Jump to content

వాడుకరి:వీర ప్రథప్/ప్రయోగశాల

వికీపీడియా నుండి

ఈ ఏడాది అద్భుత ఆవిష్కరణల్లో ఒకటిగా ‘టైమ్’ మ్యాగజీన్ ఈ ‘పాడ్ ప్రో’ను ప్రకటించింది. చిత్రాన్ని గీయడానికి ఈజిల్, కేన్వాస్, కుంచెలు, రంగులు... చాలా కావాలి. అంతేకాదు, చిత్రాన్ని గీస్తున్నప్పుడు దుస్తులపై రంగుల మరకలు పడతాయి. ఎంత ఉతికినా, అవి ఒక పట్టాన వదలవు. అయితే, ఇంతటి తతంగమేమీ లేకుండానే అద్భుత చిత్రరాజాలను చిత్రించగల పరికరాన్ని యాపిల్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ‘పాడ్ ప్రో’ పేరిట రూపొందించిన ఈ పరికరం చూడటానికి ఐపాడ్‌లాగానే ఉంటుంది. దీని తెరనే కేన్వాస్‌గా ఉపయోగించుకోవచ్చు.

దీనికి అనుబంధంగా ఒక డిజిటల్ పెన్సిల్ ఉంటుంది. దీనిని ఇటు పెన్సిల్‌గానూ, అటు కుంచెగానూ వాడుకోవచ్చు. ఇందులో తెరపైనే కావలసిన రంగులను ఎంపిక చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. చేతికి రంగు అంటకుండా, ఒంటికి మరకలు అంటకుండా ఇంచక్కా దీని మీద మీకు నచ్చిన రీతిలో బొమ్మలు గీసేసుకోవచ్చు. గీసేసిన బొమ్మలను ఇందులో దాచుకోవచ్చు. ఆనక వాటిని నేరుగా కేన్వాస్‌పైనే ప్రింట్ చేసుకోవచ్చు.