వాడుకరి:Devipriyawp

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు దేవిప్రియ. నేను అంద్ర లొయోల కళాశాల లో పీజి మొదటి సంవత్సరం వృక్షశాస్త్రం చదువుతున్నాను.


వికీపీడియా కరపత్రము

[మార్చు]

వికీపీడియా వివిధ భాషల్లో లభించే ఒక స్వేచ్చా విజ్ఞాన సర్వస్వము. దీన్ని లాభాపేక్ష రహిత సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీ అనగా అనేక మంది సభ్యుల సమిష్టి కృషితో సులభంగా వెబ్ సైటు ను సృష్టించగల ఒక సాంకేతిక పరిజ్ఞానం. ఎన్‌సైక్లోపీడియా అనగా సర్వ విజ్ఞాన సర్వస్వం. వికీపీడియా అనేపదం ఈ రెండు పదాల నుంచి ఉద్భవించింది. ఇది 2001లో జిమ్మీ వేల్స్, లారీ సాంగర్లచే ప్రారంభించ బడింది. అప్పటి నుంచి అత్యంత వేగంగా ఎదుగుతూ, ఇంటర్నెట్ లో అతి పెద్ద వెబ్ సైట్లలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది.

1.చరిత్ర వికీపీడియా మొదటగా న్యూపీడియా అనే ఆంగ్లభాషా విజ్ఞాన సర్వస్వం ప్రాజెక్టుకు సహాయ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. న్యూపీడియా లో ఆయా రంగాలలోని నిపుణులు వ్యాసాలు రాస్తారు. వాటిని ఒక పద్దతి ప్రకారం రివ్యూ చేసిన పిదప విజ్ఞాన సర్వస్వంలోకి చేరుస్తారు. న్యూపీడియా మొట్ట మొదటగా బోమిస్ అనే వెబ్ కంపెనీ ఆధ్వర్యంలో మార్చి 9, 2000 సంవత్సరంలో ఆరంభమైంది. బోమిస్ సిఈఓ పేరుజిమ్మీ వేల్స్, మరియు దాని ముఖ్య సంపాదకుడు లారీ సాంగర్. తరువాత వికీపీడియాకు కూడా వీరే అదే పదవుల్లో కొనసాగుతున్నారు. మొదటగా ఇది న్యూపీడీయా ఓపెన్ కంటెంట్ లైసెన్స్ అనే లైసెన్స్ కలిగి ఉండేది. కానీ వికీపీడీయా ఏర్పడిన తరువాత ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ ఉద్యమ రూపశిల్పి రిచర్డ్ స్టాల్​మన్ కోరిక మేరకు గ్నూ ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సుకు మార్చారు. లారీ సాంగర్ మరియు జిమ్మీ వేల్స్ ను వికీపీడియా పితామహులుగా పేర్కొనవచ్చు. అందరూ కలిసి విజ్ఞాన సర్వస్వాన్ని రచించి ఏర్పాటు చేసే ఆలోచన వేల్స్ ది అయితే అందుకు వికీలతో కూడిన వెబ్ సైటును ఏర్పాటు చేయాలనే వినూత్నమైన ఆలోచన సాంగర్ ది. వికీపీడియా ఓపెన్ సోర్సు మరియు ఉచితంగా లభించే వికీమీడియా సాఫ్టువేరు ఆధారంగా నడుస్తుంది. ఇది పి హెచ్ పి(PHP) అనే భాషలో అభివృద్ధి చేయబడింది. దీనిలో వాడే డేటాబేసు పేరు మై ఎస్ క్యు ఎల్ (MySQL). ఇది జి ఎన్ యు జనరల్ పబ్లిక్ లైసెన్సు క్రింద రిజిస్టర్ చేయబడి ఉంది. ప్రస్తుతం వికీపీడియా 253 భాషల్లో లభిస్తోంది. వీటిలో 16 భాషల వికీపీడీయా 1,00,000 పైగా వ్యాసాలు కలిగి ఉన్నాయి. 145 వర్షన్లు 1000కి పైగా వ్యాసాలు కలిగి ఉన్నాయి. డిసెంబర్ 2007 గణాంకాలననుసరించి వ్యాసాల సంఖ్య పరంగా చూస్తే ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచి, పోలిష్, జపనీస్ మొదటి ఐదు పెద్ద వర్షన్లు.

తెలుగు వికీపీడియా
సోదర ప్రాజెక్టులు

వికీపీడియా తో బాటు అదే బాటలో నడిచే మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.. అందులో .... 1.తెలుగు వికీపీడియా. ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు. ఇందులో ఏమేమి వ్రాయవచ్చు, ఎలా వ్రాయవచ్చు, వ్రాసేటప్పుడు కలిగే ఇబ్బందులు, వాటి నివారణ మొదలగు విషయాలు:

వికీపీడియా - ఎన్సైక్లోపీడియా పేరును అనుసరిస్తూ పెట్టిన పేరిది. 2001 లో జిమ్మీ వేల్స్ అనే అమెరికనుకు వచ్చిందీ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ఆలోచన. ఎవరైనా రాయగలిగేదీ, దిద్దుబాట్లు చెయ్యగలిగేదీ, చదువుకునేందుకు ఇంటర్నెట్లో అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేదే స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. వికీపీడియాను మొదటగా ఇంగ్లీషు భాషలో మొదలుపెట్టగా అది చాలా త్వరగా ప్రజల మన్నలను పొందింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగి విశ్వవ్యాప్తమైంది. జర్మను, జపనీసు, స్పానిషు, ఫ్రెంచి, ఇటాలియను, రష్యను, చైనీసు ఇలా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతర భాషల్లోనూ వికీపీడియాలు మొదలయ్యాయి. గొప్ప గొప్ప వ్యాసాలెన్నో తయారయ్యాయి, అవుతూ ఉన్నాయి. ఇంటర్నెట్లో వివిధ భాషలకు ప్రత్యేకించిన వెబ్ సైట్లలో ఈ విజ్ఞాన సర్వస్వాన్ని రాస్తున్నారు.

ఏమిటి వికీపీడియా విశిష్టత? వికీ అంటే ఎవరైనా దిద్దుబాటు చెయ్యగల వెబ్సైటు అని అర్థం. వికీపీడియా అంటే ఎవరైనా దిద్దుబాటు చెయ్యగల ఎన్సైక్లోపీడియా. వికీపీడియా విజయ రహస్యమంతా ఈ వికీ అనే మాటలోనే ఉంది. వికీపీడియాలో రాసేది ఎవరో ప్రముఖ విద్యావంతులో, ప్రత్యేకంగా అందుకోసం నియమితులైన రచయితలో కాదు. మనలాంటి వారంతా అక్కడ రాస్తున్నారు. వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు, ఏ విషయం గురించైనా రాయవచ్చు. కొన్ని నిబంధనలకు, కట్టుబాట్లకు లోబడితే చాలు. అలాగే వికీపీడియాలోని వ్యాసాలను ఎవరైనా ఉచితంగా చదువుకోవచ్చు, డబ్బు కట్టక్కరలేదు. అంతేనా, ఆ వ్యాసాలను మీరు ప్రింటు తీసుకోవచ్చు. అసలు వికీపీడియా మొత్తాన్ని మీ కంప్యూటరు లోకి డౌనులోడు చేసుకోవచ్చు - పైసా డబ్బు చెల్లించకుండా!! ఇంకా అయిపోలేదు, మీకిష్టమైన విషయాలను సంకలనం చేఇ పుస్తకాలుగా కుట్టేసుకోవచ్చు. ఆగండి, ఇంకా ఉంది.. ఈ పుస్తకాలకు వెల కట్టి అమ్ముకోనూ వచ్చు!!!! వికీపీడియా మిమ్మల్ని పన్నెత్తి మాటనదు, పైసా డబ్బడగదు. ఒకే ఒక్కమాట - దీన్ని నేను వికీపీడియా నుండి సేకరించాను అని రాస్తే చాలు. అని చివరలో వ్రాసుకుంటే చాలు.

భారతీయ భాషల్లో వికీపీడియా: 1. మొదటగా 2001 లో ఇంగ్లీషులో మొదలైందీ వికీపీడియా. నిదానంగా ఇతర భాషలకూ విస్తరించి, ఇప్పుడు 200 కు పైగా భాషల్లో తయారవుతోంది. అందులో తెలుగూ ఒకటి. హిందీ, సంస్కృతం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళం, మలయాళం, కన్నడ, ఉర్దూ, తెలుగు ఇలా దాదాపుగా అన్ని ప్రముఖ భారతీయ భాషల్లోనూ వికీపీడియా తయారవుతోంది. మనకు గర్వకారణమైన విషయమేమిటంటే, భారతీయభాషల వికీపీడియాలన్నిటిలోకీ చాల భాషల వికీపీడియా కన్నాతెలుగే ముందుంది. వ్యాసాల సంఖ్యలోగానీ, సభ్యుల సంఖ్యలో గానీ తెలుగు వికీపీడియాదే అగ్రస్థానం. దీనికి కారకులు మన తోటి వికీపీడియనులే. తెలుగు వారిగా ఇది మనకు గర్వ కారణము కాదా??? దీనిని మరింత ముందుకు తీసుకెళ్ళడము మన బాధ్యత కాదా?

తెలుగు వికీపీడియాలో ఏమేం రాస్తున్నారు తెలుగు వికీపీడియా వెబ్ అడ్రసు: http://te.wikipedia.org. చరిత్ర, సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు.. ఇలా ఎన్నో విషయాలపై రాస్తున్నారు. 13 వేలకు పైగా సభ్యులు వేలకు వేల పైగా వ్యాసాల మీద ప్రస్తుతం పని చేస్తున్నారు. ప్రఖ్యాత రచయితలు, సంఘసేవకులూ కూడా వికీపీడియాలో రాస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల లోని అన్ని గ్రామాల గురించీ రాయాలనే సంకల్పంతో సభ్యులు రేయింబవళ్ళు పని చేస్తున్నారు. చాల వరకు పని పూర్తయింది. రేయింబవళ్ళు అనే మాట వాక్యంలో తూకం కోసం వాడింది కాదు.., భారత్, అమెరికా, కెనడా, బ్రిటను, ఫ్రాన్సు, కొరియా, ఆస్ట్రేలియా ఇలా ప్రపంచం నలుమూలలలోనూ ఉన్న తెలుగువారు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. అంచేతే ఎల్లవేళలా వికీపీడియాలో ఎవరో ఒకరు రాస్తూనే వుంటారు.

ఎవరైనా రాయవచ్చంటున్నారు, మరి, నేనూ రాయవచ్చా?

నిక్షేపంగా రాయవచ్చు, ఇతరులు రాసిన వ్యాసాలను సరిదిద్దనూ వచ్చు. వికీపీడియా ఉద్దేశమే అది. విషయ పరిజ్ఞానమున్న వారు ఆ విషయాలలోని ఇదివరకు వున్న వ్యాసాలలోని విషయము తక్కువగా వుంటే అటువంటివారు తమ వద్ద వున్న అధిక సమాచారాన్ని జోడించ వచ్చు. ఏదైనా వ్యాసం అసలు లేకుంటే ఆ విషయమై కొత్త వ్యాసాన్ని తయారు చేయవచ్చు. ఆ వ్వాసంలో వారి వద్ద పూర్తి సమాచారము లేకున్న పరవాలేదు. వారి వద్ద వున్నకొద్ది పాటి విషయాన్ని పొందుపరచి వ్యాసాన్ని సృష్టించ వచ్చు. పూర్తి సమాచారముతో ఆ వ్యాసాన్ని మీలాగే మరొకరు పూరుస్తారు. భాషా పరమైన పరిజ్ఞానమున్నవారు వ్యాసాలలోని వ్యాకరణ/అక్షర దోషాలను సరిదిద్దవచ్చు. వ్యాసాలు వ్రాసేవారు గాని ఇదివరకే వున్న వ్యాసంలో కొత్త సమాచారము పొందు పరచే వారు గాని ఆ వ్యాసం గాని, వ్యాస భాగము గాని ఎక్కడినుండి సేకరించారో అనగా ఏదేని గ్రంధం, వార్తా పత్రిక మొదలగువాటి పేర్లను మూలం గా తప్పని సరిగా పేర్కొనాలి.

దేని గురించి రాయవచ్చు?

మీకు తెలిసిన ఏ విషయం గురించైనా రాయవచ్చు. మీ ఊరి గురించి రాయండి. మీ ఊరి ఫోటోను పేజీలో పెట్టండి. ఈ మధ్య మీరు చదివిన పుస్తకం గురించో, మీరు చూసిన సినిమా గురించో రాయండి. అన్నట్టు మాయాబజారు సినిమా గురించి, చందమామ పుస్తకం గురించి వికీపీడియాలో వ్యాసాలు చూడండి. ఈ వ్యాసాల్లోని సమాచారాన్ని తీసుకుని కొన్ని పత్రికల్లో వాడుకున్నారు కూడాను.

పేపర్లో చదివే వార్తలు./టీ.వీ.లో చూసిన సినిమా/ మీరు సందర్శించిన క్రొత్తప్రదేశాలు, యాత్రాస్తలాలు, చారిత్రిక ప్రదేశాలు ఇలా.... ఎన్నో ఎన్నో.......

ఏదైనా ఊరి గురించి కాని, సినిమా గురించి కాని, వ్యక్తి గురించి కాని ఆసక్తికరమైన వార్త పేపర్లో చదవొచ్చు. లేదా టీవీలో చూడొచ్చు. తెలుగు వికీలో ఆ వూరు లేదా సినిమాకు సంబంధించిన పేజీ తెరిచి ఆ విషయాన్ని క్లుప్తంగా వ్రాసేయండి. రిఫరెన్సుగా ఆ పేపరు, తేదీలను పేర్కోవడం మరచి పోకండి. మీరు సినిమా చూశారనుకోండి. మరిచిపోక ముందే ఆ సినిమా గురించి వికీలో ఆ సినిమా వ్యాసం వ్రాసెయ్యండి. ఆ సినిమా గురించి ఇప్పటికే ఒక పేజీ ఉండవచ్చును. వర్గం:తెలుగు సినిమాలు చూడండి. అందులో మరింత సమాచారం చేర్చవచ్చును. టైటిల్స్‌లో నటులు, నిపుణుల పేర్లు వ్రాస్తే మరీ మంచిది. "సినిమా బాగుంది. బాలేదు" వంటి అభిప్రాయాలు మాత్రం వ్రాయొద్దండి.

మరి, నాకు కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడం ఎలాగో రాదే, ఎలాగా? అనేగా మీ సందేహం?

ఏం పర్లేదు, తెలుగు వికీలో అప్రమేయం తెలుగు టైపింగ్ సహాయం వుపకరణం వుంది. వికీపీడియాలో ప్రవేశించగానే అంతా తెలుగులోనే మొదటి పుట కనబడుతుంది. అందులో ఏదేని వ్యాసంకొరకు వెతకండి. (వెతుకు పెట్టెలో వ్యాసం పేరు వ్రాసి వెతుకు. అనే పెట్టెను నొక్కితే ఆవ్యాసం ఇదివరకే వున్నట్లయితే ఆవ్యాసం కనబడుతుంది. లేకపోతే..... ఆ వ్యాసం పేరు ఎర్రని రంగులో కనబడుతుంది. అంటే ఆ వ్యాసం లేదని అర్థము. (అక్షర దోషాలు లేకుండా వ్యాసం పేరు వ్రాయండి.) ఆ ప్రక్కనే సృష్టించు అని కూడ కనబడుతుంది. దానిని నొక్కితే ఆ వ్యాసంపేరుతో ఖాళీ పుట తెరుచు కుంటుంది. ఇక మీరు వ్రాయవచ్చు. ఇంగ్లీషు కీ బోర్డునే వాడవచ్చు. ఒక వేళ తెలుగులో కనబడక పోతే ....... ctrs. + Capital M టాబ్ లను ఒక్కసారె నొక్కండి. తెలుగులోకి మారిపోతుంది. తిరిగి ఇంగ్లీషులోని మారాలనుకుంటే అవే బటన్ లను మరొక సారి నొక్కండి. ఇంగ్లీషులోనికి మారి పోతుంది. తెలుగులో టైప్ చేయడము రాదు అనేది సమస్యే కాదు. ఇంగ్లీషు కీ బోర్డునేవాడ వచ్చు. ఉదాహరణకు ..... అమ్మ అని వ్రాయాలంటే amma = అమ్మ అని anna = అన్న అని akka = అక్క అని nEnu = నేను అని nuvvu = నువ్వు అని mIru =మీరు eMduku = ఎందుకు eppuDu = ఎప్పుడు అని వ్రాస్తే తెలుగులో టైప్ అయి పోతుంటాయి. ద్విత్తాక్షరాలు, సంయుక్తాక్షరాల వ్రాయడానికి మాత్రము కొంత శ్రమ. అంతా ఒక పది రోజులలోనే అలవాటయి పోతుంది. దీనికి సహకారిగా మీరు వ్రాస్తున్న పుటలోనే 'టైప్ సహాయం కావాలి.' అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద నొక్కితే తెలుగు + ఇంగ్లీషు అక్షరాలున్న కీ బోర్డు కనబడుతుంది. అందులో ఏ అక్షరానికి ఏ కీ నొక్కాలి అని తెలియజేసే కీ బోర్డు కనబడుతుంది. అందులో చూసి వ్రాయవచ్చు. ఒక పది రోజుల పాటు అప్పుడప్పుడు ఆ కీ బోర్డును చూసి వ్రాయవచ్చు తర్వాత దాని అవసరమే వుండదు. దాని అవసరము లేకుంటే ఆ కీబోర్డును మూసి వేయవచ్చు. ఇంతకీ ముందు మీకుండాల్సింది వ్రాయాలనే ఉత్సాహమే గాని...... విషయ పరిజ్ఞానము గాని, టైప్ చేయడం రాదనే విషయాలు అతి చిన్నవి. ఉత్సాహంతో ప్రయత్నించండి. .

నాకున్న భాషా పరిజ్ఞానం పరిమితం. తప్పులు దొర్లుతాయేమో!?

నిజమే, మొదట్లో తప్పులు దొర్లవచ్చు. కానీ రాసుకుంటూ పోతుంటే ఆ తప్పులన్నీ సద్దుమణిగి, మీ భాష వికసిస్తుంది. వికీపీడియా సభ్యులకిది అనుభవమే. అంతేగాక, మీ రచనలోని భాషా దోషాలను సరిదిద్దడానికి ఇతర సభ్యులు సదా సిద్ధంగా ఉంటారు. కాబట్టి దోషాల గురించి మీకు చింత అక్కరలేదు. “వెనకాడవద్దు, చొరవ చెయ్యండి” అనేది వికీపీడియా విధానాల్లో ఒకటి. చొరవ చేసి రచనలు చెయ్యండి. అనుభవజ్ఞులైన సభ్యులు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీకు అవసరమైన సాయం చేస్తారు. అంతే కాక ఇక్కడ వ్రాస్తున్న వారు మహా రచయితలో, భాషా పండితులో కాదు. అంతా మీలాంటి వారే. మీరు కూడ ఇతరులు వ్రాసిన భాషా దోషాలను సరిదిద్ద వచ్చు. ఇప్పటి వరకు వికిపీడియాలో 60,000 పైగా వ్యాసాలున్నాయి.

2.తెలుగు విక్షనరీ

విక్షనరీ ఎవరైనా పాల్గొనదగిన ఒక స్వేచ్ఛా బహు భాషా పదకోశం. ఇది మామూలు పదకోశాల వంటిది కాదు. ఇక్కడ పదాల సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని పదాల సమాచారాన్ని చేర్చవచ్చు కూడా. ఇది బహు భాషా నిఘంటువు. ప్రపంచ భాషలు అన్నింటిలో ఈ నిఘంటువు తయారవుతున్నది. వాడుకరులు విక్షనరీ లో వున్న తెలుగు పదానికి సరియగు ఇతర భాషా పదాలను ఇక్కడ వ్రాయవచ్చు. తమకు తెలీసిన తెలుగు వాడుకరులలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళము మొదలగు భాషలు కూడ కొందరికి తెలిసి వుండవచ్చు. ఆ భాషలలో ఇక్కడున్న తెలుగు పదానికి అర్థము వ్రాయవచ్చు. అదే విధంగా తెలుగు మాండలిక పదాలు మీకు తెలిసి వుంటే వాటిని కూడ ఇక్కడ వ్రాయవచ్చు. క్రొత్త వాడుకరులకు ఇక్కడ వ్రాయడము చాల సౌలభ్యంగా వుంటుంది. కనుక క్రొత్తవారు తమ రచనలను విక్షనరీలో ప్రారంబించండి. ఇప్పటివరకు ఇందులో సుమారు ఒక లక్ష పదాలు వాటి అర్థాలున్నాయి.

3.తెలుగు వికీసోర్స్

(ఎవరైనా అభివృద్ధిపరచగల స్వేచ్ఛా విజ్ఞాన మూలములు ) ఇందులో కాపీ రైట్ హక్కులు గడువు తీరిపోయిన అనేక గ్రంధాలు ఇక్కడ పొందు పరచబడి వున్నాయి. ఇందులో ప్రవేశిస్తే ప్రక్కప్రక్కన రెండు పుటలున్న ఒక పేజి కనబడుతుంది. కుడి ప్రక్కన వున్న పుటలో ఆ గ్రంధానికి సంబందించిన విషయమున్న ఒక పుట కనబడుతుంది. ఎడమ ప్రక్కన ఖాళీ పుట కనబడుతుంది. మీరు కుడిప్రక్కన వున్న పుటలోని విషయాన్ని యదాతదంగా (సవరించు టాబ్ ను నొక్కి) ఖాళీగా వున్న పుటలో వ్రాయవచ్చు. వ్రాసిన తరువాత దానిని భద్రపరిస్తే సరి. తరువాత మరొక పుటకు వెళ్ళ వచ్చు. ఇందులో చాల గ్రంధాలు మీ సేవలకొరకు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే కొన్ని వేల పుటలు వ్రాయబడి వున్నాయి. మీరు కూడ వ్రాయ0డీ. కొత్తగా చేరిన వారికి ఇందులో వ్రాయడము చాల తేలిక.. ప్రయత్నించండి.

4.తెలుగు వికీబుక్స్ ( ఇది స్వేచ్ఛానకలుహక్కులతో సమిష్టిగా తయారు చేయగల పుస్తకాల జాల స్థలి).

5.తెలుగు వికీకోట్ వ్యాఖ్యలు (వికీవ్యాఖ్య ఒక ఉచిత ఆన్లైను వ్యాఖ్యల భాండాగారము. ఇందులో అన్ని భాషల ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, వాటి అనువాదాలు కూడా లభిస్తాయి) ఇందులో ప్రముఖ వ్యక్తులు చెప్పిన వ్యాఖ్యలు, గ్రంధాలలో ఇచ్చిన వ్యాఖ్యలు మొదలగు నవి వ్రాయవచ్చు. ఈ సోదర ప్రాజెక్టులో విషయము చాల స్వల్పముగా వున్నది. క్రొత్తగా చేరిన వారికి ఇది కూడ సులభమైన వనరు. ప్రయత్నించండి. ఇందులో ప్రవేశించగానే అందులో ఏమేమి వ్రాయాలో అవగాహన అవుతుంది. చొరవగా ప్రయత్నించండి.

వికీపీడియా ఐదు మూల స్థంభాలు
మొదటి స్థంభము

వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. ఇది మౌలిక డాక్యుమెంట్లు దొరికే వనరు కాదు, వార్తాపత్రిక కాదు, ఉచితంగానో, వెలకో వెబ్‌లో స్థలం ఇచ్చే సంస్థ కాదు. ప్రజాస్వామ్య ప్రయోగము కాదు. మీ స్వంత అభిప్రాయాలు, అనుభవాలు, వాదనలు ప్రచురించుకునే స్థలం అంతకంటే కాదు. సమాచారంలో సభ్యులంతా శ్రమించాలి.

రెండవ స్థంభము
వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు. దీనికోసం ఒక్కోసారి వివిధ దృక్కోణాలను చూపవలసి రావచ్చు; విషయానికి సంబంధించిన అన్ని దృక్కోణాలను నిష్పాక్షికంగా, అది ఎవరి దృక్కోణమో వివరంగా తెలిసేలా సందర్భశుద్ధిగా ప్రతిబింబించాలి. దీనివలన చదువరులకు అది ఎవరి దృక్కోణమో తెలుస్తుంది. ఫలానా దృక్కోణం నిజమనీ, సరైనదనీ చూపించరాదు. అవసరమైనచోట మీ వ్యాస మూలాలను, వనరులను ఉటంకించాలి. మరీ ముఖ్యంగా, వివాదాస్పద విషయాల్లో ఇది చాలా అవసరం.
మూడవ స్థంభము
స్వేచ్ఛగాపంచుకోగల విషయమైన వికీపీడియా ఎవరిచేనైనా మార్చుటకు వాడుటకు, సవరించుటకు మరియు పంపిణి చేయటకు వీలైనది.
సంపాదకులందరూ సమాజానికి ఉచితంగా తమ కృతులను అందచేస్తారు కాబట్టి , ఏ ఒక్క సంపాదకునికివ్యాస యజమానిత్వం లేదు మరియు ఏరచనలైనా ఎలాగైనా మార్పులకు గురిఅగుతాయి మరియు పంపిణి అవుతాయి. నకలుహక్కుల చట్టాలను గౌరవించండి మరియు మూలాలనుండి దొంగతనము చేయవద్దు. ఉచితం కాని మాధ్యమాలను అప్పుగా వాడుకొనుట సముచిత వినియోగం క్రింద అనుమతించబడినది కాని మొదట స్వేచ్ఛగాపంచుకోగల వాటిగురించి గట్టి కృషి చేయాలి.
నాల్గవ స్థంభము
వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి. వ్యక్తిగతమైన దాడికి దిగకండి. వ్యర్థ వివాదాలకు తావివ్వకండి. మీ వాదనను నిరూపించుకునేందుకు వికీపీడియాలో అడ్డంకులు సృష్టించక, నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప. మీ వాదనకు అనుకూలంగా బలం పెంచుకునేందుకు మిథ్యా సభ్యులను సృష్టించకండి.
ఐదవ స్థంభము
ఇక్కడ పైన పేర్కొన్న వి కాకుండా, వికీపీడియాలో మరే స్థిర నిబంధనలూ లేవు. వ్యాసాలలో మార్పులు చేర్పులు చేసేందుకు చొరవగా ముందుకు రండి. వ్యాసాన్ని చెడగొడతామేమోనని వెనకాడవద్దు. పాత కూర్పులన్నీ జాగ్రత్తగానే ఉంటాయి కాబట్టి, తిరిగి సరిదిద్దలేనంతగా చెడగొట్టే అవకాశం లేదు. అయితే, ఒక్క విషయం..మీరు ఇక్కడ రాసేది శాశ్వతంగా ఉండే అవకాశం ఉందని గ్రహించండి.


భాషాభిమానమున్న తెలుగు వారందరికీ విజ్ఞప్తి

మీరూ వికీపీడియాలో చేరండి. వ్యాసాలను వ్రాయండి. మీ స్నేహితులనూ చేర్పించండి. వారిచేత కూడ వ్రాయించండి. మీరు ఉపాద్యాయులైతే మీ విద్యార్థులకు వికీపీడియా గురించి అవగాహన కల్పించండి. భావి తరాల వారికి ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి. మీరు వ్రాసిన సమాచారము చిరకాలము మీపేరుతోనే వుంటాయి. మీరు సృష్టించిన వ్యాసము యొక్క సృష్టి కర్త గా మీపేరే నామోదవుతుంది. ఆ తర్వాత ఆ వ్యాసంలో ఎవరెవరు ఎంత విషయాన్ని పొందు పరచినా సృష్టికర్తగా మీపేరే వుంటుంది. ఆ విధంగా మీకు శ్రేయస్సు ఆపాదించ బడుతుంది. ఇది మీకు గర్వ కారణం కాదా........ తెలుగు భాషాభిమానమున్న మీరందరు ఈ ఉద్యమంలో పాల్గొని తెలుగు భాషకు మీవంతు సేవ చేయండి.

భాస్కరనాయుడు (చర్చ) 15:24, 10 ఆగష్టు 2015 (UTC)