ఈస్టిండియా కంపెనీ, కోరంగి ప్రాంతంనుంచి డచ్ ఈస్టిటండియా కంపెనీ వ్యాపారాలు కొనసాగించాయి. స్థానిక మత్స్యకారులు కోరంగి నుంచి సముద్రం మీదకు చేపలవేటకు వెళ్ళేవారు. క్రమంగా వారి నౌకలు శక్తి వంత మయినాయి. నౌకలు కట్టడం(నిర్మాణం), బాగుచెయ్యడంలో స్థానికులు మంచి నైపుణ్యం సంపాదించారు.

డచ్ వారు కోరంగిని చిన్న టౌనుగా అభివృద్ధి చేశారు. కోరంగిలో ఒక వారకాంత-సుందర స్త్రీని, ఒక మత్స్యకార యువకుడిని ముఖ్యపాత్రలుగా, 1750-1850 నూరేళ్ళ కథ ఆరేవు చుట్టూ అల్లబడింది. ఆనాటి సమాజం, డచ్ ఇంగ్లీషు వాణిజ్య కంపెనీలు, వాటిమధ్య సంబంధాలు కల్పన, చరిత్ర కలిపి గొప్పగా చిత్రించాడు రచయిత. మధ్యలో విముక్తి పోరాట ప్రయత్నాలు వగైరా కథను కూడా చెప్తాడు. అతిశయోక్తులు, నేలమీద నిలవని అభూతకల్పనలు కాక, ఆంధ్రదేశ చరిత్రలో ఏభైఏళ్ళను ఈ గ్రంథ పుటల్లో నిక్షిప్తం చేశాడు రచయిత. ఆధునికదృష్టి, చారిత్రక నవలాశిల్పం ఈ రచనకు వన్నెతెచ్చాయి.

బంకోలా అంటే సాగరతీరంలో దీపస్థంభం. (Light house) ఇప్పటికీ కోరంగి వద్ద శిథిలమైన ఆనాటి దీపస్థంభం కానవస్తుంది.