వాడుకరి:Gayamma/ప్రయోగశాల
కథా ప్రక్రియ ఎప్పుడు మొదలయ్యిందో ఏమో తెలియదు. బహుశా ఆదిమానవులు రాత్రి వేళల్లో నెగడు చుట్టూ చేరినప్పుడు తాము చూసిన, విన్న సాహసాలను, వింతలను వర్ణించి చెప్పుతూ చెపుతూ, కథలకు బాటలు వేశారేమో. లేదా నలుగురు కలిసి దారివెంబడి నడుస్తూ తమ ప్రయాణములో అలసట తెలియకుండా ఉండటానికి తమకి ఉన్న ఊహలకి రంగులు అద్ది కథలకి రూపం ఇచ్చాడేమో. తమ ఆలోచనలకి , అనుభవాలకి అందమైన కల్పనలను జోడించి జానపదుల జీవనంలో సన్నివేశాలను కథలుఅగా అందించారేమో. ఏదైనా కావచ్చు. రామాయణ కథను నారదుడు వాల్మీకి మహర్షికి సంక్షిప్తంగా చెప్పినట్టు మనము చదువుకున్నాము. ఈ వ్యాసములో కొన్ని కథల పేర్లని , ఆయా రచయితలని , కొన్ని కథలని గుర్తుకు తెచ్చుకుందాము.
హాలుని గాధాసప్తశతి కథలు. ఇందులో మొత్తము ఏడు వందల కథలు ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్న పద్యములుగా మనకు కనిపిస్తాయి.
భేతాళ పంచవింశతి. బేతాళ పంచవింశతి యొక్క సంస్కృత మూల గ్రంథం దొరకడము లేదు.. దీనికి రెండు సంస్కృత పాఠంతరాలు లభ్యం అవుతున్నాయి. అవి 1) క్షేమేంద్రుని విరచితమైన బృహత్కథామంజరి 2) సోమదేవసూరి విరచితమైన ‘కథాసరిత్సాగరం’ ఈ రెండింటిలోనూ 25 బేతాళ కథలు చోటుచేసుకొన్నాయి.
పంచతంత్ర కథలు. సంస్కృతములో విష్ణుశర్మ అనే పండితుడు రచించిన కథలు ఇవి. తెలుగులో పరవస్తు చిన్న్నయ్య సూరి, కందుకూరి వీరేశలింగంపంతులుగారు తెలుగులోనికి అనువదించారు. విష్ణుశర్మ మూర్ఖులైన రాజకుమారులను వివేకవంతులుగా మార్చటానికి ఎన్నుకున్న విధానము కథా ప్రక్రియ.