Jump to content

వాడుకరి:ASRCE

వికీపీడియా నుండి

అద్వైతక్రియ (Advaitakriya)

మహాసంకల్పం అద్వైతక్రియ. వ్యక్తిత్వ వికాసం మరియు జీవన నైపుణ్యాల శిక్షణ (Personality Development and Life Skills) సంస్థ. వ్యవస్థాపకులు E.K.గిరీష్. ఇది కేవలం యువతకు మాత్రమే సందేశం కాదు. మానవ జాతికి సంకల్ప సందేశం. దయనీయ స్థితిలో దిక్కుతోచక ధీనంగా కూర్చున్న వారిని ధైర్యంగా తనంతట తాను నింగిపై నిల్చునేందుకు నిచ్చెనే మహాసంకల్పం అద్వైతక్రియ. మనిషి యొక్క ఆలోచనా శక్తి మరియు సంకల్ప శక్తులను సమ్మిళితం చేసి రూపొందించిన అద్భుతమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ అభూత కల్పనలతో కూడుకున్నది కాదు. గాలిలో దీపం అసలే కాదు. మూఢనమ్మకాలను మచ్చుకైనా ప్రోత్సహించదు. జాతకాలు సరిలేవని గ్రహాలు ఏమైనా ఎక్కువ చేస్తే నువ్వు ఏం తక్కువ కాదు. గ్రహాలు గతి తప్పేలా తిప్పి తిప్పి కొట్టు అంటుంది మహాసంకల్పం అద్వైతక్రియ. ఒక్కమాటలో చెప్పాలి అంటే ఇది పూర్తిగా సైన్స్. పాజిటివ్ థింకింగ్ మా పునాధి. అనంతమైన ఆత్మ శక్తిని అందుకోవడం ఎలాగో తెలుపుతుంది. ఆలోచనే నీ సుఖదుఃఖాలన్నిటికీ మూలం. ఒక ఆలోచన నిన్ను బద్దకస్తుడిని చేస్తుంది. మరొక ఆలోచన నిన్ను బ్రహ్మాండాన్నైనా బద్దలు కొట్టేంత బలవంతుణ్ణి చేస్తుంది అన్న సత్యాన్ని తెలియజేయడమే మహాసంకల్పం అద్వైతక్రియ లక్ష్యం. అద్వైతము అనగా ఒకటి(ద్వయతము కానిది) అని అర్ధము. అనగా ఈ చరాచర సృష్టి మొత్తము ఒక పరబ్రహ్మ తత్వము నుండి ఉద్భవించి అనేక రూపములుగా వ్యాప్తి చెంది వుంది. అంటే ప్రతి ఒక్క పదార్ధము, శరీరము, ఆత్మ అన్నియు పర బ్రహ్మమే. ఇలా అనేక రూపములలో పరబ్రహ్మము వేరు అయిన తరువాత మాయ (ఆలోచనలు) ప్రభావముల వలన తాను వేరు ,పరబ్రహ్మము వేరు అను విధముగా జీవుడు ప్రవర్తించుచున్నాడు.

జీవుడు,పరబ్రహ్మ వేరు కాదని..ఇద్దరూ ఒక్కటే అని తెలియ చెప్పేదే అద్వైత సిద్ధాంతం. ఈ అద్వైత క్రియ యొక్క మొదటి మరియు చివరి లక్ష్యం సంకల్పాన్ని సిద్దించుకోవడమే. అద్వైత క్రియ యొక్క అంతర్గత మరియు బహిర్గత ప్రాధాన్యత కూడా సంకల్పమే. ఎందుకంటే ఆ అద్వైతానందుడి(పర బ్రహ్మ )అనంత కోటి బ్రహ్మాండ రూపాలలో మొట్ట మొదటి రూపమే సంకల్పం. సంకల్పమే సర్వానికీ మూలం. సంకల్పం లేనిదే ఏదీ లేదు. చివరికి ఈ సృష్టి కూడా ఆ అద్వైతానందుడి సంకల్పమే. మనిషి పుట్టింది సంకల్పాన్ని సిద్దించుకునేందుకే.కానీ ఆ సంకల్ప సిద్ధి ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు. అన్నిటికన్నా మొట్ట మొదటి ఆటంకం ఎదుటి వారి మీద ఆధారపడడం అన్న మీ ఆలోచనే. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు నేస్తమా అన్న మన పూర్వీకుల వచనం అక్షర సత్యం. నీకోసం ఎవ్వరూ రారు. చివరకి భగవంతుడు కూడా రాడు. నీ కోసం ఎవ్వరూ రాకపోయినా గానీ నీతో పాటుగా నీ చివరి వరకూ వచ్చేవి నీ కృషి...దాని ఫలితం. నీ కృషిని నీవు పరిపూర్ణంగా ఆచరిస్తే దాని ఫలితం నీవు వద్దన్నా నీ పాదాల వద్దకు పరిగెత్తుకుని వస్తుంది. కృషి అన్న పదం ఋషి నుండి ఉద్భవించింది. ఋషి అన్న పిలుపే కాలక్రమంలో కృషిగా రూపు దిద్దుకుంది. కృషి,ఋషి రెండూ వేరు వేరు పదాలు కాదు. కృషే ఋషి.ఋషే కృషి.అందుకే అన్నారు పెద్దలు. కృషి ఉంటే మనుషులు ఋషులౌతారని.ఋషులంటే జానెడు గోచీ కట్టుకుని, మూరెడు గడ్డం పెంచుకుని, బారెడు జుట్టు పెంచుకుని అడవుల్లోనో, అజ్ఞాతంలోనో, హిమాలయాల్లోనో ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే వారు మాత్రమే కాదు. సత్కార్యం కోసం సూటిగా చేసే సాధనే తపస్సు. ఆ తపస్సును లక్ష్యం సిద్దించే వరకు మనసా, వాచా, కర్మణా నిర్విరామంగా కొనసాగించే ప్రతివాడు ఋషే. కార్యం నెరవేర్చుకునే ప్రతివాడూ ఋషే.అది ఎప్పుడైనా. అది ఏ కార్యమైనా. మనకు తెలియనిది ఏమిటంటే చిన్నతనంలో ప్రతి వాడు ఋషే. మనకు నచ్చింది కావాలని తల్లిదండ్రులని ఎంత ఏడిపిస్తామో.. మనం ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కారిపోతూవుంటాయి. ప్రతి ఒక్కరూ ఆరోజు పట్టు వదలని విక్రమార్కుడే. మనం పెరిగే కొద్దీ ఆ లక్షణాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఆ లక్షణమే. ఆ లక్షణం జన్మ జన్మల నుండి మనతో పాటు వచ్చింది. కానీ మనమే ఆ లక్షణాన్ని బయటకు పంపేసాం. మనకు నచ్చింది తెచ్చి ఇవ్వకపోతే ఇల్లు పీకి పందిరేస్తాం. మనం అనుకున్నది దక్కించుకునేదాకా ఆరోజు మన ఇంట్లో తుఫాను వచ్చినట్టే. ఇప్పుడు మనం సృష్టించాల్సింది కూడా అలాంటి తుఫాన్నే. పెను తుఫాను. ఆ తుఫానులో పడి మన సంకల్పం ఉక్కరిబిక్కిరైపోయి మన పాదాల దగ్గరకు రావాలి. ఋషులమైన మనం మళ్ళీ ఆ అవతారాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. మనం సంకల్పించుకుంటే.... అది రాదు, లేదు అన్నది అవసరం లేదు. ఎందుకు రాదు. ఎందుకు లేదు అన్నది కూడా అవసరం లేదు. సృష్టిలో లేదు అన్నది కూడా అవసరమే లేదు. సృష్టిలో లేకున్నా నీ కోసం సృష్టించబడాలి. ఇదే ముఖ్యం. లేదంటే ఇల్లు పీకి పందిరేసినట్టు సృష్టిని తల్ల క్రిందులు చెయ్యడమే ఋషుల లక్షణం. పక్క వాడికి హాని తలపెట్టకుండా ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవడమే ఋషి యాగం. ఈ యాగం లో మొట్టమొదటిగా తమని తాము పాదాక్రాంతం చేస్కోవడంతో మొదలౌతుంది. తమని తాము జయించలేని వారు ప్రపంచాన్ని ఏమి జయించగలరు. అన్నదే వీరి సిద్ధాంతం. అద్వైతక్రియ వేదాంతం కూడా ఇదే. ముందు నిన్ను నువ్వు ప్రేమించు, నిన్ను నువ్వు ధ్యానించు, నీలో నిన్ను నీవు సిద్ధించు. నీకోసం నువ్వు ప్రయత్నించు. నీ కోరికల్ని నెరవేర్చుకో. జీవితంలో రాజీ పడితే జీవితాన్నే కోల్పోతావ్. నీవు శరీరాన్ని ధరించింది సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు. అంతేకానీ సమస్యల వలయం లో చిక్కుకునేందుకు కాదు. నిద్రపోయింది ఇక చాలు. లే! ఇకనైనా నీ ఆలోచనా శక్తిని అనంత ఆత్మవిశ్వాసాన్ని ఉపయోగించుకుని సంకల్పాన్ని నెరవేర్చుకో. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? కర్ర చేతికి వచ్చాకనా? కాటికి కాళ్ళు చాచాకనా? లేక కట్టె కాలిపోయాకనా? నా ఖర్మ ఇంతే అని ఖర్మలో కూరుకోకు. నా గ్రహస్థితి ఇంతే అని గ్రహాలపై నెపం వెయ్యకు. నాకు ఎవ్వరూ సహకరించలేదు అని సమాజాన్ని నిందించకు. ఆస్తి లేకపోయినా అనంతమైన ఆలోచన శక్తి ఉంది అని గుర్తించు. ఆప్తులు లేకపోయినా శక్తి, యుక్తులు నీసోదర సోదరీమణులుగా ఉన్నారని గ్రహించు.

రాళ్లు, రత్నములు ధరించుట వలన, పేర్లు మార్చుకోవడం వలన, జాతకముల వలన మీ జీవితంలో చిన్నపాటి మార్పులు సంభవించవచ్చునేమో గానీ అనూహ్యమైన శాశ్వత మార్పులు జరిగే అవకాశం ఎంత మాత్రమూ లేదు. అలా అనూహ్యమైన శాశ్వత మార్పులు జరగాలంటే ఒక్కటే జరగాలి. అదే నీ ఆలోచనా ప్రక్రియలో మార్పు. ఈ మార్పు నీలో నీ అంతటగా జరగాలి. ఎందుకంటే ఆ ఆలోచనే నువ్వు. ఒక మంచి ఆలోచన నిన్ను సన్మార్గ లక్ష్య శిఖరాన్ని చేరుస్తుంది. ఒక చెడు ఆలోచన నిన్ను దుర్మార్గ లక్ష్య పాతాళానికి పడవేస్తుంది. అదే ఆలోచనకు వున్న శక్తి. ఒక ఆలోచన నిన్ను బద్దకస్తుణ్ణి చేస్తుంది. మరొక ఆలోచన నిన్ను బ్రహ్మాండాన్నైనా బద్దలు కొట్టేంత బలవంతుణ్ణి చేస్తుంది. బద్దకాన్ని భూస్థాపితం చేసేందుకైనా, బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టేందుకైనా నీ అంతట నువ్వే కార్య రంగంలోకి దిగాలి. ఎందుకంటే బద్ధకమూ నీదే. బద్దకాన్ని భూస్థాపితం చెయ్యాలన్న కోరికా నీదే. బ్రహ్మాండం నీదే. బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టాలన్న సంకల్పమూ నీదే. కనుక ప్రయత్నం కూడా నీదే కావాలి. అది పరిపూర్ణం కావాలి. సంకల్పానికి ప్రతిరూపమైన నువ్వు నీకు తెలియకుండానే వైకల్యాన్ని సృష్టించుకుంటున్నావ్. వైకల్యం అనగా అంగ వైకల్యం కాదు. మానసిక వైకల్యం కాదు. మరేదో ఇంకేదో కాదు. అద్వైత క్రియ చెప్పేది ఒక్కటే. ఈ సృష్టిలో వున్నది ఒకే ఒక్క వైకల్యం. అదే సంకల్పాన్ని సిద్దించుకోలేకపోవడమే అసలు సిసలు వైకల్యం.

మనిషిని అన్ని జీవుల్లోకెల్లా ఉత్తమ జీవి అన్నది ఎందుకంటే అన్ని ప్రాణులకు లేని సదుపాయాలు కేవలం మనిషి అనే జీవికి మాత్రమే వున్నాయి కనుక. మరి అలాంటి ఉత్తమ జీవి తనకున్న ఉత్తమ సదుపాయాలని ఉపయోగించుకోవడం మర్చిపోయాడు. తన కోరికలను ఎలా నెరవేర్చుకోవాలో తెలీదు. ఇదే వైకల్యం అంటే. అంతే గానీ మనో వైకల్యమో, అంగ వైకల్యంతో కాదు. ప్రయత్న వైకల్యం. పరిపూర్ణ ప్రయత్నం ఎప్పుడైతే నీవు చెయ్యలేవో నీ ప్రతి కోరికా సగంలోనే ఆగిపోతుంది. శరీరం సహకరించడం లేదని దిగులు పడకు. సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి, శరీరానికి ఏ మాత్రం సంబంధం లేదు. సంకల్పం అన్నది శరీరం, మనస్సు ఈ రెండింటికీ అతీతమైన క్షేత్రంలో పుడుతుంది. ఆ క్షేత్రంలో పురుడు పోసుకున్న సంకల్పం అది నెరవేరేందుకు సంకల్పా క్షేత్రంలో పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఆ సంకల్ప క్షేత్రంలోంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడది భౌతిక క్షేత్రంలోకి వస్తుంది. భౌతిక క్షేత్రం అంటే పంచేంద్రియాలు, ప్రకృతి, విశ్వం కంటికి కనిపించేవన్నీ. అంతే కాదు చివరికి మనస్సు కూడా భౌతిక క్షేత్రమే. సంకల్పాన్ని భౌతిక క్షేత్రం ద్వారా కాకుండా సంకల్ప క్షేత్రం నుండే నెరవేర్చుకోవచ్చు. నీ శరీరాన్నీ, మనస్సుని అన్నింటినీ ముక్కుకు తాడు కట్టినట్టుగా నిన్ను లాగేది ఈ సంకల్ప క్షేత్రమే. మీరు మీ జీవితంలో ఎపుడైనా గమనించే వుంటారు. కొన్ని సార్లు మీరు మీకు తెలియకుండానే ఆకర్షణకు లోనవుతూ వుంటారు. ఆకర్షణ అంటే అది అందానికి ఆకర్షితులు కావడమో, బంధానికి ఆకర్షితులు కావడమో కాదు. ఆకర్షణకు మూలం ఆత్మ సంకల్ప క్షేత్రం. ఆ సంకల్పా క్షేత్రం ఎప్పుడో ఓ కోరిక కోరుకుని ఉంటుంది. ఆ కోరిక సంపూర్ణంగా నెర వేరేవరకు భౌతిక ప్రపంచాన్ని పట్టి లాగుతూనే ఉంటుంది. మీ సంకల్ప క్షేత్రం బలంగా ఉంటే ఎదుటి వారు మీ క్షేత్రంలోకి ఆకర్షింపబడతారు. ఎదుటివారి సంకల్పా క్షేత్రం బలంగా ఉంటే మీరు ఎదుటి వారి క్షేత్రంలోకి ఆహ్వానింపబడతారు. ఇది నిరంతరం జరిగే సంకల్ప క్షేత్ర ప్రక్రియ. అలాంటి సంకల్ప క్షేత్ర వ్యవస్థపై అనుభవ జ్ఞానం లేకపోవడమే సంకల్పాన్ని సిద్ధించుకోలేని వైకల్యంగా కార్యరూపం దాల్చుతుంది.

ఇది కాక సృష్టిలో మరే వైకల్యమూ లేదు. అలాంటి వైకల్యాన్ని క్రూకటి వేళ్ళతో సహా పెకిలించి లక్ష్యాన్ని సాధించుకోవడం ఎలాగో అద్వైత క్రియని ఆచరించడం ద్వారా తెల్సుకుని సంకల్పాన్ని సిద్దించుకోవచ్చు. మనిషి యొక్క ఆలోచనా శక్తి మరియు సంకల్ప శక్తులను మిళితం చేసి, సమ్మిళితం చేసి రూపొందించిన అద్భుతమైన అనంత జ్ఞాన బాండాగార ప్రక్రియే ఈ మహాసంకల్పం అద్వైతక్రియ. ఈ ప్రక్రియ అభూత కల్పనలతో కూడుకున్నది కాదు. ప్రాకృతిక ధర్మానుసారం జీవిత సత్యాలను ఉదాహరణగా చేసుకుని ఆచరించే ప్రక్రియ. మీకర్ధమయ్యే భాషలో ఈ కాలానుగుణంగా చెప్పాలంటే ఇది సైన్స్. కోరికలు దుఃఖానికి మూలం. ఇది బుద్ధుని వాక్కు. కానీ ఈ సృష్టి ఆ అనంత అద్వైతానందుడి కోరికే. కోరిక(సంకల్పం) లేనిదే ఈ సృష్టి లేదు. సృష్టికర్త సృష్టించిన ఈ సృష్టిలో అన్నిటికన్నా ముందు పుట్టింది సంకల్పం. ఆ సంకల్పమే సృష్టిగా రూపుదిద్దుకుంది. మన వారసులకు మన వంశపారంపర్యంగా ఏఏ లక్షణాలు అలవాడుతాయో అలాగే సంకల్పం అనేది మన పరమాత్మ నుండి వారసత్వంగా మనకు సంక్రమించిన ఆత్మ పారంపర్య ఆస్తి. సృష్టికర్తకు తన సృష్టిపై సంపూర్ణ అధికారం ఉంది. తనకు తన సృష్టిలో అధికారం లేనిది ఏదైనా వుంది అంటే అది ఆ పరమాత్ముడు వారసత్వంగా మనకిచ్చిన ఈ ఆత్మ పారంపర్య సంకల్ప ఆస్థి పైనే. అందుకే

సంకల్పాన్ని సంకల్పించుకునేందుకు సంకల్పివి కమ్ము. సంకల్పాన్ని విశదీకరించుకునేందుకు విశ్వానివి కమ్ము. సంకల్పాన్ని నడిపించేందుకు నియంతవి కమ్ము.సంకల్పాన్ని సిద్ధించుకునేందుకు యోగివి కమ్ము.

ఓ దేవా!దేవ దేవా!దేవాధి దేవా! సంకల్పం అనే స్వేచ్ఛని మాకు ప్రసాదించినందులకు సదా కృతజ్ఞులము. కనుక సంకల్పం ప్రతి జీవి జన్మ హక్కు. ఆ సంకల్పాన్ని సిద్ధించుకోవడం అన్ని ప్రాణుల ఆత్మ హక్కు. ఇది ఆ పరమాత్ముడు ప్రతి ప్రాణికిచ్చిన పురిటి హక్కు. ఇదే మా అద్వైతక్రియ విశ్వ వైద్ధాంతిక వాక్కు. వాక్కు.. వాక్కు...