వాడుకరి:Chennamanikanteswara/ఎలా చదవాలి ?
ఉపోద్ఘాతం
[మార్చు]
ఎలా చదవాలి అనేది ప్రతి విద్యార్థిని తొలిచేసే ప్రశ్న ...
చాలా మంది ఉపాధ్యాయులకు కూడా ఈ ప్రశ్న ఒక చిక్కు ముడే...
చదవాలి అనే కోరిక ఉన్నా చదవలేక పోవడం, చదువుతున్నప్పుడు టి.వి. చూడడమో లేక ఇంకో విధంగా కాలక్షేపం చేయడం, పుస్తకం పట్టుకోగానే వేరే విషయాలను గూర్చి ఆలొచనలు రావడం, ఇలాంటివి సాధారణ విద్యార్థి ఎప్పుడూ ఎదురుకొనె సవాళ్ళే. ఆధునిక ప్రపంచం లో నెగ్గుకురావాలంటే, సమాజాన్ని ఉధ్ధరించే పౌరులు గా ఎదగాలంటే, ఇలాంటి సవాళ్ళను చేదించి మనదైన శైలి లో ముందుకు నదవాలి. అందుకు ప్రతి విద్యార్థి , ప్రతి గురువు, తల్లిదండ్రులు వారి వంతు కృషి చేయాలి. మీ ఇంట విద్య వికసించడానికి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వ్యాసం రూపం లో మీ ముందు ఉంచుతున్నా.
చదువంటే ?
[మార్చు]ప్రతి రోజు మనం ఎందుకు చదవాలి అని మాట్లాడతాం కాని, చదువంటే ఏంటి అని చాలా తక్కువ మంది తర్కిస్తారు.చదువు మనల్ని ఒక సంపూర్ణ మానవున్ని చేస్తుంది.
చదువు అనగానే మనకు గుర్తుకువచ్చేది రోజూ మనం చదివే పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఇంకా గైడ్లు. ఇవి చదువు లో ఒక ముఖ్య భాగమే కాని చదువు అంటే ఇవి మాత్రమే అనుకోవడం సమంజసం కాదు. చదువు అనేది మనం దైనందిన జీవితం లో (daily life) మనకు అవసరమన విషయాలు, మన వల్ల ఇతరులకు ఉపయోగపడే విషయాలు తెలుసుకునే నిరంతర ప్రక్రియ. ఈ విషయ పరిజ్ఞానాన్ని మనం వివిధ రూపాల్లో తెలుసుకుంటాం. టి.వి. లొ చూడడం , పుస్తకం లొ చదవడం , ఇతరుల నుండి వినడం , అంతర్జాలం లొ శోధించడం , మొదలైన మార్గాల ద్వారా మనం తెలుసుకుంటాం. మనం పాఠశాల లో కూడా అదే చేస్తాం. పాఠ్య పుస్తకాలు చదివి తెలుసుకుంటాం, గురువుల నుండి విని తెలుసుకుంటాం. కాని ఇక్కడే ఒక సమస్య ఉంది.. టి.వి. చూస్తున్నప్పుడు బానే ఉంటుంది కాని పుస్తకాలు, మరీ ముఖ్యంగా పాఠ్య పుస్తకాలు చదవాలంటే మాత్రం పూర్తి నిరాసక్తత ప్రదర్శిస్తాం.
ఎందుకు ?
[మార్చు]ఏదైనా విషయాన్ని మనం తెలుసుకోవడం లో ముఖ్య పాత్రధారి మన మెదడు.మన ఇంద్రియాలు అందించిన సమాచారాన్ని సమీకరించి, భద్రపరిచేది మన మెదడు. ఈ విషయం మనందరికి తెలిసిందే. మనం ఎలాగైతే మన అమ్మా, నాన్న ల మాట వినకుండా మనకు నచ్చిన పని చేస్తామో , మన మెదడు కూడా తనకు నచ్చిన పనిని మాత్రమే చేయాలనుకుంటుంది. అందుకే మనల్ని ఎప్పుడూ ఆటలాడమని, అల్లరి చేయమని చెప్తుంది. ఇంకా టి.వి. లొ వచ్చే రంగు రంగుల బొమ్మల కార్టూన్లు చూడమని చెప్తుంది, కాని టీచర్ చెప్పేది వినమని అస్సలు చెప్పదు.ఎందుకంటే టీ.వి లో కనిపించే బొమ్మలు మెదడుకి హాయిని ఇస్తాయి , టీచర్ చెప్పేవి బోర్ కొట్టిస్తాయి.
మనం ఏం చేయాలి ?
[మార్చు]మనం మంచి విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలంటే, బోర్ కొట్టే సబ్జెక్టులను కూడా ఆనందంగా నేర్చుకోవాలంటే కొన్ని చిట్కా లు పాటిస్తే సరి. ముఖ్యంగా గా మనం మన మెదడు ని గురించి తెలుసుకోవాలి. ఏం చేస్తే మెదడు కు నచ్చుతుందో, త్వరగా అర్థం చేస్కోగలుగుతుందో తెలుసుకోవాలి. అలాంటి సాధనాల గురించి ఇక్కడ మాట్లాడుకుందాం
మైండ్ మాప్స్
[మార్చు]ఈ మధ్య కాలం లో బాగా ప్రాచుర్యం లోకి వచ్చిన విధానం మైండ్ మాపింగ్ విధానం. ఒక విషయాన్ని మన మెదడు కు అర్థమయ్యేలా చెప్పడం లో మైండ్ మాపింగ్ కి మించిన పద్ధతి ఇంకోటి లేదని చెప్పుకోవచ్చు . ఎదైనా విషయాన్ని బొమ్మలతోకూడిన మ్యాప్ రూపం లో అర్థం చేస్కోవడం వల్ల మన మెదడు త్వరగా గ్రహిస్తుంది ఇంకా ఎక్కువ కాలం గుర్తుంచుకుంటుంది. ఈ మ్యాప్ లు పదే పదే చూడడం వల్ల ఆ విషయం శాశ్వతంగా మన మెదడు లో ఉండిపోతుంది .
చిత్రలేఖనం
[మార్చు]రంగులంటే మన మెదడు కి చాలా ఇష్టం. ఇక రంగురంగుల కార్టూన్స్ ఐతే చెప్పనవసరం లేదు. ఈ చిట్కా మనం చదువు విషయం లో కూడా ఉపయోగించవచ్చు .ఉదాహరణకి గుండె పని చేసే విధానం, లేదా కిరణజన్యు సంయోగ క్రియ మొదలగు వాటిని మాటల్లో చెప్పడం కన్నా చిత్రాలు గీసి చూపించడం తేలిక. ఎలాగు మనకు భౌతిక , రసాయన , జీవ శాస్త్రాల్లో చిత్రాలు గీయడం తప్పని సరి కాబట్టి, వాటినే ఇంకాస్త వినూత్నంగా గీస్తే మన లో సృజనాత్మకత అభివృద్ది చెందుతుంది
అంతర్జాలం
[మార్చు]మనిషి సృష్టి లో అంతర్జాలాన్ని మించింది ఇంకోటి లేదంటే అతిశయోక్తి కాదు. మనకు తెలియని ఏ విషయాన్నైనా వివిధ రూపాల్లో మన ముందు ఉంచుతుంది ఇంటర్నెట్. చిత్రాలు, వీడియోలు , స్లయిడ్ షోస్, యానిమేషన్, లాంటి మాధ్యమాల్లో మనకున్న ఎటువంటి సందేహనికైన ఇంటర్నెట్ లో సమాధానాలు దొరుకుతాయి. కొన్ని ఉపయోగపడే వెబ్ సైట్ లింక్స్ కింద ఇవ్వబడ్డాయి. ఫేస్ బుక్ లాంటి సామజిక నెట్వర్కింగ్ సైట్స్ లో షేర్ చేస్కోవడం వల్ల విషయాలు తెలుసుకోవచ్చు.
వార్తా పత్రికలు
[మార్చు]ఎప్పటికప్పుడు కొత్త విషయాలతో మనల్ని చైతన్యపరుస్తాయి వార్తాపత్రికలు. సామజిక , ఆర్థిక, రాజకీయ , క్రీడ, విద్య , వైద్య , కళాది రంగాల్లో రోజు జరిగే విషయాలు వార్తా పత్రికలు చదివి మనం తెలుసుకోవాలి. పాఠ్యపుస్తకాల కన్నా వార్త పత్రికలు చదవడానికి సులభంగా , ఇంకా బోర్ కొట్టకుండా మనోరంజకంగా మనల్ని విజ్ఞాన సాగరం లో విహరింపజేస్తాయి. రోజు చదివిన అంశాల గురించి తరగతి గది లో తోటి విద్యర్థులతొనూ గురువులతొనూ చర్చించి ఆయా అంశాలపై పట్టు సాధించాలి.
చర్చించడం
[మార్చు]తరగతి గది లో కానీ లేదా బయట కానీ , చర్చించడం వల్ల ఆయా విషయాలపై ఇతరుల అభిప్రాయాలూ, ఇంకా వారి ఆలోచనా తీరు తెలుస్తాయి. ఇంకా మనం ఎలా ఆలోచించాలి అనే విషయం పై ఒక స్పష్టత వస్తుంది. దాంతో పాటు ఇతరులతో ఎలా మాట్లాడాలి అనే విషయాలు కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి మనం వీలు దొరికినప్పుడు, పెద్దలతో, గురువులతో , తోటి విద్యార్థులతో సమకాలీన అంశాల పై చర్చించి తత్సంబంధ విషయాలపై పట్టు సాధించాలి.
ఇతర మాధ్యమాలు
[మార్చు]డాక్యుమెంటరీలు , స్లయిడ్ షోలు , చిత్రాలు , టివి లో ప్రసారాలు, ఆకాశవాణి , ఇ-బుక్స్ లాంటి సాధనాలు , మిత్రులతో విషయాన్ని గురించిన నాటకాలు వేయడం, ప్రయోగాత్మకంగా పరీక్షించడం లాంటి కార్యాల వల్ల మనం విషయాంశాలపై పట్టు సాధించవచ్చు ..
కొన్ని చిట్కాలు
[మార్చు]పైన కొన్ని వినూత్న సాధనాల గురించి తెలుసుకున్నాం కదా.. ఇప్పుడు మనకు ఉపయోగపడే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం
ఎప్పుడు లేవాలి ?
[మార్చు]సాధారణం గా మనం లేట్ గా పడుకొని లేట్ గా లెస్తూ ఉంటాం.ఈ పద్ధతి అస్సలు మంచిది కాదంటారు వైద్యులు. ఉదయం 4:30 గంటలకు నిద్ర లేవడం ఉత్తమం. మనకి ఎలాగు 7 గంటల నిద్ర అవసరం కాబట్టి రాత్రి 9:30 పడుకుంటే సరి. ఉదయం 4:30 గంటల సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు, ఆ సమయం లో లేచి చదివితే చదువుల తల్లి కరునిస్తుందని ఒక నమ్మకం. ఇంకా ఆ సమయం లో మన మెదడు స్వచ్చంగా నూతనోత్సాహం తో ఉంటుంది కాబట్టి ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించాగలదు.
తరగతి గది లో
[మార్చు]విద్యార్థి దశ లో అతి ముఖ్యమైన చోటు తరగతి గది. రోజు లో మూడో వంతు మనం అక్కడే గడుపుతాం. అలాంటి తరగతి గది ని మనం చక్క గా ఉపయోగించుకుంటే నాలుగింట మూడు వంతుల విషయాంశాలు అక్కడే అర్థం అవుతాయి. ఉపాధ్యాయుడు చెప్పిన విషయాలు అర్థం చేస్కొని , మిత్రుల తో విషయాల గురించి చర్చించి, సందేహాలను అక్కడే నివృత్తి చేస్కోవాలి.
పాఠ్య పుస్తకాలు
[మార్చు]విద్యార్థి దశ లో మనకు తగిన విషయాలను చక్కగా పొందుపరిచిన వనరులు పాఠ్య పుస్తకాలు . మనకు అవసరమైన అన్ని విషయాలు పాఠ్య పుస్తకాలలో మనం పొందవచ్చు. పైగా పరీక్షల్లొ వచ్చే ప్రశ్నలు కూడా పాఠ్య పుస్తకాల లోని విషయాలపైనే కాబట్టి గైడ్స్ , వర్క్ బుక్స్ వంటి వాటి పై ఆధారపడవలసిన అవసరం కూడా ఉండదు . కాబట్టి టీచర్ చెప్పిన వెంటనే ఆ విషయాలని ఒక సరి చదివేస్తే సరి, వచ్చిన సందేహాలు మరుసటి దినం తరగతి లో నివృత్తి చేస్కోవచ్చు .
హోం వర్క్
[మార్చు]ఈరోజుల్లో మనల్ని బాగా ఇబ్బంది పెడ్తున్న పదం హోం వర్క్ . దీన్ని తప్పించుకోవడానికి మనం చెప్పే సాకులు అనంతం. హొమ్ వర్క్ ఎందుకిస్తారో తెలుసుకుంటే మనకు తప్పించుకోవాలనే ఆలోచన రాదు . హోం వర్క్ కేవలం మనం తెలుసుకున్న విషయాలను ఉపయోగించటం లో మనకు అభ్యాసం కోసమే ఇస్తారు. హోం వర్క్ చేయడం వల్ల మనం నేర్చుకున్న విషయాలు ప్రయోగించడమే కాదు వాటిని కొత్త గా ఎలా వాడాలో కూడా మనకు అర్థమవుతుంది . మొదటగా తరగతి లో చర్చించిన, పాఠ్య పుస్తకాల్లో చదివిన అంశాలను అర్థం చేస్కున్నాక, వివిధ సాధనాల ద్వారా విషయ పరిజ్ఞానం సంపాదించాక హోం వర్క్ స్టార్ట్ చేయడం మంచిది.
బట్టి విధానం
[మార్చు]మనం చాల మంది పుస్తకం ముందు గడ గడ చదవడం చూస్తుంటాం. బట్టి పట్టే పద్దతి పరీక్షల్లో పనికొస్తుందేమో కానీ , ప్రాక్టికల్ గా పనికిరాదని వారికీ తెలిసుండదు. విషయాల పట్ల అవగాహన, శాస్త్రం పై పట్టు సంపాదించాలంటే బట్టి విధానం అస్సలు సరిపోదని అందరు తెలుసుకోవాలి.
ఉపయోగపడే లింకులు
[మార్చు]ఈనాడు ప్రతిభ
సాక్షి ఎడుకేషన్
హే మ్యాథ్
ఉపాధ్యాయులు ఏం చేయాలి ?
[మార్చు]తల్లి, తండ్రి తరువాత గురువు కి అంతటి స్థానం ఇచ్చింది మన సంస్కృతి, ఒక గురువు మాత్రమే నవ సమాజ నిర్మాణానికి కారణం కాగలడు. తన విద్యార్థుల యందు ఆ జ్ఞాన జ్యోతి వెలిగించడమే తన ఏకైక కర్తవ్యం గా ప్రతి గురువు భావించాలి. విద్యార్థుల మనసు తెలుసుకొని తగు విధంగా తరగతి గది వాతావరణాన్ని మార్చుకోవాలి. ఎప్పటికప్పుడు విద్యార్థికి తన సామర్థ్యాన్ని, బాధ్యతల్ని గుర్తు చేస్తూ జాగరూకత తో మెలిగే లా చూడాలి . కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, తన విషయ పరిజ్ఞానం పెంచుకుంటూ, అవసరమైన విషయాలను విద్యార్థులు తో చర్చించి వారిలో సంక్లిష్ట ఆలోచనా విధానాన్ని అలవారచాలి . కేవలం గైడ్స్ , నోట్స్ మాత్రమే కాక తత్సంబంధిత అంశాలపై చిత్రాలు, మ్యాప్ లు , స్లయిడ్ షోస్ మొదలగు సాధనాల ద్వారా విద్యార్థికి అర్థమయ్యేలా వివరించాలి. సామజిక , ఆర్ధిక , అంశాలను సోధాహరణంగా చర్చించి వారిలో సమస్య సాధన , సామజిక స్పృహ అలవారచాలి , తద్వారా వారిని రేపటి పౌరులు గా తీర్చిదిద్దాలి.
అదనపు సమాచారం
[మార్చు]నా గురించి
[మార్చు]చెన్నా మణికంఠేశ్వర
4th year, Bachelor of Architecture,
chennamanikanteswara@gmail.com
.