వాడుకరి:B.divya06

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంధ్య రంగనాథన్ తమిళనాడు రాష్ట్రం కడలూరుకు చెందిన సంధ్య రంగనాథన్ (జననం 1998 మే 20) భారత వర్థమాన ఫుట్ బాల్ క్రీడాకారిణి. కాఠ్మాండూలో జరిగిన 2019 ఎస్ఏఎఫ్ఎఫ్ (SAFF) మహిళల చాంపియన్ షిప్, నేపాల్లోని పొఖారాలో 2019లో జరిగిన 13వ సౌత్ ఏసియన్ గేమ్స్లో విజేతగా నిలిచి భారత జట్టులో సంధ్య మిడ్ ఫీల్డర్గా వ్యవహరించింది. (1) ఇండియన్ విమెన్ లీగ్ (ఐడబ్ల్యూఎల్) లో సేతు ఫుట్ బాల్ క్లబ్కు సంధ్య ప్రాతినిధ్యం వహిస్తోంది. 2019లో అత్యంత విలువైన ప్లేయర్ అవార్డును కూడా సంధ్య గెలుచుకుంది. (2)(1) వ్యక్తిగత జీవితం, నేపథ్యం తమిళనాడు రాష్ట్రం, కడలూరు జిల్లాలో 1998 మే 20న సంధ్య జన్మించింది. తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడంతో, సంధ్యను ప్రభుత్వ హాస్టల్ లో చేర్పించింది ఆమె తల్లి. అక్కడే సంధ్యకు ఫుట్ బాల్పై ఆసక్తి కలిగింది. రోజు కూలిగా పనిచేసే సంధ్య తల్లి, తన కూతురిని నెలకు ఒక్కసారి మాత్రమే కలిసేది. (3) తిరువళ్లూరు యూనివర్సిటీలో కోచ్ ఎస్ మరియప్పన్ పర్యవేక్షణలో సంధ్యకు చక్కటి శిక్షణ లభించింది. కడలూరులోని ఇందిరాగాంధీ అకాడమీ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్లోనూ సంధ్య శిక్షణ పొందింది. ఫుట్ బాల్తోపాటు చదువుపైనా ఆమె దృష్టిసారించింది. తిరవళ్లూరు యూనివర్సిటీలో ఎంకాం పూర్తి చేసింది. (1) కెరీర్ భారత్ తరఫున ఎన్నో జూనియర్ లెవల్ పోటీల్లో పాల్గొన్న సంధ్య, 2018లో సీనియర్ జట్టుకు ఎంపికైంది. స్పెయిన్లో జరిగిన COTIF (సీఓటీఐఎఫ్) కప్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. 30 మంది సభ్యుల పటిష్ఠ రిజర్వ్ జట్టు నుంచి సంధ్యను తుది జట్టులోకి తీసుకున్నారు. అదే టోర్నీలో సంధ్య తన తొలి అంతర్జాతీయ గోల్ సాధించింది. (4) 2019 భారత జట్టుకు, ముఖ్యంగా సంధ్యకు కలిసొచ్చిన సంవత్సరం. సౌత్ ఏసియన్ గేమ్స్లో సంధ్య రెండు గోల్స్ సాధించడంతో భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. (3) అంతకుముందు మార్చిలో జరిగిన SAFF(ఎస్ఏఎఫ్ఎఫ్) టైటిల్ను సైతం భారత్ గెలుచుకుంది. ఆ టోర్నీలోనూ సంధ్య గోల్స్ సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. బంగ్లాదేశ్తో జరిగిన సెమీ ఫైనల్లో ఈ తమిళనాడు క్రీడాకారిణి కీలక పాత్ర పోషించింది. (5)(4)(6) భారత్ కన్నా ర్యాంకింగ్స్లో ఎంతో ముందున్న ఉజ్బెకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ సాధించిన ఏకైక గోల్ను నమోదు కాగా ఆ గోల్ చేసింది సంధ్యే కావడం విశేషం. ఫార్వర్డ్ క్రీడాకారిణి బాలా దేవి 52వ నిమిషంలో ఇచ్చిన పాస్ను సంధ్య గోల్గా మలచింది. (7) ఒలింపిక్ క్వాలిఫయర్లో నేపాల్తో జరిగిన మ్యాచ్లో భారత్ 3-1 స్కోరుతో విజయం సాధించడంలో కూడా సంధ్యదే కీలక పాత్ర. (8) ఈ టోర్నీలన్నీ 2019లో జరిగినవే. ఇక ఇండియన్ విమెన్ లీగ్ ఫుట్ బాల్లో సేతు ఫుట్ బాల్ క్లబ్ కు టైటిల్ దక్కిందంటే అందుకు సంధ్య ఆటతీరే కారణం. అంతేకాకుండా 2019లో మోస్ట్ వ్యాలుబుల్ ప్లేయర్ (ఎంవీపీ-అత్యంత విలువైన క్రీడాకారిణి) అవార్డు కూడా సంధ్య సొంతం అయ్యింది. (1) సంధ్య ఆటతీరు భారత కెప్టెన్ బాలా దేవీని ఎంతో ఆకట్టుకుంది. వాస్తవానికి ఫుట్ బాల్లో సంధ్యకు బాలాదేవీ స్ఫూర్తి. అలాంటి క్రీడాకారిణిని కూడా సంధ్య తన ఆటతీరుతో ఆకట్టుకుంది. (9) జట్టు తరఫున గోల్స్ సాధించి, జట్టును విజయతీరాలకు చేర్చడమంటే ఈ తమిళనాడు క్రీడాకారిణికి చాలా ఇష్టం. దేశవాళీ టోర్నీలో అత్యుత్తమ క్రీడాకారిణులతో కలిసి ఆడటంలో ఇండియన్ విమెన్ లీగ్ ఎంతో ఉపకరించిందని, తన గేమ్ మెరుగవడానికి లీగే కారణమని ఆమె అంటోంది. 2019లో ప్రదర్శించిన అత్యుత్తమ ఆటతీరునే 2020లోనూ సంధ్య కొనసాగించింది. 2020 సంవత్సరంలో టోర్నీలో రెండో అత్యుత్తమ గోల్ స్కోరర్గా సంధ్య నిలిచింది. స్పెయిన్లో జరిగిన టోర్నీతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంధ్య, ఆ టోర్నీలో పెద్దగా రాణించలేదు. అయితే కఠినమైన పరిస్థితుల్లో, ఉన్నతమైన పోటీ ఉన్న టోర్నీలో ఆడితేనే ఆట మెరుగవుతుందని సంధ్య అంటోంది. బాలా దేవీలాగా తాను కూడా ఏదో ఒక రోజు యురోపియన్ క్లబ్ తరఫున అంతర్జాతీయ లీగ్స్ ఆడతానని ధీమా వ్యక్తం చేసింది. (2)