వాడుకరి:శ్రీ మిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • సిరివెన్నెల సాహిత్యం*

అహో ఒక మనసుకు అనే ఈ పాట 1993 లో K. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన అల్లరి ప్రియుడు చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట..

  • సిరివెన్నెల సీతారామశాస్త్రి* గారు రాసారు....

పల్లవి: అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే ఇదే కుహూస్వరాల కానుక మరో వసంత గీతిక జనించు రోజు అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు..

చరణం.1 మాటా పలుకు తెలియనిది మాటున ఉండే మూగమది కమ్మని తలుపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది... రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది శ్రుతిలయలెరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది... రుతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం బ్రతుకును పాటగ మలిచేది మనసున కదిలిన మృదునాదం కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకు దింపేది తనే కదా వారధి క్షణాలకే సారథి మనస్సనేది అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు

చరణం.2 చూపులకెన్నడు దొరకనిది రంగూరూపూ లేని మది రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది... వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కళ గల నిండుమది కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమది... చేతికి అందని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం అడగని వరములు కురిపించి అమృతవర్షిణి అనిపించే అమూల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే ఇదే కుహూ స్వరాల కానుక మరో వసంత గీతిక జనించు రోజు