వాడుకరి:Anjanahari writes/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోల్డిలాక్స్ మరియు మూడు ఎలుగులు

[మార్చు]

గోల్డిలాక్స్ మరియు మూడు ఎలుగులు 19వ శతాబ్దానికి చెందిన ఒక ప్రఖ్యాత పిల్లల కథ. దీని రచయిత ఆంగ్ల దేశస్తుడు అగు రాబర్ట్ సౌతీ.గోల్డిలాక్స్ మరియు మూడు ఎలుగులకి సంబంధించి వేర్వేరు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సౌతీ ప్రచారం చెసిన కథలో గోల్డీలాక్ అను పేరు ఒక వృద్ధురాలు కాగా ఇతర గాధలలో గోల్డీలాక్ ఒక చిన్నారి పాపగా పేర్కొనబడి ఉంది.

కథా సారాంశము:

[మార్చు]

పూర్వం ఒక అడవిలో ఒక చిన్న కుటీరంలో ఒక ఎలుగుబంట్ల కుటుంబం నివసించేది.దానిలో మొదటి ఎలుగు పరిమాణంలో చాలా పెద్దదిగా, రెండవది సాధారణంగా మరియు మూడవది చిన్నదిగా ఉండేవి. అవి ఎంతో దయా గుణం కలిగినవి, శుభ్రతను పాటించేవి మరియు సాధు గుణం కలిగినవి. వాటి మూడింటికి గంజి త్రాగుటకై వేర్వేరు పాత్రలు, కూర్చొనుటకై వేర్వేరు కుర్చీలు మరియు నిద్రుంచుటకై మంచాలు ఉండేవి. ఒకనాడు అల్పాహారమునకై అవి గంజిని తయారు చేసుకుంటాయి కాని అది చాలా వేడిగా ఉండటంతో వెంటనే త్రాగలేకపోతాయి. గంజి చల్లారేలోపు అడవిలో సమయం గడపాలని వెళ్తాయి. ఇది ఇలా ఉండగా, పొరుగు గ్రామంలో గోల్డిలాక్స్ అను వృద్ధురాలు జీవించేది. ఆమె చాలా దుర్గుణవతి, అపరిశుభ్రంగా ఉంటూ ఎప్పుడూ అందరినీ తిడుతూ చాడీలు చెబుతూ ఉండేది. ఆందువలన ఆమెను గ్రామం నుండి వెళ్లగొడతారు. దానితో గోల్డిలాక్స్ అడవి వైపుగా నడక ప్రారంభిస్తుంది. ఎలుగులు నివాసం ఉండే ఇంటిలో ఎవరూ లేరని గమనించి కిటికీ నుండి లోపలికి ప్రవేసిస్తుంది. వంటగదిలో తయారై ఉన్న గంజిని చూసి త్రాగివేస్తుంది. ఆ తరువాత మూడవ ఎలుగు కూర్చీలో కూర్చునే ప్రయత్నం చేయగా అది కాస్తా విరిగిపోతుంది. దీనితో వదలక మూడవ ఎలుగు మంచం పైన పడుకోని నిద్రపోవడం మొదలు పెడుతుంది. కాసేపటికి ఆ మూడు ఎలుగులు గంజి త్రాగడానికై ఇంటికి తిరిగివస్తాయి. లోపల అంతా చిందరవందరగా ఉండటం చూసి పరుగున వచ్చి చూడగా తన గంజి గిన్నె ఖాళీగా ఉందని మరియూ కుర్చీ విరిగిపోయిందని చెబుతుంది మూడవ ఎలుగు. మంచంపై ఉన్న గోల్డిలాక్స్ ని చూసి అక్కడికి వెళ్లగా చటుక్కున నిద్రలేచి కిటికిలో నుండి పారిపోతుంది గోల్డిలాక్స్.