వాడుకరి:Kappagantu Ramakrishna

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ
దస్త్రం:Nityotsavam.jpg
నిత్యోత్సవం - కప్పగంతు రామకృష్ణ రచన
Ramakrishna @ All India Radio Vijayawada

డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna)[మార్చు]

డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) స్వస్థలం విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లి గ్రామం. గణితం, తెలుగు, జర్నలిజం, మనస్తత్వశాస్త్రాల్లో ఎం.ఎ; ఎం.ఈడి., 'గణితంలో సహపాఠ్యకార్యక్రమాలు' అనే అంశంపై ఎం.ఫిల్‌, 'కృష్ణాజిల్లా పత్రికా రంగం' అనే అంశంపై పిహెచ్‌.డి చేశారు. వృత్తిరీత్యా విజయవాడ, గాంధీనగర్‌లోని ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి బీఈడీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. రామకృష్ణ పిహెచ్‌.డి థీసిన్‌ను బి.ఎ (జర్నలిజం) విద్యార్థులకు రిఫరెన్స్‌ బుక్‌గా యు.జి.సి. ప్రకటించింది.

రచయితగా బీఈడీ, డీఈడీ విద్యార్థుల కోసం 15 పాఠ్యపుస్తకాలు రచించారు. నిత్యోత్సవం, ఆంధ్రుల ఆత్మజ్యోతి శ్రీకృష్ణదేవరాయలు, నడుస్తున్న చరిత్ర, సామెతలు, పొడుపుకథలు, తెలుగు ఇంగ్లిషు నిఘంటువు, నడుస్తున్న చరిత్ర, అందమైన ఆంధ్రప్రదేశ్‌, మనసుమాట గెలుపుబాట, శ్రీసూర్యోపాసన వంటి ఇతర పుస్తకాలు 20 రచించారు.  మానవ మనోవిజ్ఞానశాస్త్రంపై రాసిన ఐదు పుస్తకాలను తెలుగు అకాడెమి (హైదరాబాదు) ప్రచురించింది. శ్రీశైలప్రభ, భక్తి, సప్తగిరి, శ్రీకనకదుర్గప్రభ, ఋషిపీఠం, తెలుగు వెలుగు, బాలభారతం, గ్రంథాలయ సర్వస్వం, కస్తూరి (రాష్ట్రప్రభుత్వం పక్షాన సర్వశిక్షా అభియాన్‌ ప్రచురిస్తున్న పత్రిక) తదితర పత్రికల్లో పదుల సంఖ్యలో వ్యాసాలు, పుస్తక సమీక్షలు రచించారు. ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ప్రచురించిన తెలుగు పాఠ్యపుస్తకాలకు సంపాదకుడిగా, రచయితగా పనిచేశారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (ఎన్‌.ఐ.ఒ.ఎస్‌) పుస్తకాలకు అనువాదకుడిగా పనిచేశారు. డి.ఎల్‌.ఇడి రెండో సంవత్సరం విద్యార్థులకు 'గణిత బోధన పద్ధతులు' పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి. ప్రచురించింది. విద్యావిషయకంగా రెండు జాతీయ సదస్సులు నిర్వహించారు. సుమారు 50 జాతీయ సదస్సులు, మూడు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పత్రసమర్పణ చేశారు. అనేక విద్యావిషయక పత్రికల్లో వీరి పరిశోధనా వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

విజయవాడ మారిస్‌ స్టెల్లా కళాశాలలో నిర్వహించే 'సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ టీచర్‌ ట్రైనింగ్‌'కు సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎం.ఇడి. విద్యార్థులకు విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన పరిశోధన మార్గదర్శకుడిగా కూడా పనిచేశారు. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహించే వివిధ కోర్సులకు 'రిసోర్స్‌ పర్సన్‌' వ్యవహరిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయం వంటి విద్యాసంస్థలు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, వివిధ పాఠశాలల్లోను ఉద్యోగ నియామక సంఘ సభ్యుడిగా ఉన్నారు.  అనేక పాఠశాలలు, కళాశాలల్లో గౌరవోపన్యాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సహా పలు సంస్థలు నిర్వహించిన విద్యావిషయక ప్రదర్శనలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. పాత్రికేయునిగా ఈనాడు, సాక్షి, విశాలాంధ్ర దినపత్రికల్లో రెండువందలకు పైగా వ్యాసాలు వివిధ అంశాలపై రచించారు. ఈనాడు సంపాదకీయ పేజీలో ప్రత్యేక వ్యాసాలు రాశారు. ఈనాడు ప్రధాన సంచికలోని మకరందం శీర్షికలో పదుల సంఖ్యలో ఆధ్యాత్మిక వ్యాసాలు రచించారు.

విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా పాఠశాల విద్యార్థులకు గణితాంశాలపై పాఠాలు, పలువురు ప్రముఖులతో పరిచయ కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడలో జరిగే పలు సాహిత్య, విద్యావిషయక కార్యక్రమాలపై సమీక్షా ప్రసంగాలు కూడా చేశారు. శ్రీ మాడుగుల నాగఫణి శర్మ, శ్రీ గరికిపాటి నరసింహారావు, శ్రీ ఆముదాల మురళి, శ్రీ రాంభట్ల పార్వతీశ్వరశర్మ తదితరుల అష్టావధానాల్లో పృచ్ఛకుడిగా వ్యవహరించారు. భువనవిజయం తదితర సాహిత్య రూపకాల్లో పాల్గొన్నారు. గణితచంద్రిక మాసపత్రిక సంపాదమండలి సభ్యునిగా, పలు పాఠశాలలకు విద్యావిషయక సలహాదారుగా, ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరీక్షల పరిశీలకునిగా, కృష్ణా విశ్వవిద్యాలయం వార్షిక పరీక్షల ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ సభ్యునిగా.. ఇంకా అనేక హోదాల్లో పనిచేశారు. స్కోర్‌మోర్‌ ఫౌండేషన్‌ సంస్థ వీరిని 'ప్రతిభా శిరోమణి' (జనవరి 29, 2016), 'విద్యారత్న' (సెప్టెంబర్, 2019) పురస్కారాలతో వీరిని సన్మానించింది. వివిధ సందర్భాల్లో వైజ్‌క్లబ్‌, రోటరీ క్లబ్‌, వాకర్స్‌ క్లబ్‌ వంటి అనేక సంస్థలు వీరిని సత్కరించాయి.

రచయితగా[మార్చు]

  • భక్తి, సప్తగిరి, బాలభారతం, తెలుగువెలుగు, శ్రీశైలప్రభ, శ్రీకనకదుర్గప్రభ, గ్రంథాలయ సర్వస్వం తదితర పత్రికల్లో వందకు పైగా వ్యాసాలు
  • డీఈడీ, బీఈడీ విద్యార్థుల కోసం తెలుగు బోధన పద్ధతులు, తెలుగు వ్యాకరణం, కళావిద్య, పాఠశాల నిర్వహణ, ప్రాథమిక విద్య, ఆధునిక భారతదేశంలో విద్య వంటి 15 విద్యావిషయక పుస్తకాల రచన
  • శ్రీసూర్యోపాసన, నిత్యోత్సవం, శ్రీకృష్ణదేవరాయలు, తెలుగు ఇంగ్లీషు నిఘంటువు, నడుస్తున్న చరిత్ర, అమ్మా నాన్నా బుజ్జాయి తదితర 20 ఇతర పుస్తకాల రచన
  • మనోవిజ్ఞానశాస్త్రం ఆధారంగా మానవజీవితాన్ని ఐదు దశలుగా విభజిస్తూ రాసిన పుస్తకాలను హైదరాబాదు తెలుగు అకాడమి ప్రచురించింది.
    డాక్టర్ కప్పగంతు రామకృష్ణ
    Dr Kappagantu Ramakrishna
    ఎ.పి. ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ 8, 10 తరగతులకు తెలుగు పాఠ్యపుస్తకాల రచయిత, సంపాదకుడు
  • డి.ఎల్‌.ఇ.డి. రెండో సంవత్సరం విద్యార్థులకు 'గణిత బోధన పద్ధతులు' (మెథడ్స్‌ ఆఫ్‌ టీచింగ్‌ మ్యాథమెటిక్స్‌) పుస్తకాన్ని ఎ.పి. ఎస్‌సిఇఆర్‌టి ప్రచురించింది.
  • ఎన్‌.ఐ.ఒ.ఎస్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూల్‌) పాఠ్యపుస్తకాల అనువాదకుడు
  • దస్త్రం:శ్రీకృష్ణ దేవరాయలు .jpg
    శ్రీకృష్ణ దేవరాయలు
    ఈనాడు, సాక్షి, విశాలాంధ్ర పత్రికల్లో వందలాదిగా ప్రత్యేక వ్యాసాలు
  • కౌమారదశ సమస్యలు పరిష్కారాలు (తెలుగు అకాడమి, 2018

ఇతర కార్యక్రమాలు[మార్చు]

  • గణితచంద్రిక త్రైమాసిక పత్రిక సంపాదకమండలి సభ్యుడు
  • 30 జాతీయ, 5 అంతర్జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణ
  • రెండు జాతీయ సదస్సుల నిర్వహణ
  • ఆకాశవాణి కేంద్రం ద్వారా 30కి పైగా కార్యక్రమాల నిర్వహణ
  • ఆకాశవాణి వాణి వ్యాఖ్యాతల నియామక సంఘం సభ్యుడు
  • దూరదర్శన్ సప్తగిరి ఛానెల్లో వివిధ కార్యక్రమాలు (ప్రత్యేక ముఖాముఖి, ఉగాది (2019) కవిసమ్మేళనం తదితర కార్యక్రమాలు)
  • ఇగ్నో వార్షిక పరీక్షల పరిశీలకుడు
  • కృష్ణా యూనివర్శిటీ ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృంద సభ్యుడు
  • కేంద్రీయ విద్యాలయతో సహా అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామక సంఘ సభ్యుడు
  • పాఠశాలలు, కళాశాలల్లో గౌరవోపన్యాసాలు
  • అష్టావధానాలు, శతావధానాల్లో పృచ్ఛకుడిగా; భువనవిజయం వంటి సాహితీరూపకాల్లో వివిధ పాత్రధారి
  • అనేక కళాశాలల్లో గౌరవోపన్యాసాలు