వాడుకరి:Babavali virat

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

}} నాపేరు : బాబావలి నేను ఆంధ్ర లొయోల కళాశాలలో బి.ఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను పేజి ::3 అమెరికా చేరిన కొతాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం కనబడుతుంది. తనవంటి నల్లవాళ్లను చాలమందిని చూస్తాడు. అయితే తప్పించుకుపోవడానికి ప్రయత్నం చేయడం, తనవంటి వారికి ఆ ప్రయత్నమ్లో సాయం చేయడం అటుంచి, వాళ్ళు తమ యజమాన్లకు గులాంలుగా వ్యవహరిస్తూ, కుంటావంటి ఆఫ్రికన్లను తెల్లవాళ్లలాగే హేళనచేస్తూ వుంటారు. దాస్యం కేవలం భౌతికహింస మీదే నడవదని, అంతకంటె బలవంతమైన భావజాలాన్ని ఉత్పతి చేసుకుంటుందని కుంటా గ్రహించడానికి చాలా కాలం పడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే నల్లవాళ్లు తక్కువరకం మనుషులని, బానిసత్వం వారికి ప్రకృతిఅహజం అని చెబుతుంది ఈభావజాలం అయితే ఇదంతా శ్వేతజాతి శ్వేతతత్వం నుండి పుట్టిన అహంకారంగా మనం అనుకోకూడదు. నలుపు తెలుపుల మధ్య ఘర్షణ చూడకూడదు. విజాతీయులను శ్రమదోపిడికి గురిచేయాలంటే మొదట వారిని సాంస్కృతికంగా అణచాలి. వారి ఆచారాలు అనాగరికమయినవని, వారిమతం 'సాతనూ' మతమని వారి భాష భాషకాదని వారిచేతనే ఒప్పించాలి- అలా చేస్తేనే దోపిడీ సంబంధాలకు వాళ్లు లొంగుతారు అందుకే నల్లవాళ్లు తమ ఆచారాలు పాటించడం , తమ భాష మాట్లాడుకోవడం, పాటలు పాడుకోవడం ఇదంతా నిషిద్ధం. ఈ ఆఫ్రికా చెత్త వదిలిపెట్టమని కుంటాకు యిద్దరు నల్లవాళ్ళే చెబుతారు, తెల్లవాళ్లు కాదు. కుంటా ముస్లిం మతస్థుడు. కాని అమెరికాలోని నల్లబానిసలంతా క్రిస్టియన్లు. రోమన్ సాంరాజ్యంలో బానిసలకు ఇహలోక విముక్తికి మారుగా పరలోకములో ముక్తిని సాధించడానికి ఒక ఉపశమనంగా ముండుకొచ్చిన క్రిస్టియన్ మతం ఈబానిశ సంబంధాలను పదిలం చేయడానికి చక్కగా సరిపోయింది. ఈకథలోనే ఒక నల్లబానిస "మనం ఎన్ని ప్రార్ధనలు చేసినా ఈ తెల్ల వాళ్ళ గుండెలు కరుగుతాయా? అనడిగితే మతం మారిన మరొక బానిస బైబిల్లో ఏం రాసుందో తెలుసా? జోసఫ్ ఈజిప్టువాళ్ళకి బానిసగా అమ్ముడయ్యాడు. కాని భగవంతుడు జోసఫ్ యందు మాత్రమే ఉన్నాడు" అని సమాధానం యిస్తుంది.

అయితే కుంటా మాత్రం లొంగడు. మొదటితరంవాడు కావడంచేత తన ఆఫ్రికా చేత్త వదిలిపెట్టడు. తన చుట్టూవున్న నల్లవాళ్ళను నిరసిస్తాడు. వాళ్లు క్రిస్మస్ రోజున యజమానికి కానుకలర్పిస్తున్న దృశ్యం చూసి సహించలేక

పేజి::4 "ఛీ- చచ్చిపోతే బావుణ్ణు" అనుకుంటాడు. రెండుమూడు సార్లు తప్పించుకోవడానికి ప్రయత్నించి చివరి ప్రయత్నంలో ఒక పాదం సగానికి నరకబడ్డ తరువాతే ఆ ప్రయత్నం విరమించుకుంటాడు. చేలలో పనిచేస్తున్నవాడికి యజమాని బగ్గీతోలే డైవర్ గా ప్రమోషన్ వచ్చినప్పుడు బానిసవాడలోని మిగిలిన బానిసలంతా అభినందిస్తారు. కాని తాను మాత్రం అదొక గొప్పవిషయం అనుకోడు. "తెల్లవాడికోసం తెల్లవాడు చేయమన్న చాకిరీ చేయడంలో తనకు ఏ ఘనతా అవుపించలేదు". తన కుమార్తెకు ఆఫ్రికా పేరే పెడతాడు. ఆఫ్రికాలోని ఒకప్పటి మాలీ సామ్రాజ్య కాలంలోని తన పూర్వీకుల గురించి తన కుమార్తెకు చెబుతాడు. బానిసవాడల్లో పుట్టిపెరిగిన తన భార్య భయపడ్డా వినకుండా తన కుమార్తెకు తన మాతృభాష అయిన మాండింకా భాష కొంచెం నేర్పిస్తాడు. ఆఅమ్మాయి చిన్న యజమానురాలికి ప్రియమయిన చెలికత్తెగా మారిందని తన భార్యలాగా సంతోషించడు. తన కూతురు "యజమానురాలు ఒళ్లో కూర్చోబెట్టుకుని అడుకునే కుక్కపిల్ల" మాత్రమేనని అసహ్యించుకుంటాడు.

నిజంగాకుంటాది చాలా ఆకర్షణీయమయిన వ్యక్తిత్వం. అయితే అందులో ఆకర్షణ వుందేగాని అది చారిత్రకంగా నిరర్ధకం. వర్తమానలో వేళ్ళూనని స్వేచ్చాకాంక్ష, వర్తమాన్ని అసహ్యించుకునే స్వేఛ్చాకాంక్ష అందులో నిక్షిప్తమయిన భవిష్యత్తును గుర్తించదు కాబట్టి అది సాధించేది ఏమీయు వుండదు. గతం తాలూకు స్మృతులతో పుట్టిగతం మీద చూపులు నిలిపిన ఆ గతాన్ని మరచిపోయి వర్తమానంలో జీవిస్తూ, వర్తమానంలోని వైరుధ్యాలకు స్పందించి, భవిష్యత్తు మీద దృష్టి నిలిపినప్పుడే చారిత్రకంగా అర్ధవంతమవుతుంది. అయితే ఈమార్పు గతితార్కికంగానే రావాలి. బానిసలయిన ఆఫ్రికన్లు గతం తాలూకు ఆలోచనకు స్వస్తి చెప్పాలంటే ఆజ్నాపకాలలోనే పుట్టిన స్వేచ్ఛాకాంక్షను గూడ వదిలిపెట్టి పూర్తిగా బానిసవ్యవస్తలో భాగం కావాలి. స్వతంత్రత ఈవిధంగా తద్విరుద్ధమయిన బానిసత్వంగా మారి ఆబానిస సంబంధాలలోని వైరుద్యన్ని వాడుకొని మళ్లీ స్వతంత్రతగా అయితేఈ సాఅరి పైస్థయిలో రూపొందాలి.
కాని ఈమార్పు కుంటాలో రావడం అసాద్యం. తరువాత తరాలలోనే అది సాధ్యమవుతుంది. అందుకనే ఈమార్పు మొదటి మెట్టు దగ్గరే ఈ కధకు కుంటా అవసరం తీరిపొతుంది. తన కుమార్తె కిజ్జీని ఒక బానిస పారిపోవడానికి