వాడుకరి:Anji189

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మను భకర్[మార్చు]

మను భకర్ ఎయిర్ గన్ షూటింగ్ లో భారతదేశం తరపున ఒలింపిక్స్ ఆడిన క్రీడాకారిణి . ఆమె 2018 ఐఎస్ఎస్ఎఫ్( ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ) వరల్డ్ కప్‌లో భారత దేశం తరుపున ఆడి రెండు బంగారు పతకాలు సాధించారు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో  మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో స్వర్ణం సాధించారు. అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే[1].

2020లో భారత ప్రభుత్వం ప్రతిష్టతికమైన అర్జున అవార్డుతో మను భకర్‌ను  సత్కరించింది.

వ్యక్తిగత జీవితం మరియు నేపథ్యం[మార్చు]

హర్యానా రాష్ట్రంలోని ఝజ్జర్  జిల్లాకు చెందిన  గోరియా అనే గ్రామంలో భకర్ జన్మించారు. ఆమె తండ్రి మెరైన్ ఇంజనీర్. తల్లి స్కూల్ ప్రిన్సిపాల్‌గా  పనిచేసేవారు. మను భకర్ చిన్నప్పటి నుంచే షూటింగ్‌తో పాటు బాక్సింగ్ , అథ్లెటిక్స్, స్కేటింగ్ మరియు జూడో కరాటే క్రీడల్లో పాల్గొనేవారు.

కెరీర్ ఆరంభంలో పిస్టల్‌తో ప్రజల మధ్య ప్రయాణించడం ఆమెకి ఒక సవాలుగా ఉండేది. ఎందుకంటే మైనరైన భకర్ పిస్టల్ తీసుకొని ప్రయణించడం చట్టరీత్యా  నేరం. తన కుమార్తె షూటింగ్ పోటీలలో పాల్గొనడంలో సహాయ పడేందుకు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు భకర్ తండ్రి. లైసెన్స్ పొందిన పిస్టల్‌తో ఆమె ప్రయాణిస్తున్నప్పుడు తోడుగా రావడం ప్రారంభించారు.[2].

అత్యంత ఖరీదైన తుపాకులతో ఆడే ఆటను ఆడగలిగిందంటే అందుకు తన కుటుంబం అందించిన సహాయ సహకారాలే కారణమంటారు భకర్.

. 2012 ఒలింపిక్స్  తరువాత నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అఫ్ ఇండియా మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యువ క్రీడాకారుల కోసం మొదలుపెట్టిన ఇండియా'స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ షూటింగ్ ప్రోగ్రాం ద్వారా బేకర్‌కు ప్రయోజనం కలిగింది. ఈ ప్రోగ్రాం వలన బాగా పేరుగాంచిన షూటర్లును యువకులకు వ్యక్తిగత కోచ్‌లుగా నియమించే వ్యవస్థ వచ్చింది. భారత అత్యుత్తమ షూటర్ జస్పాల్ రాణా బేకర్‌కి మార్గదర్శిగా నిలిచారు[3].

వృత్తిపరమైన విజయాలు[మార్చు]

2017 కేరళలో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో భకర్ 9 బంగారు పతకాలు సాధించి జాతీయ రికార్డును బద్దలుకొట్టారు. 2017లో జరిగిన ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కూడా భకర్ రజత పతకం కైవసం చేసుకున్నారు.[4].

2018 మెక్సికోలోని గ్వాదలహరా నగరం వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్ షూటింగ్ వరల్డ్ కప్‌లోని 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోని ఫైనల్స్‌లో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలచిన అలెజాండ్రా జావ్లాను  భకర్ ఓడించారు. ఈ విజయంతో భకర్ వరల్డ్ కప్‌లో అతి చిన్న వయసులోనే బంగారు పతకం సాధించిన భారతీయురాలిగా రికార్డు నెలకొల్పారు. [2]

2018లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌లో భకర్ రెండు స్వర్ణాలు సాధించారు. [3]

అదే ఏడాది నిర్వహించిన కామన్ వెల్త్ గేమ్స్‌లో కూడా ఆమె కేవలం బంగారు పతకం సాధించడం మాత్రమే కాదు.. ఆమె స్కోర్ తో  కామన్ వెల్త్ గేమ్స్ లో కొత్త రికార్డు సృష్టించారు. కేవలం 16వ ఏళ్ల వయసులోనే భకర్ ఈ రికార్డు సాధించడం విశేషం.[5]

మ్యూనిచ్ నగరంలో జరిగిన 2019 ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో భకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 4వ స్థానంలో నిలిచి 2021లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు .[4]

2020 ఆగష్టులో జరిగిన వర్ట్యువల్ ఈవెంట్ ద్వారా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నారు.  [6]

మూలాలు[మార్చు]

  1. [Manu Bhaker clinches Tokyo Olympics quota in 10m air pistol[4] Manu Bhakar-English Wikipedia Page [5] "Manu"]. wiki. {{cite web}}: Check |url= value (help); line feed character in |url= at position 63 (help)CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 "'गोल्डन शूटर' मनु को कितना जानते हैं आप?". BBC News हिंदी (in హిందీ). Retrieved 2021-02-17.
  3. 3.0 3.1 Hawker, Peter (1830). Instructions to young sportsmen in all that relates to guns and shooting. London,: Printed for Longman, Rees, Orme, Brown, and Green,.{{cite book}}: CS1 maint: extra punctuation (link)
  4. 4.0 4.1 [Manu Bhaker clinches Tokyo Olympics quota in 10m air pistol[4] Manu Bhakar-English Wikipedia Page "Manu"]. wiki. {{cite web}}: Check |url= value (help); line feed character in |url= at position 63 (help)CS1 maint: url-status (link)
  5. "ISSF - International Shooting Sport Federation - issf-sports.org". www.issf-sports.org. Retrieved 2021-02-17.
  6. "National Sports Awards highlights: India's sporting best honoured in virtual ceremony". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-08-29. Retrieved 2021-02-17.
Anji189
వ్యక్తిగత సమాచారం
జననం18 ఫిబ్రవరి 2002
గోరియా గ్రామం, జజ్జర్, హరియాణా.
క్రీడ
దేశంభారత దేశం
క్రీడషూటింగ్