వాడుకరి:ERLA.SRINIVAS1983/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పోడు భూముల పై ఆదివాసీల పోరు.....[మార్చు]

మూడుతరాలుగా  అడవులనే జీవనాధారంగా చేసుకొని బతుకుతున్న బ్రతుకులు ఆదివాసీ  గిరిజనులవి..... అడవుల్లో భూములను సాగు చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్న వారి బ్రతుకులు ఇప్పుడు అంధకారంలో పడ్డాయి...... అడవులను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ మొదలుపెట్టిన హరితహారం కార్యక్రమం తమ జీవితాలను బుగ్గిపాలు చేస్తుందంటున్నారు.... మొక్కలను నాటడానికి వెళ్లిన అటవీ అధికారులకు,,,ఆ ప్రాంత గిరిజనులకు మధ్య తలెత్తుతున్న వివాదాలతో పచ్చని అడవులు కాస్త ఎరుపు వర్ణాలు గా మారుతున్నాయి......గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి వెళుతున్న నాయకులను,,, ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తూ వారిని అరెస్టు చేస్తున్నారు......

           జల్- జంగల్- జమిన్ అనే నినాదంతో ఆదివాసుల హక్కులకై నిజాం ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో కొమరం భీమ్ ఉద్యమించిన జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ ఖిల్లా....తమ హక్కుల కోసం,,,, మరొక ఉద్యమం తీవ్ర రూపం దాల్చే పరిస్థితి నెలకొంది... మూడు తరాల నుండి ఆ అడవులనే నమ్ముకొని తమ బ్రతుకులను గడుపుతున్న అమాయకపు గిరిజన తండాలలో ఇప్పుడు ఉద్యమ వాతావరణాలకు తెలంగాణ సర్కార్ ఆజ్యం పోసినట్టు అవుతోంది.....తాము సాగు చేస్తున్న పోడు భూముల పై తమకు హక్కు పత్రాలు ఇవ్వాలని,,,ఎన్నోసార్లు ఆదివాసీల ఉద్యమాలు చేశారు....ఆ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కి కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా అర్హులైన ఆదివాసీలకు పట్టా పత్రాలను ఇస్తామన్నారు...కానీ ఆ హామీలు ఎన్నికల సమయంలో ఓట్లు దండుకోవడానికి తమకు పట్టాలు ఇస్తామని చెప్పి,,, తీరా ఎన్నికల్లో గెలిచాక వారిని విస్మరిస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి..... ఆరు నెలల్లో ఆదివాసుల భూములను పరిష్కారం చేస్తామని చెప్పి రెండోసారి గద్దె నెక్కిన ప్రభుత్వo,, వారి హాములను విస్మరించి ఆదివాసీలపై సవతితల్లి ప్రేమను ఒలబోస్తుందంటున్నారు...

     

      మొన్న కాన్కూర్,,, నిన్న సార్సాలా  ప్రాంతాల పేర్లు ఏవైనా అక్కడి అడవుల్లో గిరిజనులకు,,,అటవీ అధికారులకు  జరుగుతున్న గొడవలతో పచ్చని అడవులు ఎరుపుగా వనాలుగా మారుతున్నారు.... అడవులనే నమ్ముకొని పోడు భూములను సాగు చేస్తూ ప్రశాంతంగా బ్రతికిన ఆ గిరిజన గుడాలు ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తున్నాయి....  మూడు తరాలుగా ఆ గిరిజనులు అడవుల్లో పోడు వ్యవసాయం చేస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు...  పోడు భూములకు సంబంధించి తమకు పట్టాలు ఇవ్వాలని ఎన్నోసార్లు ప్రభుత్వాలకు మొరపెట్టుకున్న,,ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి ముందు వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి,,, ఆ  ప్రాంత ఎమ్మెల్యేలను గెలిపించుకున్న తర్వాత వారిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.....హరిత హార కార్యక్రమం పేరిట టీఆర్ఎస్ సర్కార్ మొక్కలను నాటే క్రమంలో పోదు భూములను సాగు చేస్తున్న ఆదివాసీల అటవీ భూముల్లోకి వెళ్లడంతో అక్కడ అటవీ అధికారులకు,, అదివాసులు జరుగుతున్న గోడవలతో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి...

         గత సంవత్సరం జైపూర్ మండలం కాన్కూర్ గ్రామంలో అటవీ అధికారులు పోలీస్ బలగాలతో అక్కడ మొక్కలను నాటడానికి వెళ్లారు.. దీనితో అక్కడ పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి... తాము ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నామని ఇక్కడ మొక్కలు నాటితే సహించేది లేదని,,, గ్రామస్థులందురు హై టెన్షన్ పోల్ ఎక్కగా,, మరి కొందరు వాటర్ ట్యాంక్ ఎక్కడంతో స్థానిక రాజకీయ నేతల చొరవతో అది ఎక్కడికక్కడే ఆగిపోయాయి.కానీ ఇప్పుడు సార్సాలా గ్రామంలో నెకొన్న ఉద్రిక్త పరిస్థితులతో మరొకమారు పోడు భూముల సమస్య దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది... మొదట స్థానిక mla కొనేరు. కొనప్ప తమ్ముడు కొనేరు వంశీ fro అనిత పై చేసిన దాడి కావాలనే టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే కుట్ర పన్ని దాడి చేయించిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.... దాడి చేసిన మరుసటి రోజున బారి భద్రతా బలగాలతో ఆ ప్రాంతంలో మొక్కలను నాటించి గిరిజనుల బ్రతుకులను బుగ్గిపాలు చేసారంటున్నారు వారు... అసలు అక్కడ ఏం జరిగిందని తెలుసుకోవడానికి తాము వెళ్తే ,,, అక్కడికి ఎవరు వెళ్లకుండా ఎక్కడికక్కడ ఆపివేస్తూ అక్రమ అరెస్టులు చేయించడం హేయమైన చర్య అంటున్నారు.... తాము అక్కడికి వెళ్తే వారు ఆడివాసులకు తాము చేసిన అన్యాయాలు బయటకు వస్తాయని తమను పోనియ్యడం లేదంటున్నారు వారు....ఖచ్చితంగా వాటి హక్కుల కోసం మరొకమారు ఉద్యమం పోరాట యోధుడైన కోమరంభీం స్పూర్తితో,, అదే జిల్లా నుండి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి....

          వాస్తవానికి వస్తే 2005 డిసెంబర్ 13 ముందు ఎవరైతే గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమి ఉందొ  ఆర్వోఎఫ్ఆర్ ప్రకారం,,,2006 అటవీ హక్కుల చట్టం కింద పట్టాలను ఇవ్వడానికి  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పట్టాల కోసం దరఖాస్తులను స్వీకరించారు...ఇందుకు గాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 61353 అర్జీలను స్వీకరించారు,,, వాటిలో 20,716 అర్జీలను తిరస్కరించారు.. అయితే వారికోసం 5,20,880 ఎకరాల భూమిలో కొందరికి పట్టాలను ఇచ్చారు.. కాగా అటవీ హద్దులు సరిగా లేకపోవడంతో పట్టాలను కేటాయించడం ఇబ్బందిగా మారింది. చివరికి అటవీ ,, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జాయింట్ సర్వే చేస్తున్నారు.గిరిజనులకు పట్టాలను ఇస్తున్నారని,,,అడవులను నరికివేసి దిశగా అడుగులు పడుతున్నాయని పర్యావరణ పరిరక్షకులు సుప్రీం కోర్ట్ లో పిటిషన్ వేశారు.. సుప్రీం కోర్ట్ లో పిటిషన్ వేయడంతో మళ్ళా మొదటికే వచ్చింది... మొదటగా సుప్రీం కోర్ట్ 13 ఫిబ్రవరి 2019 న తీర్పు నిచ్చింది,, గిరిజను వెంటనే అటవీ భూములను ఖాళి చెయ్యమని తీర్పు నిచ్చారు.. అనంతరం జరిగిన కొన్ని పరిణామాలతో వారు ఇచ్చిన తీర్పు పైన ఫిబ్రవరి 8  మల్లి స్టే విధించింది....

            ఉమ్మడి అదిలాబాద్ లో ఆదివాసులపై తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో ఐక్యరాజ్యసమితి నిపుణులు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను రాశారు... అటవీ భూములతో ఆదివాసులకు విడదీయరాని బంధం ఉందని ఈ అడవి భూములను తమ బ్రతుకులకు జీవనాధారంగా చేసుకొని బ్రతుకుతున్న వారిని అక్కడి నుంచి తరలించే ప్రక్రియను నిలిపివేయాలన్నారు.. ఆదివాసీలు అటవీ ప్రాంతాలను ఆక్రమించడం వల్ల అడవులు అంతరించిపోతున్నాయి వన్యప్రాణి సంరక్షణ సంస్థలు వేసిన కేసులో ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం ఆదివాసీలను ఖాళీ చేయించేందుకు తీసుకున్న చర్యల విషయాన్ని గుర్తు చేసింది...స్థానిక ప్రజలు అక్కడి భూములకు,, అడవులకు యజమానులను ఐక్యరాజ్య రాజ్య సమితి పర్యవేక్షకురాలు  విక్టోరియా  పేర్కొన్నారు... దశాబ్దాలుగా  అడవులను రక్షించడంలో కీలక పాత్ర పోషించిన  ఆదివాసీ గిరిజనులను  కబ్జాదారులు గా ముద్ర వేయడాన్ని  ఆమె తిరస్కరించారు..ఆదివాసులను ఆ ప్రాంతాల నుండి తరలిస్తే  వారి జీవనోపాధిని కోల్పోవడమే కాకుండా,,సంస్కృతి ని సైతం కోల్పోతారని ఆమె అభిప్రాయపడ్డారు. రక్షణ పేరుతో ఇప్పటికే అడవి ప్రాంతాల నుంచి అనేకమంది ఖాళీ చేయించారని వారన్నారు...  కానీ  ఆదివాసీలు పులుల సంరక్షణ ప్రాంతాల్లో నివసించినప్పుడే పులుల సంఖ్య పెరిగిందన్నారు..  తరతరాలుగా  భారతీయ ఆదివాసులు వన్యప్రాణుల తో కలిసి జీవించడం తో పాటు  వాటిని సంపదగా భావించి  సంరక్షించారని గుర్తు చేశారు.. అటవీ హక్కుల కోసం గిరిజనులు పెట్టుకున్న దరఖాస్తులపై  పారదర్శకమైన  విచారణ జరిపి  వారి జీవితాలకు భరోసా కల్పించాలని,,  అలా కాకుండా  ఆదివాసీలను  అక్రమంగా అక్కడి నుంచి ఖాళీ చేయించాలని చూస్తే  తెలంగాణలో మరొక  మలిదశ ఆదివాసీల ఉద్యమాలు జరుగుతే  టిఆర్ఎస్ సర్కార్ తో పాటు,,, స్థానిక నేతలకు సైతం గడ్డుకాలం కచ్చితంగా వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.....