వాడుకరి:Bandi.mojesh

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
                                                                          ఎలా చదవాలి? 

ఉపోధ్ఘాతం:


విద్య అనగా చదువు అని అర్ధం. విద్య మానవునికి రహస్యంగా దాచిపెట్టబడిన ధనం. విద్యయే సౌందర్యం.విద్యయే యశస్సునూ,భోగాలనూ కలిగిస్తుంది. విద్యయే గురువు వలె అన్నింటినీ బోధిస్తుంది.పరదేశంలో చుట్టంలాగా సహాయం చేస్తుంది.విద్యయే పరదైవతం.ప్రపంచంలో విద్యకు సామానమైన ధనం మరొకటి లేదు.విద్యయే రాజ సభల్లో పూజించబడుతుంది.కనుక విద్య రాని వాడు మరణించిన వానితో సమానుడే. "చదవటం వల్ల మనం, మన చరిత్ర గురించీ మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి, చివరకు మన గురించి కూడా తెలుసుకోవచ్చు." అన్నాడు సాహిత్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ అవార్డునందుకున్న డేనియల్ బూర్ స్టిన్. " ఈ ప్రపంచంలో మన కళ్లెదుట కనిపించే దేవతలే పుస్తకాలు" అన్నాడు అబ్రహాం లింకన్. 

"అనాగరికుణ్ణి నాగరికుడిగా,దానవుడిని మానవుడిగా మార్చగలిగే అద్భుత మేజిక్ పరికరం పుస్తకం. కళ్లుండి కూడా అది చదవలేని వాడి జీవితం వృథా" అన్నాడు ప్రముఖ మెజీషియన్ హరీ హౌడినీ.

విషయ వివరణ :


విద్యలేని వాడు వింత పశువు :

చదువు పాముఖ్యత గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతో ఉంది. ప్రపంచంలో 65 శాతం మందికి ఇంకా చదవడం రాయడం రాదని తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.అందుకే ఇప్పుడు అక్షరాస్యతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాయడం రాకపోయినా ప్రతీ వ్యక్తి చదవడం నేర్చుకోవాలని వయోజన విద్యాకేంద్రాల ద్వారా కృషిచేస్తున్నారు.గతంలో ప్రభుత్వం అదొక బాధ్యతగా తీసుకుని కృషి చేసింది. ఈ రోజు నిరక్షరాస్యులే ముందుకు వచ్చి చదువు నేర్చుకుంటున్నారు.బస్సుల పేర్లు, సినిమాల పేర్లు చదవడానికైనా మంచిదని నేర్చుకుంటున్నారు. అటువంటి ప్రఖ్యాతలు ,గొప్ప విశిష్ఠటతలు కలిగిన విద్యను మనము ఎలా వినియోగించుకోవాలి? దిక్సూచిలో ముల్లు ఎల్లవేళలా ఉత్తర దిక్కు వైపు చూపినట్లుగా మన చదువుని ఎల్లవేళలా విజయం వైపే గురుచేసి ఉంచుకోవాలి. విజయం సాధించిన తరువాత కూడా దాంతో తృప్తి చెందకూడదు. విజయం ఎంత సాధించగలిగితే అంత మందికి ఉపాధి కలిగించగలరు.

చదువులో వచ్చిన మార్పు :

చదువుకునే అవకాశాలు లేకపోయినా, పట్టుదలతో చదువుకునే మహనీయులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. వారిలో అతి నిరుపేద కుటుంబాల వారున్నారు. వారు కష్టపడి చదివి నాయకులుగా, పారిశ్యామికవేత్తలుగా, విద్యావేత్తలుగా, సంఘ సంస్కరణకర్తలయ్యారు. రేడియో కనిపెట్టిన 50 ఏళ్లకు అది ఏభైకోట్ల ప్రజలకు చేరింది. టెలివిజన్ కనిపెట్టిన 42 ఏళ్లకు అది ఏభై కోట్ల ప్రజలకు చేరింది. కానీ ఇంటర్ నెట్ ,ఈ మెయిల్ ప్రవేశపెట్టిన మూడు సంవత్సరాలకు, అది ఏభై కోట్లకు చేరింది.ఆ సంఖ్య ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతోందంటే చదువు ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్నదో మనము ఊహించుకోవచ్చు. అసలు అక్షరాలు అనేవి లేకపోతే ఈ ప్రపంచం ఏమై ఉండేదో ఊహించండి. మానవుడు చదువు నేర్చుకున్నాక ఎన్నో అద్భుతాలు చేశాడు. తనని తాను మార్చుకున్నాడు.

తెలుగులో  :

మన తెలుగులో కందుకూరి,గురజాడ,శ్రీ శ్రీ రచనలు ప్రజల్ని,సమజాన్ని కొత్తకోణంలో విశ్లేషించేలా ఆలోచించేలా చేసాయి. మనం చదివే పుస్తకమే మన జీవితాన్ని మార్చి వేస్తునంది. అందుచేత చదివేది విజయానికి సంబంధించినదో,విప్లవానికి సంబంధించినదో మన చేతిలోనే ఉంది.ఈ రోజుల్లో చదువు లేనిదే మనిషి ఏ పనీ చేయలేకపోతున్నాడు. వ్యక్తికి తన జీవిత కాలములో తనను తాను పోషించికోవడానికి,ఇతరులను పోషించడానికి చదువు చాలా అవసరము. తన చదువు ద్వారా తన లక్ష్యాలను సాధించవచ్చును....అయితే ఇన్ని ఉపయోగాలున్న చదువుని మనము ఏ విధముగా చదవాలి?

శారీరక,మానసిక సమస్యలు పెల్లుబుకుతున్నాయి. ఒకప్పుడు విద్యాలయాలు అధికంగా ఉండే ఈ దేశంలో వైద్యాలయాల నంఖ్య పెరుగుతూంది. మానవతా విలువలు మంటకలిసిపోతున్న ఈ తరుణంలో,ఎవరిని వారే రక్షించుకోవాలి. దానికొకటే మార్గం.అదే మనసుని మన అదుపులోకి తెచ్చుకోవాలి. ప్రతిక్షణం ప్రశాంతముగా ఉండే మన మనసుని అదుపులో ఉంచుకోగలగాలి. సహజముగా మనసు మనిషిని తన అదుపులో ఉంచుకుంటుంది అంటారు అనుభవజ్ఞులు. మనసు కదులుతూ,మనిషిని కదలకుండా నిర్వీర్యిర్యుణ్ణి చేస్తుంది.మనిషి ఏ కార్యం తలపెట్టినా," అది సాధ్యంకాదు" ,"నువ్వు చెయ్యలేవు" ,"అందరూ కలిసిరారు" లాంటి నెగెటివ్ సజెషెన్లు ఇచ్చే శక్తి మనసుకుంది. దాంతో మనషి చతికిలబడతాడు. 'చింతకు లోనవుతాడు. చివరకు "చితి" కి దగ్గరవుతాడు. ఇటువంటి తరుణంలో మనసుని కదలకుండా చేసుకోవాలి. 

మస్తకాన్ని కూడా మార్చే పుస్తకమే గొప్పది . :


మన మనసుని అదుపులో పెట్టుకోవాలంటే ముందస్తుగా 900 ఆలోచనల సమయాన్ని ఆదాచేసుకోవాలి. అంటే బయటకు ఎప్పుడు వెళ్లినా ఒక పుస్తకం తీసుకువెళ్లాలి. పుస్తకము లేకపోతే ఒక న్యూస్ పేపరు చదవాలి . అది అర్ధం లేని ఆలోచనలకు ఆనకట్ట వేయటంతో పాటు కొంత జ్ఞానాన్ని పెంచుతుంది. ఆ చదివే పేపరు కూడా ఖచ్చితమైన వార్తలు రాసే పేపర్లయితే మంచిది. అన్నింటికన్నా ముఖ్యం చదివేటప్పుడు ఏదైనా ఒక ఆలోచన వచ్చినపుడు అది నిజంగా నాకు అవసరమా? అనే ప్రశ్న వేసుకోవాలి . ఉదాహరణకు "ఈ రోజు నా స్నేహితులు నన్ను సినిమాకు రమ్మని పిలిచారు.ఒక వేళ వెళ్లినట్లయితే నేను నమ్ముకున్న నా చదువుకు భంగం వాటిల్లుతుంది” అని మనకు మనమే ఆలోచించుకోవాలి .పరీక్ష ఫెయిలయ్యాక తలపట్టుకు కూర్చోవడం మనం చూస్తున్నాం. అప్పుడు వారిలో జ్ఞానోదయం కలుగుతుంది. ఆ సమ్మర్లో ఎంతో బాధపడుతుంటారు. మళ్లీ సంవత్సరం మళ్లీ చదవటం మొదలుపెడతారు. కానీ అదే తంతు , ఫలితాలు చూసి కుమిలిపోతారు. అటువంటి సమాయాల్లో తాను తనకున్న ఒత్తిడిని తగ్గించుకోవాలి. వీలైనంత త్వరగా పడుకోవాలి.పడుకొనే ముందు ,భయంకరమైన సీరియల్స్ చూడకూడదు. చూసినా, ఆపైన ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లుగా చక్కని సంగీతము వింటూ నిద్రకుపక్రమించాలి. రాత్రి పడుకొనేటప్పుడు మహనీయుల చరిత్రలు చదివి పడుకోవడం ఉత్తమం. పత్రికల్లో సీరియల్స్,టీవీల్లో సీరియల్స్ మనసుకి మంచికన్నా హాని ఎక్కువ కలుగజేస్తాయి.రాత్రి కలల్లో ఆ పాత్రలు ప్రత్యక్షము కావచ్చు. ఒక వ్యక్తి చదువుకుని తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే దివ్యమైన చిట్కా ఒక్కటే. అదే మనసుని మచ్చిక చేసుకుని,మనం చెప్పే విధంగా ప్రవర్తించేలా శిక్షణ నివ్వాలి. విజయం అనేది ఒక నంబర్ లాక్ లాంటిది. దాన్ని ఓపెన్ చెయ్యాలంటే, దాని రహస్య నంబర్లను కనుగొనాలి. దానికి కొంత సమయం తప్పదు. ఓపెన్ చెసేవారెవరో ఆ లాక్ పట్టించుకోదు.దానికది అనవసరం. ఆ రహస్యం తెలిసిన తరువాత నిరంతరం అది మీ సేవలోనే ఉంటుంది. విజయం కూడా అంతే. మనము చదివేటప్పుడు కసితో చదవాలి. ఆ "కసి" రాకెట్ లోని ఫ్యూయల్ లాంటిది. ఎంత శక్తివంతమైన రాకెట్ అయినా ఫ్యూయల్ లేకపోతే అంతే. ఇదే ఫ్యూయల్ గతంలో చాలామంది వినియోగించుకున్నారు. 1)క్రికెట్లో ఒక్కరోజులో 300 రన్స్ విశేషం అనుకున్న సమయంలో 400 తీసినవారు. 2)చంద్రుడిని చేరటం అసంభవం అనుకున్న రోజుల్లో అది చేసి చూపినవారు. 3)యుద్ధం చేయకుండా స్వాతంత్ర్యం సాధించిన మహాత్మాగాంధీ. 4)వైఫల్యాలు ఎదురైనా చలించక 1300 వస్తువులు కనిపెట్టిఅ ఎడిసన్ 5)నిరుపేద కుటుంబంలో జన్మించి అమెరికా అధ్యక్షుడైన అబ్రహాం లింకన్. 6)సదుపాయాలు లేనిరోజుల్లో గణిత సిద్ధాంతాలు అందించిన పైథాగరస్. 7)"సున్నా" కూడా ఒక అంకేనన్న సత్యాన్ని తెలిపిన మన పండితులు. 8)నత్తిని అధిగమించి అద్భుత స్పీకర్ అయిన చర్చిల్. 9)నల్ల జాతీయుల్లో అనూహ్య ఉత్తేజం కలిగించిన మార్టిన్ లూథర్ కింగ్.. 10)మత్స్యకారుడి కుమారుడిగా జన్మించి దేశాధ్యుక్షుడైన అబ్దుల్ కలాం. 11)ఫేస్ బుక్ ని కనిపెట్టి మొత్తం ప్రపంచాన్ని దగ్గర చుట్టంలా చేసిన జకర్ బర్గ్. ఇలా ఎందరో మహనీయులు తమ ఆలోచనలతో ప్రపంచాన్ని కదిలించారు.అయితే ఆ ఫ్యూయల్ కనపడదు కాబట్టి ఎవరికి వారే స్వయంగా వాసన పసిగట్టి అనుభవించాలి. స్వయం కృషితో, క్రమశిక్షణతో,ఆత్మవిశ్వాసముతో చదవాలి .

స్వయం కృషి :

స్వయం కృషి ఉంటే మనిషి సాధించలేనిది అంటూ ఏమీ లేదు. కాబట్టి స్వయం కృషి అనునది మనిషి చదువుకు తప్పనిసరి.

తపన :

తపన అనే శక్తివంతమైన ఫ్యూయల్ ఉపయోగించి పట్టుదలతో చదవాలి. అటువంటి ఫ్యూయల్ మనలోనే ఉంది. కాబట్టి దానిని సద్వినియోగం చేసుకోవాలి. ఉదాహరణకు తపన అనే ఫ్యూయల్ ఉపయోగించి తాము అనుకున్న దానిని సాధించినవారు...... 1)కంప్యూటర్ రంగంలో విజయం సాధించాలనే విజయం కట్టుకున్న సత్యం కంప్యూటర్స్ శ్రీరామలింగరాజు. 2)కాలేజీ చదువునుండి లీడరు కావాలనుకుని అగ్రస్థాయి నాయకుడైన శ్రీ నారా చంద్రబాబునాయుడు. 3)చిన్నప్పటి నుండి గొప్ప గాయకుడు కావాలనుకుని అది సాధించిన శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. 4)సినిమా రంగములో బంధువులు ఎవరూ లేకపోయినా,గొప్ప హీరో కావాలనుకుని అది సాధించిన శ్రీ చిరంజీవి. 5)బ్యాంకింగ్ రంగంలో ఒక అద్భుతం సాధించాలనుకుని అది అక్షరాలా సాధించిన శ్రీ రమేష్ గెల్లి. 6)నల్లవాడైనా అమెరికాకు అధ్యక్షుడు కావాలనుకుని తపన పడి రెండు సార్లు అధ్యక్షుడైన బరాక్ హుస్సేన్ ఒబామా. గెలుపు సాధించాలంటే కేవలం కోరిక సరిపోదు. బలమైన తపన ఉండాలి. దానిని చదువులో చూపించాలి. కష్టపడి మరియు ఇష్టపడి చదివినట్లయితే విజమం నీ బానిస అవుతుంది.

తెగింపు:

తమ చదువుని నమ్ముకుని , మిగిలిన వాటిని తెగించి తాము అనుకున్న దానిని సాధించిన మహనీయులు ఎందరో ఉన్నారు. "నేనెందుకు చదవలేను ?" అనే మొండితనం కావాలి.విశ్లేషణతో కూడిన వివేకం కావాలి.

వివేకంతో కూడిన విశ్లేషణ :


ప్రతి వ్యక్తీ తన శక్తి సామర్ధ్యాలను గుర్తించాలి. తన బలహీనతల నుండి బయటపడాలి.అన్నింటినీ మించి తన నెగెటివ్ సజెషన్ల బారినుండి తనని తాను రక్షించుకోవాలి. మనలో ఉండే అనంత సాగరమే మన చదువుకు ఆధారమని గ్రహించాలి.శక్తిసామర్ధ్యాలకు నిలయమైన బ్రహ్మపదార్ధం నుండి మనం కోరుకున్న పరిమితిలో శక్తిని పొందవచ్చని తెలుసుకోవాలి. కనుక ఆత్మ విశ్వాసముతో మనము చదువుకోవాలి. 


ఆత్మ విశ్వాసము :


"వ్యక్తి తన్ను తాను ఎలా భావిస్తాడో అదే అవుతాడు. తాను బలహీనుడని ఎంచుకుంటే బలహీనుడౌతాడు.తాను బలవంతుడని భావిస్తే బలవంతుడౌతాడు".దృఢ సంకల్పమే శక్తి. కార్య సాధనా యత్నంలో సంభవించే ఆటంకాలను,పొరపాట్లను లక్ష్యపెట్టకూడదు.తిరోగమనాలని కూడా సహించాలి.లక్ష్య సాధన కోసం వేలు ప్రయత్నాలు చేయవలసి వచ్చినా వెనుకాడకూడదు. అప్పటికీ లక్ష్యసాధన ఫలించకపోతే మరొక ప్రయత్నం చేయవలసిందే. స్వామి వివేకానంద చెప్పినట్లుగా "వ్యక్తికి బలమే జీవనం; బలహీనత మరణ సదృశం". ఏ పనినైనా సాధించాలంటే అకుంఠిత దీక్ష,పట్టుదలతో పాటు దృఢ సంకల్పం కూడ అత్యావశ్యకం. 'నేనీ సముద్రాన్ని ఆపోశనపట్టిస్తాను. నేని కొండల్ని పిండి పిండి చేస్తాను అంటాడు, పట్టుదల గల వ్యక్తి. 'నిరాశకు తావివ్వకు.మార్గం సుగమం కాదు; 'నీయందు నీవు పూర్తి విశ్వాసముంచుకో '.అన్ని శక్తులు నీలోనే వున్నాయి.అది తెలుసుకొని వానిని వినియోగించు. ' ఉత్సాహపూరితుడవైవుండు. డైనమో నుండి విద్యుత్తు ప్రవాహం ప్రపంచం నలుమూలల ప్రసరించి ప్రజలను చైతన్యనవంతుల్ని చేసే ఆ శక్తి మనకు కావాలి. మనలో మనకు ఆత్మవిశ్వాసముండడము చాలా అత్యావశ్యకము. అదే మనల్ని అన్ని విధాలా రక్షిస్తుంది. మనలో మనకు ఆత్మవిశ్వాసమును సాధించి ఉంటే మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలు చాలా వరకు అంతరించివుండేవి. మానవ చరిత్ర పుటల్ని తిరగేస్తే ప్రసిద్ధులైన స్త్రీ పురుషుల జీవితాల్ని గరిష్ఠ స్థాయి పటిమతో నడిపింది వారి ఆత్మవిశ్వాసం తప్ప మరొకటి కాదని స్పష్టమౌతుంది. మన స్వయంకృషి ద్వారా మనలో ఉన్న ప్రతిభను వెలికి తీసుకొని రావాలి. ఆత్మవిశ్వాసాన్ని విడనాడకూడదు. గొప్ప విశ్వాసాలే ఘన కార్యాలకు మాతృకలౌతాయి. ఆత్మవిశ్వాసమే సాధనకు అత్యావశ్యకము. ఆత్మవిశ్వాసమే ఆధారంగా పటిష్ఠతను సమకూర్చుకొని నిలబడాలి. అంతకంటే మించి మనకేమీ అవసరము లేదు. ఒక వ్యక్తి తన్ను తాను కించపరుచుకొని ,రాత్రింబవళ్లు రాను ఒక దైన్యుణ్ణని, అసమర్ధుణ్ణని చింతిస్తూ కూర్చుంటే అతడేమీ కాలేడు;ఏమీ సాధించలేడు. మనం అందరం దేవుని బిడ్డలం. ఆ అనంతమైన దైవజ్వాలలోని కణాలం. మనం అనామకులం ఎట్లా అవుతాం? మనం సంపూర్ణ మానవులం. మనం సాధించలేనిది ఏదీ లేదు.చదువుతో సాహసాన్ని ప్రదర్శించాలి. గట్టి కృషి చేస్తే ఆవేశజ్వాల మనస్సులో ప్రవేశిస్తుంది. ...... ప్రజలు మిమ్మల్ని గురించి ఏమి మాట్లాడినా సరే నిరుత్సాహపడవద్దు. ఎవరి విశ్వాసాలకు వారు బుద్ధులు కావాలి. అప్పుడు నువ్వు నిశ్చింతగా ఉండవచ్చు. 'వారిని నమ్ముకో ...నీకు మంచి చదువు వస్తుంది.వీరిని నమ్ముకో...నువ్వు బాగా చదవగలవు ' అని చాలా మంది సలహాలు చెపుతుంటారు.కానీ నీలో నీకు విశ్వాసము ఉండటమే ముఖ్యం. ఆ విశ్వాసముతోనే ముందుకు నడవాలి. మిమ్మల్ని గురించి ఇతరులు ఏ విధముగా భావిస్తారో అనే విషయాన్ని మీరు పట్టించుకోవద్దు. వారేమనుకున్నా మీ యొక్క ప్రమాణాన్ని దిగజార్చుకోవద్దు. ప్రతి జాతి జీవితంలోను ఒక ప్రధానమైన ప్రవాహముంటుంది. అది ఆధునిక మానవునికి చదువు రూపములో ఉంది. కనుక మనము దానిని పటిష్ఠం చేయాలి. ప్రవాహం యొక్క రెండు వైపుల నీరు దానితో బాటు ప్రవహించాలి. ప్రతి జాతి తన్ను తాను రక్షించుకోవాలని గుర్తించుకోవాలి. అలాగే వ్యక్తి కూడ ఇతరులపై ఆధారపడకుండా తన్ను తాను సంరక్షించుకోవాలి. మనలోని జ్యోతిని మనమే వెలిగించుకోవాలి. "జీవితమనే రణరంగంలో చదువు అనే ఆయుధాన్ని ఆహ్వానించాలి". వ్యక్తి తన అంతరాత్మ ప్రభోధించిన విధంగా కృషి చేయాలి. మనం మన శరీరాన్ని, హృదయాన్ని మనం చేసే పని యందు లగ్నం చేయాలి. సంపన్నుడైనవాడెన్నడైనా ఒక ఘనకార్యాన్ని సాధించినట్లు చరిత్ర మనకు చెపుతుందా? కార్యం సాధించాలంటే మంచి మనస్సు,మంచి హృదయం అవసరం. అంతే గాని సంపద కాదు. మనం ఒక పనిని నిర్వర్తించేటప్పుడు బలహీనతను ప్రదర్శిస్తే ఎది మనల్ని,మన లక్ష్యాన్ని కూడ హానికి గురిచేస్తుంది.కనుక అచంచలమైన ఆత్మవిశ్వాసం,అపరిమితమైన దార్ద్యత కార్యసాధనకు అత్యావశ్యాకాలు.అకుంఠితదీక్ష,అత్యధిక వివేక సంపద,దృడ నిశ్చయం ఈ గుణాలు కల్గిన ఏ కొద్దిమంది కృషి చేసినా మొత్తం ప్రపంచంలో పరివర్తన సాధించవచ్చు. మనకు ముందుచూపు తప్ప వెనకచూపు పనికిరాదు .మనకు శక్తి ,ఉత్సాహం,ధైర్యం,సహనం అధికమైన ప్రమాణంలో కావాలి.అప్పుడే మనం గొప్ప కార్యాల్ని సాధించగలం .

నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి :


నెగెటివ్ ఆలోచనలను అనుమతిస్తే, వాటిని పదే పదే ఆలోచిస్తే, అవి శాశ్వతంగా మనసుమీద తిష్టవేస్తాయి. పాజిటివ్ ఆలోచనలను బలవంతంగా నైనా పదే పదే పైకి అనుకోవటమే దానికి విరుగుడు అని అనుభవించిన వారికి తెలుసు. మనసు అనేది ఒక కార్యాలయము అనుకుంటే, అందులో ఫైళ్లు, స్టేషనరీ వగైరాలున్నట్లే ఒక చెత్తబుట్ట కూడా ఉంటుంది. ఆ చెత్తబుట్ట నిండా నెగెటివ్ ఆలోచనలుంటాయి.దాన్ని ఎప్పటికప్పుడు ఖాళీ చెయ్యకపోతే మొత్తం ఆఫీసంతా చెత్తతో నిండిపోతుంది .ఆ చెత్తని ఖాళీ చెయ్యటానికి మంచిపద్ధతులు చాలా ఉన్నాయి.దాంట్లో "గార్బేజ్ ఇన్ - గార్బేజ్ అవుట్" అనే పద్ధతి బావుంటుంది.అంటే లోపలికొచ్చే చెత్త - బయటకు పంపే చెత్త అని అనుకోవచ్చు. "నేను ఎంత చదివినా మర్చిపోతున్నాను" అనుకునే వ్యక్తి "నేను సినిమా యాక్టర్లను మర్చిపోను, టీవీ సీరియల్స్ మర్చిపోను, స్నేహితులను మర్చిపోను. క్రికెట్ ప్లేయర్ల అందరి ముఖాలను గుర్తు పట్టగలను కాబట్టి, నాకు ,మతిమరుపు అనే జబ్బు లేదు. నేను పుస్తకాలమీద నేటినుండి శ్రద్ధ పెంచుకుంటాను." అనుకోవాలి. "నాకు ఏకాగ్రత లేదు" అనుకునే వారు " నేను ఫ్రెండ్స్ తో గంటల తరబడి ఏకాగ్రతతో మాట్లాడగలను. సిగరెట్ల పొగ కంపుతో ఉండే సినిమాహాల్లో మూడు గంటలపాటు సినిమాని ఏకాగ్రతతో చూడగలను కాబట్టి, అదిచదువుపై మళ్లిస్తాను" అని అనుకోవాలి. ఉదయం లేచిన వెంటనే న్యూస్ పేపరు చూడకూడదు . అందులోని వార్తలు ముఖ్యంగా హత్యలు,పేలుళ్లు, ఆక్సిడెంట్లు,మనసుపై ఒత్తిడిని కలిగిస్తాయి. దాని ప్రభావం రోజంతా ఉంటుంది. లేవగానే కొద్ది నిమిషాలు మంచి సంగీతం వింటూ, వ్యాయామం చేయాలి .

టెన్షన్ పడకూడదు. 

ఈ పుస్తకాలు చూస్తుంటే నాకు టెన్షన్ పెరుగుతుంది. ఇవి ఎలా చదవాలి? ఎప్పటికి చదవాలి? అసలు ఈ పరీక్ష పాసవగలనా? అనుకునే విధ్యార్ధి "గతంలో కూడా నేను ప్రతిపరీక్షకీ ఇలాగే భయపడ్డాను, భయపడినట్లుగా నేను ఫెయిల్ అవ్వలేదు. కాబట్టి టెన్షన్ అవసరము లేదు." అని సర్దిచెప్పుకుని నెగెటివ్ ఆలోచనను పక్కన పడేయాలి.


చదవలేననే అనుమానాన్ని త్యజించాలి :

నేను సాధించగలనా? లేదా? నా వలన అవుతుందో? లేదో? నేను పాసవుతానో? లేదో? ననే అనుమానంతో కొంతమంది, తాము అతిసునాయాసంగా నిర్వహించగలిగే పనులను కూడా వాయిదా వేయటమో విడిచిపెట్టటమో చేస్తారు. తమ కుటుంబంలో పెద్దగా తెలివైనవారు లేరనీ, తనవెనుక ఎవ్వరూ లేరనీ, ఒకవేళ కష్టపడి చదివినా,తనకు ఉద్యోగం రాదనీ ముందే నిర్ణయించుకుని తమ ప్రగతికి బ్రేకువేసుకుంటారు. ఇటువంటి వారు తక్షణం ఆ భ్రమల్లోనుంచి బయటపడాలి. అలా బయటపడి విజయం సాధించిన వారేందరో ఉన్నారు. ఒక కల్లు తీసే వ్యక్తి కొడుకు కలెక్టరు కాలేదా? ఇప్పటికీ చేపలుపడుతూ జీవనం సాగిస్తున్న సామాన్యుడి కొడుకు అసమాన్య విద్యావేత్త కాలేదా? ఇలాంటి వారు సమాజంలో ఎందరో ఉన్నారు. వారిని చూసి మారాలి. అనుమానాలను విడిచిపెట్టాలి.

చదవడానికి సమయం :

" పుస్తకాలు చదవాలనే ఉంది కానీ,అంత టైమ్ లేదు." అంటూంటారు కొందరు.మనసుంటే మార్గముంది అంటారు అనుభవజ్ఞులు.నిజానికి రోజుకి 15 నిమిషాల పాటు ఏదో ఒక పుస్తకము చదివితే చాలు. సాధారణంగా చదువుకున్న వారు నిమిషానికి 100 పదాలు చదవగలరు. అంటే పదిహేను నిమిషాలలో 1500 పదాలు చదవగలరు.అంటే ఒక పుస్తకంలో నాలుగైదు పేజీలు.అవి నెలకు 150 పేజీలు.సంవత్సరానికి 1800 పేజీలు.అంటే ఐదారు మంచి పుస్తకాలు చదివి ఎంతో విజ్ఞానం సంపాదించవచ్చు.రోజుకి 15 నిమిషాలు అంటే ఒకరోజు సమయంలో ఒక శాతం మాత్రమే. "చదువు "నీతో పాటు నలుగురికి ఉపయోగపడేలా చదవాలి. గమ్యమును లక్ష్యముగా చేధించడంలో చదువు ఒక ఆయుధంలా సహకరిస్తుంది. చదువు కోసం శ్రమించాలి. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. మనకున్న లక్ష్యం చాలా గొప్పదయితే, దానిని చదువు ద్వారా సాధించాలనుకుంటే ఆ గొప్ప కార్యాల్ని తేలిగ్గా సాధించలేం.సమయం,సహనం,అకుంఠితకార్యదీక్షలతో మాత్రమే సాధించగలం.


                                                                        చదువుకోవలసిన విధానము : 


విద్యార్థులకు రానున్నది పరీక్షా సమయం! కోర్సును విజయవంతంగా పూర్తిచేయాలన్నా, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశించాలన్నా, ఉద్యోగ నియామకం పొందాలన్నా రాతపరీక్షలకు సిద్ధం కావాల్సిందే! ప్రతిష్ఠాత్మకమైన సివిల్స్‌ సర్వీసుల వంటివి లక్ష్యంగా పెట్టుకునేవారు సుదీర్ఘకాలం పఠనం సాగించగలగాలి. మంచి మార్కులకైనా, మేటి ర్యాంకులకైనా శ్రద్ధగా చదవటం ముఖ్యం. విజయం సాధించడం అంటే కష్టపడటం కాదు. కొన్ని అయిష్టమైన విషయాల్ని ఇష్టాలుగా చేసుకోవడం! ఒక విద్యార్థి చదువుకోవాలి. అదే సమయానికి టీవీలో సినిమా వస్తూంది. సినిమా ఇష్టం. చదువు అయిష్టం! అయిష్టాన్ని ఇష్టం చేసుకోవటం కష్టమయినపుడు చదువు కష్టమవుతుంది. యెండమూరి వీరేంధ్రనాధ్ గారు చెప్పినట్లుగా..... పొద్దున్న ఎనిమిదింటికి లేవడంకన్నా ఆరింటికి లేచి వాకింగ్‌ చేస్తే బావుంటుంది. ఆ విషయం తెలుసుకోవడమే విజయం! అప్పుడు... చేస్తున్న పనే గొప్ప తృప్తిని కలిగిస్తుంది. అప్పుడిక 'విజయం' కష్టం అవదు. ఇష్టం అవుతుంది.

తెలివీ... మార్కులూ:

తెలివైన విద్యార్థి తగినంత ప్రయత్నం చేయక మంచి మార్కులు పొందకపోవచ్చు. అలాగే మంచి మార్కులు సాధిస్తున్న విద్యార్థి తెలివైనవాడు కాకపోవచ్చు; కేవలం కష్టపడి చదివేవాడై వుండొచ్చు. గణితం, అకౌంట్స్ చదవాలంటే తెలివితేటలుండాలి. జంతుశాస్త్రం, మెడిసిన్‌ చదవటానికి కృషి, జ్ఞాపకశక్తి అవసరం. ఈ చిన్నపాటి వాస్తవం గుర్తించక చాలామంది విద్యార్థులు తాము ఏ రంగాల్లో పైకొస్తారో గ్రహించక వేరే ఆకర్షణీయమైన కోర్సులను ఎంచుకుంటుంటారు.

వాయిదా పద్ధతి :

చివరి నిమిషం దాకా చదవటం వాయిదా వేసేవారుంటారు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నామంటూ సాకులు చెప్తుంటారు. ఇలాంటివారికి గది శుభ్రంగా లేదనే చిన్న కారణం చాలు, పుస్తకం పక్కన పడెయ్యటానికి! ఇలాంటి వాయిదా మనస్తత్వాన్ని తొలగించుకోవటానికి కొన్ని కిటుకులు:

ప్రతిభావంతుల సాహచర్యంలో ఉండాలి. మీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ చూపినవారిని గమనిస్తూ వారికి ప్రేరణ ఎలా వస్తోందో అవగాహన చేసుకోవాలి .

విజయం రుచి తెలిస్తే బద్ధకం పారిపోతుంది. ఒక ఫస్ట్‌ ర్యాంకర్‌ తన స్థాయిని ఎలా నిలబెట్టుకుంటాడంటే... ఉపాధ్యాయుల అభినందనలతో, తల్లి మౌన ప్రశంసతో, తండ్రిలో కనపడే  గర్వ  భావంతో! 
ఒక సబ్జెక్టును చదివాక, కాస్త విరామం తీసుకుని మరో సబ్జెక్టుకు మారటం వల్ల చాలా తాజాగా ఉండొచ్చు. చదవటం విసుగనిపిస్తే రాయండి. చరిత్రతో విసిగిపోతే దాన్ని మార్చి, గణితం సాధన మొదలుపెట్టాలి . 

ఆహ్లాదకర వాతావరణం:


ఆహ్లాదకరమైన వాతావరణం అలసటను తగ్గించేస్తుంది. మన జ్ఞానేంద్రియాలు సౌకర్యంగా ఉన్నపుడు మనం మరింత విశ్రాంతి అనిపిస్తుంది. అందుకే...

కళ్ళు: టేబుల్‌ లైట్‌ కింద చదవాలి . ఆకలి లేకపోయినా వంట గదిలోకి వెళ్ళటం, లేకపోతే 'కొద్ది నిమిషాలు' టీవీ చూడటం (అది అక్కడితో ఆగదు) వద్దు. మరింత విశ్రాంతి కావాలంటే... చదివే గదిలో ప్రపంచ పటం పెట్టుకుని ఆసక్తికరమైన ప్రదేశాలూ, నదులూ, దేశాలను పరిశీలిస్తుండాలి .

సువాసన: దుర్గంధం వెదజల్లే డ్రెయినేజి దగ్గర కూర్చుని మీరు చదవలేరు. మల్లెల వాసన నిద్రమత్తు ప్రభావాన్ని కలిగిస్తుంది. వాసన మనసుపై ప్రభావం చూపిస్తుంది. సాంబ్రాణి పుల్ల వెలిగిస్తే అది మెరుగైన మనఃస్థితి (మూడ్‌)ని సృష్టిస్తుంది. దేవాలయ ప్రాంగణంలోని సుగంధం దీనికో ఉదాహరణ.

ఆహారం: రాత్రుళ్ళు చదవదల్చుకున్నపుడు అరటిపళ్ళు, మిఠాయిలు, జంక్‌ ఫూడ్‌, చికెన్‌ తినకూడదు. ఇవి మెదడునుంచి ఆక్సిజన్‌ను జీర్ణవ్యవస్థకు దారి మళ్ళించి నిద్ర కలగజేస్తాయి. ప్రార్థన: చదవటం మొదలుపెట్టేముందు కొద్దినిమిషాలు కదలకుండా నిలబడాలి. దీన్ని 'మెదడును శుభ్రపరుచుకోవటం' అనొచ్చు. బయటి శబ్దాలు ఇబ్బందిపెడుతుంటే చెవుల్లో దూది/ ఇయర్‌ ప్లగ్స్ పెట్టుకోవాలి. చదివేటపుడు సంగీతం వినకపోతే మంచిది. ఒకే సంగీతవాద్యం నుంచి వచ్చే మృదువైన సంగీతం పర్వాలేదు. సాహిత్యంతో ఉన్న పాటలు అసలు వద్దు.

వాతావరణం: అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలి. గజిబిజి లేని మనసుతో చదువు కొనసాగించాలి . అమితాబ్‌, ఐశ్వర్యలను మీరు గుర్తుపెట్టుకోగలిగినపుడు ఆర్కిమెడిస్‌నూ, పైథాగరస్‌నూ కూడా జ్ఞాపకం తెచ్చుకోగలరు!

యాభై శాతం సన్నద్ధత :

మెరుగ్గా చదివే అలవాట్లను పెంచుకుంటే సగం సన్నద్ధత పూర్తయినట్టే!

స్టడీ టేబుల్‌/చాప దగ్గర కొద్ది క్షణాలు నిలబడాలి.  కళ్ళు మూసుకుని, ఏమీ ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించాలి.  ఒక కరాటే ఆటగాడు విన్యాసాలకు ముందు మానసికంగా ఎలా సన్నద్ధమవుతాడో.. అలాగన్నమాట! మెదడు అనే పలకను శుభ్రం చేయటం లాంటిదిది. మొదట్లో ఇది ఆచరణకు అనుకూలం కాదనిపిస్తుంది. ఓపికను పరీక్షిస్తుంది. దీన్ని మూడు నాలుగు వారాలు సాధన చేస్తే, చక్కని ఫలితాలు ఉంటాయి.  రాత్రివేళ  రీడింగ్‌ టేబుల్‌ దగ్గర అవసరమైన అన్ని వస్తువులూ... పుస్తకాలు, నీళ్ళు లాంటివి పెట్టుకోవాలి. లేకపోతే వీటికోసం వెతకటానికి విలువైన మీ ప్రభాత సమయం వృథా అవుతుంది. చదివేటపుడు గది తలుపులు మూసివేయాలి.  ఏకాగ్రత తగ్గినపుడు పుస్తకంకేసి చూస్తూ అలాగే ఉండిపోకుండా, పుస్తకాన్ని పక్కన పెట్టాలి .  ఏదో ఒక సాకుతో చదువుకోవటం వాయిదా వేయాలనే కోరిక సగటు విద్యార్థిలో సాధారణంగా కనిపించే ధోరణి.  అందుకే ఆసక్తికరమైన సబ్జెక్టుతో ప్రారంభించి నిస్సారంగా తోచే సబ్జెక్టును ఆ తర్వాత చదవండి. నాన్‌ డీటెయిల్డ్‌ కథతో మొదలుపెట్టి, కష్టమైన సబ్జెక్టులోకి వెళ్ళటంలాంటిది ఇది.  చదవటం విసుగనిపిస్తే ఏదైనా పుస్తకం మీద రాయాలి .  లేకపోతే గణితం సాధన చేయాలి .  రెండు ఆసక్తికరమైన సబ్జెక్టుల మధ్య ఒక అనాసక్తికరమైన సబ్జెక్టును చదవటం మంచిది.  కెమిస్ట్రీ ఫార్ములాలూ, ఫిజిక్స్‌ సూత్రాలూ గోడమీద అంటించుకోండి (ఇతర సబ్జెక్టులవారు ఆ సబ్జెక్టులకు సంబంధించినవి)వాటిని అప్రయత్నంగానే గమనిస్తుంటారు కదా? కొద్దిరోజలుకే మీకు తెలియకుండానే అవన్నీ మీకు వచ్చేసినట్టు గ్రహించి ఆశ్చర్యపోతారు. ప్రపంచ పటాన్నో, దేశ/రాష్ట్ర పటాన్నో గోడకు వేలాడదీయాలి . 
ఆ రోజుకు చదవాల్సింది పూర్తిచేసినపుడు మీకు మీరే ఓ కానుక ఇచ్చుకోండి. ఉదా: 'ఈరోజు దీన్ని చదవటం పూర్తిచేస్తే రేపు సినిమాకు వెళ్తాను'.... ఇలా. ఎలాంటి పెండింగ్‌ లేకుండా, చదివే పోర్షన్‌ని పూర్తిచేసినప్పుడు... ఆ భావంతో నిద్రపోవటం ఎంత ఉల్లాసంగా ఉంటుందో మీరే వూహించుకోవాలి. సర్వసాధారణంగా విద్యార్థులు ఎక్కువ సమయాన్ని తమకిష్టమైన సబ్జెక్టులు చదవటానికే కేటాయిస్తుంటారు. తాము కష్టంగా భావించేవాటికి కాదు. ఈ ధోరణి మార్చుకోవాలి. కష్టమైన సబ్జెక్టులకే ఎక్కువ సమయం కేటాయించాలి. కేవలం చదువుకోవటానికి ఒక నిర్దిష్ట ప్రదేశం పెట్టుకోవాలి. కొంతకాలానికి చదవటం మీ స్వభావంలో భాగమైపోతుంది. మీరెప్పుడు ఆ ప్రదేశంలో కూర్చున్నా నేరుగా చదువులోకి ప్రవేశించగలుగుతారు. 

గ్రంథాలయాల్లోనూ, ఒంటరిగానూ చదివే అలవాటు పెంచుకోవాలి . ఒక సబ్జెక్టును పూర్తిచేశాక, వెంటనే మరోటి మొదలుపెట్టకూడదు . ఐదు నిమిషాల విరామం ఇవ్వాలి . దీన్ని 'మైండ్‌ హాలీడే' అంటారు.

సబ్జెక్టులో సందేహాలు వస్తే వెంటనే తీర్చుకోవాలి. చిన్న అనుమానమే ముందుకు వెళ్తున్నకొద్దీ పెద్దసమస్యగా పరిణమించవచ్చు. ప్రతిరోజూ పుస్తకాలు చదవాలి . సెలవు రోజు కూడా చదవాలి . ఇలా చేస్తే చదవటం ఒక అభిరుచిగా మారుతుంది. అలాంటపుడు పరీక్షల ముందు గంటలకొద్దీ- విరామం లేకుండా చదివే అవసరం రాదు.

ఏకాగ్రతను పెంపొందించుకోవాలి :


ఎక్కువ మంది విద్యార్థులు చదువుపై తమ యొక్క మనసు లగ్నం చేయలేకపోవడమనేది క్రమశిక్షణ, సమయ నిర్వహణ, స్థల నిర్వహణల మీద ఆధారపడివుంటుంది. ప్రతి వస్తువునూ దానికి కేటాయించిన స్థలంలో పెడుతుంటారా? సమయాన్ని సర్దుబాటు చేసుకోలేక ఒత్తిడికి గురవుతుంటారా? అయితే దినచర్యను ముందే ప్రణాళిక వేసుకోవాలి. ఏకాగ్రతను పెంచుకోవటం కోసం మంచి చిట్కా- (స్నేహితులతో బయట తిరగటం తగ్గించి) ఎక్కువసేపు ఇంట్లో ఉండటం! మీ ఏకాగ్రత క్షీణిస్తోందని మీరు భావిస్తున్నా/బద్ధకంగా అనిపిస్తున్నా మీ జీవనశైలి, చదివే వాతావరణం, నిద్ర-ఆహారపు అలవాట్లూ ముఖ్యంగా... మీపై మీ మిత్రుల ప్రభావం... ఇవన్నీ విశ్లేషించుకోవాలి . విజేతలు విజేతల సాన్నిధ్యంలో; మూర్ఖులు మూర్ఖుల సాన్నిధ్యంలో గడపటానికి ఇష్టపడతారు! కాబట్టి విజేతలు యొక్క మార్గదర్శకాలను ఆదర్శంగా తీసుకోవాలి.

అనాసక్తి... అధిక ఆసక్తి:

విద్యార్థికి ఏకాగ్రత కుదరటం లేదంటే రెండు కారణాలుంటాయి. సబ్జెక్టుపై ఆసక్తి లేకపోవటం లేదా ఇతర విషయాలపై ఎక్కువ ఆసక్తి ఉండటం. గాలి కబుర్లు, ఫోను సంభాషణలు, టీవీ వీక్షణం మొదలైనవాటి ఆకర్షణ వలయం నుంచి బయటపడటమే ఏకాగ్రత పెంచుకోవడానికి మొదటి మెట్టు. 'కోరిక నియంత్రణ' మరో మంత్రం! మీ అభిమాన హీరో సినిమా చూద్దామని మీ స్నేహితులు అడిగారనుకోండీ... 'రాను' అని నిర్మొహమాటంగా చెప్పండి. లేదా 'తర్వాత చూద్దామ'ని వాయిదా వేయండి. చదువుతున్నపుడు టోపీ పెట్టుకోవటం గానీ, స్కార్ఫ్‌ కట్టుకోవటం గానీ చేయండి. మొదట్లో ఇది చిరాకుగా ఉండొచ్చు కానీ దీని ప్రయోజనాలు చాలా ఉన్నాయి. నెమ్మదిగా మీ చదువుతో టోపీ/స్కార్ఫ్‌ను గుర్తించటం మొదలుపెడతారు. వాటిని ధరించినపుడు చదువుతున్నట్టు మానసికంగా భావన వస్తుంది. తరచూ గది బయటికి వెళ్ళలేకపోతారు. ఇతరులు కూడా మీరు చదువుకుంటున్నారని గ్రహించి ఆటంకం కలిగించరు. ప్రిపరేషన్‌ సాగిస్తున్నపుడు ఆకలి వేస్తే జంక్‌ ఫూడ్‌ తీసుకోకుండా ఉండానికి బుగ్గన ఒక లవంగం పెట్టుకోవాలి. ఏకాగ్రత తగ్గిపోతోందనిపించినపుడు... ఆ లవంగాన్నే కొరికితే చాలు! సుదీర్ఘసమయం చదువుతున్నపుడు ఎంత ఎక్కువగా నీళ్ళు తాగితే అంత మంచిది. అలా చేయటం వల్ల అది మిమ్మల్ని తాజాగా కొనసాగేలా ఉంచుతుంది. ప్రతి గంటకూ గ్లాసు మజ్జిగ, క్యారట్‌/నారింజ రసం లేదా సోయాపొడితో నీళ్ళు తాగాలి .


నిద్ర :


సోమరితనం తగ్గించి ఏకాగ్రతను పెంచే మంచి అలవాటు- నియమిత వేళల్లోనే నిద్రపోవటం, నిద్ర లేవటం! త్వరగా పక్కమీదకు చేరటం, ఆలస్యంగా నిద్రలేవటం, పగలు ఎక్కువసేపు నిద్రపోవటం, వేళ కాని వేళల్లో కునుకు తీయటం 'హైపర్‌ సోమ్నియా' లక్షణాలు. ఇది పోగోట్టుకోడానికి నూనె వంటకాలు తగ్గించటం, ఉదయం పదినిమిషాల సేపు కొంత వ్యాయామం చేయటం, రాత్రి భోజనం తర్వాత పదినిమిషాలసేపు 'ఒంటరిగా' నడవటం చేయాలి. తెల్లవారుజామునే నిద్రలేవలేని విద్యార్థులుంటారు. వారేం చేయొచ్చంటే.. మంచానికి దూరంగా అలారం, దానికి దగ్గర్లో నీళ్ళగ్లాసూ పెట్టుకోవాలి. పొద్దున్నే మోగుతున్న అలారం ఆపటానికి లేచి వెళ్ళినపుడు మొహంపై చల్లటి నీళ్ళు చిలకరించుకోవాలి. నిద్రమత్తు వదిలిపోతుంది.

సమయం సరిపోదు.. ఎందుకని?

ఉదయాన్నే ఆ రోజును చిన్న భాగాలుగా విభజించి టైమ్‌ టేబుల్‌ని తయారుచేసుకోండి. సెలవు రోజుకు కూడా ఆ ప్లాన్‌ పకడ్బందీగా వర్తించేలా ఉండాలి. మధ్యాహ్న భోజన విరామం ఎలా, ఎవరితో గడపాలో, సాయంత్రం టీవీని ఎంతసేపు చూడాలో.. ఇలా ప్రతి విషయానికీ కచ్చితంగా ప్రణాళిక వేసుకోవాలి. సమయాన్ని సక్రమంగా వినియోగంలో విఫలమవటానికి ప్రధాన కారణాలు- చేయాల్సిన పనులను ప్రాధాన్యక్రమంలో అమర్చుకోకపోవటం.; అతి నిద్ర, పనికిమాలిన కాలక్షేపపు కబుర్లు, అర్థరాత్రి దాటిందాకా మెలకువతో ఉండటం లాంటి నిరుపయోగ పనులకు ఆకర్షితులవ్వటం.

1) విద్యార్థి 'చదవటం మొదలుపెట్టటానికి చాలా సమయం ఉంది కదా!' అని అశ్రద్ధ చూపుతాడు.

2) అర్థ సంవత్సర పరీక్షలు దగ్గరవుతున్నపుడు చదవటం అత్యవసరమే కానీ, మరీ అంత ముఖ్యం కాదని భావిస్తాడు, బద్ధకం వల్ల. 3) వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నపుడు ఇక చదవటానికి సిద్ధమవుతాడు. కానీ క్లిష్టమైన సబ్జెక్టులను అంత ముఖ్యం కాదని వాటి చదవటం వాయిదా వేస్తుంటాడు.

4) చివరికొచ్చేసరికి ప్రతిదీ ముఖ్యమూ, అత్యవసరమూ అయిపోయి ఒత్తిడిని సృష్టిస్తుంది. అశ్రద్ధ, బద్ధకం, వాయిదా, ఒత్తిడీ... ఇవన్నీ కలిసి పరిస్థితి కంగారుగా, గందరగోళంగా తయారవుతుంది. వేగం కాదు ముఖ్యం! పాఠాలను చదివే వేగం పెంచుకోవడం మీద సమయ నియంత్రణ ఆధారపడివుంటుంది. మొదట్లో సబ్జెక్టును అర్థం చేసుకోవడానికి నెమ్మదిగానే చదవాలి. కానీ పునశ్చరణ (రివిజన్‌)ను మాత్రం వేగంగా సాగించాలి... కీ-నోటింగ్‌ (ముఖ్యాంశాలను మాత్రమే తేలిక పదాలతో రాసుకోవడం) సహాయంతో! మీరెంత వేగంగా చదువును పూర్తిచేశారన్నది కాదు- మీరెలా మెదడుకెక్కించుకున్నా రన్నదే ముఖ్యం. మీ సమయాన్ని వృథా చేసేవారెవరో గుర్తించండి. అనవసరంగా మీ కాలాన్ని తినేసేవారెవరైనా మర్యాదగా 'నో' చెప్పటానికి మీకు పూర్తి హక్కుంది. మీ స్నేహితుడితో మీరు ఫోన్లో మాట్లాడేటపుడు- మీకు తెలియకుండా ఆ సంభాషణను రికార్డు చేయమని మరొకరిని అడగండి. తర్వాతిరోజే మీరు కలుసుకోబోతున్న ఆ స్నేహితుడితో- మీరెన్ని అత్యవసరమైన, ముఖ్యమైన విషయాలు చర్చించివుంటారో గమనించండి. అలాంటిది ఒక్కటి కూడా ఉండదని మీరే గ్రహిస్తారు!

జ్ఞాపకశక్తి:

జ్ఞాపకశక్తి లేకపోవటం, మర్చిపోవటం వేర్వేరు విషయాలు. అల్జీమర్స్‌ వ్యాధి ఉంటే తప్ప 'నాకు తగినంత జ్ఞాపకశక్తి లేద'ని ఎవరన్నా అది అవాస్తవమే! మన జ్ఞాపకశక్తి న్యూరాన్లలో భద్రపరిచివుంటుంది. జీవితకాలంలో 5,00,000 కాన్సెప్టులను గుర్తుంచుకోవచ్చు. అనవసరమైన న్యూరాన్లకు స్థలాన్ని అందిస్తే.. విద్యకు సంబంధించిన అధిక విలువైన న్యూరాన్లు క్రియాత్మకంగా ఉండటం తగ్గిపోతుంది. సాయంత్రం చదువుకునేముందు మరునాటి ఆసక్తికరమైన ప్రోగ్రాముల (సినిమా /పిక్నిక్‌కు వెళ్ళటం) గురించి చర్చించవద్దు. అలా చేస్తే చదువుతున్నా మనసులో అదే తిరుగుతుంటుంది. అలాగే చదువు పూర్తయ్యాక సినిమాకో, ఇష్టమైన టీవీ ప్రోగాం చూడటానికో వెళ్ళాలని ప్లాన్‌ చేసుకుంటే చదువుమీద మనసు లగ్నం చేయటం కష్టం. అనుకోకుండానే ఆ ప్రోగ్రాం కోసం ఎదురుచూడటం సహజం. పఠనం మొదలుపెట్టేముందే కబుర్లు/ టీవీ చూడటం ముగించండి. చదువు మధ్యలో లేదా రాత్రి చదివాక ఈ ముచ్చట్లు, టీవీ వీక్షణం మీ న్యూరాన్‌ బంధాలను అస్థిమితం చేస్తాయి. దీన్ని 'మెమరీ ఓవర్‌లోడ్‌' అంటారు. చదవటం పూర్తిచేసిన వెంటనే పక్క మీదకు చేరిపోవటం మంచిది. నిద్ర పోయేముందు నేరుగా గానీ, ఫోన్లో గానీ మిత్రులతో గాలి కబుర్లకు దిగొద్దు. కళ్ళు మూసుకుని పొద్దున్నుంచీ ఏం చదివిందీ మననం చేసుకోండి. నిద్ర పోయేటపుడు విద్యుదయస్కాంత మార్గాలు (ఎలక్ట్రో మాగ్నటిక్‌ పాత్‌వేస్‌) ప్రశాంతంగా, క్రియారహితంగా ఉంటాయి. జ్ఞాపకశక్తి బంధాలు దృఢంగా ఎదగటానికి ఇది సాయపడుతుంది. అర్థరాత్రి దాటేదాకా ఎప్పుడూ చదవకూడదు . మెలకువగా ఉండటానికి టీ తాగటం గానీ, మందులు వేసుకోవటం గానీ చేయకూడదు . తెల్లవారిందాకా నిద్రమాని చదవటం కంటే- తెల్లవారకముందే నిద్ర లేచి చదవటం అత్యుత్తమం!

మంచి మార్కులు రావాలంటే :


ఒక పాఠశాలలోని తరగతి గదిలో చాలామంది విద్యార్థులున్నారు. వాళ్లందరికీ ఒకే సిలబస్. పాఠాలు చెప్పే టీచర్ల బృందమూ ఒకటే. చదవడానికి వారందరికీ ఉన్న సమయమూ ఒకటే. కానీ, వార్షిక పరీక్షల్లో అందరికీ మార్కులు ఒకేలా రాలేదు. నలుగురైదుగురు రాష్ట్రంలోనే టాపర్లుగా నిలిచారు. మరికొందరు మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. కొందరేమో అత్తెసరు మార్కులతో బయటపడ్డారు. ఒకరిద్దరు పరీక్షల్లో తప్పారు కూడా.. దీనికి చాలా కారణాలను చెప్పవచ్చు. విద్యార్థి సామర్థ్యం, చదువుపట్ల అతడి వైఖరి, ఇంటివద్ద చదివే వాతావరణం, తల్లిదండ్రుల తీరు.. ఇలా ఎన్నెన్నో.. కానీ, అన్నిటికంటే ముఖ్యమైందీ, మార్కుల సాధనలో కీలకమైన పాత్ర పోషించేదీ ఒకటుంది. అదే.. నైపుణ్యం. చదివే నైపుణ్యం, పరీక్ష బాగా రాయగల నైపుణ్యం విద్యార్థి విజయానికి బాటలు వేస్తాయి. ఈ నైపుణ్యాలను నేర్చుకోవాలంటే అతడు కొన్ని లక్షణాలను అలవరచుకోవాలి. మార్కుల సాధనకు అనువైన నైపుణ్యాలనే విద్యానైపుణ్యాలు అనవచ్చు. విద్యానైపుణ్యాలను పుణికిపుచ్చుకుంటే ఆ విద్యార్థికి ఇక తిరుగు ఉండదు. రోజంతా కష్టపడి చదవడం ఒక ఎత్తు అయితే చదివినదాన్ని పరీక్షల్లో ప్రదర్శించడం ఒక ఎత్తు. దీనికి కావలసింది మంచి చేతిరాత, జ్ఞాపకశక్తి, ఆకట్టుకునేలా చక్కటి శీర్షికలతో కూడిన జవాబులు, వీటన్నిటినీ సాధించడానికి అవసరమైన సానుకూల దృక్పథం తదితర నైపుణ్యాలు. పాఠశాలలో చేరినప్పటి నుంచే విద్యార్థికి పరీక్షలు తప్పనిసరవుతాయి. పదో తరగతి నుంచి పరీక్షలకు పూర్తి స్థాయి శక్తియుక్తులను ఉపయోగించి చదవాల్సి ఉంటుంది. దాదాపు 30 నుంచి 35 ఏళ్ల వయసు వరకూ ప్రభుత్వోద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధం కావలసి ఉంటుంది. సామాన్యుల జీవితంలో అభివృద్ధి, పరువూ, ప్రతిష్ఠ పరీక్షలతో వాటి ఫలితాలతో ముడిపడి ఉంటుంది. పరీక్షల్లో విజయం మన జీవిత గమనాన్ని సఫీగా, తక్కువ ఒడిదుడుకులతో కొనసాగేలా చేస్తుంది. మంచి మార్కులూ, ర్యాకులూ తెచ్చుకుంటే మరింత సులువుగా, త్వరగా మన జీవిత లక్ష్యాలను సాధించగలుగుతామనడంలో సందేహం లేదు.విజయం సాధించడానికి కావాల్సిన ఆలోచనాత్మక పునాదిని అందించేవి. పట్టుదలతో, సహనంతో ఇందులోని సూచనలను ఆచరించి విజయసౌధం నిర్మించుకోవాలి. విశ్వాసంతో ముందడుగు వేయాలి .మన కర్తవ్యాన్ని మనము ఆర్భాటరహితంగా,ప్రశాంతంగా నిలకడతో నిర్వర్తించాలి.

ముగింపు :

"గమ్యం చేరేవరకు ఆగవద్దు. జాగృతులు కండి "అని వేదాలు చెప్పుతున్నాయి. మనలో ఉన్న విశ్వాసాన్ని ,నమ్మకాన్ని సడలనీయకూడదు.మనలో ఉన్న భయాన్ని విడనాడాలి. ఎందుకంటే భయమే మనకు పెద్ద శాపము. " నేను అన్నిటిని సాధించగలను" అనే ధీమా ప్రదర్శించాలి . విష సర్పం యొక్క విషం కూడ ఏమీ చేయలేదు. ఆ విషం నన్నేమీ చేయలేదని నీవు ధైర్యంగా ప్రకటించగల్గితే ,భయరహితంగా నీ శక్తి సామర్ధ్యాలను వినియోగించి శ్రమిస్తే నీకు తిరుగుండదు. నిన్ను ఆపగల శక్తి ఎవరికి ఉండదు. కాబట్టి భయాన్ని పారద్రోలాలి . మనలోని చైతన్య జ్యోతి ప్రజ్వరిల్లాలి. ఆ కాంతి నలుమూలలా వ్యాపించి మనలను కార్యోన్ముఖులను కావించాలి. చెప్పుడు మాటలకు చెవి యొగ్గకూడదు. వీటన్నిటితో బాటు అపరితమైన సహనాన్ని అలవరచుకుంటే విజయం మన పాదాక్రాంతమౌతుంది. సంకల్పమే శక్తి. ఏ పరిస్థితులలోను నిస్పృహ చెందకుండా చదువునే సంకల్పముగా చదవాలి. కృషి చేసే మనస్సు కావాలి కాని ధనం కాదు. వ్యక్తి చదువు ద్వారా దేనినైనా సాధించగలడు. ధనం ఏమీ చేయలేదు.మనము ఎక్కడకు వెళ్లినా మన చదువు మనకు విలువనిచ్చి ఉపకరిస్తుంది.

references:

master mind tips eenadu prathiba


.............................................................................NAME: బండి. మోజేష్ ,

                                                                             ID NO :  N110043,
                                                                             YEAR:  PUC-2                                                                                  
                                                                               IIIT,NUZVID.