వాడుకరి:D R S Narendra

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డి ఆర్ ఎస్ నరేంద్ర[మార్చు]

సద్గుణబాల సంపాదకులు

సద్గుణబాల సంపాదకులు, ప్రముఖ పాత్రికేయులు, హైదరాబాద్ లోని కాచీగూడ ప్రాంతంలో జూన్ 1వ తేది 1978 లో బాలమణి, రమేశ్ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం శ్రీ సరస్వతీ శిశు మందిరంలో చేశారు. మాధ్యమిక, ఉన్నత విద్యాభ్యాసం కాచీగూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. భాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ జూనియార్ కాలేజీ నుండి ఇంటర్మీడియట్ చదివారు. ఇంటర్ చదువుతూనే నింబోలిఅడ్డలోని తాను చదివిన పాఠశాలలో 16 సంవత్సరాల వయసులోనే ఉపాధ్యాయులుగా చేరారు. అక్కడ విద్యార్ధులకు బోధిస్తునే తదుపరి చదువులను కొనసాగించారు. రచన వ్యాసాంగం పట్ల మక్కువతో రచన జర్నలిజం కళాశాల నుండి జర్నలిజం పీజి డిప్లోమా కోర్సు చేశారు. హైదరాబాద్ హిందీప్రచార సభ ద్వారా నిర్వహించబడిన హింది భూషణ్ మరియు హింది విద్వాన్ పరీక్షలు వ్రాసి ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

శ్రీ సరస్వతీ శిశు మందిరం నింబోలిఅడ్డలో 1993 నుండి 2001 వరకు ఉపాధ్యాయులుగా తదుపరి 2001 నుండి 2006 వరకు ప్రధానోపాధ్యాయులుగా పని చేశారు. తరువాత శ్రీ సరస్వతీ విద్యాపీఠం ద్వారా నిర్వహించబడే పాఠశాలలకు పర్యవేక్షణాధికారిగా సేవలందించారు. హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలలోని 56 పాఠశాలల విద్యావిషయాల పర్యవేక్షణ చేశారు.

2010 శ్రీ సరస్వతీ విద్యాపీఠంలో సేవలు విరమించి ఆర్ఎస్ఎస్ వార పత్రిక జాగృతి లో సంవత్సర కాలంపాటు చేశారు. అక్కడినుండి పదోన్నతిపై ఆర్ఎస్ఎస్ సాహిత్యవిభాగం సాహిత్యనికేతన్ కు మేనేజర్ గా పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో తన రచన వ్యాసాంగానికి పదను పెట్టారు. ’’యువత కోసం రామాయణం ‘‘ అనే పుస్తకం రచించారు. ఇది ఎంతోమంది అభిమానులను ఆయనకు సంపాదించి పెట్టింది. సార్వత్రిక ఎన్నికల ముందు దేశంలో నూతన ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తూ నరేంద్ర వ్రాసిన పుస్తకం ’’ ఒకే ఒక ఆశా కిరణం నరేంద్రమోదీ నేతృత్వం ‘‘ విడుదలయింది. తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రజాధరణ పొందింది. ఈ పుస్తకం అత్యధికంగా మూడు పర్యాయాలు ముద్రణ చేయబడింది. ఈ పుస్తక ప్రతులు చూసి నాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ ప్రశంసించారు. తన రెండు ఛాయాచిత్రాలతో పాటు అభినందన పత్రం పంపారు.

ఈ తర్వాత ’’ సద్గుణబాల పక్షపత్రిక ‘‘ను 2014 జూన్ 14న ప్రారంభించారు. ఈ పత్రిక తక్కువ సమయంలోనే ఎక్కువమంది పాఠకులకు చేరువ అయింది. తన రచనా వ్యాసాంగానికి ఉద్యోగం అడ్డంకిగా ఉందని భావించి ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచురణ విభాగం మేనేజర్ పదవికి రాజీనామా చేసి పూర్తి సమయం సద్గుణబాల పత్రిక బాధ్యతలు నిర్వహించారు. కానీ ఆ తర్వాత పత్రిక నిర్వహణ బాధ్యత ఆయనకు తలకు మించిన భారంగా మారింది అయినప్పటికి కష్టాలకు తలవంచక పత్రికను నడుపుతున్నారు.

అటు పత్రికను నిర్వహిస్తునే అనేక పుస్తకాలు రచించారు. ఆయన రచించిన పుస్తకాలో ఆచార్య చాణక్య - ఒక దేశభక్తుని పోరాట గాథ, స్ఫూర్తిమంతమైన మంచికథలు, ఉపాధ్యాయుడు, యువతకోసం రామాయణంలో రాజకీయవిలువలు తదితరాలు. భారతదేశ ఖ్యాతి కోసం వివిధ రంగాలో కషిచేసిన మహానుబావుల చరిత్రను సంక్షిప్తంగా తెలియజేసేవిధంగా ’’మన మహనీయులు వందమంది చరిత్ర ఒక్కచోట ‘‘ పుస్తకం రచించారు. ఇది చాల తక్కువ సమయంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. తెలుగు భాషీయులకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సౌకర్యార్ధం ఇంగ్లీష్ లోకి అనువదించారు.

డిఆర్ఎస్.నరేంద్ర సంపాదకులుగా వెలువడుతున్న సద్గుణబాల పత్రిక నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకొని ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా విశేష సంచిక విడుదల చేశారు. సంచిక పేరు ’’ ఈ దేహం - దేేశం కోసం‘‘ ఇందులో నరేంద్రమోదీ పనితీరు, కేంద్ర ప్రభుత్వ విధానాలు పొందిపరిచిన వ్యాసాలు ఉన్నాయి.

చాలా చిన్నవయసులో ఉపాధ్యాయులుగా, ప్రచురణ విభాగాధిపతిగా, పాత్రికేయులుగా, సంపాదకులుగా వివిధ బాధ్యతలను నరేంద్ర సమర్ధవంతంగా నిర్వహించారు. నరేంద్ర రచయిత మాత్రమే కాదు. చిత్రకారుడు, గాయకుడు,మంచి వక్తగా రాణించారు. ఆయన బహుముఖ ప్రతిభాశాలి. అన్ని రంగాలలో [1]ఆరితేరినవాడు. ప్రస్తుతం సద్గుణబాల పత్రికను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.

  1. [www.sadgunabala.org "www.sadgunabala.org"] Check |url= value (help). Cite web requires |website= (help)