Jump to content

వాడుకరి:Bgangadhar.dsmm/చెక్క సాయిలు న్యాయవాది

వికీపీడియా నుండి

చెక్క సాయిలు న్యాయవాది చెక్క సాయిలు న్యాయవాది (Ch.Sailu ) సమాజంలోని కుల, జాతివివక్షలను రూపుమాప డానికి యువత నిరంతరం సామాజిక బాధ్యతతో క?షి చేయాలని చెప్పారు. ప్రజల సమస్య ఏదైనా చట్టప్రకారం రాజ్యాంగ పరిధిలో పని చేయాలంటే అందరికీ రాజ్యాంగం, చట్టాలపై అవగాహన ఉండా లని అంటారు. రాజ్యాంగాన్ని అందరూ తప్పకుండా చదివి తీరాలని సిహెచ్‌ సాయిలు చెబుతారు. మ?దుస్వభావం స్నేహశీలతకు ఆయన మరో పేరు.

వ్యక్తిత్త్వం

[మార్చు]

సమాజంలోని కుల, జాతివివక్షలను రూపుమాప డానికి యువత నిరంతరం సామాజిక బాధ్యతతో క?షి చేయాలని చెప్పారు. ప్రజల సమస్య ఏదైనా చట్టప్రకారం రాజ్యాంగ పరిధిలో పని చేయాలంటే అందరికీ రాజ్యాంగం, చట్టాలపై అవగాహన ఉండా లని అంటారు. రాజ్యాంగాన్ని అందరూ తప్పకుండా చదివి తీరాలని సిహెచ్‌ సాయిలు చెబుతారు. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ను కోర్టు సిబ్బంది న్యాయ వాదులు ''గరిబోంక వకీల్‌'' అని పిలిచిన విధంగానే మన సాయిలు న్యాయవాదిని కూడా ''గరిబోంక వకీల్‌'' అని ముద్దుగా పిలుస్తారు. ఆయనకు ఉండే పట్టుదల, క్రమశిక్షణ వ?త్తిపట్ల అంకితభావంతో పని చేయటం ద్వారా మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులందరూ 'గరిబోంక వకీల్‌', 'గరిభ్‌కా వకీల్‌' అని పిలువడం గర్వంగా ఉందని అన్నారు. మ?దుస్వభావం స్నేహశీలతకు ఆయన మరో పేరు. అంటరానితనం, అత్యాచారాలు, దాడులు, హత్యలు, సాంఘిక బహిష్కరణల జరుగుతున్న పోరాటంలో మనం కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నారు సాయిలు వకీల్

కుటుంబ నేపథ్యం

[మార్చు]

నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండల కేంద్ర గ్రామంలో దళితుల ఉమ్మడి కుటుంబం. ఈ ఉమ్మడి కుటుంబం నుండి మొట్టమొదటిసారిగా సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు డాక్టర్‌ ముత్తెన్నను 1970 దశకంలోనే అందించింది. మరోఒక్క రైతు గంగారాం కొడుకు సమాజాన్ని సంస్కరించే బాధ్యత కలిగిన నాయకుడు చిన్నముత్తెన్నను సైతం అందించింది ఈ కుటుంబం. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండటం, మండల కేంద్రం కావడంతో సామాజికఉద్యమాలకు కేంద్రంగా ఉండేది. మండలంలో ఎవరికి ఏ సమస్య ఉన్న నేనున్నాను అంటూ ముందుకు వచ్చే సామాజికోద్యమ కారుడు చిన్నముత్తెన్న. అందరికీ ఆత్మ బంధువుగా, సమన్యాయం చేస్తాడని గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే తన సామాజిక న్యాయానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండేవాడు. బాబాసాహెబ్‌ డాక్టర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో అంబేడ్కర్‌ యువజన సంఘాలు ఏర్పాటు చేయడం, కులవివక్ష, రెండుగ్లాసుల విధానాన్ని ధ్వంసంచేయడం, దేవాలయాల ప్రవేశాలు చేయించడంతోపాటు పేదలను ఐక్యం చేశాడు. మాన్యశ్రీ కాన్షీరాం రాజ్యాధికార లక్ష్యంతో బహుజన రాజకీయాలలో క్రియాశీలంగా పని చేసేవారని చెబుతారు. చెక్క చిన్నముత్తెన్న, నర్సుబాయిల దంపతులకు ముగ్గురు సంతానంలో (సాయిలు, స్వప్న, సాయికుమార్‌) మొదటి సంతానంగా చెక్క సాయిలు 1975లో జన్మించారు. గ్రామీణ ప్రాంతంలో, దళిత కుటుంబంలో పుట్టి పెరిగిన పిల్లల మాదిరిగా కాకుండా తన ఆలోచనలతో సమాజాన్ని మార్చాలనే భావనతో ఉండేవాడు.

విద్యా-ఉద్యోగయత్నం

[మార్చు]

ప్రాధమిక విద్యాభ్యాసం మండల కేంద్రమైన మాక్లూర్‌ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించి, నిజామాబాద్‌లోని ప్రభుత్వ గిరిరాజ్‌ కాలేజ్‌ నుండి గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందాడు. చిన్నతాతయ్య డాక్టర్‌ ముత్తెన్న తన తండ్రి చిన్న ముత్తెన్న స్ఫూర్తితో గ్రూప్‌-1 అధికారిగా పేదప్రజలకు ఎక్కువగా సేవచేసే అవకాశం ఉంటుందని చిన్నతనంలోనే లక్ష్యం ఏర్పాటు చేసుకుని తన చదువును కొనసాగించాడు సాయిలు. కుటుంబంలో అందరు చదువుకున్న వారే అయినప్పటికీ చదువులో తనకు తానే పోటిగా చదివారు. ఆ లక్ష్యసాధనలో భాగంగా గ్రూప్‌-1 అధికారి ఉద్యోగం కోసం రెండు, మూడుసార్లు ఇంటర్వ్యు దశ వరకు వెళ్లారు. కాని ఉద్యోగం రాలేదు. అయిన చదువుపై మరింత దృష్టి కేంద్రీకరించి లక్ష్యం కోసం చదువుల పోరాటంలో ముందుకు సాగారే తప్ప వెనకడుగు వేయలేదు. సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఉద్యోగం కోసం కూడా రెండుసార్లు ప్రయత్నం చేసిన అనివార్య కారణాల వల్ల ఆ ఉద్యోగం కూడా సాధించలేపోయారు. అయినా తను చదువు కోవడం ఆపలేదు.

తన తండ్రి చిన్నముత్తెన్న పేదల పక్షాన నిలబడి పోరాడటం తనను తీవ్రంగా ఆలోచింపచేసిందని దళితశక్తితో తన యవ్వనదశలో జరిగిన సంఘర్ఘణను పంచుకున్నారు. సమాజంలో జరిగే రకరకాల హక్కుల ఉల్లంఘనలు, బడుగు, బలహీన వర్గాలపై దాడులు, పోలీసు ఎన్‌కౌంటర్లను చూసి చలించిపోయి రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం చట్టాల ద్వారానే సాధించవచ్చని న్యాయవాది కావాలని నిర్ణయించుకున్నారు. అందుకు తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వరంగల్‌ జిల్లా కేంద్రమైన హన్మకొండలో అఖిల భారత లా కాలేజీలో ఎల్‌ఎల్‌బి చేరి పూర్తి చేసి, నిజామాబాద్‌ జిల్లా కోర్టులో 2004లో న్యాయవాదిగా పని చేయడం ప్రారంభించారు. న్యాయవాదిగా ప్రాక్టిస్‌ చేస్తునే ఉద్యోగవేటలో ఆలుపు ఎరగని బాటసారిలా ముందుకు సాగాడు. చదువుకుంటునే స్వంత పొలంను సాగు చేసుకోవడం ఆయన ప్రత్యేకత. నేటికీ వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తూనే వ్యవసాయం చేయడం ఆయనకే సాధ్యం.

వివాహాబంధంతో ఒక్కటైన జంట

[మార్చు]

గుత్ప గ్రామానికి చెందిన అనంత్‌రావు, లక్ష్మి (కరుణ)ల పెద్ద కూతురు విద్యావంతురాలైన స్వప్న (రుచిత)తో సాయిలు వివాహాం 30 మార్చి 2002లో జరిగింది. వీరి అన్యోన్య దంపత్యానికి తీపి గుర్తు రిషీదీప్‌ జన్మించాడు. మామ గారైన చిన్నముత్తెన్న అందించిన ప్రోత్సాహాంతో స్వప్న మాక్లూర్‌మండల కేంద్రగ్రామ రేషన్‌ డీలర్‌గా పని చేయడం ప్రారంభించింది. గత 10 సంవత్సరాలుగా రేషన్‌షాపుకు వచ్చే ప్రతి ఒక్కరిని పేరుపేరున పలకరించడం ద్వారా స్వప్న అందరి తలలో నాలుకగా మారింది. లాక్‌డౌన్‌లో తన సొంతడబ్బులతో అనేక మందికి బియ్యం పంపిణి చేశారామే. రేషన్‌షాపుకు వచ్చే వారికి తనవంతు సహాయ సహాకారాలు అందించడానికి ఆమె భర్త సాయిలు అందించే ప్రోత్సాహాంతోనే ఈ పని చేయగలుగుతున్నానని గర్వంగా చెప్పారు స్వప్న.

లాయర్‌గా...

[మార్చు]

లాయర్‌గా తన ప్రస్థానం సీనియర్‌ న్యాయవాది మదన్‌మోహన్‌ రెడ్డి వద్ద మొదలు పెట్టి మూడు సంవత్సరాల అనంతరం తానే స్వంతంగానే వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీనియర్‌ న్యాయవాదులు జి.శంకర్‌, ఎన్‌ఎల్‌ శాస్త్రి, బి.నారాయణ, బి.గంగాధర్‌, తదితరుల కేసులను తానే చూడడం, వృత్తి పట్ల ఆయన నిజాయితీ, నిబద్ధతకు నిదర్శనం.

అత్యాచారంతో మొదలు - పెండ్లితో ముగింపు

[మార్చు]

నవీపేట్‌ మండల కేంద్రానికి చెందిన స్టేషన్‌ ఏరియాలో ఒక పేద దళిత కుటుంబంలో తల్లి, కూతురు ఇద్దరు మాత్రమే నివసిస్తూ ఉండేది. తల్లి కూలీ పనులకు చేసుకుంటే, కూతురు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉండేది. స్టేషన్‌ ఏరియాలో ఉండే ఒక ముస్లిం కుర్రాడు వాళ్ల బలహీనతలను ఆసరా చేసుకుని అమ్మాయికి మాయమాటలు చెప్పిలైంగికంగా లొంగదీసుకుని అమ్మాయిని గర్భవతిని చేశాడు. ఈ ఘటన నవీపేట్‌ మండలంలో సంచలనం రేపింది. నవీపేట్‌లో ఉండే దళితనాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న గరిబోంక వకీల్‌ బాధితులతో నిందితుడిపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టించి, జైలుకు పంపించడం జరిగింది. అంతటితో ఆగకుండా అమ్మాయి డైలివరీ కావడంతో పసిపాపకే మరో పసిపాప పుట్టింది. బాధితురాలైన అమ్మాయిని, తల్లిని సురక్షితంగా ఉండేవిధంగా చూడటం జరిగింది. చుట్టూప్రక్కల వారు రకరకాల ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసిన బాధితుల తరుపున నిలబడి జిల్లా పోలీస్‌ అధికారులు, కలెక్టర్‌ సహాకారంతో బాధితురాలికి రక్షణకు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రభుత్వ సహాయం ఇప్పించడం జరిగింది. బాధితురాలి తరఫున కోర్టులో సాక్ష్యం చెప్పించి నిందితుడికి జైలు శిక్ష ఖరారు కావడంతో బాధితురాలిని పెండ్లి చేసుకుని కాపురం చేయడానికి ఒప్పందం చేసుకోవడంతో ఈ కేసు ముగిసింది. కొంత కాలం తరువాత బాధితురాలికి విడాకులు ఇవ్వడంతో అనాథగా మారింది. అత్యాచారం, అత్యాచారయత్నం కేసుల్లో పెండ్లి డ్రామాల ద్వారా నిందితులు శిక్ష నుండి తప్పించు కుంటారని అనడానికి ఈ ఘటనే నిదర్శనం.

గ్రామాభివృద్ధి కమిటిపై తిరుగుబాటు చేసిన దళితులు

[మార్చు]

ఏర్గట్ల (పాత మోర్తాడ్‌) మండలం తొర్తి గ్రామంలో దళితుడైన రవిచంద్ర గ్రామాభివృద్ధి కమిటి అధ్యక్షుడిగా జీర్ణించు కోలేని అగ్రకులాలు చిన్నవివాదాన్ని వారికి అనుకూలంగా మార్చుకున్నారు. అగ్రకులాలతో నిండి ఉండే గ్రామాభివృద్ధి కమిటి బలహీన వర్గాలైన మంగలి, చాకలి, గౌండ్ల, దళితులపై జరిమానాలు, బహిష్కరణలు వేయడం గ్రామాభివృద్ధి కమిటిలకు సర్వసాధారణం. దళితులు, బలహీన వర్గాల వారు ప్రశ్నించినందుకు అగ్రకుల ఆహాకారంతో బహిష్కరణ వేటు వేశారు. ఎక్కడ తప్పు జరిగిందని విచారణ చేయకుండానే మీరు మమ్ముల్ని ప్రశ్నిస్తారా? అనే ఆక్రోశంతో జరినామాలు విధించడంతో అందరూ తిరస్కరించడంతో బహిష్కరణ విధించారు. అయిన ఈ కమిటి అగడాలపై బలహీన వర్గాలను దళితులను, ఉన్నత విద్యావంతుడైన రవిచంద్ర ఐక్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ''తాను తీసిన గోతిలో తానే పడ్డట్లు...'' అగ్రకులాలు చేసిన తప్పులను రవిచంద్ర ఎదిరిస్తే మన గరిబోంక వకీల్‌ సహాయంతో గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేయించి రక్షణగా నిలిచాడు. అహాకారంతో విర్రవీగిన వారందరినీ జైలుకు పంపించారు. దళితులకు ప్రభుత్వం నుండి పరిహారాన్ని కూడా ఇప్పించాడు. ఆ గ్రామంతోపాటు చుట్టు ప్రక్కల గ్రామాల్లో, మండలాల్లో ఎస్సీ, ఎస్టీ చట్టంపై ౖ యువతకు అవగాహాన సదస్సులను ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీలను భాగస్వామ్యం చేశారు. దాంతో చట్టంను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు దోహాదం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఏదైనా తొర్తి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని దళితులందరిని కోరారు గరిబోంక వకీల్‌ సబ్‌.

ఉచిత న్యాయం కోసం...

[మార్చు]

పేద ప్రజలకు న్యాయం చేయాలనే తన తండ్రి ఆకాంక్షను న్యాయ సలహా కేంద్రం (లీగల్‌ ఎయిడ్‌ సెంటర్‌) ద్వారా తీర్చుకుంటున్నాడు. లీగల్‌ ఎయిడ్‌ న్యాయవాదిగా గత ఐదు సంవత్సరాలుగా అనేక కేసులలో బాధితులకు గైడ్‌ చేశారు, చేస్తున్నారు. లీగల్‌ ఎయిడ్‌ సెంటర్‌కు వచ్చిన బాధితుల పక్షనా కేసులు నడిపించడంలో ముందుభాగాన ఉన్నారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయం చేయడంతోపాటు వివిధ చట్టాలపై అవగాహాన కల్పిస్తున్నారు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను పొందడానికి చట్టాలను అధ్యయనం చేయాలని ఆయన సూచిస్తారు. గ్రామాభివృద్ధి కమిటిల అగడాలను అరికట్టేందకు తన వంతు కృషి చేస్తూనేఉన్నారు. గ్రామాభివృద్ధి కమిటిలు సంప్రాదాయం పేరుతో, మూఢనమ్మకాలను ప్రజలలో వ్యాప్తి చేస్తూ పేదలను మరింత పేదలుగా తయారు చేస్తున్నారు. ఇక్కడ కులమే ప్రధానపాత్రం వహిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బిసిలను అగ్రకులాలు జరిమానాల పేరుతో బెదిరించడమే కాకుండా బహిష్కరణలకు దిగడంలాంటివి చేస్తున్నారు. ఎదిరించిన వారిని గ్రామ బహిష్కరణలకు గురి చేయడం నిజామాబాద్‌ జిల్లాలో పరిపాటి. అలాంటి ఘటనపై సాయిలు లీగల్‌గా పోలీసులను, రెవెన్యూ అధికారులను చట్టం ప్రకారం పేదలకు రక్షణ కల్పించేవిధంగా చేశారు. కింది కులాల వారికి అగ్రకులాల వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పు అగ్రకులాలదే అయినప్పుడు గ్రామ పెద్దలు, పోలీసులు రాజీ చేయించడం, బెదిరించడం లాంటివి చేస్తారు. ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా కోర్టుల్లో అనేక కేసులు నడిపించారు మన న్యాయవాది సాయిలు.

న్యాయవాదిగా పనిచేస్తునే జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టుకు రాత పరీక్షల్లో ఇంటర్వ్యు వరకు వెళ్లారు. కాని న్యాయవాది న్యాయమూర్తి కాలేకపోయారు సాయిలు. పట్టువదలని విక్రమార్కుడిగా పేదల న్యాయవాదిగా తనవంతు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మార్గంలో అనేకమందికి ఉచిత న్యాయసహాయం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కోర్టులో జిల్లా లైజన్‌ ఆఫీసర్‌గా గత కొన్ని సంవత్సరాలుగా సేవలు అందించారు. లైజన్‌ ఆఫీసర్‌గా జిల్లాలో జరిగిన అనేక కేసుల్లో బాధితులకు అండగా వారిని గైడ్‌ చేయడంతోపాటు బాధితులు, సాక్షుల రక్షణకు కోర్టు ద్వారా పోలీస్‌ ప్రోటేక్షన్‌ ఇప్పించడంలో ముందు భాగాన ఉన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం క్రింద నమోదు అయిన కేసుల్లో అత్యధిక శాతం శిక్ష పడ్డాయంటే సాయిలు గైడ్‌ చేసిన కేసుల్లోనే అంటే అతిశయోక్తి కాదు. న్యాయసేవ సాధికార సంస్థ నిజామాబాద్‌లో రిటేనర్‌ లాయర్‌గా కూడా పని చేశారు. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ను కోర్టుల్లో వివిధ లాయర్లు, కోర్టు సిబ్బంది ''గరిబోంక వకీల్‌'' అన్నట్లే మన లాయర్‌ సాయిలును సైతం మిత్రులు అదే పేరుతో సంబోంధించడం గర్వంగా భావిస్తానని అన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగే జిల్లా సమీక్షలో లైజన్‌ ఆఫీసర్‌ కృషిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ కార్యదర్శి కొనియాడారంటే ఆయన పనితనం అలాంది మరి.

మనవ హక్కుల కొసం...

[మార్చు]

హ్యూమన్‌ రైట్స్‌ లా నెట్‌వర్క్‌, సాక్షి మానవ హక్కుల సంస్థలకు జిల్లా కన్వీనర్‌గా పని చేశారు. ఆయన వివిధ మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో ప్రజలకు చట్టాలపై అవగాహన సదస్సులు, న్యాయవాదులకు సెమినార్స్‌ నిర్వహించారు. ఈ సదస్సులు, సెమినార్స్‌లో జిల్లా న్యాయమూర్తులను, న్యాయవాదు లను కూడా భాగస్వాములను చేశారు. ప్రజల సామాజిక సమస్యల పరిష్కారం కోసం చట్టంపై అవగాహన కలిగి ఉండా లని అన్నారు. జిల్లాలో 40 జంటలకు కులాంతర, మతాంతర వివాహాలు చేశారు. పట్టుదల, క్రమశిక్షణతో చట్టపరిధిలో, చట్ట ప్రకారం నడుచుకుంటూ పని చేయడం సాయిలు వకీల్‌ వ్యక్తితత్వం. ఆయన మృధు స్వభావంతో ఎవ్వరిని నొప్పించకుండా, ఆయన బాధ పడకుండా మసులుకుంటారు.

ముగింపు...

[మార్చు]

సమాజంలోని కుల, జాతివివక్షలను రూపుమాపడానికి యువత నిరంతరం సామాజిక బాధ్యతతో క?షి చేయాలి. ప్రజల సమస్య ఏదైనా చట్టప్రకారం రాజ్యాంగపరిధిలో పని చేయాలంటే అందరికీ రాజ్యాంగం, చట్టాలపై అవగాహన ఉండాలి. అందరూ తప్పకుండా రాజ్యాంగాన్ని చదివి తీరాలి. అప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ-అభివ?ద్ధి కార్యక్రమాలలో జరుగుతున్నటువంటి అవకతవకలను మనం ప్రశ్నించగలుగుతాం. సంప్రదాయాల పేరుతో మూఢనమ్మకాలను విశ్వసిస్తే ఆధునిక ప్రపంచంలో అడుగుపెట్టలేని పరిస్థితి ఎదురవు తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగితే మనం అభివ?ద్ధి చెందటంతోపాటు మన గ్రామాన్ని, మనదేశాన్ని అభివ?ద్ధి పరిచినట్లు అవుతుంది. మనతో పాటు మన దేశాన్ని కూడా ముందుకు తీసుకుపోయిన వారిలో మనం భాగస్వాములమవుతాం. నేటి యువత లక్ష్యం లేకుండా చదువుకోవడం గాని, పనిచేయడం గాని చెయ్యటం ద్వారా జీవిత లక్ష్యసాధన వెనుకబడి పోవటాన్ని మనం గమనిస్తున్నాం. దీనిని అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ జీవిత ఆశయాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. లక్ష్య సాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు సాగిన మలావత్‌ పూర్ణను ఆదర్శంగా తీసుకోవాలి. అనుకున్నది సాధించే వరకూ అలుపెరుగని బాటసారిలా ముందుకు సాగిపోతూనే ఉండాలి. మన ఆలోచనలే మనకు మార్గనిర్దేశం చేస్తాయి.