వాడుకరి:Bhaskarasarma

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

[[ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి]] జననం-1909 తల్లి- పుల్లమాంబ తండ్రి - బంగారేశ్వర శర్మ, భార్య- భాస్కరమ్మ విద్య - ఉభయభాషాప్రావీణ వ్యాకరణాఛార్య, షడ్దర్శనిీ విశారద వృత్తులు - శ్రీ దంతులూరి వేంకట రాయపరాజోన్నత పాఠశాల కోలంక తెలుగు పండిట్, జ్యోతిషం, వైద్యం. రచనలు - 1.ధన్వంతరి చరిత్ర 2.ద్విభాష్యం వేంకటేశ్వర్లు గారి జీవిత చరిత్ర 3.భీమేశ్వర స్తవము 4.ఆంధ్రకధా సరిత్సాగరము (7-18 లంబకములు) 5.కర్మయోగి 6.వేంకటేశ్వర శతకము 7.వేంకటేశ్వర స్తవము 8. నూర్జ హాన్ నాటకం 9. ఖండ కావ్య సంపుటి ఆంధ్ర కథా సరిత్సాగరము - ఓలేటి వేంకట రామశాస్త్రి ఇందు 5వ లంబకము వరకు పూర్తిగావించి 6వ లంబకములో 1,2,3 తరంగాలు వ్రాసినట్టుగా ఉవాచగా తెలుస్తున్నప్పటికి మూలం యెక్కడ లభ్యం కాలేదు.తదుపరి తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామం ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి (1909) 7వ లంబకము నుండి 18వ లంబకము వరకు అనువదించి 1963సం..లో వేంకటేశ్వరుని దివ్యదామమైన వైకుంఠము చేరితిరి. తదనంతరం వారి జ్యేష్ఠపుత్రుడైన ఓలేటి శ్రీనివాసశర్మ (1942) శ్రీ దంతులూకి వేంకటరాయపరాజోన్నత పాఠశాల కోలంక నందు గ్రేడ్-1 తెలుగు పండితుడిగా రిటైరైతిరి(2000). పిదప 1-5, 7-18 లంబకములు పూర్తియైనవి 6వ లంబకము పూర్తి గావించిన గ్రంధమునకు పూర్ణత్వము, పూర్వికులకు యశః కాయము లబించునన్న తలంపుతో 6వ లంబకము 2009నాటికి పూర్తిగావించితిరి. ఆంధ్ర కథా సరిత్సాగరము - ఓలేటి వేంకట రామశాస్త్రి (పల్లిపాలెం) 1-5లంబకములు, ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి (ఇంజరం) 7-18, ఓలేటి శ్రీనివాసశర్మ -6వ లంబకము ఈవిదమున ఓలేటి త్రయంచే పూర్తిగావింపబడినది.