వాడుకరి:Baswameenakshi/ప్రయోగశాల/NTR

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జూనియర్ ఎన్.టి.ఆర్.

[మార్చు]

జూనియర్ ఎన్.టి.ఆర్., భారతదేశంలోని హైదరాబాద్లో 20 మే 1983లో జన్మించారు. అతను నటులు, నృత్యకారులు మరియు టీవీ వ్యాఖ్యాత. అతను తెలుగు సినిమాలలో అతని నటనకు బాగా గుర్తింపు పొందారు. అతను ప్రముఖ నటులు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి సీనియర్ ఎన్.టి.ఆర్. గారి మనవడు.

జూనియర్ ఎన్.టి.ఆర్.కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను తన సినిమా కెరీర్‌తో పాటు రియాలిటీ టీవీ షో "బిగ్ బాస్" యొక్క తెలుగు వెర్షన్ మరియు "ఎవరు మీలో కోటీశ్వరులు" షోకి టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Jr-NTRspotted-promoting-RRR-on-sets-of-The-Kapil-Sharma-Show_(cropped)

చలనచిత్ర జీవితం :

[మార్చు]

జూనియర్ ఎన్.టి.ఆర్. "బ్రహ్మర్షి విశ్వామిత్ర" (1991) సినిమాలో బాలనటుడిగా తన నటనను ప్రారంభించారు మరియు తరువాత "నిన్ను చూడాలని" (2001) చిత్రంతో ప్రధాన నటులుగా పరిచయం అయ్యారు అతను "స్టూడెంట్ నంబర్ 1", "సింహాద్రి", "యమదొంగ", "రాఖీ (2006 సినిమా)", "టెంపర్", మరియు "ఆర్.ఆర్.ఆర్." వంటి సినిమాలలో తన నటనకు విస్తృతమైన గుర్తింపు పొందారు.

బహుమతులు:

[మార్చు]

తన కెరీర్‌లో, జూనియర్ ఎన్.టి.ఆర్. తన నటనకు అనేక బహుమతులు అందుకున్నారు, వీటిలో నంది పురస్కారాలు, దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉన్నాయి. తన నటన మరియు తన వృత్తిపై ఉన్న అంకితభావం ఆయనకు బలమైన అభిమాన వర్గాన్ని మరియు ప్రశంసలను అందించాయి.