Jump to content

వాడుకరి:వెలుదండ నిత్యానందరావు/ప్రయోగశాల

వికీపీడియా నుండి

ఆచార్య వెలుదండ నిత్యానందరావు

[మార్చు]

ఆచార్యులు, పరిశోధకులు, కవి, విమర్శకులు, రచయిత.

జననం

[మార్చు]

9-8-1962, మంగునూరు, నాగర్ కర్నూల్ జిల్లా. తల్లిదండ్రులు శ్రీమతి లక్ష్మమ్మ, రామేశ్వరరావు

చదువులు

[మార్చు]

10వ తరగతి (1977) వరకు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల మంగునూరు, డిగ్రీ (1983) వరకు శ్రీవేంకటేశ్వరప్రభుత్వ ప్రాచ్యకళాశాల పాలెం, నాగర్ కర్నూల్ జిల్లా, ఎం.ఏ. (1985), ఎం.ఫిల్ (1988), పిహెచ్.డి. (1990) ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు.

ఉద్యోగం

[మార్చు]

పార్టటైం లెక్చరర్ గా 1988-92. ఉస్మానియా తెలుగు శాఖలో లెక్చరర్ గా 24-7 -1992న చేరిక, - 24-7-2001న అసోసియేట్ ప్రొఫెసర్ గా, 24-7-2009న ప్రొఫెసర్‌గా పదోన్నతి.

రచనలు

[మార్చు]

1.చంద్రరేఖావిలాపం-తొలివికట ప్రబంధం (1990-ఎం.ఫిల్ సిద్ధాంత వ్యాసం) 2. తెలుగు సాహిత్యంలో పేరడీ (1994-పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథం) 3. హాసవిలాసం (2005-హాస్య విశ్లేషణాత్మక వ్యాసావళి) 4. భారతీయ జ్వలిత చేతన-బంకించంద్ర (2006-బంకించంద్ర చటర్జీ జీవితం - రచనలపై విశ్లేషణ) 5. నిత్యవైవిధ్యం (2007 - పరిశోధనాత్మక వ్యాససంపుటం) 6. నిత్యానుశీలనం (2010 -పరిశోధనాత్మక వ్యాససంపుటం) 7. రాజనీతిజ్ఞుడు బూర్గుల రామకృష్ణరావు (2011-జీవిత చరిత్ర) 8. తెలుగుపరిశోధన (2012)4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడమీ ప్రచురణ. 9. విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన (పరివర్థిత ముద్రణం 2013) 10. నిత్యాన్వేషణం (సాహిత్య దీర్ఘవ్యాస సమాహార-2019)

సంపాదకత్వం

[మార్చు]

1. నవయుగరత్నాలు. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం (సాహిత్య వ్యాస సంపుటి- 1996) 2. పరిశోధన వ్యాసమంజరి. (1-2, 2009,2010 -105 సిద్ధాంత గ్రంథాల సారసంగ్రహాల సంకలనం) 3. ఆధునిక భాషాశాస్త్రం- ప్రకారభాష (2010 ఉస్మానియా ఎం.ఏ. దూరవిద్య తెలుగు పాఠ్యగ్రంథం) 4. ఆధునికాంధ్ర భావకవిత్వం. డా. పాటిబండ మాధవశర్మ (2012 పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.)

సహ సంపాదకత్వం

[మార్చు]

1.వాజ్మయ దివాకరుడు (దివాకర్ల వెంకటావధాని శతజయంతి సంచిక 2014) 2. పాలవెల్లి (పల్లాదుర్గయ్య శత జయంతి సంచిక 2016) వివిధ పత్రికల్లో అసంఖ్యాకంగా వ్యాసాలు, గ్రంథసమీక్షలు, ఎన్నోసదస్సుల్లో పత్ర సమర్పణలు. 75 దాక పీఠికలు.

కృషి చేసిన ప్రధానరంగం

[మార్చు]

వ్యాసం-పరిశోధన (తొలినాళ్ళల్లో కవితలు, కథలు, నాటకాలు పత్రికల్లో ప్రచురితాలు. ఆకాశవాణిలో ప్రసారితాలు)

పురస్కారం

[మార్చు]

1.ఎం.ఏ తెలుగులో ప్రప్రథమ స్థానం పొందినందుకు గురజాడ అప్పారావు స్వర్ణ పతకం పురస్కారం - 1985, 2. సాహిత్య విమర్శలో ధర్మనిధి పురస్కారం – తెలుగు విశ్వవిద్యాలయం 2007. 3. కొత్తూరు సుబ్బయ్య, దీక్షితులు వెంకట లక్ష్మీ పురస్కారం - భీమన్న సాహితి నిధి 2011. 4. ఉత్తమ విమర్శ పురస్కారం - నవ్య నాటక సమితి మే 2013 5. ఎస్.వి.ఆర్. విద్యాపురస్కారం-ఆచార్య ఎస్.వి. రామారావు 2013 6. ఉత్తమ విమర్శ పురస్కారం - జ్యోత్స్న కళాపీఠం 2013 7. బి.ఎన్. శాస్త్రి అత్మీయ పురస్కారం-హరిత అసోసియేషన్ మహబూబ్ నగర్ 2013 8. గంటి జోగి సోమయాజి స్మారక పురస్కారం - మానస ఆర్ట్ థియేటర్స్ 2013 9. బోయి భీమన్న సాహితీ పురస్కారం (19-09-2019)

ప్రతిష్టాత్మక పురస్కారం

[మార్చు]

1 తెలంగాణాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం తరపున ఉత్తమ సాహితీ వేత్త పురస్కారం - కలెక్టర్, నాగర్ కర్నూలు జిల్లా 2-6-2017.

పర్యవేక్షణ

[మార్చు]

5 ఎం.ఫిల్, 12 పిహెచ్.డి లు అవార్డయ్యాయి

బాధ్యతలు - పదవులు

[మార్చు]

1.ఎన్.ఎస్.ఎస్ కార్యనిర్వహణాధికారి , నిజాం కళాశాల, 1996 -2004 2.వార్డెన్ , ఓల్డ్ పిజి, సి హస్టల్ ఉ.వి 1-1-2005 నుండి 31-7-2009 వరకు 3. అధ్యక్షులు, తెలుగు శాఖ నిజాం కళాశాల 2001 నుండి 2004 వరకు 4. అధ్యక్షులు, మహిళా కళాశాల కోరి 17-6-2010 నుండి 31-8-2012 వరకు 5. అధ్యక్షులు, పాఠ్య ప్రణాళిక సంఘం తెలుగు ఉస్మానియా విశ్వవిద్యాలయం. 1-12-2014 నుండి 1-3-2015 వరకు 6. అధ్యక్షులు, తెలుగు శాఖ ఉస్మానియ విశ్వవిద్యాలయం 1-3-2015 నుండి 8-3-2017 వరకు 7. అధ్యక్షులు, పాఠ్య ప్రణాళిక సంఘం తెలుగు ఉస్మానియా విశ్వవిద్యాలయం. 21-9-2017నుండి 2020

మరికొన్ని

[మార్చు]

1. బెనారస్, బెంగుళూరు విశ్వవిద్యాలయాల్లో తెలుగుశాఖలో బి.ఓ.ఎస్. సభ్యత్వం. 2. వివిధ కాలాల్లో రాష్ట్ర విశ్వవిద్యాలయాలన్నింటిలో బి.ఓ. ఎస్. సభ్యత్వం. 3. వివిధ కాలాల్లో అటానమస్ కళాశాలల్లో బి.ఓ.ఎస్. సభ్యత్వం. 4. తెలుగు లెక్చరర్ల నియామకాల్లో విషయ నిపుణులుగా గుర్తింపు. 5. ఇంటర్మీడియట్, డిగ్రీ తెలుగు పాఠ్య గ్రంథాల రూపకల్పనల కమిటీలో సభ్యత్వం. 6. తెలుగుకు సంబంధించి ప్రభుత్వ పరీక్షలకు విషయ నిపుణులుగా గుర్తింపు.

కుటుంబం

[మార్చు]

శ్రీమతి వి. గీతారాణి (జీవన సహచరి) కుమారి వి. నాగసాయి శ్రీవర్ష (కూతురు) వి. శ్రీహర్ష (కుమారుడు) ఇంటి చిరునామా: ప్లాట్ నెం.34, విరాట్ నగర్, మీర్ పేట పోస్టు, హైదరాబాదు -97