వాడుకరి:Likhitha/sandbox
ప్రపంచ నలుమూలల నుండి సమాచారం సేకరించడం భద్రపరచడం సాధ్యమైన కార్యమేనని రుజువు కావడంతో తరువాతి దశలలో ప్రపంచ భాషలన్నిటిలో ఆయా భాషాభిమానుల కృషితో వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వం అభివృద్ధి పధంలో నడవటం మొదలైంది. దానిలో ఒక భాగమే వెన్న నాగార్జున కృషితో 2003 డిసెంబర్ 10 న ఆవిర్భవించిన తెలుగు వికీపీడియా . దీనిలో చాలా మంది సభ్యులై అభివృద్ధి పథంలో నడిపించారు. తెలుగు వికీపీడియా మొదటిపేజీ వివిధ రకాల శీర్షికలతో అందరినీ ఆకట్టుకొనేటట్లుగా ఉంటుంది. దీనిలో భాగంగా చాలా మార్పులు చేర్పులు జరిగాయి. తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి వ్యాసాలను వెలికితీసి, పదిమందికీ చూపించాలనే లక్ష్యంతో విశేష వ్యాసం అనే శీర్షికతో అప్పుడప్పుడు మొదటిపేజీలో మంచి వ్యాసాన్ని ప్రదర్శించేవారు. నవంబర్ 14 2005న గోదావరి వ్యాసంతో విశేష వ్యాసాల పరంపర మొదలయింది. ఆ తరువాత "ఈ వారపు వ్యాసాల" గా మారింది. 2007 జూన్ లో(23 వారంలో) మొదటిగా సుడోకు వ్యాసం ఈ వారం వ్యాసంగా ప్రదర్శించబడింది. గూగుల్