వాడుకరి:JVRKPRASAD/ఉపపేజీ1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏమి వ్రాయవచ్చు[మార్చు]

స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వంలో ఏమి వ్రాయాలో నిర్ణయించేది రచయితలు గాని అధికారులు కాదు. మీరు వ్రాసేది (1) నిజం (2) సార్వ జనీనం (3) నిర్ధారించుకోవడానికి వీలైన ఆధారాలున్నది (4) నిష్పాక్షికం అయి ఉండాలి. ఇంకా తెలుగు భాషలో వ్రాయాలి. వ్రాసినదానినిన మళ్ళీ మళ్ళీ మార్పులు చేయవచ్చును. అదనపు సమాచారం చేర్చవచ్చును. ఏమి వ్రాయడానికి వీలవుతుందో సూచనా ప్రాయంగా ఇక్కడ వివరిస్తున్నాము.


 • ఏ వూరు? ఎక్కడ? మీ వూరు పేరు, మండలం, జిల్లా - ఈ మూడు వివరాలూ తప్పనిసరిగా కావాలి. లేకపోతే వికీలో దానిని వర్గీకరించడం, వెదకడం సాధ్యపడదు. ఇంకా మార్గము, సరిహద్దులు, గుర్తులు, దగ్గరి పట్టణం నుండి దూరం వంటి వివరాలు కూడా ఇవ్వవచ్చును. వీలయితే పంచాయితీ ఆఫీసు, పోస్టాఫీసు టెలిఫోను నెంబరులు.
 • గణాంకాలు -జనాభా (స్త్రీలు, పురుషులు), వైశాల్యం, ఇండ్లు, వీధులు, అక్షరాస్యత వంటి వివరాలు.
 • సదుపాయాలు - స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు , గ్రంధాలయాలు, పోస్టాఫీసు, బస్సు రైలు సౌకర్యం , దుకాణాలు, గుడులు, చర్చిలు, మసీదులు, సినిమా హాళ్ళు (సారాకొట్లు ఉండే ఉంటాయి. వ్రాయనవసరం లేదు. ఒకవేళ మద్యపాన నిషేధం మీ వూళ్ళో అమలు అయితే తప్పక వ్రాయండి)
 • ఆర్ధికం - ప్రధానమైన ఉపాధి అవకాశాలు. ఎందరు ఏయే పనులు చేస్తున్నారు? ఏ యే పంటలు? నీటి వనరులేమిటి? ఇతర వృత్తులేమిటి? పాడి పరిశ్రమ, కోళ్ళ పెంపకం, నేతపనులు, టౌనులో పనిచేసేవారు, దుకాణాలు, ఫ్యాక్టరీలు - వగైరా
 • చరిత్ర - చిన్న వూరికైనా పెద్ద వూరికైనా చరిత్ర ఉంటుంది. కాని మనకు వ్రాసే అలవాటు తక్కువ. పరిశోధించండి.
 • సంస్కృతి - సాధారణంగా పాటించే సంస్కృతి. ప్రత్యేకతలు. సంబరాలు. తిరణాళ్ళు. మీవూరికి ప్రత్యేకమైన కధలు.
 • విజయాలు - క్రొత్త వ్యవసాయ విధానాలు, నీటివనరుల అభివృద్ధి, అక్షరాస్యత, రోడ్లు, స్వచ్ఛంద సంస్థల సాధన, పొదుపు సంఘాల పనులు, వనరుల సమీకరణ.
 • సమస్యలు - చాలా వుండవచ్చును, ముఖ్యమైనవి. వాటికి శాస్త్రీయమైన పరిష్కారాలు ఎవరైనా అధ్యయనం చేశారా? (ఎలక్షను వాగ్దానాలు కాదు)
 • వార్తలలో - ఏవైనా ప్రమాదాలు, వరదలు, ఎన్‌కౌంటర్లు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సంబరాలు.
 • ప్రముఖులు - వివిధ రంగాలలో రాణించిన మన వూరి బిడ్డలు. ఇదివరకు గానీ, ఇప్పుడు గానీ. మీ వూరిలో ప్రత్యేకమైన నైపుణ్యం, ప్రతిభ గలవారు. సమాజసేవకులు. ఇంకా..
 • విశేషాలు - మీకే తెలియాలి.
 • ఫొటోలు - ఏవైనా ఒకటి రెండు వివరణాత్మకమైన, లేదా ఆసక్తి కరమైన ఫొటోలు జోడించండి. మీరు పంపే ఫొటోలు మీరు తీసినవైతే మంచిది. అవి Public Domain ఫొటోలుగా పరిగణించబడుతాయి. అంటే వాటిని వేరెవరైనా వాడుకొనవచ్చును.