Jump to content

వాడుకరి:Indu gnana vedika/books

వికీపీడియా నుండి

త్రైత సిద్ధాంత భగవద్గీత

[మార్చు]
coverpage of Thraitha Siddantha Bhagawad Geetha
coverpage of Thraitha Siddantha Bhagawad Geetha

(578 శ్లోకముల వచన గ్రంథము)(మహా జ్ఞానవంతమైనది.) సృష్ఠి ఆదిలో దేవునిచే చెప్పబడిన స్వచ్ఛమైన దైవజ్ఞానము ఈనాడు త్రైత సిద్ధాంత భగవద్గీతగా మనకు లభించడము గొప్ప అదృష్టము. భగవద్గీత నిజార్థము, పరమాత్మ, ఆత్మ, జీవాత్మలనబడు మూడు ఆత్మల సవివరము సులభశైలిలో కొద్దిపాటి చదువు కల్గినవారు సైతము చాలా సునాయాసముగా అర్థము చేసుకొను విధముగా తీర్చి దిద్దబడినది. పూర్తి శాస్త్రబద్దమై, ఎటువంటి హేతువాద ప్రశ్నకైనా సరిjైున సమాధానము లభించు ఏకైక గ్రంథ రాజము త్రైత సిద్ధాంత భగవద్గీత. విశ్వమాన వాళికి అత్యంత అవసరమైన సమాచారముతో కూడుకొనియున్న ప్రప్రథమ దైవ గ్రంథమే ఈ భగవద్గీత. ఈ గ్రంథమునందలి సాంఖ్యయోగము విజ్ఞాన శాస్త్రవేత్తలకే పెను సవాలు విసరగలదు. సామాన్య శాస్త్రములకందని జ్ఞానము విజ్ఞాన సహితముగా ఈ గ్రంథమునందు పొందుపరచబడినది. అంతేకాక వివిధ యోగములైన కర్మ, బ్రహ్మయోగముల వివరము మరి ఏ ఇతర గ్రంథమునందు కానరాదు. అద్వైత, విశిష్ఠాద్వైత, ద్వైత సిద్ధాంతములను అధిగమించిన త్రైత సిద్ధాంత ఆధారముగా యోగీశ్వరుల ఆధ్యాత్మిక శక్తితో రూపొందించబడిన మహాశక్తివంతమైన గ్రంథరాజమే ఈ బ్రహ్మవిద్యాశాస్త్రమైన త్రైత సిద్ధాంత భగవద్గీత. గమనిక : పాఠకులు ముందుమాటను చదువుట అత్యంత ముఖ్యమైన, అవసరమైన విషయము.

ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు

[మార్చు]
coverpage
coverpage

(మహా వివరణాత్మకమైనది.) ఆధ్యాత్మికము అను పదమునకు శాస్త్రబద్ధమైన అర్థము దొరకక, ఆధ్యాత్మికత చిరునామాకై వెదకి విసిగి వేసారిన జిజ్ఞాసులకు ఎట్టకేలకు లభించు స్వచ్ఛమైన ఆధ్యాత్మిక నిధియే ఈ గ్రంథము. ప్రశ్నలు అడుగరాదను నియమమును విధించు, ఆచరించు స్వామీజీలు, పీఠాధిపతులు, భగవానులు రోజుకొకరు చొప్పున పుట్టుకొస్తున్న ఈ సమాజములో ఆధ్యాత్మిక రంగమునకు సంబంధించిన ఎటువంటి ప్రశ్నకైనా సమాధానము చెప్పగల్గిన, ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవలసిన గ్రంథమే ఆధ్యాత్మిక ప్రశ్నలు` జవాబులు. ఈ గ్రంథములో పాఠకులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడమేకాక, వారి ఊహకందని ప్రశ్నలను సృష్ఠించి, సంధించి నిజమైన ఆధ్యాత్మిక ప్రశ్నకు నిర్వచనమిస్తూ, ఒకేఒక్క వాక్యములో జవాబు, దానికి తగిన వివరణ ఈ గ్రంథమునకు ప్రత్యేక ఆకర్షణ. ఈ గ్రంథములో మొదటి భాగమున ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలు, రెండవ భాగమున రచయిత యోగీశ్వరుల యొక్క సంచలనాత్మక ప్రశ్నలు, జవాబులు కలవు. ఈ గ్రంథము పరిపూర్ణముగా అవగాహన చేసుకొన్న పాఠకులు నిజమైన ఆధ్యాత్మికవేత్తలుగా మారగలరనునది అక్షర సత్యము.

దేవాలయ రహస్యములు

[మార్చు]
Cover page
Cover page

(మహా గుహ్యమైనది.) ప్రపంచ పటమున భారతదేశము ఆధ్యాత్మికతకు పుట్టినిల్లుగా చెప్పబడినా దక్షిణ భారతదేశము స్వచ్ఛమైన దైవ జ్ఞానమునకు పట్టుకొమ్మలాంటిది. దక్షిణ భారతదేశములో నిర్మించబడిన దేవాలయములు, సృష్ఠి ఆదిలో దేవుని జ్ఞానమునకు సంకేతములై, సందేశములై విరాజిల్లుచున్నవి. దేవాలయములందలి విధివిధానములకు సరిjైున అర్థము తెలియని దురదృష్టకర పరిస్థితిలో ఈనాడు మనమున్నాము. మన తరువాత తరములవారు అడుగు ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో దేవాలయముల మనుగడను చేతులారా మనమే ప్రశ్నార్థకము చేసుకొనుచున్నాము. ఆధ్యాత్మిక రహస్యములను దేవాలయములలో అడుగడుగునా ఆనాటి జ్ఞానులు నిక్షిప్తము చేయగా, వాటిని అన్వేషించువారికి ఆ రహస్యములు తెలియకుండా పోయినటువంటి సమయములలో ఎడారిలో ఒయాసిస్సు వలె లభించు అపురూపమైన ఆధ్యాత్మిక గ్రంథమే ‘‘దేవాలయ రహస్యములు’’. ఈ గ్రంథములో దేవాలయ గోపురమునుండి మొదలుకొని గర్భగుడిలో సాకార ప్రతిమ వరకూ, మరియూ ఆ ప్రతిమకు చేయు పూజా విధానములోని ప్రతి ఒక్క కార్యమునకూ సులభశైలిలో, శాస్త్రబద్దమైన వివరము ఈయబడినది. ఇంతవరకూ ఎవ్వరూ విప్పి చెప్పలేని ఆధ్యాత్మిక రహస్యముల గుట్టును మొట్టమొదటిసారి ప్రబోధానంద యోగీశ్వరులు ప్రపంచమునకు తేటతెల్లము చేసినారు.

ఇందూ సాంప్రదాయములు

[మార్చు]
Cover page
Cover page

(మహా సాంప్రదాయమైనది.) ‘‘అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యముకాదు, సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యముకాదు. అను సంచలనాత్మక వాక్యము ప్రకారము మన దేశమును కోట్లాదిమంది హిందూ దేశమనినా, వాస్తమునకు ఇది ఇందూ దేశమనీ, హిందువు అను పదమునకు శాస్త్రబద్దమైన అర్థము లేదనీ, ఇందూ అను పదమునకు పూర్తి శాస్త్రబ్దత ఉందనీ, ఇందువు అనగా జ్ఞాని అనీ, భారతదేశము పూర్తి దైవజ్ఞానమునకు నిలయమై ఉండెడిదనీ దీనికి ఋజువుగా ఈ దేశములోని సాంప్రదాయలు ఇప్పటికీ మిగిలి ఉన్నవనీ సవివరముగా తెలియజేసిన గ్రంథమే ‘‘ఇందూ సాంప్రదాయములు’’ ఈ సాంప్రదాయములు ఈనాడు దురదృష్టవశాత్తు ఒక మతమునకు చెందినవిగా చెప్పుకొన్నప్పటికీ, వాస్తవానికి ఇవి ఒక మనిషి ఆచరించవలసిన విధానమనీ, మనిషి దేవునివైపు పోవుటకు సాధనములనీ, ఈ గ్రంథము చదివిన తరువాత అర్థము కాగలదు. ఈ గ్రంథములో, పుట్టుక నుంచి, చివరకు మరణము వరకు మనిషి జీవితములో అనుసరించు సాంప్రదాయములు, ఆచారములు అన్నియు అతనిని ఆధ్యాత్మిక మార్గములో నడిపించునవై ఉన్నవి.

జనన మరణ సిద్ధాంతము

[మార్చు]
Cover page
Cover page

(మహా విజ్ఞానవంతమైనది.) ప్రపంచ వైద్యరంగానికే పెను సవాలుగా నిలచిన ఈ సిద్ధాంతము ప్రపంచములో మొదటిసారిగా ఆవిష్కరించడినది. భగవద్గీత సాంఖ్యయోగమను అధ్యాయమునందలి ‘‘వాసాంసి జీర్ణాని’’ అను శ్లోకమునకు శాస్త్రబద్ధమైన ఆధారము నిచ్చుచూ బ్రహ్మ విద్యాశాస్త్రమైన భగవద్గీత మిగిలిన ప్రపంచ శాస్త్రములకు మూలమై వున్నది. ఈ గ్రంథమునందు గర్భస్థ శిశువుకు ప్రాణము ఉండదను సంచలనాత్మక సత్యమును ప్రబోధానంద యోగీశ్వర్లు పూర్తి శాస్త్రబద్ధముగా వివరించినారు. ప్రతి ఒక్కరూ ముఖ్యముగా విజ్ఞానవేత్తలమనుకొనువారు తప్పనిసరిగా చదువవలసిన సూపర్‌ సైన్సుతో కూడుకొనియున్న గ్రంథమే ‘‘జనన మరణ సిద్ధాంతము’’. ఈ గ్రంథములో అండజ, పిండజ, ఉద్భిజ జీవరాశుల యొక్క జనన రహస్యము చాలా విపులముగా, సాక్ష్యాధారము లతో సహా ఋజువు చేయబడినది. అదే విధముగా మరణావస్థ గురించి కళ్ళకు కట్టినట్లు చెప్పబడినది.

త్రైత సిద్ధాంతము

[మార్చు]
coverpage
coverpage

(మహా సిద్ధాంతమైనది.) ప్రపంచములో ఏ మత మూలగ్రంథమైనా మనిషి మోక్షమువైపు పోవు మార్గమును బోధించును. ఆ గ్రంథముల సారమంతయు త్రైత సిద్ధాంతముపైననే ఆధారపడియున్నది. అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతములు ఒక మతమునకు పరిమితముకాగా ఆ సిద్ధాంతములను అధిగమించిన త్రైత సిద్ధాంతము మతాతీత జ్ఞానమును, సర్వమానవాళికి అవసరమైన ఆధ్యాత్మిక సంపదను ప్రసాదించుచున్నది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ గ్రంథములో వైష్ణవుల నిలువునామములు, శైవుల మూడు అడ్డనామములు, ద్వైతుల బొట్టు, త్రైతుల కాల,కర్మచక్రముల సమాచారము సవివరముగా పొందు పరచబడినది. అదే విధముగా పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అను మూడు ఆత్మల విధానమే త్రైతమనీ, ఈ విధానమే భగవద్గీత, బైబిలు మరియు ఖురానులలో కలదని శాస్త్రబద్ధమైన వివరణతో నిరూపించబడినది.

త్రైతారాధన

[మార్చు]
Cover page
Cover page

(మహా ఆరాధనవంతమైనది.) ఆరాధన అను పదమునకు ధనము కొరకు ఆరాతీయుట అనియూ, ధనమనగా ఎప్పటికీ నాశనముకాని జ్ఞానమనియూ ఈ ఆరాధన మూడు విధములుగా వారములోని ఆది, సోమ, మంగళ వారములలో విధిగా చేయవలెననియూ, ఈ ఆరాధన భగవద్గీతలోని బ్రహ్మ, కర్మ, భక్తియోగములకు నమూనా అనియూ సవివరముగా తెలియజేసిన గ్రంథమే త్రైతారాధన, సృష్ఠి ఆదిలో నెలకొల్పబడిన త్రైతారాధన ఆదినుండి ఉన్న ఇందూ (హిందూ) మతములో కనుమరుగై వందల సంవత్సరాల క్రితము పుట్టిన ఇతర మతములలో ప్రాధాన్యత పొందినది. అణగారిపోయిన ఆధ్యాత్మిక ఆచరణను తిరిగి పునరుద్ధరించుటకు వ్రాయబడిన గ్రంథమే త్రైతారాధన.

నిగూఢ తత్వార్థ బోధిని

[మార్చు]
coverpage
coverpage

(మహా నిగూఢమైనది.) ఆత్మజ్ఞానమును ఆటవెలది పద్యములో ఆశువుగా చెప్పిన మహా యోగి వేమన. పామరునికి సైతం అర్థమగునట్లు, అపారమైన జ్ఞాననిధిని పద్యములలో నిక్షిప్తము చేసి ప్రపంచ వ్యవహారములతో సరిపోల్చుచూ వేమన చెప్పిన జ్ఞానము, అర్థముకానివారికి నిగూఢతత్త్వమై ఉన్నది. ఈ పద్యములలోని నిజార్థమును త్రైత సిద్ధాంత ఆధారముతో ప్రబోధానంద యోగీశ్వరులు వివరించిన విధానము నభూతో నభవిష్యతిః. వేమన పద్యములలో పరిపూర్ణ ఆత్మజ్ఞాన నిలయమైన కొన్ని పద్యముల సంకలనమే ఈ ‘‘నిగూఢ తత్వార్థ బోధిని’’,

పునర్జన్మ రహస్యము

[మార్చు]
We8
We8

(నిజ జన్మలను తెల్పునది). బ్రహ్మవిద్యా శాస్త్రమును పరిపూర్ణముగా అర్థము చేసుకొన్న వారికి మాత్రమే ఈ సృష్ఠిలోని రహస్యములను తేట తెల్లము చేయగల శక్తి గలదు. ఆ విధముగా ఆధ్యాత్మిక రంగములో బ్రహ్మవిద్యా శాస్త్ర ఆధారముగా పరిశోధన చేసిన ప్రబోధానంద యోగీశ్వరుల నుండి వెలువడిన ఎన్నో రహస్యాలలో ఒక సంచలన రహస్యమే పునర్జన్మ రహస్యము. గత జన్మలున్నవని భగవద్గీత, మరి ఇతర మతగ్రంథములలో తెలియచేయబడినప్పటికీ అవగాహనా రాహిత్యము వలన పునర్జన్మలను నమ్మలేని స్థితిలో మనమున్నాము. దైవసందేశమున్న ప్రతి గ్రంథములోనూ పునర్జన్మల వివరమున్నదని శాస్త్రబద్ధముగా నిరూపించిన గ్రంథమే పునర్జన్మ రహస్యము. గత జన్మలు లేవని ఘాటుగా వాదించు విజ్ఞానులకు ధీటైన ఆధారములతో సమాధానమిచ్చు గ్రంథమే పునర్జన్మ రహస్యము.

మరణ రహస్యము

[మార్చు]
We15
We15

(నిజ మరణమును తెల్పునది.) మనిషి మరణం ఎలా సంభవిస్తుందను దానిపై ప్రపంచ వ్యాప్తముగా పరిశోధనలు జరుగుచున్నా మరణం ఒక అంతు చిక్కని రహస్యముగా మిగిలియున్నది. ఈ మరణము గురించి వివరము ‘‘జనన మరణ సిద్ధాంతము’’ అను గ్రంథమునందు తెలియజేయబడగా, ఈ గ్రంథములో మరణములు ఎన్ని రకములో వివరించబడినవి. ఇంతవరకూ ప్రపంచమునకు రెండు మరణములు మాత్రమే తెలియును. అవి కాల, అకాల మరణములు. వీటికి తోడుగా తాత్కాలిక మరణము అనునది మరి యొకటున్నదను సంచలనాత్మక సత్యమును బయటపెట్టిన ఈ గ్రంథము విజ్ఞానరంగములో అంతు చిక్కని రహస్యములకు సమాధానమిచ్చును. పూర్వము యోగులు, ఆధ్యాత్మికవేత్తలు తాత్కాలిక మరణమును సాధన చేసినారను సత్యము సంచలనాత్మకమైనది. క్రైస్తవుల దైవమైన ఏసుప్రభువు కూడా శిలువపై తాత్కాలిక మరణమును పొందినాడను విషయమును శాస్త్రబద్ధముగా వివరించిన ఈ గ్రంథము వైద్యరంగములో దొరకని ప్రశ్నలకు సమాధానమిచ్చును.

ప్రబోధ

[మార్చు]
coverpage
coverpage

(మహా ఉద్భోధవంతమైనది.) శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతవలె, యోగీశ్వరులు రచించిన ప్రబోధ గ్రంథము చాలా విశేషత కలిగియున్నది. ప్రబోధ అనగా ముఖ్యమైన విశిష్టమైన బోధ అని అర్థము నిచ్చుచూ, పేరుకు తగినట్లుగా, ప్రపంచములో ఇంతవరకూ ఎవరికీ తెలియని ఆధ్యాత్మిక విషయములు బయల్పరచబడినవి. ఈ గ్రంథములో ఆధ్మాత్మిక విషయములను కొన్ని శీర్షికలుగా విభజించబడడమైనది. అందులో ఒక చర, అచర ప్రకృతి యొక్క వివరము, అవి ఏర్పడిన విధానమూ సృష్ఠ్యాదినుండి ఇంతవరకూ ఎవరూ తెలియపరచలేదు. అదే విధముగా స్వర్గ`నరకములు నిజముగా ఉన్నాయా? తపస్సుకు ` యోగముమునకు బేధమున్నదా? జపమాలలో 108 పూసలకు అర్థమేమిటి? ‘శరీరము అద్దె ఇల్లు’ మొదలగు ప్రతి శీర్షికా ఎంతో జ్ఞాన సమాచారమిచ్చును.

సుబోధ

[మార్చు]
cover page
cover page

(మహా బోధవంతమైనది.) ప్రబోధానంద యోగీశ్వరుల బ్రహ్మయోగస్థితిని ముఖచిత్రముగా కల్గియున్న ఈ గ్రంథములో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములు ఇంతవరకూ భూమిపై చెప్పబడలేదను సత్యమును ఈ గ్రంథమును చదివిన వారెవరైనా ఒప్పుకొనక తప్పదు. ఆధ్యాత్మికవేత్తలు, పీఠాధిపతులు చెప్పలేని రహస్యములకు, వక్రీకరించిన విషయములకు, జవాబు చెప్పలేక కుప్పించి దాటవేసిన ప్రశ్నలకు శాస్త్రబద్దమైన, హేతువాద దృష్ఠితో కూడిన వివరణ ఈ గ్రంథములో కలదు. సృష్ఠి రహస్యమను శీర్షికతో మొదలైన ఈ గ్రంథము ‘‘నీ సంసారము’’ అను శీర్షికతో ముగియును. ప్రతి ఒక్క శీర్షికా ఎంతో ఆలోచించదగినరీతిలో జ్ఞాన జిజ్ఞాసుల ప్రశ్నలకు ఖండిరపలేని సమాధానముగా ఉన్నది.

త్రైతాకార రహస్యము (త్రైతకార బెర్ముడా)

[మార్చు]
Cover page
Cover page

(నిజ రహస్యములను తెల్పునది.) త్రైత సిద్ధాంత జ్ఞానముతో ఎంతటి రహస్యమునైనా ఛేదించవచ్చనీ, సృష్ఠిలో ప్రతి వస్తువూ త్రైతమునే అనుసరించి వున్నదనీ, బ్రహ్మవిద్యాశాస్త్రము, ప్రపంచ శాస్త్రములైన గణిత, ఖగోళ, రసాయనిక, భౌతికశాస్త్రమునకు ఆధారమైయున్నదను విషయము ఈ గ్రంథము ద్వారా తెలియగలదు. ఎందరో శాస్త్రజ్ఞులు దశాబ్దాల తరబడి తలలు బద్దలు కొట్టుకొంటున్న అంతు చిక్కని రహస్యమైన ‘‘బెర్ముడా ట్రయాంగిల్‌’’ విషయమును ఈ గ్రంథము తెలియజేసినది. అంతేకాక ప్లయింగ్‌ సాసర్స్‌, ఏలియన్స్‌ గురించీ మరియు భూకంపములు, సునామీలు ఏ విధముగా వచ్చునను విషయము గురించీ ఈ గ్రంథములో వివరించబడినది. త్రైత సిద్ధాంతములో మూడు ఆత్మలలో ఒకటైన రెండవ ఆత్మ యొక్క సామర్థ్యమును ఈ గ్రంథములో ‘‘ఆహారము తినని మనిషి’’ అను శీర్షికను చదవడము ద్వారా తెలియవచ్చును.

కలియుగము ఎప్పటికీ యుగాంతము కాదు.

[మార్చు]
Cover page
Cover page

(నిజ ప్రళయమును తెల్పునది.) హిందువులమని చెప్పుకుంటూ ఇంగ్లీషు కాలమానమును అనుసరించు వారికి జవాబు ఇచ్చునట్లు ఈ గ్రంథము హిందూ కాలమానమైన యుగములు, అదే విధముగా తెలుగువారికే తెలియకుండా పోయిన అరవై తెలుగు సంవత్సరములతో వివరము ప్రారంభమగును. యుగాంతమంటూ కొంతమంది, అమాయకపు ప్రజలను భయపెట్టిన సమయములో యోగీశ్వరులు ఈ గ్రంథమును రచించినారు. ప్రళయ, ప్రభవములు నిత్యమూ మనిషి జీవితములో జరుగుచున్నవను విషయము, మనిషి వాటిని అనుభవించుచున్నాడను సత్యమూ ఈ గ్రంథముద్వారా తెలియబడినది. ఈ గ్రంథములో ప్రకృతే నిన్ను జన్మలకు పంపుటకు కారణము. ఆ ప్రకృతే నిన్ను మోక్షమునకు చేర్చు మార్గము అను వాక్యము, మనిషి మరణించుటకు పుట్టకూడదు దేవున్ని తెలియుటకే పుట్టాలి దేవుడు మతమునకు అతీతుడైన కాలస్వరూపుడు అను వాక్యములు ఎంతో లోతుగా ఆలోచించదగినవి. ఈ సృష్ఠి ఎప్పటికీ అంతముకాదనీ, నాలుగు యుగములైన కృత, త్రేతా, ద్వాపర, కలియుగముల చక్రము శాశ్వతముగా తిరుగునను సత్యమును ఈ గ్రంథము చదివిన పాఠకులు నిస్సందేహముగా తెలియగలరు.

ఆత్మలింగార్థము

[మార్చు]
Cover page
Cover page

(నిజ ఆత్మను తెల్పునది.) త్రైతములోని మూడు ఆత్మలలో రెండవ ఆత్మ యొక్క విధానము ఈ గ్రంథములో పూర్తిగా తెలియదగును. మిగిలిన సిద్ధాంతములన్నియు జీవాత్మ, పరమాత్మల గురించి మాత్రమే తెలియజేసినవి. కానీ ఈ రెండు ఆత్మల నడుమనున్న ‘‘ఆత్మ’’ గురించి వివరించలేదు. ఒక్క త్రైత సిద్ధాంతము మాత్రమే ఈ ఆత్మయొక్క ఉనికిని మొట్టమొదటి సారిగా ప్రపంచమునకు పరిచయము చేసినది. ఆత్మాలింగార్థమను ఈ గ్రంథములో 120 పద్యములున్నవి. ప్రతీ పద్యమూ ఆత్మయొక్క విధానము మన శరీరములో ఎట్లున్నదో వివరించును. అంతేకాక ప్రపంచములోని అజ్ఞాన ప్రజలను గురించీ, జ్ఞానుల గురించీ, గురువుల గురించీ తెలియజేయుచూ మానవునికి కావలసిన జ్ఞానమును వరుసగ చెప్పుచూ చివరకు పరమాత్మను గురించి చెప్పడము జరిగినది.

యజ్ఞములు

[మార్చు]
Cover page
Cover page

నిజమా-అబద్దమా (మహా సూచనాత్మకమైనది.) ఈ గ్రంథము ముఖ చిత్రములో యజ్ఞములు నిజమా? అబద్దమా? అను ప్రశ్న కలదు. గ్రంథములోపల ఏమున్నదో తెలియకనే, ఇందులో యజ్ఞమును వ్యతిరేకించినారను అపోహను చాలామంది వెలిబుచ్చగలరు. వాస్తవానికి భగవద్గీతలో దేవుడు చెప్పినది శరీరములో జరుగునవి యజ్ఞములు. బాహ్య యజ్ఞముల వలన తనను చేరలేరనీ దేవుడే భగవద్గీతయందు స్వయముగా తెలియజేసినాడు. కర్మను నాశనము చేయు యజ్ఞములను దేవుడు చెప్పగా, కర్మను మూటగట్టుకొను బాహ్య యజ్ఞముల వలన దేవున్ని చేరలేరను వివరము ఈ గ్రంథమునందు శాస్త్రబద్ధముగా చెప్పబడినది. భగవద్గీత ప్రామాణికముగా వ్రాయబడిన ఈ గ్రంథము చదువుట ద్వారా యజ్ఞముల యొక్క నిజార్థమును తెలియవచ్చును

గుత్తా

[మార్చు]
Cover page
Cover page

(మహా భగవంతమైనది.) సిద్ధాంతకర్తల, గురువుల వ్యక్తిగత జీవితమును గూర్చి తెలుసుకోవాలనుకొను వారికి, త్రైత సిద్ధాంత ఆదికర్త ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల ఆధ్యాత్మిక ప్రస్థానమును గురించి తెలియజేయు గ్రంథము గుత్తా. యోగీశ్వరుల జీవితమంతయు, జన్మించినది మొదలుకొని ఇప్పటి వరకు పూర్తి ఆధ్యాత్మిక అర్థముతో కూడుకొని ఉన్నదని వారు పుట్టిన కులము, ఇంటి పేరు, ఆయనకు పెట్టిన పేరు, పుట్టిన ఊరూ ఋజువు చేయుచున్నవి. గుత్తా అనునది యోగీశ్వరుల ఇంటి పేరైనప్పటికీ ఆ పదము ప్రపంచ అర్థమునుకాక పరమాత్మ అర్థమును శాస్త్రోపేతముగా ఇచ్చును. అంతేకాక ఆయనలోని ప్రత్యేకమైన ఆత్మ ఎన్నో సంచలనాత్మక రచనలను చేయుటకు కారణమైనది. సామాన్య జీవితమును గడుపు యోగీశ్వరులలోని అసామాన్య, అపార ఆధ్యాత్మిక జ్ఞానశక్తి ఈ రోజు ఎన్నో గ్రంథరూపములలో ప్రకటితమవుతున్న దను విషయము ఈ గుత్తా గ్రంథము ద్వారా తెలియగలదు. యోగీశ్వరుల యొక్క బాహ్య, అంతరంగ జీవన విధానమును ఈ గ్రంథము ద్వారా, ఆ ఆధ్యాత్మిక పురుషునిలోని ప్రత్యేక ఆత్మ మనకు తెలియజేయడము అపురూపమైన, అరుదైన విశేషము. ప్రబోధానందుల ఆధ్యాత్మిక జీవన సరళి ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని ఈ గ్రంథము ద్వారా తెలియవచ్చును.

ఇందుత్వమును కాపాడుదాం...

[మార్చు]
Cover page
Cover page

(మహా ఆలోచనాత్మకమైనది.) దేవుడు సృష్ట్యాదిలోనే చెప్పిన తన ధర్మము ఇందూ ధర్మము. భూమిమీద ఎన్ని మతములు వచ్చినా మొదట సృష్ఠిని తయారు చేసిన దేవుడు మారడు. అట్లే అతని ఇందూ ధర్మమూ మారదు. ఈ గ్రంథములో ఇందుత్వము అను పదమునకు అర్థము తెలియచేయుచూ, ద్వాపర యుగము చివరలో భగవద్గీత ద్వారా భగవంతుడు తెలియజేసిన ధర్మమునే మిగిలిన మత గ్రంథములలో చెప్పబడినవనీ అందువలన, ఇందుత్వమనగా దైవత్వమనీ, ఈ గ్రంథము చదివిన తరువాత ఏ మతములోనున్న వాడైనా ఇందుత్వమును తెలుసుకొని ఇందువుగా బ్రతికితే చనిపోయిన తర్వాత ఇందుత్వము లోనికి (దైవత్వము) చేరిపోగలరనీ తెలియగలదు. ఈ గ్రంథము చివరిలో ‘‘గ్రహించుకొనువారికి ఇంతకంటే ఎక్కువ చెప్పలేము’’ అను వాక్యము ఆలోచింపదగినది.

ధర్మము-అధర్మము

[మార్చు]
Cover page
Cover page

(మహా యోచనాత్మకమైనది.) మనిషి ఎక్కడ చెప్పినా అధర్మములనే చెప్పును. దేవుడు భగవంతుని రూపములో ఎక్కడ చెప్పినా ధర్మములనే చెప్పును. లోకులకు అనుకూలములేనివి ధర్మములు, లోకులకు అనుకూలమైనవి అధర్మములు. ఈ సూత్రమునుబట్టి సాధారణ మనిషి ఎవరైనదీ, అసాధారణ భగవంతుడు ఎవరైనదీ సులభముగా తెలియవచ్చును. ఇదే సూత్రము ప్రకారము భగవద్గీతను చెప్పినది సామాన్య మనిషికాదనీ, స్వయముగా భగవంతుడే చెప్పాడనీ తెలియుచున్నది. ఈ విషయమును వివరిస్తూ వ్రాసిన ‘‘ధర్మము`అధర్మము’’ అను ఈ గ్రంథములో ధర్మ`అధర్మము యొక్క వివరమూ, బేధమూ శాస్త్ర బద్ధముగా తెలియచేయబడినది. ఇంతవరకు ఏ పీఠాధిపతీ, మఠాధిపతీ నిర్వచించలేకపోయిన ధర్మము అను పదమునకు సంపూర్ణ నిజార్థమును తెలియజేయు గ్రంథమే ధర్మము`అధర్మము.

గీతా పరిచయము

[మార్చు]
Cover page
Cover page

(మహా ప్రశ్నార్థకమైనది.) భగవద్గీత సర్వమానవులకు అన్ని మతములలోని వారికి తెలిపిన హద్దనీ, సర్వమానవాళికీ, మాయకు మధ్యలో గీచిన గీతయనీ, ఒక్క హిందూమతములోని వారికే కాదనీ, అన్ని మతములలోని ఇందువులకని (జ్ఞానులకని) తెలియునట్లు వ్రాయబడినదే త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ సంబంధించిన భగవద్గీత తెలియాలంటే ముందు ఈ గీతాపరిచయము చదువవలసిందే! ఈ గ్రంథము మొదట చదువుట వలన అన్ని మతములవారికీ గీత యొక్క స్వరూపమేమిటో తెలియగలదు. ఈ గీతా పరిచయమను గ్రంథములో అనేక సంశయములు, అనేక ప్రశ్నలు సృష్ఠింపబడి, భగవద్గీతలో వాటికి సమాధానములు తెలుపబడినవి. అందువలన చూపు ‘‘గీతా పరిచయము’’కాగా, దృశ్యము భగవద్గీత అయినదని చెప్పవచ్చును. త్రైత సిద్ధాంత భగవద్గీత చదువుటకు ముందు గీతా పరిచయమను ఈ గ్రంథము చదువుట ఎంతో అవసరము.

సిలువ దేవుడా?

[మార్చు]
coverpage
coverpage

(నిజ వివరమును తెల్పునది.) దైవజ్ఞానము అన్ని మతముల మూల గ్రంథములలోనూ ఇమిడియున్నది. అందువలన భగవద్గీతలోని సారాంశమే బైబిలు మరియు ఖురాన్‌లలో కలదని తెలియజేస్తూ శిలువ సాతాను లేక మాయకు చిహ్నమనీ, మాయ దేవునికి వ్యతి రిక్త దిశలో ఉన్నదనీ, ‘‘సిలువ దేవుడా?’’ అను ఈ గ్రంథము వివరముగా తెలియజేయుచున్నది. ‘‘నన్ను చూచినవాడు నా తండ్రిని (దేవుని) చూచినట్లేనను ఏసు ప్రభువు అనిన మాటను గౌరవించక ఆయన ఆకారమును కూడ చూడకుండా సిలువ ఆకారమును ఎందుకు చూచుచున్నారను విషయమును తెలియజేయు గ్రంథమే ‘‘సిలువ దేవుడా?’’. ఇందులో సిలువ అను పదమునకు సరైన అర్థము తెలియబడినది. అంతేగాక మాయ లేక సాతాను నిజమైన ప్రభు భక్తులను మభ్యపెట్టి చివరకు ప్రభువుకంటే సిలువనే గొప్పగ చూపించుచున్నదను వాక్యములు ఆలోచింపదగినవి.

దేవుని గుర్తు-963, మాయ గుర్తు-666

[మార్చు]
cover page
cover page

(మహా విప్లవాత్మకమైనది.) దేవునికి కూడా ఒక కోడ్‌ ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? అను ప్రశ్నలకు పూర్తి జవాబునిచ్చు గ్రంథమే ఈ సృష్ఠి కర్తకోడ్‌. భగవద్గీతయందలి 15 మరియు 16 అధ్యాయములలోని శ్లోకములను ఆధారము చేసుకొని దేవుని కోడ్‌ 963 అనియూ మాయకోడ్‌ 666 అనీ శాస్త్రబద్దముగా, హేతువాద పద్ధతిలో తెలియపరచిన సంచలనాత్మక గ్రంథమే ఈ సృష్ఠికర్తకోడ్‌. సర్వజీవరాశులకు తల్లి ప్రకృతిగ తండ్రి పరమాత్మగ ఉన్నాడని భగవద్గీతలో చెప్పబడినది. ఒక మనిషికి తల్లీ, తండ్రి ఇద్దరూ సమానమే. అందువలన ప్రకృతి లేక మాయకు సూచించిన 666 గానీ, పరమాత్మకు సంబంధించిన 963 గానీ కూడితే రెండూ సమానమైన 18 సంఖ్యనే వస్తున్నవి. దేవుని కోడ్‌ 963 గానూ, అట్లే మాయ సంబంధ సంఖ్య 666 గానూ ఎందుకున్నవను విషయమును సవివరముగా తెలియాలంటే ఈ గ్రంథము చదివి తీరాలి.

ప్రబోధానందం నాటికలు

[మార్చు]
We10
We10

(మహా విమర్శనాత్మకమైనది.) ఆధ్యాత్మికతను ప్రజలలో ప్రచారము చేయుటకు, స్వచ్ఛమైన దైవజ్ఞానము సులభముగా చదువురాని వారికొరకు కూడా అర్థమగుటకు వ్రాయబడిన గ్రంథమే ప్రబోధానందం నాటికలు. ఆత్మ జ్ఞాన సందేశమును నాటికల రూపములో తెలియచేయుటకు ఈ గ్రంథములో ఎన్నో నాటికలను రచించడం జరిగినది. ప్రతి ఒక్క నాటికా ఎంతో ఆలోచింప దగిన రీతిలో ఉండును. ఉదాహరణకు ‘‘ప్రబోధానందం’’ అను నాటిక దైవజ్ఞానము పట్ల వివిధ రకములైన మనుషుల అభిప్రాయములు, వారి మూఢ నమ్మకములకు అద్దము పడుతున్నది. అంతేకాక ‘‘ఎవరు దేవుడు’’ అను నాటిక నిజమైన దేవుని వివరమును తెలియుచేయును. ఈ నాటికలను చదువడమేకాక, వాటిని ప్రదర్శించడము ద్వార స్వచ్ఛమైన దైవజ్ఞానము ప్రచారము చేయవచ్చు ననీ, ప్రతి మానవునికీ ఈ నాటికల ద్వారా ఆత్మజ్ఞానసందేశము అందుననీ ప్రతి ఒక్కరూ తెలియగలరు.

తల్లి-తండ్రి

[మార్చు]
Cover page
Cover page

(నిజ తల్లి తండ్రులను తెల్పునది.) సర్వసాధారణ మనుషులకు కనిపించెడు తల్లితండ్రులు మాత్రమే తెలిసి, కనిపించని తల్లితండ్రులు తెలియక పోవచ్చును. తల్లితండ్రులు రెండు విధములుగా ఉన్నారని కూడా వారికి తెలియదనియే చెప్పవచ్చును. అయితే దైవ జ్ఞానము తెలిసిన యోగులకు, జ్ఞానులకూ రెండవ రకమైన ప్రకృతి, పరమాత్మలు తల్లితండ్రులుగా ఉన్నారను విషయము తెలిసివుండును. మన పురాణములు శరీర తల్లితండ్రుల మీద భక్తి పెంచాయి తప్ప, తెలియని తల్లితండ్రులైన ప్రకృతి పరమాత్మల మీద భక్తిని పెంచలేదు. పురాణాలకు, వేదములకు అతీతముగా ఉన్న జ్ఞానముతో, శాశ్వితమైన తల్లితండ్రుల గురించి తెలియజేయు ప్రయత్నమే ఈ తల్లి తండ్రి గ్రంథము.

కథల జ్ఞానము

[మార్చు]
Cover page
Cover page

(నిజ కర్మక్షేపమైనది.) ఆత్మ జ్ఞాన సారాంశమును బాల్యమునుండే మనుషులకు తెలియచేయగలిగితే, ఒక వయస్సు వచ్చుసరికి మనిషి పూర్తి జ్ఞానికాగలడను లక్ష్యముతో ఆనాటి పెద్దలు జ్ఞానమును కథలయందు ఇమిడ్చిపెట్టారు. ఈ గ్రంథములో అటువంటి కథలను తీసుకొని గ్రంథమునకు కథలజ్ఞానమని పేరు పెట్టడము జరిగినది. ఈ గ్రంథములో బాగా ప్రాచుర్యము పొందిన వేట`ఏడు చేపలు అను కథలో గొప్ప జ్ఞానసంపద ఇమిడ్చి పెట్టబడి ఉన్నది. ప్రతి ఒక్క కథా ఒక్కొక్క నిధిగా ఆత్మజ్ఞానమును అందించును. జ్ఞాన జిజ్ఞాసులందరూ తప్పక చదువవలసిన ఈ కథల జ్ఞానము అను గ్రంథము దైవజ్ఞానమును ఆసక్తికరమైన రీతిలో, సులభముగా అర్థమగునట్లు చేయును.

దయ్యాల-భూతాల యదార్థ సంఘటనలు

[మార్చు]
Cover page
Cover page

(మహా శక్తివంతమైనది.) సైన్సు పురోగతి చెందిన ఈ సమయములో దయ్యమను దానిని ఏ కోశానా నమ్మని విజ్ఞానవేత్తలున్న ఈ కాలములో దయ్యాలు వాస్తవమనీ అవి రక రకములుగా ప్రవర్తించుచున్నవనీ, ఒక మనిషి శరీరములో అవలీలగ చేరగలవనీ, మనుషుల వలనకల్గు బాధలకు కష్టములకు చట్టబద్దమైన పరిష్కారమూ శిక్షలూ ఉన్నాయనీ, ఒక దయ్యము మనిషి శరీరములో చేరి కష్టాలపాలు చేసినపుడు ఆ కష్టాలనుండి బయటపడుటకు బయటి చట్టాలు పనికిరావనీ, స్వచ్ఛమైన దైవజ్ఞానము ఒక్కటే పరిష్కారమనీ, యోగీశ్వరుల స్వీయ అనుభవముల ద్వారా తెలియ చేసిన గ్రంథమే దయ్యాల`భూతాల యదార్థ సంఘటనలు. ఈ గ్రంథములో 300 పేజీల వరకు దయ్యాలు, గ్రహములు, గోళముల పని విధానముండగా ఆ తరువాత పేజీలలో చాలాగొప్ప జ్ఞాన సమాచారము లభించి మనిషి మోక్ష మార్గము వైపు పోవుటకు అవకాశము కల్పించును.

పొడుపు కథల జ్ఞానము

[మార్చు]
coverpage
coverpage

(నిజ సారాంశమును తెల్పునది.) ‘‘శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానమ్‌’’ అన్నట్లుగా జ్ఞానము తెలియుటకు కావలసిన శ్రద్ధ ఏర్పడుటకు పూర్వము పెద్దలు కొన్ని పొడుపు కథల రూపములో ప్రశ్నలు రేకెత్తించినారు. పొడుపుకథలు ద్వంద్వ అర్థము కలిగియుండును. ఒకవైపు ప్రపంచ అర్థము ఇమిడి ఉండగా మరియెకటి పరమాత్మ అర్థము ఇమిడి ఉండును. దురదృష్టవశాత్తూ అంతరించి పోవు స్థితిలోనున్న పొడుపు కథలను, వాటి అవసాన దశనుండి తిరిగి పునరుద్ధరించుటకు చేసిన ప్రయత్నమే ఈ గ్రంథము. పొడుపుకథలను సేకరించి, వాటిలో దాగియున్న జ్ఞాన సంబంధమైన విషయములను ప్రతి ఒక్కరికీ తెలియ జేయాలను ఉద్దేశముతో రచించబడిన ‘‘పొడుపు కథల జ్ఞానమను’’ గ్రంథము ప్రతి ఒక్క తెలుగువారూ చదివి తీరవలసిందే!

సామెతల జ్ఞానము

[మార్చు]
coverpage
coverpage

(నిజ జ్ఞానమును తెల్పునది.) ఒక్క చిన్న వాక్యములో ఎంతో విలువైన జ్ఞానమును దాచిన సామెతలు ఈనాడు కనుమరుగైపోవుచున్నవి. తెలుగు భాష గొప్పదనీ, తెలుగు భాషలోనున్న సామెతలు ఎంతో గొప్పవనీ తెలుపుటకు వ్రాయబడిన గ్రంథమే సామెతల జ్ఞానము. ఈ గ్రంథములో ప్రతి ఒక్క సామెతా ఎంతో లోతైన, విలువైన దైవజ్ఞానమును సులభశైలిలో అందరికీ అర్థమగులాగున శాస్త్రబద్ధముగా వివరించబడినది. ఉదాహరణకు ‘‘ఉద్యోగం పురుష లక్షణమనే’’ సామెత ప్రపంచములో ప్రాచుర్యం పొందినప్పటికీ ఆ సామెతకు జ్ఞానపరమైన నిజార్థము మొట్టమొదటి సారిగా ఈ సామెతల జ్ఞానమనే గ్రంథములో చూడ (చదువ) గలరు. ప్రపంచములోనే అత్యంత ప్రాచీనమైన తెలుగుభాషలో చెప్పబడిన జ్ఞానపరమైన సామెతలు కాలక్రమేపీ కనుమరుగై పోవుచున్న తరుణములో వాటని పునరుద్ధరించుటకు యోగీశ్వరులు చేసిన ప్రయత్నము మనకు గొప్ప జ్ఞాననిధి సామెతల రూపములో ప్రసాదించెనను సత్యము ఈ గ్రంథము ద్వారా అర్థముకాగలదు.

మంత్రము-మహిమ

[మార్చు]
We13
We13

నిజమా-అబద్దమా (మహా మహిమత్వమైనది.) విజ్ఞాన శాస్త్రము రోజురోజుకీ అభివృద్ధి చెందుచున్న ఈ రోజులలో మంత్రమొకటున్నదని గానీ, దానికి కొంత శక్తి ఉన్నదను విషయముగాని ఎవరికీ నమ్మశక్యము కానటువంటిది. కానీ శాస్త్రములకు అందని అతీతమైన ఆధ్యాత్మిక పరిశోధనతో మంత్రమునకు ఒక మహిమ ఉన్నదని రుజువు చేయుచు యోగీశ్వరులు రచించిన గ్రంథమే మంత్రము`మహిమ. మంత్రమూ, అది పని చేయు విధానమూ, దాని ప్రభావమూ శాస్త్రబద్ధముగా ఈ గ్రంథములో వివరించబడినది. దానికి నమూనాగా ఒక తేలుమంత్రము, ఆ మంత్రము ద్వారా తేలుకాటువల్ల కల్గిన విష బాధను తొలగించు విధానము ప్రయోగాత్మకముగా ఈ గ్రంథమునందు నిరూపించబడినది. ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన శక్తివంతమైన గ్రంథమే మంత్రము`మహిమ.

మతము-పథము

[మార్చు]
coverpage
coverpage

(నిజ పథమును తెల్పునది.) సృష్ఠ్యాదిలో, దేవుని చేరుటకు దేవుని చేత నిర్ణయించబడిన మార్గమే జ్ఞానమార్గముగా చెప్పబడినది. జ్ఞానమనగా దైవజ్ఞానమనీ, ఆ దైవజ్ఞానమును గుర్తించుటకు ‘‘ఇందూ’’ అను పదమును వాడెడివారు. అందువలన జ్ఞానమార్గము లేదా పథము అనునది ఇందూ పథముగా పిలువబడినదని ఈ గ్రంథములో విపులముగా వివరించినారు. మాయా ప్రభావము వలన ఇందూ అనునది హిందూగా, పథము లేదా మార్గము అనునది మతముగా మారి, హిందూమతమై మనుషులను దైవజ్ఞానమునకు దూరము చేసి మాయా జ్ఞానమునకు దగ్గరగునట్లు చేసినదను విషయమును ఈ గ్రంథము బయటపెట్టినది. ఈ గ్రంథములో భగవద్గీత ఏమాత్రము తెలియనివారు నూటికి 80 మంది కలరను సత్యము ఆవేదన కలిగించును. అంతేకాక ఈ గ్రంథము చివరిలో మతమును నిర్వీర్యము చేస్తూ, పథమును బలపరుస్తూ యోగీశ్వరులు వ్రాసిన వాక్యములు మనిషిని తిరిగి ఇందూ పథమువైపు నడిపించగలవు.

సమాధి

[మార్చు]
We7
We7

(నిజ సమాధిని తెల్పునది.) అన్ని మతములలోనూ సమాధి అను పదము ఉండినా, ప్రవక్తలందరూ ఎంతో గొప్ప భావముతో చెప్పినా దానిని ఏ మతస్థులూ సరిగా అర్థము చేసుకోలేదనీ సమాధి అను శబ్దము సామాన్యమైనది కాదనీ, గొప్ప అర్థముతో కూడుకొన్నదేకాక, ధర్మాధర్మ విషయములతో ముడిపడియున్నదను విషయమును సవివరముగా తెలియజేసిన గ్రంథమే సమాధి. తల్లిగర్భమునుండి పుట్టిన శిశు శరీరమే సమాధి అనిగానీ, ఆ శరీరమునుండే మొట్టమొదట ప్రపంచ ధ్యాస లోనికి వస్తున్నామనిగానీ, ప్రళయ దినమున సమాధినుండి ప్రతి ఒక్కరినీ లేపుదునని ఇతర మతములలో దేవుడు చెప్పిన వాక్కు సత్యమైనదని ప్రత్యక్ష ప్రమాణములతో ఈ గ్రంథము తెలియ చేయుచున్నది. అందరూ అనుకొన్నట్లు దేవుడు మానవులకు పరీక్షలు పెట్టడను సంచలనాత్మక వాస్తవాన్ని తెలియాలంటే ‘‘సమాధి’’ గ్రంథాన్ని అన్ని మతస్థులూ తప్పనిసరిగా చదవాలి.

నాస్తికులు-ఆస్తికులు

[మార్చు]

(నిజ ఆస్తిని తెల్పునది.) కనిపించని ఆస్తి అయిన జ్ఞానధనమునుబట్టి జ్ఞానమున్న వానిని ఆస్తికుడనీ, జ్ఞానధనము లేనివానిని నాస్తికుడు అనీ పూర్వము సంబోధించెడువారను క్రొత్త విషయమును తెలియజేస్తూ నిజమైన నాస్తిక ఆస్తికులను తెలియాలంటే ముందు గీతలోని నిగూఢమైన ధర్మములను తెలుసుకొమ్మని ఈ గ్రంథములో యోగీశ్వరులు సూచించినారు. ఈ గ్రంథములో యోగీశ్వరులు సంధించిన ‘‘మీరు ఆస్తికులా-నాస్తికులా?’’ మరియు ‘‘మీరు హేతువాదులా, అహేతువాదులా’’ అను ప్రశ్నలు వాటి వివరణ ఈ గ్రంథమును మరింత సునిశితముగా అర్థము చేసుకొనునట్లు చేయును. అంతేగాకుండా అందరూ ఉపయోగించు డాక్టర్‌ ఆప్‌ ఫిలాసఫి అను పదము యొక్క అర్థమే పూర్తి అసమంజసమని చెప్పుట ఆలోచించ దగ్గ విషయం. శరీరములో పనిచేయు ఆత్మశక్తిని విద్యుశ్ఛక్తిగా పోలుస్తూ దేవుని ఉనికిని హేతువాదులు సైతం ఖండిరచలేని విధముగా వివరించిన విధానము ఈ గ్రంథమును తప్పక చదివించి నాస్తికులకు ఆస్తికులకు హేతువాదులకు సరిjైున అర్థము తెలుసుకొనునట్లు చేయును.


తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము

[మార్చు]

(నిజ దీవెనలను తెల్పునది.) వినుటకే విచిత్రముగా ఉన్న ఈ గ్రంథము పేరు వెనుక సారాంశము చాలా లోతైనది, అర్థవంతమైనది. ధర్మాలు అధర్మాలుగా మారిపోవునని గీతాచార్యుడు చెప్పిన విధముగా ఒకప్పటి తిట్లు నేడు దీవెనలుగా, దీవెనలు తిట్లుగా మారి పోయినవను కఠోర సత్యమును ఈ గ్రంథము ద్వారా తెలుసుకొనవచ్చును. తిట్లు దీవెనల తారతమ్యము ఎవరికీ తెలియక పోవడము వలన స్వాములు తిట్లను, శత్రువులు దీవెనలను ఇస్తున్నారు. ఉదాహరణకు ఒక స్వామీజీ ధీర్ఘాయుష్మాన్‌ భవ అంటే తిట్టనీ, ఒక శత్రువు నీవు నాశనమైపో అంటే దీవెన అనీ చెప్పడము విడ్డూరమే అయినా అది వాస్తవమనీ, తిట్లలో జ్ఞానము, దీవెనలలో అజ్ఞానమున్నదనీ తెలుసుకొనుటకు ఈ గ్రంథము చదివి తీరవలసిందే.


గురు ప్రార్థనామంజరి

[మార్చు]
Cover page
Cover page

(నిజ గురువును తెల్పునది.) ప్రపంచములో ప్రతి ఒక్కరికీ పరిచయమైన, అందరూ పలుకుచున్న గురువు అను పదమునకు నిజార్థమును తెలియజేయు గ్రంథమే గురువు. ఈ గ్రంథములో మానవుని నేటి మూఢభక్తిని వివరిస్తూ, అటువంటి భక్తిని వదలి నిజభక్తివైపు నిజమైన దైవమువైపు దృష్ఠి సారించవలెననీ, అలా చేయుటకు పరమాత్మ విద్యను నేర్వాలనీ దానికి గురువు తప్పనిసరిగా ఉండాలని వివరించబడినది. దేవుడు మనిషిగా వస్తే గురువు అవుతాడు కానీ మనిషి ఎప్పటికీ గురువు కాలేడు అను వాక్యము ప్రకారము దేవుడొక్కడే, గురువు ఒక్కడే అను సత్యమును మొట్టమొదటిసారిగా ఈ గ్రంథము ద్వారా తెలియవచ్చును. ఆ గురువునే భగవంతుడంటున్నాము అను విషయము మొదటగా యోగీశ్వరులే ఈ ప్రపంచ మునకు తెలియజేశారు. ఈ గ్రంథములోని శీర్షికలన్నియూ ఎంతో గొప్ప జ్ఞానసమాచారమునిచ్చును. అందరికీ పరిచయమున్న ఎవరికీ అర్థము తెలియని గురుపౌర్ణమి, గురువులేని విద్య గ్రుడ్డివిద్య మొదలగు పదములకు అర్థము ఈ గ్రంథము ద్వారా తెలుసుకొని నిజ గురువుని పొందగలరు.

మతాతీత దేవుని మార్గము

[మార్చు]
We14
We14

(నిజ మార్గమును తెల్పునది.) ఏది దేవుని మార్గము? ఏది మాయ మార్గము? అను ప్రశ్నలకు జవాబు వెదుకువానికి సరిjైున చిరునామా ‘‘మతాతీత దేవుని మార్గము’’ అను గ్రంథము. ఇందులో హిందువుల గూర్చి, క్రైస్తవుల గూర్చి వ్రాయడము జరిగినది. ఇందులో చెప్పిన విషయములు ఏ మతమువైపు నుండి చెప్పకుండా దేవుని వైపు నుండి మాత్రము చెప్పబడినది. అంతేకాక ‘‘నీవు హిందువైతే ప్రభువును గురించి తెలుసుకొనుటకు ప్రయత్నించు. ఒక వేళ నీవు క్రైస్తవుడవైతే ఇప్పటినుండీ కృష్ణుణ్ణి గురించి తెలుసుకొనుటకు ప్రయత్నించు’’ తెలుసుకోవడములో తప్పులేదు. మతాలు మారడములో తప్పుకలదు. అను వాక్యములు లోతుగా ఆలోచింప చేయును. గ్రంథమంతయూ మతములకతీతమైనది దేవుని జ్ఞానమనియూ, మతాలకు సంబంధించినది మాయా జ్ఞానమనియూ తెలియచేయును.

సత్యాన్వేషి కథ

[మార్చు]
We6
We6

మహా సత్యవంతమైనది.) మనుషులకు తెలియని ఎన్నో క్రొత్త విషయములు తెలియవలెనను ఉద్దేశ్యములో ఈ కథ వ్రాయబడినదను వాక్యముతో ఈ గ్రంథము ప్రారంభమగును. ఈ కథలో జరుగు సన్నివేశములు కల్పితమైనా అందులోని సారాంశము మాత్రము సత్యము. ఎన్నో మహత్యములు చేయు బాబాలకు కూడా ఆ మహత్యములు ఎలా జరుగుచున్నవో తెలియక రహస్యముగా మిగిలిపోయినది. ఆ రహస్యములను ఈ కథలో ప్రత్యక్ష ప్రమాణములుగా చూపుచూ, వివరముగ చెప్పడము జరిగినది. ఇటువంటి తెలియని రహస్యములను తెలుపుట వలనా, ఈ రహస్యములలోని అసలైన యదార్థములను తెలుపడము వలనా, ఈ కథ పేరు సత్యాన్వేషి అయినది. ఈ గ్రంథములో కథ ఎన్ని మలుపులు తిరిగినా, ఎన్ని ప్రపంచ పనులకూ సంబంధించినా ప్రతిచోటా దైవజ్ఞానమును జోడిరచడం ఆశ్చర్యకరము! అద్భుతము!! ఈ అన్వేషణ రెండు ప్రశ్నల చుట్టు సాగుచున్నది. తాను ఎవరు? దైవము ఎవరు? ప్రతి ఒక్కరూ తప్పని సరిగా చదువ వలసిన గ్రంథమే సత్యాన్వేషి కథ.

హేతువాదము- ప్రతివాదము

[మార్చు]

(నిజ వాద, ఆత్మవాదమును తెల్పునది.) ఈ గ్రంథము ముఖ చిత్రముపై మితవాదము నాస్తికవాదము, అతివాదము, తీవ్రవాదము మరియు ఉగ్రవాదము అను పదములు కలవు. వీటి అర్థము, వివరణ గ్రంథములో పూర్తి సోదాహరణలతో సులభముగా అర్థమగులాగున తెలియజేయబడినది. నిజమైన హేతువాదమునకు పరిపూర్ణ అర్థమిచ్చుచూ అతివాద, ఉగ్రవాదమును లేకుండా చేయుటకు జ్ఞానమే సరి అయిన మార్గమనీ, బ్రహ్మవిద్యా శాస్త్ర జ్ఞానముతో హింసను మాన్పించవచ్చుననీ. ఈ గ్రంథములో శాస్త్రబద్దముగా నిరూపించబడినది. అంతేకాక ఈ గ్రంథములో ఇంతవరకు ఎవరు జవాబు ఇవ్వలేని ప్రశ్నలకు హేతువాద, శాస్త్రబద్ద దృష్టితో సమాధానములు ఈయబడినవి. ఈ గ్రంథము చదివిన తర్వాత ప్రతి ఒక్కరూ హేతుబద్ధముగా యోచిస్తూ నిజమైన హేతువాదులు కాగలరు.


ప్రవక్తలు ఎవరు?

[మార్చు]
coverpage
coverpage

(నిజ వక్త, ప్రవక్తలను తెల్పునది.) దైవజ్ఞానమును బోధించువారెవరైనా సూత్రము ప్రకారము ప్రవక్తలే అగుదురు. అత్యంత ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన ఈ వాక్యమును గురించి సవివరముగా తెలియజేయు గ్రంథమే ప్రవక్తలు ఎవరు? వక్తకు ప్రవక్తకు ఏ నిఘంటువులో లేని నిర్వచనమిస్తూ, మనుషులవద్దకు జ్ఞానము చేరునది కనిపించని గ్రహముల ద్వారా, కనిపించే మనిషిగాయున్న (మారురూపములోని) దేవుని ద్వారా అను క్రొత్త విషయమును తెలియజేస్తూ, ఈ గ్రంథము చివరి భాగము ప్రశ్నలు-జవాబుల రూపములో ప్రవక్తల యొక్క పూర్తి సమాచారమును అందించును. అంతేగాక భూమిమీద దేవుడు తన జ్ఞానమును తెలుపు విధానములు మూడు కలవనీ అందులో మొదటిది వాణి (ఆకాశవాణి) ద్వారా, రెండవది తెరవెనుక నుండి కనిపించక చెప్పడము ద్వారా, మూడవది తన దూతను పంపి అతని ద్వారా చెప్పించడము, ఈ మూడు విధానములలో దూత ద్వారా చెప్పించడమును భగవంతుని ద్వారా చెప్పడము అను సంచలనాత్మక సత్యమును ఈ గ్రంథము ద్వారా గ్రహించవచ్చును.

తత్త్వముల జ్ఞానము

[మార్చు]
Cover Page
Cover Page

(నిజ తత్త్వమును తెల్పునది.) తత్‌ అనగా అది అని అర్థము. త్వం అనగా నేను అని అర్థము. తత్వం అనగా అది నేను అను అర్థము నిచ్చుచు ప్రారంభమైన గ్రంథమే తత్త్వముల వివరము. పూర్వము పెద్దలు జ్ఞానమను ధనమును సంపాదించి, ప్రపంచ ధనమును దాచినట్లు పెట్టెలో పెట్టి తాళము వేయలేదు, కానీ ఒక గుడ్డలో కట్టి ముడివేశారు. ఆ మూటలను మన ఎదుటే పెట్టి పోయారు. ఆ మూటల ముడి విప్పితే అందులోని జ్ఞానము సులభముగా దొరుకును. కానీ ఆ ముడిని మనము విప్పుకోలేనివారమైనాము. ప్రబోధానంద యోగీశ్వరులు ఆ ముడి విప్పి కొన ఊపిరితో మరణశయ్యమీదున్న వానిలాగా ఉన్న తత్త్వములకు ఊపిరిపోసి ఈ గ్రంథములో వివరము చెప్పినారు. ఎందరో తిక్క వ్రాతలుగా భావించు తత్త్వములు ఆధ్యాత్మిక విద్యలో ఆణిముత్యములను విషయము ఈ గ్రంథము ద్వారా తెలియును.

శ్రీకృష్ణుడు దేవుడా? భగవంతుడా?

[మార్చు]
We16
We16

(మహా రహస్యమైనది.) ప్రపంచములో మొట్టమొదటిసారిగా భగవంతునికీ, దేవునికీ అర్థమును తెలియచేయుటయేకాక, శ్రీకృష్ణుని పట్ల ఉన్న ఎన్నో అపోహలను శాస్త్రబద్ధమైన వివరణతో తొలగించుచూ యోగీశ్వరులు రచించిన ఈ గ్రంథము చాలా సంచలనాత్మకమైనది. ఈ గ్రంథము యొక్క పేరు అనేక సందేహములకు తావిచ్చును. వాటన్నిటికీ సరిjైున, శాస్త్రబ్ధమైన సమాధానము కొరకు, శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి అనబడుటకు గల కారణము కొరకు ఈ గ్రంథమును విధిగా చదవాలి. శ్రీకృష్ణుని జీవితము ఆద్యంతమూ ఆధ్యాత్మిక మార్గమున సాగినదను గొప్ప సత్యమును యోగీశ్వరులు అవిష్కరించకున్న, ప్రపంచమంతయూ కృష్ణుని వక్రదృష్టితో చూసి ఉండేది. ఇటువంటి గ్రంథము చదవిన తరువాత కృష్ణ భక్తులు అందరూ నిజమైన దేవుని (సాకార భగవంతుని) ఆరాధించినామని భావించి ధన్యులగుదురు. ఈ గ్రంథములో ప్రతి శీర్షికా కృష్ణుని విధానము తెలియచేయడమేకాక, ఇందులో శ్రీకృష్ణుని మరణము లోకమునకు కనువిప్పా? అను శీర్షిక ప్రతి ఒక్కరినీ మతములకు అతీతముగా ఆలోచింపచేయును.

కర్మపత్రము

[మార్చు]
coverpage
coverpage

(నిజ కర్మ నిర్మూలనమును తెల్పునది.) అధ్యాయములు 3, పాఠములు 36, సమాచారములు 324 అను ముఖచిత్రముతో ఈ గ్రంథము తయారైనది హిందూ, క్రైస్తవ, ముస్లీమ్‌ మతములలో ఒకే విధముగా చెప్పబడిన కర్మ విధానమును విపులముగా, వివరణాత్మకముగా ఈ గ్రంథమునందు గ్రహించవచ్చును. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన కర్మ, బైబిల్‌లో ఏసు చెప్పిన పాపము, ఖుర్‌ఆన్‌లో జిబ్రయేల్‌ చెప్పిన కర్మపత్రము మూడూ ఒకటే అను వివరము, కర్మ ఏ విధముగా అంటుకొనునో ఆ కర్మను తొలగించు విధానము ఈ గ్రంథములో వివరముగా తెలియజేయబడినది. అంతేకాక కర్మ సంపాదించుటయందుగానీ, సంపాదించుకోకపోవుటయందుగానీ భావము ఎంతటి ప్రధానమైనదో ఈ గ్రంథమునుండి గ్రహించవచ్చును.

జ్యోతిష్య శాస్త్రము(శాస్త్రమా-అశాస్త్రమా)

[మార్చు]

(నిజ జ్యోతిని తెల్పునది.) జ్యోతిష్యము మూఢనమ్మకమని కొట్టిపారవేసే మిడిమిడి జ్ఞానమున్న వారికీ, అదెట్లు మూఢనమ్మకమో శాస్త్రబద్ధముగా నిరూపించలేని అజ్ఞానులకూ, కనువిప్పు కలిగిస్తూ జ్యోతిష్యము శాస్త్రబద్ధమైనదనీ, మనుషుల అవగాహనారాహిత్యము వలన దాని శాస్త్రీయత తెలియకుండా పోయినదను వివరణతో యోగీశ్వరులు రచించిన సంచలనాత్మక, జ్ఞానపూరిత, ఆధ్యాత్మిక అవగాహనతో కూడుకొనియున్న గ్రంథమే జ్యోతిష్య శాస్త్రము. ఇంతవరకు జ్యోతిష్యములో మహామహులైన వారికి తెలియని మూడు క్రొత్త గ్రహములు, రాశి మరియు లగ్నముల వివరము, గ్రహచారము, దశాచారముల నిర్వచనము, రాశి, గ్రహము, యోగము, కరణముల అర్థములు ఈ గ్రంథములో తెలియ చేసిన విధానము ప్రపంచములో మొదటిసారిగా చెప్పబడినది. ఎవరైనా సులభముగా వారి జాతకమును తెలుసుకొను విధముగా ఈ గ్రంథము వ్రాయబడినది. ఈ గ్రంథము చివరిలో ఇచ్చిన ప్రశ్న`జవాబులు జ్యోతిష్యముపై మరింత అవగాహనను పెంచగలవు. ఈ గ్రంథములో త్రైత సిద్ధాంత ఆత్మజ్ఞానము తెలిసినవారే జ్యోతిష్యమును చెప్పగలరను మాట త్రైతులందరికీ బ్రహ్మానందమును కలుగజేయును.

గీతం-గీత

[మార్చు]

(పాటల జ్ఞానము) త్రైత సిద్ధాంత భగవద్గీతవలె ఈ గ్రంథములో కూడా దేవుడు చెప్పిన నిజమైన బోధకు సంబంధించిన శ్లోకములను, ఆ శ్లోకముల భావమును తేనెలొలుకు తెలుగులో ఆటవెలది, తేటగీతి పద్యములతో సులభశైలిలో వివరించడమైనది. ఈ గ్రంథమునకు మొదట కొన్ని ఆధ్యాత్మిక పాటలను జోడిరచుచూ ఈ గ్రంథము పేరునకు తోడుగా పాటల జ్ఞానము అను శీర్షికనుంచారు. పద్య ప్రియులకు అనువుగా ఈ గ్రంథము సులభశైలిలో స్వచ్ఛమైన దైవజ్ఞానమును అందించును. ఈ గ్రంథము పైన ముఖ చిత్రము అత్యంత ఆకర్షణీయము ఆలోచించవలసిన సమాచారముతో కూడుకొనియున్నది.


మన పండుగలు

[మార్చు]
coverpage
coverpage

(ఎలా చేయాలో తెలుసా) (మహా ఆచరణవంతమైనది.) మానవుని దృష్ఠిలో విలువలేని కాలమునకు విలువ కల్పించాలనీ, జరిగిన కాలము తిరిగిరాదని అర్థమగునట్లు చేయాలనీ, నీ జీవితకాలము కొద్దిపాటియేననీ, ఆ కొద్దిపాటి కాలము కూడా ఖర్చయిపోతున్నదని ఆలోచించాలనీ, జరిగిన నీ జీవితకాలములో ఏమీ సాధించానని యోచించాలనీ, అసలు కాలమంటే ఏమిటో కనువిప్పు కల్గించాలని పెద్దలు మనుషుల చేత ఆచరింపజేసిన ప్రక్రియనే ‘‘పండుగ’’ అనుచున్నాము. కాయ కొంత కాలమునకు పండుగ మారుచున్నది. కాయ అనునది పండుగ పరివర్తన చెందుట మనకు పూర్తిగా తెలిసిన విషయమే. మార్పువచ్చిన పండునుండి పుట్టిన పదమే ‘‘పండుగ’’ పూర్వమే మన పెద్దలు ఆత్మజ్ఞానమును ప్రజలకు తెలియజేయాలని పండుగలను మన మధ్యలో పెట్టారు. ఇప్పటి అజ్ఞాన విధానమును వదలి, అజ్ఞాన వాతావరణములో చేయుచున్న పండుగలను భావములో మార్పు తెచ్చుకొని, జ్ఞానమును కల్గించు వాతావరణములో చేసుకొందాము. మన జీవితములో జ్ఞానమును పండిరచుకొని జ్ఞాన పండితులుగా తయారవుదాము.

ద్రావిడ బ్రాహ్మణ

[మార్చు]
coverpage
coverpage

(నిజ చరిత్రను తెల్పునది.) యోగీశ్వరుల రచనలలో యాభైయ్యవ రచన అయిన ‘‘ద్రావిడ బ్రాహ్మణ’’ ఒక గొప్ప సంచలనాత్మక గ్రంథము. యుగయుగములనుండి భారతదేశములో జరుగుచున్న సంఘటనలను తనలోని రెండవ ఆత్మ ద్వారా యోగీశ్వరులు కళ్ళకు కట్టినట్లు చూపినారు. ద్రావిడ అను పదము త్రైత సిద్ధాంత జ్ఞానమును నిర్వచించునదనీ ద్రా, వి, డ అను మూడు అక్షరములకు జ్ఞానపరమైన అర్థమునిచ్చుచూ ఆనాడు ఆర్యులు దైవజ్ఞానులైన ద్రావిడులను నిజమైన దైవమార్గమునుండి ఏ విధముగా ప్రక్కదారి పట్టించినదీ, తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదీ, దక్షిణ భారతదేశము ఎంత జ్ఞాన సంపన్నమైనదీ సోదాహరణముగా, సులభశైలిలో యోగీశ్వరులు వివరించిన విధానము చరిత్రకారులనే విస్మయపరచును. భారతదేశములో పుట్టిన బౌద్దము స్వదేశములో కనుమరుగై విదేశాలలో ఎందుకు ప్రాముఖ్యత పొందినదో ఈ గ్రంథములో మాత్రము తెలియబడును. భారతదేశ పటము మానవాకారములో ఉన్నదను సరిక్రొత్త కోణమును యోగీశ్వరులు చూపిన విధానము, వర్ణన ఈ గ్రంథములోపల, చివరి పేజీ ముఖచిత్రముగా పాఠకులను ఆశ్చర్యచకితులను చేయును. దక్షిణ భారతదేశమున పుట్టిన ద్రావిడులు ఎంత జ్ఞానవంతులో ఈ గ్రంథము ద్వారా తెలియగలదు. ద్రావిడ జాతియుడైన ఆంజనేయుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు,జ్ఞానవంతుడు ఎలా అయ్యాడనే రహస్యము తెలుసుకొనుటకు పాఠకుల అదృష్టము. అంతేకాక చదివితే తప్ప తెలియని అనేక సంచలనాత్మక విషయముల కొరకు ఈ గ్రంథమును తప్పక చదివి తీరవలసిందే

ఇందువు-క్రైస్తవుడా?

[మార్చు]
coverpage
coverpage

(నిజ ఇందుత్వమును తెల్పునది.) ‘‘ఇది మత మార్పిడి మీద బ్రహ్మాస్త్రం’’ అను ముఖచిత్ర వాక్యముతో కూడుకొనియున్న ఈ గ్రంథము చదువరులను ఆలోచింప చేయును. వినుటకే విచిత్రముగా కనిపించు ఈ గ్రంథము యొక్క పేరు ఒక్కసారిగా పాఠకులను ఆశ్చర్యచకితులను చేయును. ఈ గ్రంథమునందు మతమార్పిడి దేవునికి సమ్మతముకాదనీ, ‘మతము’ అను భావన ప్రాథమిక అజ్ఞానమనీ ఒక మతము వారు వేరొక మతము వారిని ఏ విధముగా తమ మతములోనికి మార్చుతున్నారను విషయమును, లోతైన పరిశోధన ద్వారా ప్రబోధానంద యోగీశ్వరులు కళ్ళకు కట్టినట్లు వివరించినారు. ప్రతి మతమునందు మనిషికి కావలసిన జ్ఞానమును దేవుడు తెలియచేసినాడు. ఒక మత గ్రంథములోని ప్రశ్నకు మరొక మత గ్రంథమునందు జవాబు లభించునను యోగీశ్వరుల పదునైన వాక్యము సర్వ మత సామరస్యమును తెలియజేయును. ప్రతి వ్యక్తి తన మతములో తాను ఉంటూ ఇతర మతములలోని జ్ఞానమును తెలుసుకోవచ్చుననీ, తన మతములో దొరకని జ్ఞానము వేరొక మతములో దొరకదనీ తెలియచేస్తూ, అన్ని మత గ్రంథములలో ఒకే జ్ఞానమును చూచినవారు అదే జన్మలోనే జన్మరాహిత్యమును పొంది దేవునియందు ఐక్యమగుననీ వివరించిన ఈ గ్రంథమును మత సామరస్యముకోరు ప్రతి మనిషీ చదివితీరవలయును.

ధర్మశాస్త్రము ఏది?

[మార్చు]
coverpage
coverpage

(మహా ధర్మవంతమైనది.) ప్రథమ దైవ గ్రంథము భగవద్గీత అను గ్రంథమునందు సందర్భానుసారముగా ప్రస్తావించిన ధర్మశాస్త్రము అను పదమునకు సవివరణ ఇచ్చిన సంచలనాత్మక గ్రంథమే ‘‘ధర్మశాస్త్రము ఏది?’’ ధర్మము అనుపదమునకు సరిjైున అర్థమును చెప్పలేని స్వామీజీలను, పీఠాధిపతులు ఉన్న నేటి సమాజములో, ధర్మమునకు నిజమైన శాస్త్రబద్దమైన అర్థమును సోదాహరణముగా యోగీశ్వరులు వివరించినారు. ధర్మము యొక్క ఆవశ్యకతతో ప్రారంభమైన ఈ గ్రంథము, ధర్మశాస్త్రము యొక్క అర్థమును వివరించుచూ ముగియును. ఇంతవరకూ, లేని ధర్మములను స్థాపించుటకొరకై దేవుడు భగవంతునిగా భూమిపైకి వచ్చునని అందరికీ తెలియును. సృష్ఠ్యాదినుండి ఇప్పటివరకు తెలియని ఒక సంచలనాత్మక, సరిక్రొత్త వివరమును యోగీశ్వరులు ఈ గ్రంథములో వివరించినారు. ఆ వివరమును తెలుసుకోవాలను ప్రతి ఒక్కరు ఈ గ్రంథమును చదివితీరాలి. అంతేకాక శాస్త్రమునకు, గ్రంథమునకు గల బేధమును, భావము మరియు ప్రభావముల నిర్వచనము, గుణములయొక్క పని ఈ గ్రంథములో యోగీశ్వరులు చాలా సులభశైలిలో ప్రతి ఒక్కరికీ సునాయాసముగా అర్థమగునట్లు వివరించినారు. ఎంతో సంచలనాత్మక సమాచారముతో కూడుకొనియున్న ఈ గ్రంథరాజము జ్ఞాన జిజ్ఞాసులను ఆధ్యాత్మిక లోతులకు తీసుకొనిపోగలదని నిస్సందేహముగా చెప్పవచ్చును.

ప్రథమ దైవ గ్రంథము భగవద్గీత

[మార్చు]
coverpage
coverpage

(నిజ దైవమును తెల్పునది.) సృష్ఠ్యాదిలో ఆకాశవాణి ద్వారా సూర్యునికి మొదటిసారి తెలియజేయబడిన జ్ఞానమే, ద్వాపరయుగము చివరిలో కృష్ణుని ద్వారా అర్జునునికి భగవద్గీతగా తెలియబడినది. ఆ విధముగా తెలియజేయబడిన జ్ఞానము వ్యాసునిచే రచించబడిన గ్రంథమై, ప్రథమ దైవ గ్రంథము భగవద్గీత అను పేరును సార్థకము చేసుకొన్నదను శాస్త్రబద్ధమైన వివరణతో కూడిన, యోగీశ్వరుల సంచలనాత్మక గ్రంథమే ‘‘ప్రథమ దైవ గ్రంథము భగవద్గీత’’. సమస్త మానవాళికి దేవుడు అందించిన జ్ఞానము ప్రథమ దైవ గ్రంథము భగవద్గీతగా, ద్వితీయ దైవ గ్రంథము బైబిలుగా, అంతిమ దైవ గ్రంథము ఖుర్‌ఆన్‌గా లభించినది. ఈ గ్రంథములో భగవద్గీతను ధృవీకరించు గ్రంథములుగా బైబిలు, ఖుర్‌ఆన్‌ కలవని, వాటిలోనే ఆ ధృవీకరణ వివరము ఉన్నదని యోగీశ్వరులు శాస్త్రబద్ధముగా నిరూపించినారు. దైవ జ్ఞానము గ్రహము ద్వారా, దూత ద్వారా తెలియునని సంచలనాత్మక వివరమును సులభశైలిలో యోగీశ్వరులు ఈ గ్రంథములో వివరించినారు. సందర్భానుసారముగా పురుషులలో, స్త్రీలలో ఏయే గుణములు ఎక్కువగా పనిచేయునను సరిక్రొత్త వివరమును ప్రపంచములోనే మొదటిసారిగా తెలియజేయబడినది. ఈ గ్రంథమునకు కొసమెరుపుగా ప్రబోధానందయోగీశ్వరులు వ్రాసిన చివరిమాట, ప్రతి మతస్థుని హృదయమును తాకి ఆలోచింపచేయును.

తీర్పు

[మార్చు]
Cover page
Cover page

(నిజ న్యాయ, శిక్షను తెల్పునది.) ఈ గ్రంథము మూడు ఆత్మల యొక్క వివరణతో మొదలై శిక్ష, అక్ష అను పదములకు అర్థమును వివరిస్తూ ఈ రెండు పదములు దేవుని తీర్పును అమలు చేయు సాధనములై ఉన్నవనీ, తీర్పులు ప్రకృతి తీర్పు, పరమాత్మ తీర్పని రెండు రకములనీ, వాటిని ముందే దేవుడు నిర్ణయించి ఉండగా ఆత్మ అమలు జరుపుచున్నదనీ, ఆత్మ అమలు జరుపుచున్నా అది దేవుని తీర్పేననీ, యోగీశ్వరులు సోదాహరణముగా ఈ గ్రంథములో వివరించినారు. ఎవనికి ఏ తీర్పు తీర్చబడినదో, ఎవడు ఏమి అనుభవించునో అన్నీ దేవునికి ముందే తెలుసునను గొప్పవాక్యమును భగవద్గీత ఆధారముగా ప్రబోధానంద యోగీశ్వరులు సవివరముగా తెలియచేసినారు. బయటి కోర్టులలోనే తీర్పులు, శిక్షలు ఉంటాయి. ప్రతి మనిషికీ లోపల కనిపించని న్యాయస్థానము, కనిపించని న్యాయవాది, కనిపించని న్యాయమూర్తి ఉన్నారను సంచలనాత్మక విషయముతో పాటు, ఎవరికీ తెలియని అంతరంగములోని కోర్టులో విచారణ ఎలా ఉంటుందో, తీర్పు ఎలా ఉంటుందో అందరికీ అర్థమయ్యేలాగున యోగీశ్వరులు ఈ గ్రంథములో వివరించిన విధానమును అన్ని మతములవారూ తప్పక చదివితీరవలసిందే !

ప్రబోధ తరంగాలు

[మార్చు]
We9
We9

(మహా జ్ఞాన నీటి అలలు.) ప్రబోధానంద యోగీశ్వరులనుండి వెలువడిన మహాశక్తివంతమైన వాక్యముల సంకలనమే ఈ గ్రంథము. ఇందులో యోగీశ్వరుల జ్ఞానసందేశము క్లుప్తముగా ఒకటి, రెండు వాక్యములతో నిక్షిప్తమై, విశదీకరించుకొద్దీ ఒక పెద్ద గ్రంథమే కాగల శక్తిని కల్గియున్నవి. కొందరి మనస్సులలో ఎంతో కాలమునుండి ఉన్న సంశయములకు మరియు ఎన్నో గ్రంథములను చదివినప్పటికీ తీరని ప్రశ్నలకు సూటిగ జవాబు చెప్పినట్లు ఈ వాక్యములు గలవు. విన్నపుడు రుచిగ ఉండి తర్వాత జీవితములో ఉపయోగపడని జ్ఞానవిషయములుకాక, ఎల్లప్పుడూ ఒకే జ్ఞాన సారాంశము కల్గి జీవితములో ఉపయోగపడునవే ఈ ప్రబోధ తరంగాలు. దాదాపు 800లకు పైగా వాక్యములున్న ఈ గ్రంథములో మూడు ఆత్మల వివరమూ, శరీరాంతర్గత వివరమూ, మనస్సు యొక్క మర్మమూ యోగీశ్వరులు తెలియజేసేవరకూ, ఈ ప్రపంచములో వాటి వివరము ఎవరూ తెలియచేయలేదను విషయమును ఈ గ్రంథమును చదివిన తరువాత ప్రతి పాఠకుడూ తెలియగలడు.