వాడుకరి:117.213.145.246/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

'ప్రకృతి ప్రసాదిత భారతీయ పండుగలు'

[మార్చు]
సంక్రాంతి పండుగ నవ్యాంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు అతి ముఖ్యమైన పండుగ. పల్లెసిమలు పాడి పంటలతో విలసిల్లె ఈ నెలలో క్రొత్త పంటలకు కొంగ్రొత్త శుభాలకు సూచికగా ఈ పండుగ వస్తుంది. ఇదే సమయంలో సూర్యుడు దక్షనాయణం నుంచి ఉత్తరాయణానికి కాంతి మరలతుంది కాబట్టి అది కూడా మకరరేఖ నుండి కాంతి మరలుతుంది కాబట్టి మకర సంక్రాంతి గా వ్యవహారికమైనది. సంక్రాంతి కి ముందు రోజు భోగి పండుగ సంక్రాంతి తర్వాత కనుమ పండుగలు జరుపుతారు. గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం తేది మారకుండ వచ్చేహిందూ పండుగ సంక్రాంతి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. సంక్రాంతికి ముందు రోజు సూర్య గమనం దక్షిణాయనంలో చివరి రోజు కాబట్టి ఆ రోజు పాత వస్తువులను  భోగి మంటల్లో దాహించివేసి మరునాటికి క్రోత్తవాటితో అలంకరిస్తారు. క్రొత్త ధాన్యంతో చేసిన పిండివంటలకు సంక్రాంతి ప్రసిద్ది. మరునాడు కనుమ రోజు పశువులను అలంకరించి పశువులపట్ల పల్లెసిమాలలో వున్నా అనురాగానికి ప్రతీకగా పశువుల పండుగ నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ పర్వదినం మూడు రోజులు తెలుగు ప్రజలే కాకుండా తమిళ, కర్ణాటక, సింహళ,పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాలలో కూడా వేరువేరు పేర్లతో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.  సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంట రంగవల్లులు, పిండివంటలు, ఎద్దుల పోటీలు, బండలాగుడు, గాలిపటాలు ఎగరేయటం కొన్ని ప్రాంతాలలో కోడి పందేల్లు ఘనంగా జరుపుతారు. ప్రతి ఇంట కుటుంబ సభ్యులంతా కొత్త బట్టలు ధరిస్తారు. ఎక్కడ చూసిన పల్లె వాతావరణం రకరకాల సంబరాలతో కళకళలాడుతూ కనిపిస్తుంది. 

                  దక్షిణాదిలో ఘనంగా జరుకొనే పండుగలో  సంక్రాంతి ఉగాది ముఖ్యమైనవి. సంక్రాంతి గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి నెల 14 లేక 15 తారీఖులలో వస్తుంది. ఒక రోజు అటుఇటు తప్ప తేది మారటం ఉండదు. అలాగే ఉగాది కూడ తెలుగు సంవత్సరాది ఒకే ఋతువులో వస్తుంది. చంద్రమానం ప్రకారం హిందూ పండుగలన్నీ ఓ పక్షం రోజులు అటుఇటుగా ఒకే ఋతువులో వస్తాయి. ఉదాహరణకు సంక్రాంతి ఛి పూర్తీ స్తాయికి వచ్చినప్పుడు శివరాత్రి చలి తగ్గి ఎండాకాలం మొదలైదనడానికి ప్రారంభంగా వస్తుంది. వసంత ఋతువుకు ఆహ్వానంగా ఉగాదిపండుగ వస్తుంది. మామిడి పండు తిన్న ధశరధుని పత్నులు రామ లక్ష్మణ భారత శత్రఘ్నులకు జన్మనిచ్చారు. అందుకు అనుగుణంగానే మామిడి పండ్లు పండే కాలాలలోనే శ్రీరామనవమి పండగ వస్తుంది. వర్షాకాలంలో వరలక్ష్మి వ్రతం, అలాగే నైరుతి ఋతు పవనాలకు ముగింపుగా దశరా పండుగ ఈశాన్య ఋతు పవనాలకు నెలవైన రోజులలో చలి ప్రారంభానికి సూచనగా దీపావళి వస్తుంది. చంద్రమానం ప్రకారం పండుగలు క్యాలెండర్ వున్నా సుర్యమానానికి అనుగుణంగా మన వాళ్ళు శూన్య మాసాన్ని సృష్టించుకున్నారు. మన పూర్వికులు ఆ రకంగా ప్రకృతిని ఋతువులను బాలెన్సు చేస్తూ ఋతువులు కాలమానం తారుమారు కాకుండా జాగ్రత్త పడ్డారు.అందుకే  ప్రతి సంవత్సరం కొద్ది రోజులు అటుఇటు ఉండవచ్చుగాని  ఋతువులు తారుమారై చంద్రమానం ప్రకారం పండుగలు ప్రతి సంవత్సరం ఒకనెల ముందు పోవడంలేదు.  అరబిక్ కాలమానం ప్రకారం కొన్ని ముస్లిం పండుగలు సంవత్సరం సంవత్సరం ఒక నెల ముందుకు పోతూ ఒక్కో సంవత్సరం ఒక్కో నెలలో ముస్లిం పండుగలు వస్తాయి. ఖచ్చితమైన కాలక్రమం వుండదు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే భారతీయులు ఖగోళ పరమైన పరిజ్ఞానం పూర్వం నుంచే కలిగివున్నారని గ్రహించవచ్చు. ఆనాటికే ప్రకృతిపై మన పుర్వికులకు సంపూర్ణమైన పట్టు విషయ పరిజ్ఞానం ఉన్నట్లు అర్థమవుతుంది. కాదంటారా?