వాడుకరి:125.17.245.82/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
                              ద్వాదశ జ్యోతిర్లింగములు 
                            రచన:వడ్డూరి.అచ్యుతరామ కవి 
                
                             శ్రీ దుర్గా భవాని విశ్వేశ్వర స్తోత్రం
                       1 . ప్రభాస తీర్ధము -సోమలింగేశ్వరుడు 


        సీ!!        అశ్వని రోహిణి యారుద్ర ముఖ్య న
                         నత్ర భార్యల యందు చంద్రుడెపుడు                                                          
                   రూపలావణ్యయౌ రొహిణీనే ప్రేమ 
                          జూచుచు సవతులజూడకున్న 
                   పక్షపాతముగల్గు పాపాత్ములకు శిక్ష 
                         క్షయరోగమనుట శాస్త్రమునెరింగి
                   చంద్రుని దక్షుడు శపియింప భీతిల్లి 
                         శాపవిముక్తికై సాంబ నిన్ను 
       గీ!!      ప్రణవ పంచాక్షరీ మంత్రపఠన జెసి
                భువి ప్రభాసంబుగానాబడు పుణ్యతీర్ధ
                మందు లింగ ప్రతిష్త నబ్జారి జేయ
                సోమలింగేశ్వరుండవై భూమి వెలసి
                భక్తులను బ్రోచుచున్నావు పరమపురుష
                శ్రీ ఉమారామలింగేశ చిద్విలాస.
                   2 శ్రీ శైల మల్లికార్జున లింగము  
       సీ!     ఆది శేషుడు తొల్లి హరి హర దేవుల
                      గూర్చి యొనర్చెను ఘోరతపము
              హరి హరుల్ ప్రత్యక్షమై వరంబును వేడు
                      మని బల్క శేషాహి యమిత భక్తి
              నర్చావతారులై యఖిల భక్తుల బ్రోవ
                       నిజశిఖరంబుల నిలుబవుడనగ
              హరి శ్రీనివాసుడై యతని శిరంబందు 
                        బొలుపొందె,నీవును బుచ్చమందు
              బరగు శ్రీశైల శిఖరాన భవ్యమూర్తి
        గీ!      మల్లికార్జున లింగ నామంబుదాల్చి
                దేవి భ్రమరాంబతో గూడి తేజరిల్లి
                ఇహపర సుఖంబులొసంగెదో యీశ్వరేశ
                శ్రీ ఉమారామలింగేశ చిద్విలాస!
             3. ఉజ్జయినీ క్షేత్రం -శ్రీ మహాకాళ లింగము 
  సీ! ఉజ్జ్వలుండను ప్రభుడుజ్జయనీనామ 
            నగరంబుగట్టి జమబుపొగడ
     మణిమంత్ర సిద్దుడు మహిత మహాకాళు
             డొసగిన లింగంబు నెసగు భక్తి 
     బూజింపవానినిబొడగని  యోర్వక
             శత్రురాజులు దండయాత్రరాగ
     తనలావునెంచి శాత్రవబలంబుదలచి
              శంకర నినుజేరి శరణు వేడ
   గీ!    ఉరుమహాకాళ మూర్తివై యుద్భవించి
         భద్రకాళితో గూడి భక్తులబ్రోచు
         శ్రీ మహాకాళలింగ విశ్వేశలింగ
         శ్రీ ఉమారామలింగేశ చిద్విలాస