వాడుకరి:Kolasekhara

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోలా శేఖర్
QR Code

నా పేరు డా.శేఖర్. నేను ఆంధ్ర లొయోల కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా ఉన్నాను. నాకు తెలుగులో వ్యాసాలు రాయటం ఇష్టం. నేను ఆంధ్ర లొయోల కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదివాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యం. ఏ. చేశాను. నాగార్జునా యూనివర్సిటీలో యం. ఫిల్, పి.హెచ్. డి. చేసాను. వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఆంధ్ర లొయోల కళాశాల కు, వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర లొయోల కళాశాల/తెలుగు కు కార్యశాల సంధానకర్త ను.

ఉప శీర్షిక[మార్చు]

కోలా శేఖర్. రజని, వంశి, తేజ. నాగార్జునా యూనివర్సిటీలో యం. ఫిల్. పూర్తి చేసి, పి.హెచ్. డి. చేస్తున్నాను. నాగార్జునా యూనివర్సిటీలో యం. ఫిల్. పూర్తి చేసి, పి.హెచ్. డి. చేశాను.

మాట మీద నిలబడడం, సత్యాన్ని పాటించడం, వ్యక్తులు సత్ ప్రవర్తనతో ఎలా జీవించాలలో నేర్చుకోవడం. ఉత్తమ సౌరులుగా తయారు చేసుకోవచ్చు.


 1. డా. ఆర్. రవీంద్ర భాస్, తెలుగు శాఖాధిపతి
 2. డా. డి. కృపారావు
 3. డా. కె. శేఖర్
 4. శ్రీ కె. జోసఫ్
 5. శ్రీ వి. గణేష్
 6. డా. వి. గోపాల రెడ్డి
 7. డా. బి. సుబ్బారావు


అర్కునిమూర్తి సర్వకళలందుఁ బ్రవీణుఁడు సంగరస్థలిం.

గర్క శరాజలోకలయకాలుఁడు దానవినోది పాపసం

పర్కవిదూరుఁ డా ర్తపరిపాలనశీలనశాలి విక్రమో

దర్కుఁడు విక్రమార్కుఁ డిట కాతనిఁ బిల్వఁగఁ బంపు నావుడున్


సత్పాత్రప్రతిపాదితార్థు డయి రాజ్యం బుర్విలో సర్వసం

పత్పూర్ణంబుగ జేయుచుం బ్రజల భూపాలుండు పాలింపగా

దత్పూర్వార్జిత పుణ్యభోగముల కుత్సార్యత్వ సంపాదులై

యుత్పాతంబులు పుట్టె నుజ్జయినిలో నుల్కాది లక్ష్యంబులై.


వరపుత్రుడు డమరేంద్ర వైరి, పరిఖ ల్వారాశి, యాలంక దా

గిరిదుర్గం బసురు ల్బలంబులు, దశగ్రీవుండు రా జిట్లు బం

ధురమౌ రాజ్యము ఱాలు దేలగిల, మిత్రు ల్శత్రులం గూఢగా

నరులు న్వానరులుం గొనం దలచి చన్నం చేటు వాటిల్లదే.

అర్కునిమూర్తి సర్వ . . . . . . . . . . . . . . . . . . . . . బిల్వగ బంపు నావుడున్.

అత్తరి వీరు లేర్చు క్రియ . . . . . . . . . . . . . . . . . . . గెల్తురుద్ధతి.

సాహసంబు సేయు సాహసాంక.

పుట్టి నేర్చుకొనెనొ పుట్టక నేర్చెనో

చిట్టి బుద్ధు లిట్టి పొట్టి వడుగు

శాలివాహన విజయాన్ని సోదాహరణంగా వివరించండి.

'శాలివాహన విజయం` ఆధారంగా విక్రమార్కుని గుణశీలాలు తెలుపండి.

ఎరుపు మన రంగు నలుపు మనోళ్ళరంగు.

ఆకాశంలో సగం పాఠ్యభాగ సారాంశం రాయండి.

వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే అంశాలను తెలపండి.


తిరుపుల మురిపముల మెఱుపుదీగయుబోలెన్

దీన నీకుగీడు తెల్లమింక

ఆకాశం కారంచేడు రంగది.

రేపే ఊడ్చేద్దాం !

ఈ క్రింది పద్యపాదమును గణవిభజన చేసి ఛందస్సును గుర్తించుము

ఈ క్రింది పద్యములోని అలంకారాన్ని వివరించండి.

ఇట్లు విక్రమార్కు డీల్గిన విజయుడై

శాలివాహనుండు లీలతోడ


సురకామిని తన నయనము

లరుదుగదల చుట్టి వచ్చు ననుట నిజము గా

జరుగుచు బరిమండలి తాం

బర పల్లవయై నటించె మరుగొడుగు క్రియన్.

ఆచార్య కొలకలూరి ఇనాక్ కథలు - సామాజిక వాస్తవికత

డా.కోలా శేఖర్,

తెలుగు అధ్యాపకుడు,

ఆంధ్ర లొయోల కళాశాల,

విజయవాడ-10

9441441097


కవి, విమర్శకుడు, నవలానాటక రచయిత, విద్యావేత్త అయిన ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు మంచి కథకులు కూడా. సాహితీలోకంలో కథాసమ్రాట్టుగా ఖ్యాతిగాంచారు. బహుజనుల అట్టడుగు జీవితాల్ని కథా సాహిత్యంలోకి తీసుకువచ్చారు. మనిషి తత్వాన్ని విశ్లేషించే కథలతో పాటు చీకటి కోణంలో మ్రగ్గే బడుగు జీవితాల్ని విశ్లేషించే కథలు పుంఖానుపుంఖాలుగా వెలువరించారు. కథాచరిత్రని, అది నడిచిన బాటని ఇనాక్ బాగా అర్థం చేసుకున్న కారణంగా పాఠకుల మనస్సుకు హత్తుకునే కథల్ని రచించగలిగారు. ఆయన రచనలన్నీ వివిధ పత్రికల్లో రావడం వల్ల కోట్ల కొలది తెలుగు పాఠకులకి పరిచయం అయినాడు. కవితా సంకలనాలు, నవలలు పరిమిత సంఖ్యలో రచించి, కథాసంకలనాల్ని అపరిమిత సంఖ్యలో వెలువరించడం వల్ల ఆయన తెలుగు కథకుడిగానే సాహిత్యంలో స్థానం సంపాయించుకున్నాడు. ఊరబావి, ఏముంది నాకు, మల్లె మొగ్గ, జాగ్రత్త, అపెండిసైడిస్ కథలు కన్నడంలోకి, కుంకుమ, ఏమైంది నాకు ఇంగ్లీషులోకి, పంతులుగారి పాఠం హిందీలోకి, అపెండిసైడిస్ కథ తమిళంలోకి అనువదించబడ్డాయి. ఇనాక్ కథలు వివిధ భాషల్లోకి వెళ్లడం వల్ల తెలుగు కథకు జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

వాక్య నిర్మాణంలో అల్పపదాల్లో అనల్ప అర్థాన్ని సృష్టించిచారు. చిన్న వాక్యాలు, వ్యావహారిక పదాలు, అర్థవంతంగా ఉంటాయి. ఆలోచింపజేస్తాయి. కవితాత్మతో రూపం, ప్రాణం యిస్తాడు. ప్రతి ప్రక్రియకూ అధికారిక ముద్ర వేస్తాడు. పదాల్లో అనుభూతి ఉంది. వాస్తవికత కన్పిస్తుంది. సగటు మధ్య, పేద దళిత జీవితం ఉంటుంది. వేజండ్ల నుంచి అనంతపురం దాకా జీవిత ప్రస్థానం వెలయిస్తాడు. వాక్యాలు అర్థవంతంగా ఉంటాయి. శక్తిమంతంగా చదివిస్తాయి. ఎక్కడా ఎవరినీ కించపరిచినట్టు కన్పించడు. ఏది ఉత్తమం అనే సామాజిక న్యాయిన్ని అంతర్లీనంగా ప్రశ్నిస్తాడు. పాఠకుల ఎదలో ఆలోచనా వీచికలు రేకెత్తిస్తాడు. బలమైన చురకత్తి గుండెను తాకేలా పాత్రలను సృష్టిస్తాడు.

సామాన్యంగా రచయిత వ్యక్తిత్వాన్ని ప్రకటించేవే రచనలు. రచయిత ఆలోచనలు, వ్యక్తిత్త్వం సాంఘికమైతే గొప్ప రచనలు వెలుగులోకి వస్తాయి. మనిషి తత్వాల్ని విశ్లేషించే, మనిషి అట్టడుగు జీవితాల్ని లోతుగా విశ్లేషించే రచనలు చేయడం ద్వారానే ఆ రచయితలు తమ ప్రత్యేకతలు నిరూపించుకుంటారు. అంతేకాదు, తాము రాస్తున్న సాహిత్య ప్రక్రియల ద్వారా అభివ్యక్తమయ్యే సమకాలీన సామాజిక సంబంధిత భావజాలమంతా రచయితల సాహిత్య దృష్టిని, దృక్పథాన్ని వెళ్లడించేవే. ఆధునిక సాహిత్యంలో సంక్లిష్టమైన సామాజిక సమస్యలే చిత్రితమవుతూ వస్తున్నాయి. రచయితకు సామాజిక స్పృహ, లోతైన అధ్యయనం ఉంటే తప్ప ఒక మంచి రచన వెలువడడానికి ఆస్కారమేర్పడుతుంది. ఇప్పటి కథకులు జీవితాన్ని నిశితంగా పరిశీలిచడం, వివిధ కోణాలలో విశ్లేషించడం నేర్చుకున్నారు. మనిషి అనుభవాల మీద, మూఢనమ్మకాల మీద, కులమతాల మీద, వృత్తుల మీద, రాజకాయాలు, అసమానతల మీద ఇప్పటి రచయితలకు ఖచ్చిమైన అభిప్రాయలాలున్నాయి. ఆ నేపథ్యంలోనే మంచిని ఆవిష్కరించడానికి రచయితలు జీవితాన్ని తీరుస్తున్నారు. దానికి మేధాసంపత్తి తోడైతే ఒక స్పష్టమైన విషయాన్ని మలచగలరు. అలాంటి కోవలోకి వచ్చేవాడే కొలకలూరి ఇనాక్.


ఆయన కథా గమనంలో ఒక అనుస్యూతం ఉంది. ఉదాహరణకు 'కులవృత్తి` కథ ప్రజాసాహితిలో 2006 ఫిబ్రవరిలో ప్రచురితమయిన కథ ఇది. మూర్తి అనే కుర్రాడు బూటు కాళ్లతో గుడి ప్రవేశం చేస్తానంటాడు. వద్దని వారిస్తాడు పూజారి. పూజారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తాడు. పూజారికి ఒక సందర్భంలో బూట్లు వేసుకొనే నిన్ను గుడిలోకి పంపాలని ఉంది. కాని గుడి కట్టుబాట్లు, సంప్రదాయం, ఆచారం నన్ను కట్టిపడేస్తున్నాయి నేను అశక్తుణ్ణి, నిస్సహాయుణ్ణి అంటాడు. చివరికి బూటు కాళ్లతో వెళ్లాడా అనేది ప్రశ్న. నిజానికి సంప్రదాయాన్ని గౌరవం యిచ్చాడు. ఐతే తన కులవృత్తి, కుల కట్టుబాట్లకీ గౌరవం కలిగించి ఉన్నతంగా నిలబెట్టాడు.

ఈ కథలో పూజారిని ఏమాత్రం తిట్టినట్టు కన్పించడు. తన శుచికి పూజారి మురికి వస్త్రధారణకూ ఆలోచనాత్మకంగా బేరీజు వేస్తాడు. 'పూజారి మురికి శరీరంతో దేవాలయంలో ప్రవేశింప వచ్చు కానీ, పరిశుభ్రంగా ఉన్న బూటు నిషిద్ధం` అంటాడు. 'దైవ దర్శనం అహంకారం చంపుకోవడానికీ` అని చెప్పి ÷ 'మలిన మనస్సు, మలిన దేహం, మలిన అహంకారం లేకుండా మనిషి ఉన్నాడా` అని సమాజాన్ని ప్రశ్నిస్తాడు. 'నిరహంకారంతో మనిషి మసలుతున్నాడా? ` అని ప్రశ్నిస్తాడు.

చివరికి దేవాలయ ప్రవేశం బూటు కాళ్లతో వెళ్లడానికో చిన్న మెలిక పెడతాడు మూర్తి. తన పాదాలు రక్తం, రసి కారే జబ్బుందని దాని వల్ల ఇతరులకు హాని కలుగుతుందని అన్నప్పుడు వాళ్లు అనుమతిస్తారు. పాదుకలతో రాజ్యపాలన చెయ్యొచ్చు కానీ పాదుకలతో దేవాలయ ప్రవేశం చేయనివ్వరంటూ దెప్పి పొడుస్తాడు. పైగా దేవాలయానికి దొంగలు, వ్యభిచారులు, హంతకులు, కుక్కలు, నక్కలు, పశువులు, పక్షులు సర్వ క్రిమి కీటకాలు రావచ్చు. సాటి మనిషిని మాత్రం కుల వివక్ష వల్ల రానివ్వరని వాదించి చివరికి వాళ్ల పంతాన్ని ఓడించి ఒప్పిస్తాడు. కాని తాను మాత్రం దేవాలయ ప్రవేశం చేయకుండా తన కులాన్ని, కులవృత్తిని, తన వాళ్లన్ని నమ్ముకున్న జాతిని రానిస్తే వస్తానని అంటాడు. ఇదో చక్కని మలుపు. పరిష్కారం కూడా. కవిలోని బాధ ఆంతర్యం ఒక పాత్ర ద్వారా మలిచి సామాజిక వాస్తవికతను సజీవంగా చిత్రీకరించి సమాజానికి కనువిప్పు కలిగించడం ఒక కొత్త దృక్కోణం.

ఈ వ్యవస్థలో దళితులెంతటి విద్యావంతులైనా వారికి గౌరవం ఉండదు. ఈ వ్యవస్థ నిర్మాణ స్వభావమే అణచివేతకు అనుకూలమైంది. భారతంలో ధర్మాన్నివేటాడే ధర్మవ్యాధునిదేస్థానం? కౌశికుదేస్థానం? వ్యవస్థను కాపాడే వాటిలో ఆలయం బలీయమైంది. ఆముక్తమాల్యద కవ్యంలో మంగళ కైశికిని ఆలపించిన మాలదాసరి కథ ఒకసారి గుర్తుకు తెచ్చుకొవాలి. ఆలయమంటేనే అణచివేత పరికరంగా అర్థం చేయించాలి. ఆ కథలో దోపిడి చట్రంలోనే స్వేచ్ఛ కోరుకున్నట్లుంది.

2008 జనవరి పదిహేడవ తేదీన వెలువడిన ఈభూమి వారపత్రికలో ఆచార్య ఇనాక్ గారి 'బిచ్చం` కథ ప్రచురింపబడింది. ఇందులో శివరామకృష్ణస్వామికి భిక్షాటనలో వారం రోజులైనా తిండి దొరకదు. అందుకు కోపమొచ్చి, వ్యాసుడు కాశిని శపించినట్లు మన్ను తీసుకొని ఊరునాశనమగుగాక అని శపించడానికి ప్రయత్నిస్తాడు. ఈ దృశ్యాన్ని పోతరాజు అనే మాదిగ యువకుడు చూస్తాడు. మీ స్వార్థం కోసం ఊరును శపిస్తే పల్లె బతుకులు ఏమయిపోతాయి. అందులో నువ్వు కూడా ఉన్నావు కదా! అని ప్రశ్నిస్తాడు. నా శాపానికి తిరుగు ఉండదు. ఈ మట్టిని ఏమి చేయాలి అని శివరామకృష్ణ స్వామి అంటాడు. 'నా పంచెలో పోయి` అంటాడు. పోతరాజు 'నువ్వు చస్తావే` అంటాడు. స్వామి 'ఊరు బాగు కోసం నేను చచ్చినా పరవాలేదు` అంటాడు యువకుడు.

ఈ కథలో రచయిత భావన ఏమిటంటే దళితులకి త్యాగగుణం ఎక్కువ అని, నలుగురి శ్రేయస్సు కోసం తనకు ఏం జరిగినా ఫర్వాలేదని చెప్పడంతోపాటు సహనం, ఓర్పు ఉంటే బతుకులు బాగుంటాయన్నాడు. పిల్లి శాపానికి ఉట్లు తెగవు అనే సూక్తిలోని తత్వం చెప్పడం కూడా కనిపిస్తుంది. 'బిచ్చం` కథ ప్రేమకు కేతనమై నిలుస్తుంది. పల్లె బతుకులకు సంబంధించి 'పోలె` అనే కథ, విఘ్న వినాయకుడు, ముట్టడి మొదలైన ఎన్నో కథలు దర్శనమిస్తాయి.

2010 లో నాలుగో ముద్రణ పూర్తి చేసుకున్న కథ 'ఊరబావి`. అటు వస్తుపరంగా, ఇటు శిల్పపరంగా గొప్ప పరిణామాల్ని సృష్టించిన కథ. దళితులు తమ హక్కులు కావాలని అరిస్తే రావని, వాటిని హింసకు గురైనా సరే సాధించుకోవాలన్నది ఈ కథ అంతరార్థం. ఊరబావి ఒక ఊటబావి. సాంఘికవివక్ష తీవ్రత ఈ కథలో వుంది. దళితులు ఊరబావిలో నీళ్లు తోడుకోరాదు. సవర్ణులు ఎత్తిపోస్తే తీసుకోవాలి. దళితులకు నీటికి ఇంకో ఆదరువు లేదు. బావిలో దట్టెం (పశు కళేబరం) ఎవరో వ్రేలాడదీసిన కారణంగా సవర్ణులు ఆ బావిలో నీరుతోడుకోలేదు. ఒకరిద్దరు దళితుల ఒళ్లు హోనమైన తరువాత కాని సవర్ణులు ఆ బావిని దళితులకు పూర్తిగా వదలిపెట్టలేదు. బావి దళితుల వశమైంది. దేశవ్యాప్తంగా దళితులపై అణచివేత కొనసాగుతూనే వుంది. ఈ కథలో సవర్ణులు తమపై అత్యంత క్రూరంగా దాడి చేస్తారని తెలిసి కూడా తెగించి బావిలో దట్టెం వ్రేలాడదీశారు. నీటి సమస్య తీవ్రత వాళ్లను ఆదశకు నెట్టింది. దేశవ్యాప్తంగా ప్రత్యేకించి సంఘటనలు వివరించనక్కనలేదు కాని దళితులు చాలాచోట్ల ఈ విధంగా స్వంత నిర్ణయాలు తీసుకుంటూనే వున్నారు.

అనంతరం నీటి సమస్యతో ముడిపడిన దళిత కథలకు ఈ కథ మూలసూత్రం. తనను అవమానించిన సవర్ణుని చెంప చెళ్లుమనిపించడం, తన భర్తను, మామను హింసించి బంధించిన మునసబుకు బుద్ధి చెప్పటం, ఎద్దు దట్టెంను ఊరభావిలో వేసి చివరికి ఆ బావిని దళితులకు స్వాధీనం చేసిన ఘనత చిందంబరం భార్యకు దక్కుతుంది.

ఇదేకాలంలో రావిశాస్త్రి 'పిపీలికం` కాళీపట్నం రామారావు 'యజ్ఞం` కథలు వెలువడినాయి. 'పిపీలికం` కథ జన్మరాహిత్యం, పునర్జన్మ వంటి భావజాలాన్ని వెక్కిరిస్తూ కార్మికులు, కర్షకులు ఉద్యమించాల్సిన ఆవశ్యకతను తెలుపుతుంది. 'యజ్ఞం` కథ దేశ స్వాతంత్ర్య ఫలాలు కొందరికే దక్కిన తీరును తర్వాత తెలుపుతుంది. ఈ మూడు కథలు దేశంలో ఇరవై రెండేళ్ల స్వాతంత్ర్యం ఎటువంటి మూర్పులు తీసుకురాలేదని ప్రజలు తమ సమస్యలకు తమశైలిలో పరిష్కారాలు వెదుక్కుంటున్నారని చెబుతాయి.

మహాభారతం నుంచి నేటి దాకా భూమి కోసం యుద్ధాలు జరుగుతూనే వున్నాయి. భూస్వాములు అనేక విధాలైన అణచివేతను అమలు చేస్తూ బలహీనుల పొలాల్ని ఆక్రమించుకుంటూనే వున్నారు. ఆచార్య ఇనాక్ వ్రాసిన 'తలలేనోడు` కథలో వీరన్న అనే భూస్వామి నాగలింగం అనే చిన్నరైతు పొలాన్ని మోసం చేసి ఆక్రమించుకుంటాడు. మోసాన్ని తెలుసుకున్న నాగలింగం యోసంతోనే వీరన్న తలను తప్పించినట్లు కథ ముగింపులో ధ్వనింపచేస్తారు. ఈనాడు ఇటువంటి నాగలింగాలు, వీరన్న పెరిగిపోయింది. భూమికోసం సంఘర్షణ తీవ్రమయింది. వీరన్న గ్రామమంతా విస్తరించినట్లు కథలో లేదు. భూస్వామ్య పీడన గ్రామమంతా విస్తరించి వుంటుంది. మన సమాజంలో భూమికి ప్రత్యామ్నాయ వనరు మరొకటి కనిపించదు. కాబట్టి ఎండినా పండినా మనకు భూమే ప్రధానం.

వాస్తవానికి ముగింపు చాలా విచిత్రంగా, రహస్యంగా, శిల్పవస్తు పరంగా, జీవిత వాస్తవికంగా తెలుగు కథానికా సాహిత్యంలో మరో కథ రాలేదు.

ఆచార్య ఇనాక్ వ్రాసిందే మరొ కథ 'పిండీకృతశాటి`. బట్టలుతికే గూగడి ఇల్లూ పొలాన్ని భూస్వామి తన బాకి కిందకు ఆక్రమించుకుంటాడు. ఆనాటికి వృత్తుల వాళ్ల జీవితాలు కథల్లోకి రావడం కొత్త. గ్రామం వదలి అదే వృత్తి చేసే రామస్వామి పట్టణంలో లాండ్రి పెట్టుకొని ధనవంతుడయినాడనే సఘటన కూడా ఈ కథలో వుంది. భూస్వాములు వృత్తుల వాళ్లను ఎదగనీయరన్న వాస్తవం ఈ కథ చెబుతుంది.

ఊరబావి, తలలేనోడు మరియు పిండీవృతశాటి మొదలైన ఈ మూడు కథల్ని బట్టి చూస్తే రచయితకు అణగారిన ప్రజల పట్ల సానుభూతి వున్నట్లు కనిపిస్తుంది. ఈనాడు నూతన ఆర్థిక విధానాల వల్ల వృత్తులు దెబ్బతిని పోతున్నాయని తెలిపే కథాసాహిత్యం వెలువడతూ వుంది. దాదాపు నలభై ఏళ్ల క్రితం వృత్తి కులాలు అభివృద్ధి చెందక పోవడానికి కారణం భూస్వాములే అన్న వాస్తవాన్ని ఆచార్య ఇనాక్ 'పిండీకృతశాటి` కథలో వివరించగలిగినారు. 'తలలేనోడు` కథలోనూ పట్టణంలోని క్షౌరశాలల ప్రస్థావన వుంది. వృత్తులను గురించిన అవగాహన, విశ్లేషణ ఈ కథల్లో చూడవచ్చును. గ్రామాల్లోని వృత్తులు భూస్వామ్య పదఘట్టనల కింద నలిగిపోతున్న ఆర్తనాదాల్ని వినిపించగలిగారు.

ఇనాక్ జీవితమంతా ఒడుదుడుకుల జీవితం. అట్టడుగు కులంలో పుట్టడం వల్ల బాల్యం అంతా కష్టాలతో ఎదిగింది. జీవితం పొడవునా కుల వివక్షత నీడలా వెంటాడింది. పేదరికం వెక్కిరించింది. అందుకే ఏ బేషజం లేని విషయాల్ని గురించి, నిరాడండర జీవితం గురించి వాస్తవికతలోంచి కథలు పుట్టాయి.పాత్రలు వాస్తవిక జీవితంలోని అమాయకత్వాన్ని మోస్తూ కనిపిస్తుంటాయి. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి జీవితానుభవంతో పాటు సాంఘిక సిద్ధాంతాలు కూడా అవసరం అనేది మరవద్దు. ఇనాక్ సాజాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టే వర్గాలు, వర్ణాలు అవి కల్పించే సామాజిక క్తిష్టతల్ని గుర్తించి చిత్రించగలిగాడు. అణచివేతకి, పీడనకి వ్యతిరేకంగా దళితులని జాగృతి చేయడం వారిని ప్రతిఘటించేందుకు తయారుచేయడం ఆయన కర్తవ్యం అయినది.

ఆధార గ్రంథాలు :

1.ఊరబావి × ఆచార్య కొలకలూరి ఇనాక్

2.కొపులు × ఆచార్య కొలకలూరి ఇనాక్

3.తెలుగు కథానిక ÷ ఆచార్య కొలకలూరి ఇనాక్

4.ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్యంపై పరిశోధనం ÷ సం. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

5.గుప్పెడు తలపులు ÷ ఆచార్య కొలకలూరి మధుజ్యోతి


రచనాభివృద్ధి, జ్ఞాపకరశక్తి పెంచడం, బహుగ్రంథ నిర్మాణం, ఉత్తమ గ్రంథాలు అందించడం, శబ్దం, అర్థం వైచిత్రి, విషయం అర్థవంతం చేసుకోవచ్చు.

పరిశోధనకు అనుగుణంగా మొదటి సంవత్సరంలో కొన్ని వందల కథలను సేకరించాను. కథాస్రవంతీ- 2001-2010 వరకు వచ్చిన కథా సంకలనాలను సేకరించాను. వాటిలోని వందల కొలది కథలలో నా పరిశోధనకు కావలసిన ఆణిముత్యాల్లాంటి కథలను ఎంపిక చేసుకున్నాను. అవి

పురాగానం-జి.ఆర్.మహర్షి గారు రచించారు. మానవుడు వైజ్ఞానికంగా తాను ఎదుగుతూ ఉన్నాననే అనుకుంటూ, మానవీయ విలువల విషయంలో ఎంతగా దిగజారిపోతున్నాడో - ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఏరోజు దినపత్రిక చూసినా తప్పనిసరిగా అలాంటి వార్తలు కనిపిస్తూనే ఉంటాయి. అందుకే మనిషి నైతికంగా, మానవీయ విలువలపరంగా ఎదగవలసిన ఆవశ్యకతను 'పురాగానం` చాటుతోంది.

కాలాన్ని వెనక్కి తిప్పకు-డి.కామేశ్వరి గారు రచించారు. తన తల్లికి చదువు ఆర్థిక స్వాతంత్ర్యం లేక తండ్రి అధికారానికి లొంగిపడి ఉండే దుస్థితి తనకి కలగకూడదని పట్టుపట్టి, గొడవచేసి పై చదువు చదివి, ఉద్యోగం సంపాదించుకుంది ఓ ఆధునిక యువతి. తను పడిన ఇబ్బందులు తన కూతురు ఎదుర్కోకూడదని, భర్త వద్దంటున్నా వినకుండా ఆమె కూతురికి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ఉండేలా పెంచింది. ఆ స్వేచ్ఛని కూతురు దుర్వినియోగం చేస్తే, స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదనీ, స్వేచ్ఛ బాధ్యతతో కూడినదనీ 'కాలాన్ని వెనక్కి తిప్పకు` అనీ హెచ్చరించింది. నేటి తరం యువతులందరికీ బాధ్యతల గురించి శక్తిమంతంగా తెలియజేప్పిన కథ.

ఢాకన్-మహమ్మద్ ఖదీర్ బాబు గారు రచించారు. మతరాజకీయాలు సృష్టిస్తున్న కల్లొల పరిస్థితుల నేపథ్యంలో మైనార్టీల తీవ్రమైన మానసిక అవస్థలను విశదపరిచిన కథ 'ఢాకన్`. బాబ్రీ విధ్వంసం, గుజరాత్ మారణహోమం తర్వాత హిందూ-ముస్లింల అంతరంగాలు యథాతథంగా లేవు. ఒకరిపట్ల మరొకరి దృక్పథమూ యథాతథంగా లేదు. ఇటువంటి సందర్భలో మైనార్టీ యువత ఎదురొ్కంటున్న వివక్షనూ, ఫలింతంగా ఆయా మైనార్టీ కుటుంబాలో్ల చోటు చేసుకుంటున్న పరోక్ష హింసనూ 'ఢాకన్` చూపిసు్తంది. ఈ కథ పూర్తిగా మైనార్టీల దృష్టికోణంనుంచి నడిచినట్టుగా అనిపించినా, ఇందులో ఎంతో కొంత సత్యం లేకపోలేదని ప్రతి పాఠకునికీ అనిపించి తీరుతుంది.

బలిచ్రకవర్తి మహాదాత అని 'వామనావతారం` ఆధారంగా నిరూపించండి?

వలదీ దానము గీనమున్ బనుపుమా వర్ణి వదాన్యోత్తమా!

తెలుగు భాష ప్రాచీనతను వివరించండి? తిరుగన్నేరదు నాదు జిహ్వ

మహి వద్యాన్యుఁ డొకఁడు మఱియుఁ గలడె.

చీకు చింత లేక చిరజీవులైరయా

హరిజనుల కిచ్చిన సందేశం ఏమిటి ?

రీమిడ్ :

నిరయం బైన నిబంధ మైన ధరణీనిర్మూలనం బైన దు

ర్మరణం బైనఁ గులాంత మైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో

హరుఁ డైనన్ హరి యైన నీరజభవుం డభ్యాగతుం డైన నౌఁ

దిరుగ న్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య! వే యేటికిన్.

కారే రాజులు రాజ్యముల్ . . . . . . . . . . . . . . . . . యి క్కాలమున్ భార్గవా!

కులము ఘనతగాంచె గుణమంతరించెరా

తారాగణ పరివృతుండై వెలుంగు చంద్రుని చందంబున అందంగబు బృందారకేంద్రుని.

ఇంకా, నాగశాల-బి.యస్.రాములు, దొరుంచుకున్న దేవక్క-కె.వి.నరేందర్, చింత చచ్చినా...-అన్నవరం దేవేందర్, పంటసిరి-మొలకలపల్లి కోటేశ్వరరావు, బాలచంద్రుడు-దార్ల రామచంద్రం, మింగుతున్న పట్నం-ముదిగంటి సుజాతారెడ్డి, మావూరి ముచ్చట్లు-నల్లాల లక్ష్మీ రాజ్యం, వేళ్లు-కాలువ మల్లయ్య, నల్లటి వెలి- దాట్ల దేవదానం రాజు, దళిత కథలు- ఆచార్య కొలకలూరి ఇనాక్, పగిలిన గాలిబుడగ,కాలుతున్న పూలతోట-పెద్దిభొట్ల సుబ్బరామయ్య, మావూరి కతలు-డా.వి.ఆర్.రాసాని మొదలైనవి. వాటి విషయ విశ్లేషన చేస్తున్నాను.

పరిశోధనను 4 అధ్యాయాలుగా విభజించాను.

 1. కథాసాహిత్యం - పరిచయం
 2. సామాజిక వాస్తవికత - పరిచయం
 3. తెలుగు కథ - వస్తువైవిధ్యం
 4. తెలుగు కథ సామాజిక వాస్తవికత (2001-2010)
  1. కుటుంబ జీవనం
  2. ఆచారాలు
  3. సంస్కృతి
  4. సాంఘిక జీవనం
 5. రచయితల పరిచయం

మొదటి రెండు అధ్యాయాలను పూర్తిచేసాను. నాల్గవ అధ్యాయమైన పరిశోధనకు హృదయంవంటి భాగం లో పరిశోధన విషయవిశ్లేషన జరుగుతుంది.

రంగనాయకమ్మ కథలు స్త్రీవాద దృక్పథం

స్త్రీవాద రచయితల ప్రగతిశీల ధోరణులు

విమల్ విమర్శ్

బహుముఖ ప్రజ్ఞాశాలి, తన మాటలతో, కవితలతో వేజండ్ల నుంచి తానా సభల వరకు మంత్ర ముగ్థుల్ని చేసిన ప్రసంగ ప్రజ్ఞానిధి, సాహితీ లోకంలో వీరి వెంటనడవని అవార్డులు లేవు, పదవులకే వన్నేతెచ్చిన తెలుగు భాషోపాధ్యాయులు, మూడు తరాల అధ్యాపకత్వంలో ఏదరో విద్యార్థుల మనసులలో స్థిరమైన స్థానాన్ని పొందిన ఉత్తమ అధ్యాపకులు, 50 మంది పరిశోధక విద్యార్థుల అభినవ వ్యాసుడు, అంశమేదైనా వీనులవిందుగా మలచనేర్చిన గురుపుంగవులు, విజయవాడ నగరాన ఏ సాహితీ కార్యక్రమం జరిగినా వీరు లేనిది సభకు నిండుదనంరాదు, నిరంతరం పేపరులోని వ్యక్తిగా కీర్తినొందిన ఆశుకవి, అన్నిటికి మించి మంచి మనస్సున్న సాహితీ గుమ్మాళింపు.

మాన్యశ్రీ ఆచార్య గుమ్మా సాంబశివరావు గారి పదవీ విరమణ సంద్భంగా ఆంధ్ర లొయోల కళాశాల అధ్యావులు సమర్పించు అభినందన మందార మాల.

ఉపాధ్యాయవృత్తి మూలసూత్రాలు : ఇవి ఐదు

 1. ప్రేమను కలిగి ఉండాలి
 2. నిరంతరం జ్ఞానాన్ని సంపాదించాలి
 3. కొత్త బోధనా పద్ధతులు
 4. సృజనాత్మకత కలిగివుండాలి
 5. మారుతున్న పరిణామాలపై అవగాహ

ఆంధ్ర లొయోల కళాశాల - విజయవాడ

తెలుగు శాఖ

ది. 20-02-2018 వ తేది మధ్యాహ్నం రెండు గంటలకు తెలుగు శాఖలో జరిగిన పాఠ్యనిర్ణాయక సంఘ సమావేశంలో ఆ మోదించిన తీర్మానములు.

 1. సాధారణ తెలుగులో 1,2,3 సెమిష్టర్లలో పాఠ్యాంశ ప్రణాళికలలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత పాఠ్యాంశాలను కొనసాగించుటకు నిర్ణయించటమైనది.
 2. ప్రత్యేక తెలుగులో 1,2,3,4,5,6 సెమిష్టర్లలో ప్రస్తుత సిలబస్ నే కొనసాగించుటకు తీర్మానించటమైనది

ఆర్.రవీంద్రబాస్

ఛైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్.

స్కూళ్లు అధికార మందిరాలు కావు.

 1. స్కూళ్లు ఉపాధ్యాయుల కోసం రూపొందించినవిగా ఉంటున్నాయి
 2. ఉపాధ్యాయుడు - విద్యార్థి మధ్య పోరాటానికి వేదికగా తరగతి గది

క్రమశిక్షణా - శిష్యభావమూ

 1. సంస్కరణలు విద్యార్థి కోనంలో జరగాలి

తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులు

 1. పాఠాలు చెప్పే వాళ్లు మాత్రమే కాదు. అంతకు మించి
 2. విద్యార్థుల మధ్య మంచిని వ్యాప్తిచేయాలి
 3. నేను కేవలం ప్రభుత్వ ఉద్యోగిని, జీతం తీసుకొని నాపనినేను చేసుకు పోతాను అనేవాడు అసలు అధ్యాపకుడు కాడు.
 4. విద్యార్థి పట్ల ప్రేమను చూపాలి. నమ్మకాన్ని కలిగించాలి. భవిష్యత్ మీద భరోసాకలిగించాలి, చదువు పట్ల ఆశక్తిని రగిలించాలి. అప్పుడు చదువు బోధించాలి. తండ్రిలా మారాలి

ధర్మాలు: ఇవి మూడు

 1. పరీక్షకు తయారు చేయటం
 2. శక్తిసామర్ధ్యాలు భయటకు తీయటం
 3. నైతిక విలువలు బోధించటం

ఉపాధ్యాయుడు నిరంతరం జ్ఞానాన్ని సంపాదించాలి. బోధనదశలో నిరుత్సాహాన్ని పొందకూడదు. సెమినార్లు, కౌన్సిలింగ్ మొదలైన పద్ధతుల ద్వారా ఉత్సాహాన్ని పొంది, విద్యార్థుల చైతన్యం కోసం కృషిచేయాలి.

పేద విద్యార్థుల పట్ల గురువు తల్లిలా మారాలి. వారి దీన స్థితిని ఎదుర్కోనేనట్లు వారిని చైతన్య పరచాలి. వారిలో మంచి తనం, ప్రేమ, శక్తి సామర్ధ్యాలను అభివృద్ధి చేసుకొనేటట్లు ప్రోత్సహించాలి.

పేద విద్యార్థుల ఇళ్లను సందర్శించి తల్లిదండ్రులను చైతన్య పరచాలి. అప్పుడు వారు చదువులో ముందుంటారు.

పాఠాలు బోధించేటప్పుడు మానవత్వాన్ని విడిచిపెట్టరాదు.

విద్యార్థులుగా గుర్తించాలి. ఆసక్తిని చూపించాలి. రిజిష్టర్లో ఒక నంబరుగా మాత్రమే చూడకూడదు.

పరీక్షలలో సాధించిన మార్కులను బట్టి మాత్రమే విద్యార్థిని అంచనా వేయరాదు. అతని శ్రమని గుర్తించాలి.

ఆధార గ్రంథాలు

వృద్ధాప్యం - వృద్ధ సమస్యలు : ప్రభుత్వ పథకాలు తెలుగు నవలలు తెలుగు నవలలు - వృద్ధపాత్రలు - ఒక పరిశీలన

డా.కోలా శేఖర్, తెలుగు అధ్యాపకుడు, ఆంధ్ర లొయోల కళాశాల, విజయవాడ జీవన విధానం శారీర మార్పులు

ఉల్లాసవంతమైన వృద్ధాప్యం

1.భ ర న భ భ ర వ గణాలు వరుసగా వచ్చే పద్యం.

1. చంపకమాల 2. ఉత్పలమాల 3. శార్దూలం 4. మత్తేభం ఉత్పలమాల

2. సీసపద్య రచనలో నైపుణ్యం చూపిన కవి.

1. నన్నయ 2. పాల్కురికి సోమన 3. శ్రీనాథుడు 4. వేమన శ్రీనాథుడు

3. తేటగీతికి యతి స్థానం

1. 1,4 గణాల ఆద్యక్షరం 2. 1,2 గణాల ఆద్యక్షరం 3. 1,5 గణాల ఆద్యక్షరం 4. తేటగీతికి యతి నియమం లేదు 1,4 గణాల ఆద్యక్షరం

4.'తెలిసి కొనుము నీవు తెలుగు బాల` పద్యపాదం

1. తేటగీతి 2. ద్వివద 3. ఆటవెలది 4. కందం ఆటవెలది

5. మత్తకోకిల పద్యము.

1. వృత్తము 2. జాతులు 3. ఉపజాతులు 4. ఏదికాదు. వృత్తము

6. ఉత్సాహము పద్యము.

1. వృత్తము 2. జాతులు 3. ఉపజాతులు 4. మాలిని జాతులు

7. చంపకమాలలోని గణాలు

1. స భ ర న మ య వ 2. మ స జ స త త గ 3. న జ భ జ జ జ ర 4. ర స జ జ భ ర న జ భ జ జ జ ర

8. స భ ర న మ య వ అనే గణాలు గల పద్యం

1. చంపకమాల 2. ఉత్పలమాల 3. శార్దూలం 4. మత్తేభం మత్తేభం

9. తెలుగు కవిత్వంలో గురజాడ ప్రవేశపెట్టిన ఛందస్సు

1. తరళం 2. తరువోజ 3. ముత్యాల సరాలు 4. మధ్యాక్కర ముత్యాల సరాలు

10. వేమన పద్యాలు రచించిన ఛందస్సు

1. కందం 2. ఆటవెలది 3. తేటగీతి 4. తరువోజ ఆటవెలది

11. పద్యాలు ఎన్ని రకాలు

1. 3 2. 2 3. 4 4. 6 3

12. లఘువును ఏ అక్షరంతో సూచిస్తారు.

1. U 2. E 3. I 4. @ I

13. ఐ, ఔలు వానితో కూడిన హల్లులు

1. లఘువులు 2. గురువులు 3. లఘువు గురువు 4. ఏది కాదు. గురువులు

14. సీసము, ఆటవెలది, తేటగీతి మొ||వి.

1. వృత్తములు 2. జాతులు 3. ఉపజాతులు 4. ఏవీకావు ఉపజాతులు

15. పద్యలక్షణములను తెలుపునది.

1. ఛందస్సు 2. అలంకారములు 3. గురులఘువులు 4. అన్నియూ ఛందస్సు

16. ద్విత్త్వాక్షరములు.

1. గురువులు 2. లఘువులు 3. 1,2 4. ఏవీకావు లఘువులు

17. ఆది గురువుగల మూడక్షర గణము

1. భగణము 2. జగణము 3. యగణము 4. తగణము భగణము

18. క్రింది వానిలో సూర్యగణము

1. గలము 2. హగణము 3. రగణము 4. తగణము హగణము

19. ఇంద్రగణములు ఎన్ని.

1. రెండు 2. మూడు 3. నాలుగు 4. ఆరు ఆరు

20. శార్దూల పద్యపాదములో యతి స్థాన అక్షరము

1. 11 2. 12 3. 13 4. 14 13

21. 1 సూర్య + 2 ఇంద్ర + 2 సూర్య గణములు గల పద్యము

1. సీసము 2. తేటగీతి 3. ఆటవెలది 4. కందము తేటగీతి

22. జగణము ప్రదానముగా గల పద్యం.

1. కందము 2. సీసము 3. ఆటవెలది 4. 1,3 కందము

23. ఏ పద్యానికి చివర మరొక పద్యము వ్రాయవలెను

1. కందము 2. తరువోజ 3. సీసము 4. ఏదీకాదు సీసము

24. చతుర్మాత్రా గణములు కల పద్యము

1. సీసము 2. కందము 3. మధ్యాక్కర 4. ఏదీకాదు కందము

25. కందము, ద్విపద, తరువోజ, అక్కర మొ||వి.

1. వృత్తాలు 2. జాతులు 3. ఉపజాతులు 4. పైవన్నీ జాతులు

26. పద్యపాదములోని రెండవ అక్షరం

1. యతి 2. ప్రాస 3. లఘువులు 4. ప్రాసయతి ప్రాస

27. ఏకమాత్రాకాలమున ఉచ్చరింపబడునది.

1. లఘువు 2. గురువు 3. ప్లుతము 4. యతి లఘువు

28. మత్తేభ పాదంలోని అక్షరాల సంఖ్య

1. 19 2. 20 3. 21 4. 22 21

29. ఆటవెలదిలో ప్రాసనియమం.

1. లేదు 2. ఉంది 3. 1,2 4. ఏదీకాదు లేదు

30. 6 ఇంద్రగణములు + 2 సూర్యగణములు

1. కందము 2. ఆటవెలది 3. తేటగీతి 4. సీసం సీసం