వాడుకరి:Banka kiran

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
            ABVP 
    • దేశం కోసమే ఒక విద్యార్థి ఉద్యమం*
  • జులై 9 ఎబివిపి 75 వ ఆవిర్భవ దినోత్సవం*
  దేశంలో ఉన్న విద్యా రంగ సమస్యల పరిష్కారదిశగా, సమాజంలో సేవ చేయాలనే జాతీయ భావంతో దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ విద్యార్థులు జాతీయ భావన కల్పన కై విశ్వవిద్యాలయాలు కళాశాలలు కేంద్రాలుగా చేసుకుని కొందరు యువకులు వాళ్ళు చదువుతున్న ప్రాంతం నుంచే పనులు మొదలుపెట్టారు. ఈ యొక్క కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు1948 లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) స్థాపించి. 1949 జులై 9 న రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది . ప్రతి సంవత్సరం జులై 9 రోజు న దేశవ్యాప్తంగా జాతీయ విద్యార్థుల దినోత్సవం గా నిర్వహిస్తారు . విద్యార్థుల ద్వారా దేశం సమాజం కోసం విద్యార్థి పరిషత్ కు ఈ ఏడాది 75 వ వసంతం లో అడుగు పెడుతోంది.... విద్యార్థి పరిషత్ స్థాపించినప్పటి నుండి నేటి వరకు కూడ "విద్యా రంగం" అంటే ఒక కుటుంబం అనే భావనతో పనిచేస్తూ విద్యార్థుల మధ్య ఉంటూ కలశాలలు కేంద్రాలు గా చేసుకొని కళాశాలో ఉండే మౌలిక వసతులు ,ఫీజు సమస్యల దగ్గర నుండి మొదలు కొని ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల వరకు.. బస్టాండ్ లో ఉండే బస్ పాస్ కౌంటర్ దగ్గర నుండి గ్రామాలకు వెళ్లే బస్సుల సమస్యల పై సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించడంతో పాటు. జాతీయత మా ఊపిరి - దేశభక్తి మా ప్రాణం అంటూ దేశంలో ఎక్కడ విచ్చిన్నం చేసేసంఘటన జరిగినా అనుక్షణం స్పందిస్తూ దేశ రక్షణలో ఒక వాచ్ డాగ్ లాగా ఏబీవీపీ నిమగ్నమై ఉంది.
         కొంత మందితో ప్రారంభమైన ఏబీవీపీ యాత్ర ఎక్కడ ఆగలేదు.  ప్రేమ అధికం మైoది విద్యారంగ సమస్యల తో పాటు జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఏబీవీపీ పని చేస్తా ఉంది జాతీయ పునర్నిర్మాణం కావాలంటే వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందనే ఏబీవీపీ నమ్మకం. జాతీయ పునర్నిర్మాణం అంటే చిట్టచివరి వ్యక్తికి కూడా,గూడు, గుడ్డ, విద్య, వైద్యం వంటి ప్రాథమిక వసతులు చివరి వ్యక్తికి అందించాలి ఆపై అభివృద్ధి లో సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళే శక్తితో పాటు వ్యక్తిగత జీవన ప్రమాణాలు, సంస్కృతిని కాపాడుకుంటూ వసుదైక కుటుంబం అనే భావనతో పనిచేయడం ఏబీవీపీ ముఖ్య ఉద్దేశం.
  • దేశం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఏబీవీపీ కార్యకర్తలు బలిదానం*
      కళాశాల క్యాంపస్ లో పని చేస్తున్న సందర్భంలో ఇంకా మనకు స్వాతంత్రం రాలేదు ఇది బూటకపు స్వాతంత్రం భారత్ మాతా కి జై వందేమాతరం అంటే చంపేస్తా అంటూ బెదిరించిన విదేశీ సిద్ధాంతంతో ఉన్న కమ్యూనిస్టు అనుబంధ విద్యార్థి సంఘం రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ ఎస్ యు) పేరుమీద కళాశాల విద్యార్థులను రెచ్చగొట్టి దేశ విద్రోహ కార్యకలాపాలను చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూఉన్న తరుణంలో. తెలంగాణ ప్రాంతంలో 1982 సంవత్సరంలో లో వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయాన్ని కారల్ మార్క్స్ యూనివర్సిటీగా అనేవారు. కాకతీయ యూనివర్సిటీ స్వాతంత్ర గణతంత్ర వేడుకల్లో ఆనాటి ఉపకులపతి జాతీయ జెండాను ఎగురవేస్తున్న తరుణంలో నక్సలైట్లు వచ్చి జాతీయ జెండాను అవమానించి నల్ల జెండా ఎగరవేయగా జాతీయ జెండా కు జరిగినటువంటి అవమానాన్ని తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ఏబీవీపీ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షుడు సామ జగన్ మోహన్ రెడ్డి ఎదిరించి జాతీయ జెండాను ఎగురవేసిన అందుకు అతి కిరాతకంగా నరికి చంపారు. ఇదే మాదిరిగా ఉస్మానియా యూనివర్సిటీలో మేరెటీ చంద్రారెడ్డి, హన్మకొండ జిల్లా పరకాల లో దగ్గు వెంకన్న, సూరనేని భీమన్న, జనగామలో, చెంచారపు రవన్న, కరీంనగర్ జిల్లాలో రామ్అన్న, గోపన్నలు, జమ్మికుంటలో ఎలక సమ్మిరెడ్డి, నల్గొండలో ఏచూరి శ్రీనుఅన్న, ఇలా 30 మంది పైగా ఏబీవీపీ కార్యకర్తలను కమ్యూనిస్టులు పొట్టన పెట్టుకున్నారు ప్రాణాలు పోతాయని తెలిసికూడా ఏబీవీపీ కార్యకర్తలు ఎరుపు అంటే ఎవ్వడికి రా భయం అది నా కన్నతల్లి నుదుట ఎర్రటి సింధూరం అంటూ నినాదాలు ఇస్తూ నమ్మిన సిద్ధాంతం కోసం నరనరాన నింపుకొని నేటి తరానికి ఎంతో స్ఫూర్తినిచ్చారు. వారు ఇచ్చిన స్ఫూర్తి  వారు చేసిన త్యాగ ఫలితం కారణంగా నేటి విద్యార్థి లోకం, కార్యకర్తల అందరం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి త్యాగాలను వృధా కాకుండా వారి  యొక్క ఆశయాలను నేటి యువతరం పుణికి పుచ్చుకొని కార్యసిద్ధుల వుతున్నారు. సైద్ధాంతిక సంఘర్షణ తర్వాత ఏబీవీపీ వైపు విద్యార్థి సమాజం మొత్తం జాతీయ భావ సిద్ధాంతంతో పాలుపంచుకొని ప్రస్తుతం విద్యార్థి పరిషత్ దేశంలోనే లక్షల సభ్యత్వం కలిగి  ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ గా  ఉంటూ అనేక కార్యక్రమాలు చేసి  సాధించిన విజయాలు అనేకం.
       ఇందులో ముఖ్యమైనవి భారతదేశ రాజ్యాంగ నిర్మాణ సమయంలో "వందేమాతర" గేయం పొందుపరచడం లో విద్యార్థి పరిషత్ చేసిన బావ జాగరణ నిర్మాణాత్మక ఆందోళన చెప్పుకోదగినవి.

భారత రాజ్యాంగంలో ఇండియా పేరుని ఇండియా దట్ ఇస్ భారత్ నిలిపేందుకు రాజ్యాంగ సభ లోని పెద్దలను మేధావులను విజ్ఞానవేత్తలు చైతన్యవంతుల్ని చేసింది ఏబీవీపీ. మనోభావాలను నొప్పించకుండా ఒప్పించిన ఘనత విద్యార్థి పరిషత్తు కు ఉన్నది.

ఎమర్జెన్సీ 1975 ఉద్యమ సమయంలో జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలో ఏబీవీపీ క్రియాశీల పాత్ర పోషించింది నాన్ కాంగ్రెస్ ఉద్యమాన్ని నిర్మించి దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులను యువకులను ఎమర్జెన్సీ ఉద్యమంలో పాల్గొనే విధంగా చేసింది నవంబర్ 15 నుండి 26 వరకు జరిగిన సత్యాగ్రహోద్యమంలో వందలాది మంది ఏబీవీపీ కార్యకర్తలు జైలుకు వెళ్లారు.

అస్సాం లో అక్రమంగా బంగ్లాదేశీ చొరబాటుదారులను దేశం నుండి పంపించి వేయాలని డిమాండ్ తో ఆగస్టు 15 నుండి అక్టోబర్ 2 వరకు అస్సాం పరిరక్షణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించింది.

అదేవిధంగా దేశవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల మీద, వాటి స్థితిగతుల మీద, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు - వాటి సమస్యల పరిష్కార మార్గాలను క్లుప్తంగా అధ్యయనం చేసి బ్లాక్ పేపర్ లో విడుదల చేసి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసింది సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల రాష్ట్ర సదస్సు లో సుప్రీం కోర్ట్ జస్టిస్ శ్రీ పున్నయ్య గారు ఆ యొక్క డిమాండ్లను చూసి వసతిగృహాల పై ఏబీవీపీ యొక్క దృష్టి కోణంని ప్రశంసించారు. దీని ద్వారా విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు , నూతన భవనాలు, భోజనం లో మెనూ మార్చిన ఘనత ఏబీవీపీ సొంతం. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ క్యాంపస్ ఆచారాలను కాపాడుతూ విద్యా రంగంలో నూతన మార్పులు తీసుకురావాలని ప్రభుత్వాలకు అనేక ప్రతిపాదనలు ఇచ్చిన ఏకైక విద్యార్థి సంస్థ గా ఉంటూ సామాజిక సమరసతా మా నినాదం కాదు.. మా నిబద్ధత అని అనేందుకు నిలువెత్తు నిదర్శనం ఏబీవీపీ.

  • తెలంగాణ ఉద్యమంలో ఏబీవీపీ పాత్ర*
     1969 లో తెలంగాణ ఉద్యమంలో లో ఏబీపీ క్రియాశీల పాత్ర పోషించిoది 1997లో నెల్లూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం రెండు రాష్ట్రాలుగా విభజించాలని తీర్మానించింది ఏ ఒక్క రాజకీయ పార్టీ చెయ్యని సాహసం అఖిల భారత విద్యార్థి పరిషత్ యొక్క తీర్మానాలు చేసింది అటు విద్యారంగ సమస్యలపై కార్యక్రమాలు చేస్తూనే ఇటు తెలంగాణ ఉద్యమంపై అనేక రకమైన వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది నా రక్తం - నా తెలంగాణ పేరుమీద ఒకే రోజు వేలాది మంది విద్యార్థులు రక్తదాన కార్యక్రమం నిర్వహించింది ఈ యొక్క కార్యక్రమం "గిన్నిస్ బుక్"రికార్డులు సాధించింది తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని విద్యార్థులు ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు అని ఆనాడు తెలంగాణ "విద్యార్థి రణభేరి" బారి బహిరంగ సభను నిర్వహించి లక్షలది మంది విద్యార్థులకు ఉద్యమ స్ఫూర్తినిచ్చింది ఏబీవీపీ.

తెలంగాణ సమాజాన్ని చైతన్య పరచడానికి "తెలంగాణ మహా పాదయాత్ర" పేరుతో తెలంగాణ నలుమూలల నుంచి గ్రామగ్రామాన విద్యార్థులతో 1200 కిలోమీటర్ల పాదయాత్రలను నిర్వహించిన ప్రజలను చైతన్య పరిచిన ఘనత విద్యార్థి పరిషత్ కి ఉన్నది. ఈ విధంగా అనేక రకమైన కార్యక్రమాలు అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించింది.

స్టూడెంట్ అంటేనే న్యూసెన్స్ అనుకునే రోజుల్లో లో విద్యార్థులకు ఏబీవీపీ తోడై స్టూడెంట్స్ పవర్ న్యూసెన్స్ పవర్ కాదు "స్టూడెంట్ పవర్ ఇస్ ఏ నేషన్ పవర్" గా తీర్చిదిద్దుటకు కృషి చేసింది. నేటి విద్యార్థి రేపటి పౌరులు అనేది గతం నేటి విద్యార్థి నేటి పౌరులు అనేది ప్రస్తుతం నేటి విద్యార్థులు సమకాలీన పరిస్థితులపై సమాజంలో అనేక విషయాలపై స్పందిస్తూ పరిష్కారలను చూపే విధంగా తీర్చిదిద్దడమే అఖిల భారత విద్యార్థి పరిషత్ యొక్క లక్ష్యం. విద్యార్థి పరిషత్ లో కుల, మత,వర్ణ, లింగ, ప్రాంత, బేధం లేకుండా మనమంతా ఒక తల్లి బిడ్డలం భరతమాత బిడ్డలు అనే భావనతో కలిగి ఉన్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. కులాల కుళ్ళును అడుగేద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం అంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విశ్వవిద్యాలయాల్లో ఏబీవీపీ పనిచేస్తుంది. ప్రస్తుత విశ్వవిద్యాలయాల్లో కులాల పేరుతో మతాల పేరుతో కుంపటి పెడుతూ విద్యార్థుల మధ్య చిచ్చు రేపుతున్న కొన్ని విద్యార్థి సంఘాలు విద్యా వాతావరణం కోలిపోయే విధంగా నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఏబీవీపీ సేవ్ ఎడ్యుకేషన్ - సేవ్ క్యాంపస్ పేరుతో విద్యార్థులకు అండగా ఉంది.

  • ఏబీవీపీ లో వివిధ ఆయా మాల పని*

వివిధ రకాల విద్యార్థులకు కార్యా విస్తరణకు గాను వివిధ ఆయామల పని ఏబీవీపీ ఏర్పాటు చేసింది బహు పరిమాణ దృష్టితో తో ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు టెక్నికల్ సెల్ ఏర్పాటు చేసి సృజన, నైపుణ్య, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తుంది. మెడికల్ విద్యార్థుల కోసం మేడి విజన్, అగ్రికల్చర్ విద్యార్థుల కోసం అగ్రి విజన్, ఫార్మా విద్యార్థుల కోసం ఫార్మా విజన్, ఆయుర్వేద వైద్య విద్యార్థుల కోసం జిజ్ఞాస, ట్రైబల్ విద్యార్థులకోసం వన్ వాసి, వివిధ రకాల కళలు నైపుణ్యాలు ఉన్న విద్యార్థుల కోసం రాష్ట్రీయ కళా మంచ్, స్పోర్ట్స్ విద్యార్థుల కోసం ఖేల్, సేవ చేసే విద్యార్థుల కోసం SFS స్టూడెంట్ ఫర్ సేవ, సోషల్ యాక్టివిటీ కోసం SFD స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్, IIIT ,NIT, విద్యార్థుల కోసం థింక్ ఇండియా, విదేశీ విద్యార్థుల కోసం వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్, ఇలా అనేక రకమైన వివిధ ఆయమాలను ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎం తో కృషి చేస్తుంది. విద్యార్థులకు మనమందరం సమానమనే భావన కల్పించి విద్యా రంగంలో అనేక సంస్కరణలకు కృషి చేస్తు ప్రపంచంలోనే ఒక శక్తిగా నిలిచింది జాతీయ పునర్నిర్మాణం యజ్ఞంలో అనేకమంది ఈ పని చేసిన కారణంగా ప్రపంచంలో,దేశంలో, రాజకీయ రంగాల్లో కీలకమైన వ్యక్తులందరూ విద్యార్థి పరిషత్ లో పనిచేసిన వారే దీనికి కారణం విద్యార్థి పరిషత్ నేర్పిన వ్యక్తి నిర్మాణం క్రమశిక్షణ యె ప్రధాన కారణం. విద్యారంగంలో అనేక సంస్కరణలసాదించడం, దేశశ్రేయస్సు పట్ల నిరంతరం స్పందించే పౌరులుగా విద్యార్థులను ఎప్ప టికప్పుడు తయారుచేసింది. సూర్యచంద్రులున్నంతవరకు సుందర కాశ్మీరం మనదే, 370 ఆర్టికల్ను రద్దు చేయాలి, జా తీయ విద్యావిధానం కావాలి లాంటి డిమాండ్లను ప్రజలముందుంచడంకోసం ఎబివిపి కార్యకర్తలు గోడలమీద రాసిన నినా దాలు ఇటీవల మన కండ్లముందు సాకారమవుతున్నాయి. విద్యారంగలో అవినీతిని, అక్రమాలలను వెలికితీయడంలో ఎ బివిపి అగ్రభాగాన నిలిచింది. నాలుగు సార్లు EAMCET

పేపర్ లీకేజీ కుంభకోణాలను వెలికితీయడం, ఎమ్ఐఎ/ ఎమ్సిఎ అడ్మిషన్ల కుంభకోణాన్ని, Inter papers leakage, వివిద విశ్వవిద్యాలయాలలో పరీక్ష పేపర్ల లీకేజిలను వెలికితీసి, ప్రతిభకు పట్టం కట్టాడం

కోసం ఎబివిపి పోరాడింది. కార్పోరేట్ కాలేజీల అక్రమలు పట్ల, విద్యావ్యాపారం పట్ల, విద్యార్థుల ఆత్మహత్యలకు వ్యతిరేఖ ౦గా ఎప్పటికప్పుడు ఉద్యమాలను నిర్మిస్తూనే ఉన్నది. విద్యారంగంలో వస్తున్న, రావాలసిన మార్పుల పట్ల, సదస్సులు, సెమినార్లు, వర్క్షాప్ లు నిర్వహిస్తూ విద్యారంగ పాలసీల తయారిలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచే విదంగా కార్య కమాలను రూపొందిస్తున్నది. పైన పేర్కొన్న కార్యక్రమాలు, ఉద్యమాలు మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలతోనే అతి సాధారణ విద్యార్థులను అసాధారణంగా ఆలోచింపగలిగే విదంగా ప్రేరణనిచ్చి అనేక మంది బాధ్య తాయుత పౌరులను ఎబివిపి అందించగలిగింది. ఈ 74 సంవత్సరాలలో సమాజంలోని బిన్న వ్యవస్థలలో ఎబివిపి కార ్యకర్తలు సమాజంలో మంచి మార్పుల కోసం, పాజిటివ్ దృక్పదంతో కృషిచేస్తున్నారు. విద్యార్థి పరిషత్ పని నిరంతరం వ మంచి పౌరులను తయారుచేసే మ్యాన్ మేకింగ్ మిషన్.

(జులై 9 జాతీయ విద్యార్థి దినం సందర్భంగా)