వాడుకరి:Akhilapo/ప్రయోగశాల
శుద్ధ శాఖాహార జీవన విధానం (వీగనిజం)
వీగన్ సొసైటీ వివరణ ప్రకారం, "వీగన్ అనేది ఆహారం, దుస్తులు లేదా ఇతర ప్రయోజనాల కోసం జంతువులను అన్ని రకాల దోపిడీ మరియు క్రూరత్వం, వీలైనంతవరకు మరియు సాధ్యమైనంత వరకు మినహాయించాలని కోరుకునే జీవన విధానం".
జంతువులను ఆహారము కోసము వినియోగించడం లేదా జంతువులను వస్తువు లాగా (కమోడిటీ) వాడటానికి వీగన్లు వ్యతిరేకిస్తారు. ఈ తత్వాన్ని అనుసరించే వాళ్ళను శుద్ధ శాకాహారులు లేదా ఇంగ్లీషులో వీగన్లు అంటారు.
శాకాహారవాదం (వీగనిజం) లో పలు రకాలు లేదా వర్గాలు వున్నాయి.
1. ఆహార నియమాలు పాటించే శాఖాహారులు (డైటరీ వీగన్స్): వీళ్ళు పశు మాంసం ఉత్పత్తులు మాత్రమే కాకుండా, జంతువులనుండి పరోక్షంగా తయారు చేసే ఆహార పదార్థాలు (గుడ్లు, పాల ఉత్పత్తులు, తేనె, వెన్న, నెయ్యి, పెరుగు లాంటివి) కూడా తీసుకోరు. అలాంటి వాటిని ప్రోత్సహించరు.
2. నైతిక శాకాహారులు (మోరల్ వీగన్స్): వీరు శాకాహారి ఆహారాన్ని మాత్రమే అనుసరిస్తారు. అంతే కాకుండా, జంతువులను అన్ని ఇతర అవసరాలకు వాడటాన్ని వ్యతిరేకిస్తారు. ఉదాహరణకు, తోలుతో చేసిన వస్తువులు, పట్టు బట్టలు, తోలు చెప్పులు వాడటాన్ని పూర్తిగా ప్రతిఘటిస్తారు. ఇంకా జంతు ప్రదర్శన శాలలు (జూ), సర్కస్ , శాస్త్ర పరిశోధనల కోసం జంతువులను వాడటాన్ని వ్యతిరేకిస్తారు.
3. పర్యావరణ శాఖాహారులు (ఎన్విరాన్మెంటల్ వీగన్స్): వీళ్ళు జంతువుల ఉత్పత్తులను ఉపయోగించడానిని పూర్తిగా వ్యతిరేకిస్తారు, ఎందుకంటే, దీని వలన భూమికి భరించలేని పర్యావరణ నష్టం జరుగుతుంది.
ప్రణాళికతో కూడిన శాకాహారి ఆహారాలు లో ఆరోగ్యకరమైన మరియు పోషక విలువలు తగినంత ఉన్నాయి. ఈ వీగన్ విధానం, క్యాన్సర్ మరియు గుండె జబ్బులతో సహా కొన్ని వ్యాధుల నివారణ మరియు చికిత్స కోసం ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.
వీగన్ ఆహార విధానం అన్ని వయసుల వారికి , గర్భధారణ మరియు శిశుదశలతో పాటు అన్ని జీవన దశలకు సరిపోతుంది. ఈ విషయాన్ని, ప్రపంచము లోని ప్రముఖ దేశాల ఆహార నియమ సంస్థలు నిర్ధారించాయి. అమెరికన్ అకాడెమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డయటిటిక్స్ , డయటిషియన్స్ అఫ్ కెనడా, మరియు బ్రిటీష్ డైటీటిక్ అసోసియేషన్ వంటి ప్రధాన ఆహార నియంత్రణ సంస్థలు దీనిని ధ్రువ పరిచాయి.