వాడుకరి:JVRKPRASAD/నీ(తి) సూత్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నీ(తి) సూత్రాలు[మార్చు]

 • నీకు పదవి ఇక్కడ ఉంటే బానిసలా బ్రతుకు. నీ సొంత తెలివి తేటలు ప్రదర్శించకు. నిన్ను పదవిలో నుండి తొలగించే వరకు శతవిధాల ప్రయత్నిస్తారు. ఒంటరిగా పోరాడకు ఓడిపోతావు. జీవితాకాలం నీకు అన్ని విషయాలలో నిషేధం విధిస్తారన్న సంగతి మరువకు మరియు మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయేవరకు ఒక్కలా ఉండకపోయినా ఇక్కడ మాత్రం నీ బ్రతుకు చీకటి మయంగానే ఉంటుంది.
 • సింహాం ఎవరూ అధికార బిరుదు ఇవ్వకుండానే అడవికి రాజు అయింది.
 • నీటికి ఎదురు ఈదే నీ మనస్తత్వం బహు కొద్ది మందికి మాత్రమే ఉంటుంది అని తెలుసుకుంటే కష్ట నష్టాలు ఎన్ని వచ్చినా భరించే ఓర్పు, సహనం నీకు అలవాడతాయి.
 • సింహానికి వేట ఎవరూ నేర్పనట్లే ఎవరి సహాయ సహకారములు లేకుండా నీకు ఎదురయినా ఏ మానసిక సమస్యనయినా నువ్వే పరిష్కరించుకుంటే నీకంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వ గుర్తింపు ఎల్లప్పుడూ ఉంటుంది.
 • అడవిలోని మందలకు సొంత బుద్ధితో పెద్దగా అవసరం లేకుండా, ఐకమత్య జీవన విధానాన్ని ఏవిధంగా అనుసరిస్తాయో నిస్వార్ధంతో మన మనుషులతో మసలుకుంటే ఏనాటికైనా నీకో పుటను వికీలో కేటాయింపుకు మంచిపేరు వస్తుందని తెలుసుకుంటే మంచిది.
 • అడవిలో తన దారిలో సింహాము వెళ్ళుతుంటే దారి మధ్యలో చెట్ల మీద పక్షులు సింహాన్ని తరిమి తరిమి కొట్టాలని, తమ కూతలతో తరమాలని తెగ గోలగోల చేసేస్తాయి, వాటి వల్ల కాక మాకూ పులులున్నాయని, అవి మరికొన్నింటిని కూడా పిలుచుకు వస్తాయి తోడుగోల కోసం. కానీ సింహం మాత్రం ఈ గోల గ్యాంగులతో నాకేమి పని అని అది మరో మంచి సమయం మరియు దారి కోసం మరో వైపు పయనిస్తుంది. దారిలో తారసపడిన ఏనుగులు గుంపు సింహాన్ని చూసి అవి ఆ పక్షుల గుంపు ఉన్న చెట్ట్ల వైపు పరుగిడి అవి అక్కడే స్థిరపడి ఆహారం కోసం కొమ్మలతో మొదలుపెట్టి మానులు తినటం మరిగినప్పుడు, మొత్తం పక్షులు గుంపుతో సహా మరోచోటికి ఎగిరిపోతాయి. (ఇది నా (సొంత) కథ)
 • నీకు తృప్తి కలిగించే సరయిన సమాధానాలు నువ్వు వేసిన ప్రశ్నలకు ఎంతటివారయినా ఎవరు చెప్పలేరు మరియు ఎవరి దగ్గర నుండి కూడా ఏనాటికీ లభించవు (పెద్దలకు ఎవరి పిచ్చి వారికి ఆనందం) అని తెలుసుకుంటే మంచిది.
 • ప్రపంచంలోని ఎంతటి వారి గురించి అయినా ఏకవచనంలోనే వ్రాయి. అదే వికీ మూల సూత్రం. ఏకవచనం ప్రయోగంతో మాట్లాడే వాడు ఇది తయారు చేసాడేమో అని మూలం గురించి వెతకితే సూత్రం మాత్రం దొరకదు.
 • నువ్వు వేల వ్యాసాలు ఒకేసారి ప్రారంభం, పూర్తి చేసి విందు భోజనం తయారు చేయాలనుకుంటావు, కానీ ఆకలితో ఉన్న బిడ్డకు బిస్కత్తు ఇచ్చినట్లు ఒక వ్యాసం పూర్తి చేసిన తరువాత మరొకటి వ్రాయాలని తెలుకుంటే మంచిది.
 • నువ్వు ఇక్కడ వికీ సూత్రాలు తెలియక తెలుగులో ఎవరైనా ఏదైనా ఎంతైనా స్వేచ్చగా వ్రాయవచ్చు అని నీకు నచ్చిన విషయములు వ్రాద్దామని అసలు (ని)గూడార్థం తెలియక భ్రమలో ఉండి అవి పదిమందికి నచ్చక పోతే వెంటనే ఆ పని మానుకోక పోతే ఎందుకూ ఇక్కడ పనికి రాని పనికి జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
 • నువ్వు సంస్కారము లేని చదువు ఎవరికీ కూడా చెప్పి నేర్పించకు . భవిష్యత్తులో నిన్ను కూడా సంస్కారహీనుడని అనుకుంటారు.
 • నువ్వు వ్యాసాలకు నామకరణం చేశానని, వాటిని నువ్వే వ్యాసాలుగా వ్రాస్తానని ఎంత మొత్తుకున్నా నీ మొర ఆలకించక పోగా అవి మొలకలంటారు, వ్యాసాలంటారు, ఇంకా ఏదో ఏదో మూర్ఖంగా వాదిస్తారు అని సహ మేధావులను మనసులో కూడా అనుకోవద్దు, అలాంటి వారితో సహకరించి వారి వాదనలను ఏకీభవించుతూ భవిష్యత్తులో సవ్యంగా నీ భావన వేరే వారికేమన్నా తెలుస్తుందిలే అని సరిపెట్టుకుంటే సరి.
 • నువ్వు ప్రస్తుతం ఉన్న మొత్తం వ్యాసాలకంటే నా వ్యాసాలు తీసి(పారే)సేవిగా ఉన్నాయా అని మనసులో కూడా ప్రశ్నించుకోకు, జవాబు దొరకదు. కొద్ది మంది ఎదుటి వారికి నచ్చినవే (ఏలాంటి [దరిద్రానివి కూడా]) ఉండాలి అని (వ్యాసాల జాబితాలో) తెలుసుకుంటే మంచిది.
 • నువ్వు తెలుసుకోవాలనుకున్న దానికి నిర్ణయాలు చేసేసేందుకు మాత్రం ఉన్న పదిమంది అందరూ తమ మేధావి తనంతో తమతమ అభిప్రాయాలు చెబుతారు అంతే కానీ నీ (మనసు)కు తృప్తి కలిగేలా మూలాలు ఆధారాలు ఏనాడూ చూపించ(లే)రని తెలుసుకో.
 • నువ్వు చేసిన పని విలువైనది అని అనుకుంటే ఇక్కడ పనికి రాకపోతే ఆ సమాచారాన్ని మరోచోటకు పదిలంగా మొత్తం చేర్చుకో, వీలయినంత త్వరగా ఆ పని చేసుకో, నీకు ఆనందంగా ఉంటుంది.
 • నీకు ఇప్పుడే వికీలో చేరిన ఎర్రలింకుతో ఉన్న అనామక, అడ్రసులేని, ఊరు పేరులేని వ్యక్తి, ఎటువంటి విద్రోహ వ్యక్తో అని భ్రమపడకుండా వికీలనందు ప్రపంచంలో ఎవరికీ ఇవ్వని గౌరవ మర్యాదలతో సానుకూల స్పందనలతో నువ్వు భయపడుతూ, అణగి మణగి ఆయనకు స్వాగతంతో, సత్కార్యాలు అందిస్తున్నట్లుగా సేవలు చేయడమే వికీ మూలసూత్రం.
 • ఇక్కడ వ్రాసే వ్యాసాలు అంతర్జాలంలో తెలుగులోనే ఎన్నో చోట్ల లభ్యమవుతాయి. మరి అలాంటివి ఇక్కడ ఎందుకు వ్రాయడం ? తెలుగులో లేనివి కూడా ఇక్కడ వ్రాయకూడదంటాడు. ప్రతివాడు తను చెప్పేదే వినాలనుకుంటాడు, అదే వేదం అంటాడు. అదే వికీపీడియా మూలసూత్రం అంటాడు. దానికి పాత మరియు కొత్త అందరూ భజనలు చేస్తారు. గ్రూపులు కడతారు.
 • నువ్వు వ్రాయాలనుకున్న వ్యాసాలు సమాచార విధానం ప్రస్తుత, రాబోయే తరాలకు అనుగుణంగా ఉండాలని అనుకుంటావు కానీ అది వికీ మూల సూత్రానికి విరుద్ధం కనుక పెడచెవిన పెట్టక పద్ధతి మార్చుకుంటే ఈ సమస్య జటిలం కాకుండా సమసి పోతుంది అని వెంటనే స్ఫురణకు తెచ్చుకొంటే మరి కొంతకాలం వికీ వ్యాస ప్రయాణం ముందుకు సాగవచ్చును అని మనసులో ఎల్లప్పుడూ నెమరు వేసుకుంటే పదుగురు వికీ వారికోసం వారు కోరుకున్న నాణ్యమైన వ్యాసాలు అందించడానికి అవకాశముంటుంది అని తక్షణమే గ్రహించగలగాలి.
 • నువ్వు వ్రాసే వేల వ్యాసాలకు నిన్ను అనుసరిస్తూనే, గమనిస్తూ నెలలు గడిచిన తదుపరి అప్పుడు చెబుతాడు నీకు నీతి సూత్రాలు అవి ఏవీ పనికి రావని, అప్పుడు నువ్వు ఏమీ మనసులో బాధపడి విచారించుతూ ఆలోచించకుండా సమయం వృధా చేయక వెను వెంటనే తొలగించకపోతే వికీనుంచి నిన్ను గుంపులు వెలి వేస్తాయి.
 • అందరి మనుష్యుల మనసులలోనూ దైవాన్ని చూసే నువ్వు వర్తమాన, భవిష్యత్తు తరాల పసి హృదయాల మనసులలో విషబీజాలు నాటే మర్యాద మరచిపోయే ఏకవచన ప్రయోగ వ్యాసాలు వారి మనసులు కల్మషమయ్యే విధంగా ఆమోదింప బడిన వికీ సూత్రాలకు లోబడి ఎన్నడూ కర్తగా అయి వ్రాయుటకు, దిద్దుటకు ఎలాంటి ప్రయత్నము చేయకు.
 • నువ్వు కోట్లమంది ప్రజల కోసం సొంతంగా పెద్ద పనులు గురించి ఒక్కడివే ఆలోచించి జీవితం లోని సమయాన్ని పాడుచేసుకోకు. పదిమందితో కలసి ఒకే ఒక వ్యాసంలో పాలుపంచుకుంటే గుర్తింపు ఉంటుంది.
 • నువ్వు పొందాలనుకున్న సమాధానము దొరికేంత వరకు మరియు విలువిచ్చినంతవరకు, ఎంతటి వారి నయినా భయపడక అడుగుతూ ప్రశ్నించుతునే ఉండు.
 • నువ్వు ఇక్కడ కొన్ని వేలమంది వాడుకరులు ఉన్నారనే భ్రమతో దేని కొరకు ఒంటరిగా పోరాడకు, వాదించకు. కారణం ఇక్కడ ఉండేది బహుకొద్ది మాత్రమే ఉంటారు, వారి నిర్ణయాలే వికీకి శిరోధార్యం అని మరువ కూడదు.
 • నువ్వు పొందాలనుకున్న సలహా, సూచన, సందేహం, సహాయం లాంటివి ఏవైనా వాటికి మర్యాద పూర్వకంగా అడిగితే కనీస ముందస్తు సమాధానము దొరుకుటకు కూడా పుష్కరకాలం పడుతుంది అని సందేహించి సంయమనము లేకపోయి ఏకవచనంతో పరుషపదజాలంతో ప్రశ్నిస్తే వికీ మూలసూత్రం ప్రకారం వెనువెంటనే ఎక్కడి నుండో అనేకమంది వాలిపోయి నీకు మర్యాదలు నేర్పుతూ సూటిగా కావలసిన అవసరము తీరని అనేక అనవసర చర్చలు చేస్తారు మరియు అందరి నొచ్చుకోలు విమర్శలు అందుకోవాల్సి రావచ్చును అని గ్రహించుకొని గుర్తుంచు కోవాలి.
 • నువ్వు కట్టే ఒక వ్యాస పెద్ద భవంతి నిర్మాణానికి వాడే సెంటరింగ్ మెటీరియల్ ఎవరికీ అర్థం కాకుండా ఉంటుంది, భవంతి వ్యాసము పూర్తి అయ్యేనాటికి ఒక్కొక్క వ్యాసములో ఏమేమి ఉంచుతావో, కొత్తగా ఏమి చేర్చుతావో ఎవరికీ ఏమీ తెలియకుండా నీ మనసులోనే ఉంచితే అసలుకే మోసం వస్తుంది అని తెలుసుకున్నా, నీ దారిలోనే నీవు నడువు మరెక్కడైనా నీ పనితనం అవసరమైన చోట ప్రదర్శించి చూపించుకుంటే మెప్పులు పొందుతావేమో ఒకసారి ఆలోచించుకుంటే బావుంటుంది.
 • నువ్వు వ్యాసాలకు పేర్లు మాత్రమే పెట్టానని ఎంతగా మెత్తుకున్న అవి వ్యాసాలు అనే ఎదుటి వారు అంటారు. వేల వ్యాసాలు ఒకేసారి నువ్వే పూర్తి చేస్తానంటావు, అందుకు ఒకరు మూస పెట్టాలంటారు. ఆ మూస అన్ని రోజులు, అన్ని వేల వ్యాసాలకు ఉండకూడ దంటారు. నీ ఆలోచనల విధానంతో కొత్తగా ఏదో చేయాలనుకుంటవు. బొమ్మలు పెట్టడం దగ్గర కూడా అనేక విమర్శలు. ఒకరు మొలకలు తీయాలంటే ఎక్కడ తీసివేస్తారోనని జాబితాలో అందులో చేర్చావు. మరొకరు జాబితాలు ఉండకూడ దంటారు. జాబితాలు తీసివేసి మూసలు పెడతావు. మూసలు ఎక్కువయ్యాయని ఉండకూడదంటారు ఇంకొకరు. తెలుగు వారు నివశిస్తున్న చదువుకున్నవారు, అంతర్జాల అవగాహన ఉన్నవారి మాత్రం కోసమే తప్పితే, నువ్వు అనుకున్నట్లుగా దేశంలో, విదేశాలలో ఉన్న ఎటువంటి చదువు లేకపోయినా ప్రతి తెలుగు బిడ్డ కోసం తెలుగు సమాచారం అందించాలనుకునే నీ తపన, తాపత్రయం చాలా తప్పు అని వికీ మూల సూత్రాలు ద్వారా మరో ఇద్దరు పెద్దలు నీకు నీతులు చెప్పేందుకు రాకుండానే, త్వరగా నీవు తెలుసుకున్నందుకు మనసులోనే మంచిదయ్యిందని సంతోషించితే, నీకు ఆనందం మిగులుతుంది. ఇక్కడ ఉన్న పదిమంది అభిప్రాయాలు చెప్పినట్ట్లుగా ఇలా అందరికీ నీ పనిలో లోపాలే కనబడతూ ఉంటే ఆపనిని ఎలా ముందుకు తీసుకు వెళ్ళగలవు.
 • నిన్ను ఏనాడూ ఎవరూ మెచ్చుకోరు, గుర్తించరు, అభినందించరు, ఇత్యాది వాటి కోసం ఏనాడూ పాకులాడకు, అలాంటివి నువ్వు కావాలనుకున్నప్పుడు లభించవు.
 • ఏ చర్చలలో నయినా వివాదాలు తెగేదాకా చేయకు. అలా అయితే నువ్వు వివాదాలకు కేంద్ర బిందువు అవుతావు. నీవు ఒక్కడివే అయినా చింతించకు, నీ వల్ల ఎంతో మంది ఒకటిగా ఏకమయ్యరనే భావనతో ఎల్లప్పుడూ మనసులో సంతోషించుతూ ఉంటే చాలా మంచిది.
 • నువ్వు మహాభారతంలో అన్నదమ్ములు అందరూ కలసి శకునిని బ్రతికించు కున్నట్లుగా ఒకే ఒక పని నిమిత్తం నీవంతు సహాయ సహాకారాలు ఇక్కడ ఉన్న పది మందికి మనసుకు నచ్చినట్లుగా నడచుకుంటే నప్పుతావు.
 • అడవిలోని సింహం ఎవరి బంధు మిత్రుల సహాయ సహాకారాలు తనకోసం ఏనాడూ కోరుకోదని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ జీవితంలో ఎదురయ్యే ఎటువంటి మనసుకు కష్టం కలిగించేవి వచ్చినా ఒంటరిగానే వాటిని ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని విడవక అండగా అందుబాటులోనే ఉంచుకుంటే ధైర్యంగా ముందుకు నీ జీవిత ప్రయాణ పయనము సాఫీగా సాగుతుంది.
 • ప్రపంచంలోని ఎంతటి వారి గురించైనా ఏకవచనంలో వ్రాయి కానీ, ఇక్కడ ఎవరికయినా ప్రపంచంలో ఎవరికీ ఇవ్వనంత గౌరవ మర్యాదలిచ్చి మసలుకుంటేనే ఇక్కడ మనగలుగుతావు.
 • నువ్వు చేసే ఏ పనిలో అయినా నీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలి, రావాలి అనుకున్న రోజున ఇక్కడ పనిచేయకు.
 • నువ్వు చేయాలనుకున్న పని లేదా చెప్పాలనుకున్న మాట ఏదయినా మంచిది అయినప్పుడు ఎవరేమన్నా పట్టించుకోక నీ దారిలోనే నువ్వు నడువు. ఏనాటికో ఒకనాటికి నీ పనులు మరియు మాటలు మంచివి అని ఎవరో ఒకరు గుర్తిస్తారు అప్పుడు తప్పకుండా నువ్వు వెలుగులోకి వస్తావు, గుర్తింపు వస్తుంది. అప్పటి వరకు ఓర్పుతో, సహనంతో ఎదురుచూస్తూ ఉండు.
 • నువ్వు వాడే భాషా పదాలు మేళవింపు మొత్తం ఆంతర్యం అర్థం గుళ్ళో పూజారి లాంటి వారికి అర్థం అవుతుంది చెప్పగలరు సవ్యంగా కానీ మామూలు వారికి మాత్రం అంత ఒంట బట్టవు మరియు ఎటువంటి సందేహం లేకుండా తప్పకుండా మాత్రం తప్పుగానే మొదలుగా అర్థం చేసుకుంటారు.
 • ""ఏ పని ఒక్కటి కూడా జీవితంలో ఇక్కడ ఛేయకుండా అప్పుడే వచ్చిన కొత్త వాడుకరి పనిచేస్తున్న మనలాంటి వారికి ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళని ఏమని అనాలంటారు ?""" రాబోయే రోజుల కాలంలో ఇక్కడకు వచ్చే ఒక ఊహజనిత వ్యక్తిని నేను వెధవ అని సంభోదించాను. అటువంటి అదృశ్య వ్యక్తి వారికి ఎక్కడా లేని మర్యాదలు అందరికీ ఇవ్వాలి అని అంటారు. దీనికి రోజుల తరబడి చర్చలు చేస్తానంటారు. మరి, దైవంతో సమమైన వారి గురించి ఏకవచనంతో వ్యాసాలు చదువుతుంటే పంటి కింద రాయిలా తగులుతూ కొత్తతరానికి ఇలాంటి మర్యాదేలేని వ్యాసాలు అందించితే, అన్నిచోట్ల అమర్యాదగా అనుసరిస్తూ ఉంటే ఆ దోషం ఎవరిది అని పదిమందిలో పదే పదే ప్రశ్నించకు. నీకు చేతనయినా మంచి పనులు చేస్తూ సాగిపోతూ ఉండటమే మంచిది.
 • ఏ మనిషి శాశ్వతం కాదు కానీ తను చేసిన మంచి మాటలు మరియు పనులు ప్రజలలో ఎల్లకాలం గుర్తుండి పోతాయి అని ఎల్లప్పుడూ గ్రహించుకోవాలి.