వాడుకరి:Anandasai1990/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దర్శకత్వం - వెంకటేష్ .యూ 

నిర్మాణం  - రాజ్ స్టూడియోస్.

నిర్మాత  - డా.ఆర్య వర్ధన్ రాజ్.

రచన - డా.ఆర్య వర్ధన్ రాజ్.

సంభాషణలు  - డా. ఆర్య వర్ధన్ రాజ్.

తారాగణం - రాళ్ళపల్లి.

సంగీతం - రాజేష్ . ఆర్ . బి.

ఎడిటింగ్ - విజయకుమార్ .ఎస్ .ఎం .

విడుదల తేదీ  - జనవరి - 26 ,2017 .

బాష - తెలుగు .

లఘుచిత్ర నిడివి - 7 నిమిషాల 55 సెకనులు.

 ఇదే నా దేశం తెలుగు భాషలో నిర్మించబడిన సాంఘీక లఘుచిత్రం.ఈ లఘు చిత్రాన్ని 2017 వ సంవత్సరం , జనవరి 26 వ తేదీన ,భారత గణతంత్ర దినోత్సవం సందర్బంగా విడుదల చేసారు. వాలి వధ - రామ కథ వంటి అంతర్జాతీయ అవార్డులను పొందినటువంటి లఘుచిత్రాన్ని నిర్మించిన రాజ్ స్టూడియోస్ వారి సారధ్యంలో నిర్మించబడిందీ లఘుచిత్రం.ప్రముఖ నటులు రాళ్ళపల్లి నటించగా ,డా . ఆర్య వర్ధన్ రాజ్ నిర్మాతగా వ్యవరించి , సంభాషణలను  కూడా వ్రాసారు.

కథావస్తువు 

మొదట భారత దేశ గొప్పతనం ఏంటి ? తర్వాత పరిస్థితి ఏంటి ? ఎందుకు ఎలా మారింది,ప్రస్తుతం ప్రజలకు ఎం కావాలి ? అందుకు మనం ఎం చెయ్యాలి ? ఎవరు చెయ్యగలరు ?అనే అంశంపై ఆధారపడి కథ సాగుతుంది.కేవలం ఏడూ నిమిషాలున్న ఈ లఘుచిత్రం అతి తక్కువ సమయంలోనే చెప్పాలనుకున్నది చెప్పగలగడం గొప్ప విషయం.

పాత్రలు 

కేవలం ఒకే పాత్రతో నడిపించిన ప్రయోగాత్మకమైన చిత్రం ఇది.ప్రధాన పాత్రను సీనియర్ నటులు రాళ్లపల్లి పోషించారు.

సాంకేతిక వర్గం 

ఈ లఘుచిత్రానికి ప్రాణంగా చెప్పుకొనే అద్భుతమైన సంభాషణలను ప్రముఖ సాహితీవేత్త , మేధావి ,రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా . ఆర్య వర్ధన్ రాజ్ అందించగా,లఘుచిత్ర దర్శకుడైన వెంకటేష్ .యూ .దర్శకత్వం వహించారు.మరొక లఘు చిత్ర దర్శకుడు రాజేష్ ఆర్ .బి ,స్క్రీన్ ప్లే ను ,సంగీతంను ,కలర్ ఎఫెక్ట్స్ ను అందించారు.ప్రముఖ ఎడిటర్ విజయకుమార్ ఎడిటింగ్ చెయ్యగా,ప్రముఖ ఛానల్లోని ఈవెంట్ మేనేజర్ ఐన  జానా ప్రవీణ్ కుమార్ దర్శకత్వ పర్యవేక్షణ చేసారు.రాజ్ స్టూడియోస్ నిర్మాణంలో డా.ఆర్య వర్ధన్ రాజ్ నిర్మాతగా ఆన్ లైన్ యూట్యూబ్ ఛానల్ ఐన ఆరెంజ్ పిక్చర్స్ ద్వారా విడుదల చేసారు.

ఇదే నా దేశం లఘుచిత్ర ప్రత్యేకతలు 

800 లకు పైగా చిత్రాలలోనూ ,3000 కు పైగా నాటకాలలోను,పలు టెలి ఫిలిమ్స్ లోనూ నటించిన సీనియర్ నటులు రాళ్లపల్లి గారు చేసిన ఒకే ఒక్క లఘుచిత్రం ఇదే కావడం విశేషం.

లఘుచిత్రం అంతా ఒకే పాత్రతో కొనసాగుతుంది.

ప్రముఖ సమాజసేవకుడు,తత్వవేత్త,మేధావి,రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా.ఆర్యవర్ధన్ రాజ్ ఈ లఘు చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. అంతేగాక రచయితగా పదునైన సంభాషణలు అందించారు..

ఈ లఘుచిత్రంలో నటనకు గాను రాళ్ళపల్లి ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ అవార్డుని పొందారు

ఇదే నా దేశం లఘుచిత్రంలోని సంభాషణలు యధాతధంగా ఈ క్రింద ఇవ్వబడింది .

ఇది నా దేశం , భారత దేశం .

కాలితో త్రొక్కే మట్టిని కూడా కన్న తల్లిలా కాపాడే దేశం .

ప్రపంచంలోని ప్రతి మతానికి మర్యాదనిచ్చే మాతృదేశం .

కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రదేశం.

వేదాలు,ఉపనిషత్ గ్రంధాలూ వ్రాయబడ్డ విజ్ఞాన ప్రదేశం .

పరాక్రమం ప్రదర్శించిన వీరులు నడయాడిన జన్మ ప్రదేశం .

భిన్న భాషలు ,భిన్న సంస్కృతులు కల్గిన భాగ్య ప్రదేశం.

స్వాతంత్రానికై సాయుధ పోరాటాలను జరిపిన సమర వీరుల ఆవేశం .

బానిసత్వంపై భారతీయులు సంధించిన అంకుశం .

శాంతికై సమస్తాన్ని కోల్పోయిన వారి సందేశం .

అహింసే ఆయుధమని నమ్మిన అద్భుత దేశం .

ఇది ఒకప్పటి నా భారత దేశం .

ఉగ్రవాదుల చేతిలో ఊపిరి పోగొట్టుకుంటున్న అమాయకుల ఆక్రందనల దేశం.

నక్సలైట్ల చేతుల్లో నలిగిపోతున్న అమాయకుల అరుపుల ప్రదేశం.

అధికారం చేతుల్లో అంధకారాన్ని గురైన ప్రజాస్వామ్య దేశం.

రాజకీయం చేతుల్లో రంగులు పులుముకున్న రాక్షస ప్రదేశం.

మతాల మత్తులో మానవత్వాన్ని మరిచిన దేశం .

కుల కక్షలతో కొట్టుకుంటున్న కన్నీటి ప్రదేశం .

ప్రాంత విభేదాలతో ప్రాణాలను తీసుకుంటున్న పుణ్య ప్రదేశం.

ఇది ఇప్పటి మన భారత దేశం.

అరవై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్య్రాన్ని అభివృధి పేరుతో పిలుచుకుంటున్న అమాయక దేశంలో ఎక్కడ వుంది అభివృద్ధి ?

మతాలను కోసం మత యుద్ధాలను చేస్తూ మారణకాండను సృష్టిస్తున్న స్వార్థపరులైన మనుష్యుల చేతుల్లోనా ? లేక ,

మతం మత్తులో సాటి మతస్తులనే చంపుకుంటున్న ఉగ్రవాది ఆలోచనల్లోనా ?

విలువలున్న సమాజం కోసం విలువలనే మరచి ప్రాణాలను తీస్తున్న నక్సలైట్ చేతుల్లోనా ? లేక 

ఆశ కోసం కొంత మంది , ఆశయం కోసం కొంత మంది చస్తున్న మావోయిస్టు ఆలోచనల్లోనా ?

అవినీతిపరులైన రాజకీయ నాయకుల చేతుల్లోనా ? లేక నోటు కోసం ఓటును వేసే అవినీతిపరులైన ప్రజల ఆలోచనల్లోనా ?

రాజ్యాంగంలోని మొదటి పేజీలో స్వర్ణాక్షరాలతో లిఖించబడ్డ ప్రజాస్వామ్యం అనే పదం అదే రాజ్యాంగంలో సమాధి చెయ్యబడింది.

ప్రజల చేత ,ప్రజల కొరకు,ప్రజలే ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వంలో ఆ ప్రజలు పోరాడితే పట్టించుకొనే వాడే లేడు.

అందరూ సమానమే అంటూ సమానత్వం గురించి సగర్వంగా చెప్పుకునే మన ప్రజాస్వామ్య దేశంలో కులమతాలకు రేజర్వేషన్లను కేటాఇంచిన రాజ్యాంగంలోనా వున్నది అభివృద్ధి ?

ప్రజలకు మందు సీసాలు అవసరం లేదు , జీవితాంతం మంచినీరు కావాలి.

ప్రజలకు రెండు చేతులా డబ్బు కాదు , ఐదు వ్రేళ్ళు నోట్లోకి వెళ్లేలా రెండు చేతులా పని కావాలి.

పార్టలకై ప్రచారాలు కాదు,పిల్లలకు పాఠశాలలు నిర్మించాలి.

పేజీలకు పేజీల ఎజెండాలు కాదు,పరాయి దేశాలకు వెళ్లకుండా పనులు కల్పించాలి.

పంచవర్ష ప్రణాళికలు కాదు , ప్రజల మాన ప్రాణాలకు భద్రతను కలిగించాలి.

గడచినా అరవై ఎనిమిది సంవత్సరాలలో వంద సార్లు మార్చి,సవరించిన రాజ్యాంగ చట్టాన్ని ప్రజా ప్రయోజనార్ధం మరొక్కసారి సవరించి దేశాభివృద్ధికి సమగ్ర నివేదికా చట్టాలను అమలులోకి తీసుకొని రావాలి.ఇదంతా ఎవరు చెయ్యగలరు ?

యువత