వాడుకరి:Alahari Srinu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1986లో వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్ పత్రిక ద్వారా పత్రికా రంగంలోకి అడుగు పెట్టిన అళహరి  శ్రీనివాసాచార్యులు మూడున్నర దశాబ్దాలుగా (2020నాటికి ) ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాలలో పనిచేశారు. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలలో క్యాజువల్ అనౌన్సర్ గా, ఆంధ్రప్రభ హైదరాబాద్ సిటీ ఎడిషన్ అసోసియేట్ ఇంచార్జ్ గా, హైదరాబాద్ సిటీ కేబుల్ లో న్యూస్ ప్రెజెంటర్ గా చాలాకాలం విధులు నిర్వహించారు. ఆ తర్వాత జెమిని టీవీ న్యూస్ విభాగంలో వ్యవస్థాపక సబ్ ఎడిటర్ గా, టీవీ9లో ప్రారంభం నుండి అసోసియేట్ న్యూస్ ఎడిటర్ గా పనిచేశారు.ఆ తర్వాత కొద్దీ రోజులపాటు 99టీవీలో డిప్యూటీ అవుట్ పుట్ ఎడిటర్ గా బాద్యతలు చేపట్టారు.ఆ తర్వాత హైదరాబాద్ మీడియా (hmtv)టీవీలో కూడా పని చేశారు. ప్రస్తుతం సుమన్ టీవీలో సీనియర్ కంటెంట్ హెడ్ గా విధులు నిర్వహిస్తున్నారు.

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అన్ని విభాగాలలో అపరిమిత పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న శ్రీనివాసాచార్యలు అనేక పుస్తకాలు కూడా రాసి పాఠకుల మన్ననలు చూరగొన్నారు. ఆయన రాసిన పుస్తకాలలో గ్రామీణ చరిత్రలే అధికం. వీటిలో స్వర్ణ చరిత్ర, శ్రీవల్లభరాయ వైభవం,స్వర్ణమంజరి,మాగం చరిత్రతో పాటు 18 గ్రామాలకు చెందిన శ్రీ వల్లభరాయ స్వామి వారి దేవాలయాల చరిత్ర కూడా అక్షరబద్ధం చేశారు. లింగగరి చరిత్ర, స్నేహబంధం, నేను చూసిన మీడియాతో పాటు మరికొన్ని పుస్తకాలు ముద్రణ కావాల్సి ఉంది. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్, హిందీ భాషలలో మంచి ప్రవేశం ఉంది.వీరి రచనలు కన్నడ, తమిళ్ భాషలలో కూడా అనువాదం అయ్యాయి.చదుకునే రోజుల్లో విద్యార్థి సంఘ రాజకీయాలలో కూడా శ్రీనివాసాచార్యులు కీలకపాత్ర పోషించారు.పొంగులేటి సుధాకరరెడ్డి హయాంలో ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర కార్యదర్శిగా,పొన్నం ప్రభాకర్ గారి సారధ్యంలో ఉపాధ్యక్షునిగా పనిచేశారు.ప్రకాశం జిల్లా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ కి అధ్యక్షునిగా కూడా కొంతకాలం వ్యవహరించారు.మైసూరులో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్థాపించడంతో పాటు వ్యవస్థాపక అధ్యక్షునిగా కూడా పనిచేశారు.హరిణి పబ్లికేషన్స్ పేరిట అనేక పుస్తకాలు ముద్రించారు.వీటిలో తన సొంత రచనలతో పాటు ఇతర రచయితలూ రాసిన కొన్ని శతకాలు కూడా వున్నాయి.తన స్వగ్రామం స్వర్ణ (ప్రకాశం జిల్లా, కారంచేడు మండలం)పై మొత్తం 8 పుస్తకాలు రాసి పుట్టిన ఊరిపై తన మమకారాన్ని చాటుకున్నారు.  

శ్రీనివాసాచార్యులు తండ్రిగారు అళహరి వెంకట రమణాచార్యులు ప్రముఖ వైద్యునిగా వాసికెక్కారు. అంతేకాదు పర్చూరు సమీపంలోని నూతలపాడు గ్రామానికి సర్పంచ్ గా కూడా పనిచేశారు. తల్లి అన్నపూర్ణమ్మ గృహిణి. శ్రీనివాసాచార్యులు ఉషారాణి దంపతులకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి పేరు భృగు వల్లభ సందీప్, అమ్మాయి పేరు హరిణి.