వాడుకరి:విలాసాగరం రవీందర్
స్వరూపం
విలాసాగరం రవీందర్ జూన్ 08, 1971 వ సంవత్సరం బెజ్జంకి గ్రామం కరీంనగర్ జిల్లా తెలంగాణా రాష్ట్రంలో జన్మించారు. వీరు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరు ప్రవృత్తి కవిత్వం. వీరి మొదటి కవిత్వ సంపుటి "నది పలికిన వాక్యం(2016)". వీరు కవిసంగమం 21వ కార్యక్రమంలో పాల్గొన్నారు. 442 కవుల "తొలి పొద్దు" కవిత్వ సంకలనంలో వీరు ఒకరు. కరీంనగర్ లో నెలనెలా జరిగే "ఎన్నీల ముచ్చట్లు" కార్యక్రమానికి సి.వి. కుమార్ తో కలిసి సమన్వయ కర్తగా పని చేస్తున్నారు. "తెలంగాణా రచయితల వేదిక" కరీంనగర్ లో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.