Jump to content

వాడుకరి:EswarNovelist

వికీపీడియా నుండి


Sanjay Sree Raj(Actor)

Sanjay Sree Raj
దస్త్రం:Sanjay Sree Raj
in 2019
జననం 21 February 1992
Vizag
రంగం Telugu Film Industry
కృతులు Gully gangsters

సంజయ్ శ్రీ రాజ్ అసలు పేరు బడి పృధ్వీరాజ్. గల్లి గ్యాంగ్ స్టార్స్ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. 2012 నుండి మొదలు పెట్టిన సినీ ప్రయాణం 2024 కు తన గమ్యాన్ని చేరుకున్నాడు. ఎన్నో లఘు చిత్రాల్లో నటించి ప్రతి డైరెక్టర్ మనసును మెప్పించాడు. ఎన్నో అవకాశాలు వచ్చిన పోయిన ఎలాంటి నిరుత్సాహం పడకుండా బలమైన సంకల్పంతో ప్రయత్నించారు సంజయ్. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ జూలై 26వ తారీకు నాలుగేళ్ల కష్టం తరువాత గల్లి గ్యాంగ్ స్టార్ సినిమా రిలీజ్ కాబోతుంది.

బాల్యం

సంజయ్ 21 ఫిబ్రవరి 1992 జన్మించారు. ఈయన పుట్టి పెరిగింది వైజాగ్లో. స్టెల్లా మేరీస్ స్కూల్లో తన విద్యాభ్యాసం పూర్తి చేయగా, నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. అప్పటి నుండే సినిమాలు ఎక్కువ చూసేవాడు. పృథ్వీరాజ్ తను పెరిగే కొద్దీ సినిమా మీద ప్రేమ కూడా విపరీతంగా పెంచుకున్నాడు. ఆ పిచ్చితో ఇంజనీరింగ్ చేస్తుండగానే వైజాగ్ లో ఒక యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు.

కుటుంబం

సంజయ్ దిగు మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినవాడు. సంజయ్ వాళ్ల నాన్న పేరు బడి కోదండరావు. తల్లి అరుణ. తమ్ముడు ఉదయ్ శంకర్. సంజయ్ తండ్రి కోదండ రావు గారు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడంతో ఆయనకున్న సినిమా పిచ్చి సంజయ్ కూడా వచ్చింది. సంజయ్ పుట్టిన తర్వాతే సినిమాలు మానేసి కేబుల్ బిజినెస్ మొదలు పెట్టారు. కొన్నేళ్ల తర్వాత కేబుల్ బిజినెస్ లో నష్టం వచ్చి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. 2017లో జీవితాలు మారుతాయని హార్బర్ లో అప్పు చేసి మరి బోట్ తీసుకున్నారు. భారీ నష్టాలు వచ్చాయి. కష్టాలు పడుతున్న నాన్నను చూసి సినిమాల్లో చేయలేక, లఘు చిత్రాలు కూడా చేయడం మానేసి ఉద్యోగం చేసుకునేవాడు సంజయ్ శ్రీ రాజ్. 2019లో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా తండ్రి చనిపోవడంతో ఒక్కసారిగా సంజయ్ జీవితం మారిపోయింది.

Professional career

సినీ ప్రయాణం

2012 మొదలైన సినీ ప్రయాణం 2024లో జూలై 26 విడుదల కాబోతున్న గల్లి గ్యాంగ్ స్టార్స్ సినిమాతో గమ్యం చేరుకున్నారు. గతంలో దర్శకుడు కుమార్ వట్టి(లేట్) దర్శకత్వంలో శ్రీ విష్ణు నటించిన మా అబ్బాయి సినిమాలో చిన్న పాత్ర చేశారు సంజయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమాని సంజయ్. బీటెక్ పూర్తి అయిపోయాక దిలీప్ అని తన ఇంజనీరింగ్ ఫ్రెండ్ వల్ల అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ రోజు పరిచయం అయ్యాడు ఈశ్వర్. ఉద్యోగం మానేసి మరి సినిమాల్లో ప్రయత్నిస్తున్నాడని ఎంతో మంది తన దగ్గర స్నేహితులే నీ వల్ల కాదు, మనకి ఎందుకు అని నిరుత్సాహ పరిచారు. కానీ ఎక్కడా వెనకడుగు వేయలేదు సంజయ్. దానికి కారణం ఇద్దరే ఇద్దరు. సంజయ్ షార్ట్ ఫిలిమ్స్ నుండి సినిమాల వరకు ప్రయాణించడానికి సహాయం చేసిన వాళ్ళు ఇద్దరు స్నేహితులు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న మొదటి దశలో తన స్నేహితుడు ఈశ్వర ప్రణీత్ సాయం చేశాడు. రెండో దశలో తాను సినిమా చేయడానికి ఎంతో ప్రోత్సహిస్తూ, ప్రతి విషయంలో తోడుగా ఉంది హారిక. మా డైరెక్టర్ సంతోష్ షార్ట్ ఫిలిం చేస్తున్న సమయంలో పరిచయం అయింది హారిక. కృతజ్ఞతలు చెప్పుకుంటే సరిపోదని తనకి సాయం చేసిన వాళ్లని మర్చిపోకుండా గుండెల్లో, అలాగే తన జీవితంలో స్థానం ఇచ్చాడు. 2017 లో రిలీజ్ అయిన (మా అబ్బాయి) సినిమా దర్శకుడు కుమార్ వట్టి గారు, హీరో శ్రీ విష్ణు గారు అలాగే కో డైరెక్టర్ మహేష్ రాజ్ గారు చాలా బాగా ప్రోత్సహించారు. 2019 నుండి మాటలు జరుగుతుండగా సంజయ్ బాగా నటిస్తాడని దర్శకుడు వెంకటేష్ కొండిపోగు అభిప్రాయపడి అతని మీద ఒక మంచి కథ రాసుకుని సినిమా షూటింగ్ 2020 లో మొదలుపెట్టారు. క్లాస్ గా కనిపించే సంజయ్ శ్రీరాజ్ ను ఊర మాస్ లుక్ తో సిల్వర్ స్క్రీన్ మీదకు పరిచయం చేయబోతున్నారు. 2024 జూలై 26న గల్లీ గ్యాంగ్ స్టార్స్ పక్కా మాస్ నెల్లూరు లోకల్ సినిమాతో సంజయ్ ని లాంచ్ చేస్తున్నారు దర్శకుడు వెంకటేష్.

లఘు చిత్రాలు ఇయర్
3 పేజెస్ (2013)

అలాగే

నీకోసమే (2014)
ప్రేమకై (2014)
ద డ్రీమర్ (2016)
ద క్లూ (2016)
బుట్ట బొమ్మ (2018)
లాంటి కథ (2017)
వందేమాతరం (2018)
మంచి కాఫీలాంటి కథ (2019)
ముక్తపదగ్రస్తం (2019)
ఏయ్ రాజా ఈరోజు మనదేరా (2022)
సినిమాలు release date
మా అబ్బాయి (17 March 2017)
గల్లి గ్యాంగ్ స్టార్స్ (26 July 2024)