వాడుకరి:Loka jagannadhasastri
అవధానం అనేేేది ఒక విశిష్ట సాహితీ ప్రక్రియ. సంస్కృత భాషలో ఇది ప్రారంభమైనప్పటి ఇతర భాషలలో లేని విధంగా మనతెలుగు వారు పెంచి పోషించిన అపురూపమైన సాహితీ క్రీడ ఇది. అష్టావధానం,ద్విగుణితాష్టావధానం,చతుర్గుణిత, దశగుణితాష్టావధానం, శతావధానం,సహస్రావధానం..ఇలా ఎన్నోరకాలుగా అవధానం ఇటీవలికాలంలో ఆంధ్రదేశమంతటా అక్కడక్కడా ప్రదర్శించబడుతున్నది. నిషిద్ధాక్షరి,సమస్య,దత్తపది,వర్ణన,ఆశువు,పురాణప్రసంగం,న్యస్తాక్షరి, అప్రస్తుత ప్రసంగం అనే ఎనిమిది అంశముల నిర్వహణమే అవధానం. ధారా ధారణ వ్యుత్పత్తి మొదలైన లక్షణాలు స్వంతం చేసుకున్న కవిపండితులు అవధానాలు నిర్వహించడం పరిపాటి. మాడభూషి కృష్ణమాచార్యులు తొలిఅవధానిగా ప్రసిద్ధికెక్కారు.మనజిల్లాలో గడియారం వెంకటశేష శాస్త్రి,సివీసుబ్బన్న,నరాలరామారెడ్డి లాంటి ప్రముఖులు ఈ కళను సుసంపన్నం చేశారు. మరిన్ని విశేషాలు తదుపరి వ్యాసంలో... లోకా జగన్నాథ శాస్త్రి అష్టావధాని.కొత్తపేట.రాయచోటి.అన్నమయ్యజిల్లా