Jump to content

వాడుకరి:Drgvlal

వికీపీడియా నుండి

డా. జి. వెంకట లాల్

తెలుగు ఉపన్యాసకులు

గురుబ్రహ్మ , ఆచార్య దేవోభవ, విద్య తేజ, విద్య విశిష్ట, విద్య రత్న, సేవా జ్యోతి, మహాత్మగాంధీ విశ్వ శాంతి, పద్మ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ, గ్లోబల్ బెస్ట్ టీచర్ అవార్డుల బిరుదాంకితుడు డా. జి. వెంకట లాల్ పుట్టినతేదీ 12/06/1977. జన్మస్థలం: పెద్ద కిష్టాపురం, గార్ల మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. తండ్రి కీ.శే!! బాల్య (లేటు), తల్లి శ్రీమతి తులసి. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఉన్న కొంత వ్యవసాయం చేసుకుంటూ, కూలీ పనులు చేేేేసుకుంటూ కష్టపడి చదివి, డిగ్రీ కళాశాల ఉపన్యాసకులుగా ఉద్యోగం సాధించి, ఎంతోమంది విద్యార్ధులను ఉన్నత స్థానాలకు చేర్చి, చాలామంది విద్యార్దులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

విద్యాభ్యాసం: ప్రాధమిక విద్య స్వగ్రామంలో పెద్ద కిష్టాపురంలోని ప్రాధమిక పాఠశాలలో, ఉన్నత విద్య గార్ల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేసారు. ఇంటర్ బయ్యారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ ఖమ్మంలోని సిద్ధారెడ్డి కళాశాలలో పూర్తి చేసారు. తరువాత యం.ఏ. (తెలుగు), యం.ఫిల్. కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో పూర్తి చేసారు. పిహెచ్.డి.ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరులో పూర్తి చేసారు.

ఉద్యోగం: 1. వి.యస్.ఆర్ & యన్. వి. ఆర్. కళాశాల, తెనాలిలో 2002 నవంబరు నుండి తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. 2. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఖమ్మం లో 10 సంవత్సరాలు తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసారు. 3. సాంఘిక సంక్షేమ పాఠశాల, జనగామలో కాంట్రాక్టు తెలుగు అధ్యాపకులుగా రెండు సంవత్సరాలు పనిచేసారు. 4. ప్రస్తుతం ఛత్రపతి శివాజీ త్రి శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంగారెడ్డిగూడెంలో తెలుగు శాఖాధ్యక్షులుగా పని చేస్తున్నారు.[1]

రచనలు : I. పుస్తకాలు: 1.తెలుగు వ్యాకరణం, 2. తెలుగు నవలల్లో లంబాడీల జీవన చిత్రణ, 3. కొర్రపాటి గంగాధర రావు నవలానుశీలన, 4. ఖమ్మం జిల్లా బంజారా పండుగలు, 5. అడవి పక్షి ఆలాపన (కవిత సంపుటి), 6. కర్త కాదు క్రియ (కవిత సంపుటి). 7. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న కోణాలు (వ్యాస సంపుటి) మొదలైనవి. వీరు రచించిన అడవి పక్షి ఆలాపన కవిత ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖ పట్నం MA తెలుగు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఒక పాఠ్యాంశంగా బోధిస్తున్నారు.[2]

సంపాదకత్వం: రెండు అంతర్జాతీయ పత్రికలకు ప్రధాన సంపాదకుడిగా వ్యవహరిస్తున్నారు.. అవి. 1. సాహిత్య తరంగిణి (తెలుగు పరిశోధన పత్రిక), 2. యునైటెడ్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మల్టిడిసిప్లీనరీ రీసెర్చ్ (UIJMR) మొదలైనవి. 3. సంపాదక మండలి సభ్యులుగా 8 అంతర్జాతీయ పత్రికలకు పనిచేస్తున్నారు.

II.పరిశోధన పత్రాలు: అంతర్జాతీయ, జాతీయ పత్రికల్లో 60 కి పైగా వ్యాసాలు ప్రచురించబడ్డాయి.అంతర్జాతీయ, జాతీయ సదస్సుల్లో 55 కి పైగా పత్రాలు సమర్పించారు.

III. అవార్డులు: 30 కి పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. వాటిలో కొన్ని....

1. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2013 లో అంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారిచే అందుకున్నారు.

2. ఉత్తమ జాతీయ సేవా అధికారి అవార్డు, అంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే 2011 లో అందుకున్నారు.

3. ఉత్తమ రక్తదాన శిభిర నిర్వాహక అవార్డు 2010, ఉత్తమ మాస్టర్ ట్రయినింగ్ అధికారి అవార్డు, ఉత్తమ సాంస్కృతిక శాఖ కన్వీనర్ 2011 గా ఖమ్మం జిల్లా కలెక్టర్లల చేతుల మీదుగా అందుకున్నారు.

4. గురు బ్రహ్మ జాతీయ అవార్డు 2015 , ఆచార్య దేవో భవ జాతీయ అవార్డు 2015, ఆణిముత్యం జాతీయ అవార్డు 2015, సేవా జ్యోతి జాతీయ అవార్డు 2017, విద్యా విశిష్ట జాతీయ అవార్డు 2018, విద్యా భూషణ్ జాతీయ అవార్డు 2019, విద్యా తేజ జాతీయ అవార్డు 2020 మొదలైనవి స్వచ్చంధ సంస్థలైనటువంటి మధర్ తెరిస్సా, ప్రియదర్శిని, విన్నర్స్, బాపూజీ, ఆరాధన సంస్థలచే అందుకున్నారు.

5. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ టీచరు రోల్ మోడల్ అవార్డు 2017, ప్రైడ్ ఆఫ్ నేషన్ ప్రతిభ సన్మాన అవార్డు 2018 సంవత్సరాలలో యం.వి.యల్.ఏ ట్రస్టు, ముంబాయి వారిచే అందుకున్నారు.

6. పద్మ అవార్డు 2019, 2020 సంవత్సరాలలో క్విజ్ విభాగంలో భారత ప్రభుత్వంచే అందుకున్నారు.

7. మహాత్మా గాంధీ పీస్ అవార్డు, 2020 లో మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ ఫౌండేషన్ భువనేశ్వర్ ఒరిస్సా వారిచే అందుకున్నారు.

8. వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ 2024 లో జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని వాల్డ్ రికార్డ్ యూనియన్ వారిచే అందుకున్నారు.

9. నేషనల్ ఎక్స్లెన్స్ అఛీవర్ అవార్డు 2024 లో వెల్ రెడ్ ఫౌండేషన్, వెస్ట్ బెంగాల్ వారిచే అందుకున్నారు.

10. డా. ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ ప్రతిభ అవార్డు 2024 లో సదరన్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఆర్గనైజేషన్, గుంటూరు వారిచే అందుకున్నారు.

  1. "Gmail". accounts.google.com. Retrieved 2024-09-09.
  2. "Gmail". accounts.google.com. Retrieved 2024-09-09.