వాడుకరి:B.K.Viswanadh/ప్రయోగశాల2
ఎక్కడైనా గ్రామదేవత దేవాలయాలు పెద్ద కట్టడాలో లేక సిమెంట్ కట్టడాలో ఉంటాయి అయితే నరసాపురం మండలంలో ఎల్.బి.చెర్ల గ్రామ సమీపాన కల ఒక ఎల్.బి.చర్ల గంగాలమ్మ దేవాలయం చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
ఈ ఆలయం నరసాపురం చుట్టుప్రక్కల గ్రామాల్లో అతి ప్రసిద్దం, మండలం నుండే కాక అనేక జిల్లాల నుండి భక్తులు వస్తారు. ఆదివారం ఎక్కువ మంది ఉంటారు. సాధారణంగా గ్రామదేవత ఆలయం అంటే ఒక గ్రామానికి మాత్రమే చెంది ఉంటుంది. దానికి విరుద్ధంగా ఈ దేవాలాయం ఎల్.బి.చెర్ల, సారవ, మోడి గ్రామాలకు మూడిటికి చెందినదిగా చెప్తారు అమ్మవారి జాతర మూడు గ్రామాల్లో చేస్తారు.
ఈ ఆలయం పంటచేల మద్య ఉంది. మట్టి రోడ్డు ద్వారా ఈ ఆలయానికి సారవ గ్రామం నుండి లేదా చెర్ల నుండి రెండు కిలోమీటర్లు వెళ్ళాలి.
ఆలయం అంటే సిమెంట్ కట్టడాలు గోపురాలు వంటివి ఉంటాయి కాని ఈ గుడికి అలాంటివి ఉండవు చుట్టూ ఫెన్సింగ్ పైన చిన్న్ అరేకు తప్ప మరేంఉండవు.
ఇక్కడ అమ్మవారి విగ్రహం వంటివి ఉండవు. ఒక చెట్టును అమ్మవారిగా పూజిస్తారు.